ఈ భాగంలో అనుభవాలు:
- సాయి ప్రేమే అత్యంత మధురమైన అనుభవం
- సాయిబాబా యందు విశ్వాసాన్ని పెంచిన అనుభవం
సాయి ప్రేమే అత్యంత మధురమైన అనుభవం
ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో ఇలా పంచుకుంటున్నారు:
సాయిబంధువులందరికీ సాయిరాం! ముందుగా ఈ సాయిమహరాజ్ సన్నిధి బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి చాలా చాలా కృతజ్ఞతలు. “సాయీ! మీరు చేసే ఈ సేవ మాలాంటి చాలామంది సాయిబిడ్డలకు పెద్ద వరం. మమ్మల్ని బాబాకి చాలా దగ్గర చేస్తున్నారు. కాదు కాదు.. మనల్ని సాయినాథుడు ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో అర్థమయ్యేలా తెలియజేస్తున్నారు. అందుకు మీకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే సాయీ! బాబా మిమ్మల్ని ఎప్పుడూ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను”.
బాబా నాకు ప్రసాదించిన అనుభవాన్ని మొదటిసారిగా మీతో పంచుకుంటున్నాను. ఏమైనా తప్పులుంటే మన్నించండి. నేను ప్రతిరోజూ క్రమం తప్పకుండా సాయిభక్తుల అనుభవాలు చదువుతుంటాను. చదవటం మొదలుపెట్టిన క్రొత్తలో కొన్ని చిన్న చిన్న అనుభవాలు చూసి కొంచెం ఇబ్బందిగా అనిపించేది. ‘ఇంత చిన్నవాటికి కూడా సాయిని వాడుకోవాలా?’ అని అనిపించేది. అందుకు నేను బాబాని క్షమాపణలు కోరుతున్నాను. “నన్ను క్షమించండి బాబా!” కానీ, అది వాడుకోవటం కాదని, మన వల్ల కానివాటికి బాబాని సాయం అడగటమని చాలా కొద్దిరోజుల్లోనే బాబా నాకు అర్థమయ్యేలా చేశారు. “చాలా చాలా కృతజ్ఞతలు బాబా!” మన అమ్మానాన్నలను మనకి కావాల్సినవి అడగటం వాడుకోవటం కాదు కదా! అలాగే బాబాని అడుగుతున్నామని అర్థం చేసుకున్నాను. మన అమ్మానాన్నలు మనకి ఏది మంచిదో అదే ఇస్తారు. బాబా కూడా అదే చేస్తున్నారు. మనం అడగనివి, మనకి మేలు చేసేవి కూడా బాబా చాలా ఇస్తారు, అచ్చం అమ్మానాన్నల లాగానే! కానీ మనమే వాటిని గుర్తించం.
మనం అడిగినవి ఇచ్చినప్పుడు బాబాకి కృతజ్ఞతలు చెప్పటం, కోరుకున్నది జరగనప్పుడు బాబా మీద అలగటం... ఇవన్నీ గమనిస్తుంటే, ‘బాబా మనల్ని ఒక భక్తునిగా కాకుండా అమ్మ తన బిడ్డని చూసినంత ప్రేమగా చూసుకుంటున్నారు’ అని అర్థమవుతోంది. అలా అర్థమయ్యేకొద్దీ గుండెల్లో పొంగే సంతోషం కళ్ళలో నుండి ఆనందభాష్పాలుగా జాలువారుతోంది. ఈ ప్రేమ మన అందరిపైనా ఎల్లప్పుడూ ఇలాగే కురిపించాలని బాబాని మనసారా వేడుకుంటున్నాను.
ఇదే నేను మీతో పంచుకోవాలి అనుకున్న అనుభవం. అవును! సాయి ప్రేమే అత్యంత మధురమైన అనుభవం. నా చివరి శ్వాస వరకూ కూడా ఇదే అనుభవం కావాలి అని మాత్రమే నేను కోరుకునేది. ఎందుకంటే సాయి ప్రేమలో మునిగితే ప్రాపంచిక విషయాలు మనని కలతపెట్టవు. ఒకవేళ కలతపెట్టినా అది కొద్ది సమయం మాత్రమే. ఇది నూటికి నూరుశాతం నిజం. తల్లిలాంటి సాయి ఒడిలో ఆడుకునే పసిపాపకి కష్టాలు ఉంటాయా? ఉన్నా తెలుస్తాయా? సాయిమాత అండలో అందరూ పసిపాపల్లా ఎప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ... ఓం సాయిరాం!

సాయిబాబా యందు విశ్వాసాన్ని పెంచిన అనుభవం
ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
సాయిబాబా దయవల్ల క్షీణిస్తున్న వినికిడిశక్తి తిరిగి పొందిన మా అమ్మగారి అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. మా అమ్మకి భగవంతుడిపై నమ్మకమున్నప్పటికీ సాయిబాబాపై అంత విశ్వాసముండేది కాదు. అలాంటి తను ఒక్క సంఘటనతో సాయిబాబా యందు ఎక్కువ శ్రద్ధ పెట్టడం ప్రారంభించింది. ఒకప్పుడు ఆమె జలుబుతో దీర్ఘకాలం బాధపడింది. దాని కారణంగా ఆమె వినికిడి సామర్థ్యం రోజురోజుకు క్షీణించింది. ఆ స్థితిలో ఒకరోజు ఆమె మా ఇంటికి సమీపంలో ఉన్న ఒక ఆలయానికి వెళ్ళినప్పుడు అనుకోకుండా ఒకామె తనని కలిసి, 'నవగురువారవ్రతం' గురించి వివరించి, వ్రత పుస్తకాన్ని ఇచ్చింది. ఇంకా కొన్ని సాయిభక్తుల అనుభవాలతో ఉన్న ఒక పుస్తకాన్ని కూడా ఇచ్చింది. ఆ పుస్తకంలో ఉన్న ఒక భక్తురాలి అనుభవం అమ్మ ఎదుర్కొంటున్న సమస్యలాంటిదే కావడం ఆసక్తికరమైన విషయం. అది చదివాక అమ్మ సాయిబాబాను ప్రార్థించి, తనకి వచ్చిన కష్టంనుండి బయటపడేందుకు మార్గదర్శకత్వం చేయమని కోరింది. ఆరోజునుండి ఆమె వివిధ రూపాలలో బాబా యొక్క ఉనికిని గుర్తించడం ప్రారంభించింది. వైద్యుడిని సంప్రదిస్తే, వైద్యుడు చెవిలో ఎముక వృద్ధిచెందడమే సమస్యకు మూలకారణంగా గుర్తించి, "ఆపరేషన్ చేయాలి. కానీ ఆపరేషన్ చేసేటప్పుడు ఏదైనా పొరపాటు జరిగితే నాడీవ్యవస్థ దెబ్బతినే ప్రమాదముంద"ని చెప్పారు. మేము అది విని నిర్ఘాంతపోయాము. ఏమి చేయాలో అర్థంకాక ఆ విషయం గురించి కుటుంబసభ్యులతో చర్చించాము. కొంతమంది శస్త్రచికిత్సకి అనుకూలంగా, మరికొంతమంది ప్రతికూలంగా చెప్పారు. ఆ స్థితిలో అమ్మ మళ్ళీ బాబానే ఆశ్రయించి, ఆయనపై నమ్మకంతో ఆపరేషన్ చేయించుకుంది. ఆయన దయవలన ఆపరేషన్ విజయవంతమై ఆమె తిరిగి వినికిడిశక్తిని పొందింది. ముఖ్యవిషయమేమిటంటే, ఆమెకు ఆపరేషన్ చేసిన డాక్టర్ కూడా సాయిబాబా భక్తుడే. ఆ స్త్రీ పుస్తకం ఇచ్చినప్పటినుండి బాబా మా అమ్మకు తోడుగా ఉన్నారని ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు.
Om sai ram. Thank you Baba for being with us. Be with us always. Help my husband in speedy recovery. Om sai sri sai Jaya Jaya sai 🙏
ReplyDeleteOM SAIRAM.
ReplyDeleteTHE LEELAS OF SAIBABA ARE GREAT AND THEY IMPROVE OUR TRUST IN SAIBABA AND THESE LEELAS ALSOCONFIRM HOW AFFECTIONATE SAI IS TOWARDS HIS CHILDREN.
I AM GRATEFUL TO ALL THE SAIs WHO RUN THIS BLOG
TQ...SAI
Sri sachchidananda sadguru sainathmaharajuki jai. Please help me baba
ReplyDeleteఓం శ్రీ సాయిరాం జీ 🙏🙏🙏.
ReplyDeleteఓం సాయిరాం...🌹🙏🏻🌹
ReplyDelete