సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 696వ భాగం....



ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబాకి చెప్పుకుంటే అన్నీ నెరవేరుతాయి
  2. బాబా ఊదీతో బుగ్గ మీద మచ్చ మాయం

బాబాకి చెప్పుకుంటే అన్నీ నెరవేరుతాయి


సాయిభక్తులందరికీ నా నమస్కారం. నేనొక సాయి భక్తురాలిని. ప్రతిరోజూ సాయిభక్తుల అనుభవాలు చదువుతుంటే మనసుకు చాలా సంతోషంగా ఉంటుంది. బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను సాటి సాయిభక్తులతో పంచుకోవాలనుకుంటున్నాను.


ఒకసారి మేము ఇల్లు మారేటప్పుడు సామాన్లు సర్దడంలో నేను చేస్తున్న బిజినెస్‌కు సంబంధించిన కొన్ని పత్రాలను ఎక్కడో పెట్టి మర్చిపోయాను. ఒకరోజు కస్టమర్ కాల్ చేసి బిల్స్ అడిగినప్పుడు అవి ఎక్కడ పెట్టానో నాకు గుర్తురాలేదు. వాటికోసం ఇల్లంతా వెతికినా అవి కనపడలేదు. తరువాత నేను బాబాను తలుచుకొని, “బాబా! నాకు కావలసిన పత్రాలు కనపడేలా దయ చూపండి” అని అనుకున్నాను. కాసేపటి తర్వాత బాబా దయవల్ల ఆ పత్రాలను ఎక్కడ పెట్టానో గుర్తుకు వచ్చి ఆ చోట వెతికితే, ఆ బిల్స్ అన్నీ కనిపించాయి. “చాలా చాలా ధన్యవాదములు బాబా!”


మరొకసారి మా బాబు తన ప్యాంటు జేబులో డబ్బులు ఉన్నాయన్న విషయం మర్చిపోయి తన బట్టలను ఉతకడానికి వేశాడు. తర్వాత మాటల సందర్భంలో ఆ విషయం నాకు చెప్పాడు. నేను వెళ్ళి అక్కడున్న బట్టలన్నీ వెతికి చూశాను, డబ్బులు కనిపించలేదు. మా పనిమనిషిని కూడా అడిగాను, తనేమైనా చూసిందేమోనని. కానీ ఆమె ఏమీ మాట్లాడలేదు. నేను బాబాకు నమస్కరించుకుని, “బాబా! పనిమనిషే గనక ఆ డబ్బులు తీసివుంటే తనే మాకు ఆ డబ్బులు ఇచ్చేలా చేయండి” అని చెప్పుకున్నాను. బాబాకు చెప్పుకున్న వెంటనే మా పనిమనిషి తన ఇంటికి వెళ్లి ఆ డబ్బు తీసుకొచ్చి మాకు ఇచ్చేసి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయింది. తన సంకల్పంతో ఆమె మనసు మార్చి మా డబ్బులు మాకు ఇచ్చేలా చేసిన సాయి లీలకు మేము ఎంతో ఆనందించాము. “చాలా చాలా కృతజ్ఞతలు బాబా!”


ఇంకొకసారి మా అమ్మ తన చెవికమ్మలు ఎక్కడో పెట్టి మర్చిపోయింది. వాటికోసం ఇల్లంతా వెతికింది కానీ, అవి ఎక్కడా కనబడలేదు. చెవికమ్మలు కనిపించనందుకు అమ్మ దిగులుపడుతుంటే చూసి నేను బాబాను స్మరించుకుని, “బాబా! మా అమ్మ చెవికమ్మలు కనపడేలా చూడండి” అని చెప్పుకున్నాను. మరుసటిరోజు సాయంత్రం మా అమ్మ మళ్లీ వెతుకుతున్నప్పుడు ఆ చెవికమ్మలు కనిపించాయి. అమ్మ చాలా చాలా సంతోషపడింది. “థాంక్యూ బాబా! ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉండి మమ్మల్ని కాపాడు తండ్రీ!”


బాబా ఊదీతో బుగ్గ మీద మచ్చ మాయం


సాయిభక్తులందరికీ నా నమస్కారం. నేనొక సాయి భక్తురాలిని. నాకు సాయిబాబా అంటే చాలా ఇష్టం. చిన్నప్పటినుంచీ మేము సాయిబాబాను నమ్ముకొనివున్నాము. బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని ఇప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మా బాబుకి ఒకటిన్నర సంవత్సరాల వయసప్పుడు బుగ్గ మీద నల్లని మచ్చలా వచ్చింది. అది గమనించిన నేను దానివల్ల బాబుకేమైనా అవుతుందేమోనని భయపడి, బాబాకు నమస్కరించుకుని, “బాబా! మీ అనుగ్రహంతో బాబు బుగ్గ మీద ఉన్న నల్లమచ్చ తగ్గిపోవాలి” అని వేడుకున్నాను. బాబాను ప్రార్థించిన తరువాత బాబు బుగ్గమీద ఉదయం, సాయంత్రం ఊదీ రాశాను. బాబా అనుగ్రహంతో రెండు రోజుల్లో ఆ నల్లమచ్చ తగ్గిపోయింది. “చాలా చాలా ధన్యవాదాలు బాబా!”



సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo