- ఫోటో రూపంలో అభయమిచ్చి రక్షించిన బాబా
- బాబా అనుగ్రహంతో కొద్దిసేపట్లోనే తగ్గిన వాంతులు
ఫోటో రూపంలో అభయమిచ్చి రక్షించిన బాబా
విశాఖపట్నం నుండి సాయిభక్తుడు పరశురాము తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
ఓం శ్రీ సాయిరాం! నా పేరు పరశురాము. మేము విశాఖపట్నంలో నివసిస్తున్నాము. నేను కొద్ది రోజుల క్రితం నా స్నేహితుల సలహా మేరకు ఒక మనీ మల్టిపుల్ గ్రూపులో సభ్యుడిగా చేరాను. అందరిలాగా నేను కూడా కొంత డబ్బు కట్టాను. కొంతకాలం తర్వాత మరికొంతమంది నా క్రింద జాయినై వాళ్ళ వ్యవహారం వాళ్ళు చేసుకుంటున్న సమయంలో కంపెనీవాళ్ళు టీమ్ పేరు చెప్పి నా పేరుతో కొంత బోనస్ ఇచ్చారు. ఆ బోనస్‌ను నా క్రింద ఉన్నవాళ్ళందరికీ కంపెనీవాళ్ళ ఎదురుగానే నేను పంచేశాను. తరువాత నా సొంతంగా నేను వ్యాపారం చేస్తున్న సమయంలో ఆ కంపెనీపై పోలీసు కేసు బుక్ అయింది. ఆ సమయంలో పోలీసులు నా పేరున ఇచ్చిన బోనస్ నిమిత్తం నన్ను కూడా పోలీస్ స్టేషనుకు రమ్మంటే వెళ్ళాను. అప్పటికే కంపెనీవాళ్లు నేను బోనస్ పంచిన విధానాన్ని సి.ఏ గారికి చెప్పారు. కానీ సి.ఏ గారు నన్ను కూడా, “నీకు కెంపెనీ ఇచ్చిన బోనస్ ఎంత? ఆ బోనస్‌ను ఏం చేశావు?” అని ప్రశ్నించారు. జరిగిన విషయాన్ని నేను ధైర్యంగా చెప్పాను. దాంతో, ‘సరే, మేము ఫోను చేస్తే నువ్వు స్టేషనుకు రావాలి’ అని చెప్పి నన్ను వెళ్ళమన్నారు. కానీ అక్కడున్న పోలీసులు, పోలీస్ ఎస్.ఐ లు నన్ను బయటకు రానివ్వలేదు. “స్టేషన్లోనే ఉండాలి, ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండు” అంటూ నన్ను అక్కడే ఉంచారు. నాకు తోడుగా నాతో వచ్చిన నా ఫ్రెండును కూడా బెదిరించారు. నేను అక్కడే దిగులుగా కూర్చుని మనసులోనే సాయిబాబాను శరణు కోరుతూ పైకి చూశాను. అక్కడ శ్లాబుకు దిగువన గోడమీద అభయం ఇస్తున్నట్టు బాబా ఫోటో కనిపించేసరికి నా కళ్లలో నీళ్లు తిరిగాయి. అలా బాబాను చూస్తూ మనసులోనే బాబాను స్మరించుకుంటూ దిగులుగా చూస్తుంటే, ఇంతలో సి.ఏ గారు అటుగా వచ్చి, “ఏమయ్యా, ఇంకా ఇక్కడ ఎందుకున్నావు? నిన్ను వెళ్లిపోమన్నాను కదా!” అన్నారు. నేను జరిగింది చెప్పాను. “నేను చెప్పాను కదా! నేను చెప్పింది విను, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు!” అని ధైర్యం చెప్పి మరీ పంపించారు. సమయానికి బాబానే ఫోటో రూపంలో నాకు దర్శనమిచ్చి నన్ను రక్షించారని ఎంతో సంతోషంగా బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఓం శ్రీ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
బాబా అనుగ్రహంతో కొద్దిసేపట్లోనే తగ్గిన వాంతులు
సాయిభక్తురాలు శ్రీమతి లక్ష్మి ఇటీవల తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
“సాయినాథ నీకిదే హృదయపూర్వక వందనం - నిన్ను కొలుచుటే మాకు పూర్వజన్మ భాగ్యము”
నా ఊపిరి, నా సర్వస్వం మన సాయినాథుడే. ముందుగా ఆ సాయినాథునికి వేనవేల ప్రణామాలు. ఈ బ్లాగును చక్కగా నిర్వహిస్తున్న సాయికి హృదయపూర్వక నమస్కారాలు. నేను ప్రతిరోజూ ఈ బ్లాగులో ప్రచురిస్తున్న సాయిభక్తుల అనుభవాలను చదువుతాను. నాలో బాబాపై నమ్మకం మరింతగా పెరగడానికి ఈ బ్లాగ్ కూడా ఒక కారణం. ఇదివరలో నేను నా అనుభవాలను కొన్నిటిని ఈ బ్లాగ్ ద్వారా మీ అందరితో పంచుకున్నాను. బాబా అనుగ్రహంతో ఈమధ్య జరిగిన నా అనుభవాన్ని ఇప్పుడు మీతో పంచుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.
కొన్ని రోజుల క్రితం జరిగిన సంఘటన ఇది. ఆరోజు మావారు క్యాంపుకి వెళ్ళవలసి వచ్చి ఉదయం 4 గంటలకు బయలుదేరి వెళ్ళారు. తర్వాత నేను ఒక గంటసేపు పడుకుని 5.30 కి లేచాను. ఉన్నట్టుండి నాకు కడుపులో చాలా వికారంగా అనిపించింది. వాంతి వచ్చేలా అనిపించటంతో ఒకసారి పళ్ళుతోముకుని వద్దామని బాత్రూముకి వెళ్లాను. ఉన్నట్టుండి వాంతి అయింది. రాత్రి తిన్న ఆహారం సరిగా అరగలేదేమో అనుకున్నాను. తరువాత కాసిని మంచినీళ్ళు త్రాగి కూర్చున్నాను. ఇంతలో మళ్లీ వాంతి వచ్చింది. అలా ఆరోజు ఉదయం 9.30 వరకు వాంతులవుతూనే ఉన్నాయి. ఏమి త్రాగినా వాంతి అవుతుండేసరికి నాకు చాలా భయమేసింది. సమయానికి మావారు కూడా ఊళ్ళో లేరు. అప్పుడు నేను మన సద్గురు సాయికి నమస్కరించి, బాబా ఊదీని నీటిలో కలుపుకుని, “నాకు వాంతులు తగ్గితే నా అనుభవాన్ని సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటాన”ని ప్రార్థించి ఊదీనీటిని త్రాగాను. బాబా అనుగ్రహంతో కొద్దిసేపట్లోనే వాంతులు తగ్గిపోయాయి. “ధన్యవాదాలు సాయీ! నీ చల్లని దీవెన ఎల్లప్పుడూ మాపై ఉండేలా అనుగ్రహించండి”. బాబా అనుగ్రహం అందరిపైనా ఉండాలని కోరుకుంటూ..
సాయినాథ్ మహరాజ్ కీ జై!
Om sairam
ReplyDelete🙏💐🙏ఓం సాయిరాం🙏💐🙏
ReplyDeleteఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
🌺🌟🌺🌟🌺🌟🌺🌟🌺🌟🌺🌟🌺🌟🌺
Om sai ram sai baba your blessings must be to all.2 leelas of baba are very nice.every day I read all Baba's leelas.I felt very happy sai.
ReplyDeleteOm Sai ram
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
636 day
ReplyDeletesai ram
emito sai emi ardham kavadam ledu
naa ee samasyaku pariskaram chupu sai
nenu eduru chuda leka potunnau
opika ayipoindi sairam
please sai please
జై సాయిరాం! జై గురుదత్త!
ReplyDeleteOm sai ram baba amma ki manchi arogyani prasadinchu thandri
ReplyDelete