ఈ భాగంలో అనుభవాలు:
- బాబా దయ, బాబా ఊదీ మహిమ
- ఊదీ చేసిన అద్భుతం
బాబా దయ, బాబా ఊదీ మహిమ
బాబాకి ఉన్న కోటానుకోట్ల భక్తులలో నేను ఒక ఇసుకరేణువు వంటి భక్తురాలిని. నా పేరు అంజలి. ఇటీవల బాబా మా మీద చూపించిన కరుణను మీతో పంచుకోవాలని ఈ అనుభవాన్ని రాస్తున్నాను.
2019, ఏప్రిల్ నెల ప్రారంభంలో మావారు తన ఛాతీలో మంటగా వుందని చెప్పారు. మేము హాస్పిటల్‌కి వెళ్లి హార్ట్ చెకప్ చేయించుకోవాలని అనుకున్నాము. అయితే హాస్పిటల్‌కి వెళ్ళేరోజు నేను ఆయన ఛాతీకి బాబా ఊదీని రాశాను. అంతే! ఊదీ రాయగానే ఆయనకు ఛాతీ మంట తగ్గిపోయింది. ఆ తరువాత ఆయుర్వేద హాస్పిటల్‌కి వెళ్లి చెకప్ చేయించాము. డాక్టర్ పరీక్షించి, "సమస్యేమీ లేదు, కేవలం కండరం పట్టేసిందంతే, ఏమీ కంగారుపడకండి" అని చెప్పి మందులు ఇచ్చారు. బాబా దయవల్ల మావారు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు.
మరోసారి మా పాప కళ్ళకి సైట్ వచ్చింది. రావటమే చాలా ఎక్కువ వచ్చింది. కళ్ళతో వ్యాయామం చేయాలని డాక్టర్ సూచించారు. పాప కంటిచూపు మెరుగుపడాలని బాబాను ప్రార్థించి ప్రతిరోజూ నిద్రపోయేముందు మా పాప కళ్ళకి బాబా ఊదీ రాసేదాన్ని. కొద్దిరోజుల తరువాత చెకప్ చేయిస్తే కంటిచూపు కొంచెం మెరుగుపడిందని చెప్పారు. అంతా బాబా దయ, బాబా ఊదీ మహిమ. ఇలా బాబా నా మీద చాలా కృప చూపించారు.

ఊదీ చేసిన అద్భుతం
నా పేరు రిచా. నేను ఏమాత్రం సహనమే లేని దానిని. అయినా బాబా నన్ను ఎప్పటికప్పుడు క్షమిస్తూనే ఉన్నారు. నేను బాబాను ఎంతో ప్రేమిస్తున్నాను. ఎల్లప్పుడూ ఆయన గురించే ఆలోచిస్తుంటాను. ప్రతిరోజూ ఈ బ్లాగులో సాయిభక్తుల అనుభవాలు చదవడం నాకు అలవాటు. బ్లాగును చక్కగా నిర్వహిస్తున్న సాయికి నా కృతజ్ఞతలు.
ఒకరోజు రాత్రి ఫ్రైడ్ రైస్ తయారుచేయడం కోసం పెద్ద పచ్చిమిరపకాయలను కోసి లోపల గింజలను తొలగిస్తున్నాను. ఆ మిరపకాయలు అంత కారంగా ఉండవు కాబట్టి వాటి గురించి నేను అంతగా ఆలోచించలేదు. కాస్త సమయం గడిచాక నా కళ్ళు మండటం మొదలైంది. చల్లటి నీళ్లతో కళ్ళను కడుక్కుని పడుకున్నాను. పడుకునేముందు ముఖానికి క్రీం రాసుకోవడం వల్ల ముఖం కూడా మండసాగింది. క్రీం పూసుకోబోయే ముందు సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కున్నట్లు నాకు బాగా గుర్తు. ముఖం మండుతున్నప్పటికీ అదృష్టవశాత్తూ నేను ప్రశాంతంగా నిద్రపోగలిగాను. ఉదయం నిద్ర లేచేసరికి నా వేళ్లు భరించలేనంతగా మంటపుట్టసాగాయి. నా చేతుల్ని మళ్ళీ మళ్ళీ సబ్బుతో శుభ్రంగా కడుక్కున్నాను. వేళ్ళకి పాలు, పెరుగు ఇలా ఎన్నో రాసుకున్నాను. ఎన్ని రాసినా ఏమీ ఉపశమనం లేదు. అలాగే బాధను భరిస్తూనే పనులు చేసుకుని మా వారిని ఆఫీసుకి పంపించాను. తర్వాత పూజాగదిలోకి వెళ్లి, నాకు సహాయం చేయమని బాబాను ఆర్తిగా వేడుకున్నాను. తర్వాత నేను బాబాతో, "బాబా! నేను మీ ఊదీని నా వేళ్ళకు రాసుకుంటున్నాను. నేను పూజ పూర్తి చేసేలోపు నా వేళ్ళ మంట పూర్తిగా తగ్గిపోయేలా అనుగ్రహించండి. నేను మధ్యాహ్నానికి భోజనం తయారుచేయాలి" అని చెప్పుకున్నాను. ప్రతిరోజూ బాబా అష్టోత్తరం చదవడం నాకు అలవాటు. ఆరోజు అష్టోత్తరం అయ్యాక కూడా నా వేళ్ళ మంట తగ్గలేదు. నాకు చాలా బాధగా అనిపించి, "బాబా! మీరు నన్ను ప్రేమించట్లేదు. ఈమధ్య నా ప్రార్థనలకు మీరు సరిగా స్పందించడం లేదు. ఇప్పుడు నేను అడిగింది ఎంతో చిన్నదే అయినా మీరు అసలు స్పందించనేలేదు" అని అన్నాను. ఇలా అనుకుంటూ నేను నా వేళ్ళ మీద నీళ్లు పోసుకుందామని మగ్గు పట్టుకోగానే నా వేళ్ళు మొద్దుబారిపోయాయి. నాకు చాలా ఉపశమనంగా అనిపించింది. ఎంతో సంతోషంతో బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను. బాబా ఎల్లప్పుడూ అంతా మంచే చేస్తారు, కానీ నాకే సహనం లేదు. "బాబా! గత ఏడు సంవత్సరాల నుండి సంతానం కోసం ఎదురు చూసి చూసి నిరాశతో నాకు కన్నీళ్లే మిగిలాయి. నాపై దయచూపి నాకు సంతాన భాగ్యం కలిగించండి బాబా!"
source: http://www.shirdisaibabaexperiences.org/2019/10/shirdi-sai-baba-miracles-part-2510.html?m=0
Om Sairam...
ReplyDeleteSri sainathaya namaha omsairam please help me baba
ReplyDeleteOm Sai Ram 🙏🌹🙏
ReplyDeleteఓం శ్రీ సాయినాథాయ నమః!🙏
ఓం ఆరోగ్య క్షేమదాయ నమః!🙏