సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 675వ భాగం.....


ఈ భాగంలో అనుభవాలు:
  1. సాయిబాబా కష్టాలను తీరుస్తారు
  2. బాబా కృపతో అరుదైన వ్యాధి నుండి ఉపశమనం

సాయిబాబా కష్టాలను తీరుస్తారు


సాయి భక్తుడు రామ్‌ప్రసాద్ తనకి బాబా ప్రసాదించిన ఒక చిన్న అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:


ఓం సాయిరామ్! ప్రథమంగా, అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజుకు శతకోటి పాదాభివందనాలు. సాయి మహారాజ్ సన్నిధి బ్లాగ్ నిర్వాహకులకు నా ధన్యవాదాలు. నా పేరు రామ్‌ప్రసాద్. ఇదివరలో ఈ బ్లాగ్ ద్వారా నా అనుభవాలను సాటి సాయిబంధువులతో పంచుకోవడం జరిగింది. ఇప్పుడు సాయిబాబా నాకు ప్రసాదించిన మరో లీలను మీతో పంచుకోవటానికి మీ ముందుకు వచ్చాను.


నా జీవితంలో దాదాపుగా ఆర్థికపరమైన సమస్యలే ఎక్కువగా ఉన్నాయి. “జన్మతః అనుభవించాల్సిన ప్రారబ్ధకర్మను ఎంతో ఓరిమితో అనుభవించక తప్పదు” అని సాయిబాబా చరిత్రలో మనం చదువుకున్నాము. “హత్య, శత్రుత్వము, ఋణము ఈ మూడింటిని అనుభవించక తప్పించుకునే మార్గం లేదు” అన్న సాయి సూక్తికి నిదర్శనం నాకు జరిగిన ఈ అనుభవం. వీటిలో మూడవదైన ఋణం వల్ల నేను పీకల్లోతు కష్టాల్లో ఉన్నాను. ఇదివరకు ఎన్నో సమస్యల నుంచి నన్ను గట్టెక్కించిన సాయినాథునికి ప్రణమిల్లి మరో సమస్య నుంచి కూడా ఏ విధంగా గట్టెక్కించారో మీతో పంచుకుంటాను.


ఎప్పటినుంచో పట్టిపీడిస్తున్న ఒక ఆర్థిక సమస్య కారణంగా నా పొలం అమ్మాలనుకున్నాను. కానీ ఎందుకో ఆ పొలం అమ్మదలుచుకున్నప్పుడల్లా ఏదో ఒక ఆటంకం ఎదురవుతూ వచ్చింది. నేను డబ్బులు ఇవ్వవలసిన చోట కూడా ఎన్నో అవమానాలు. గడువులు మించి గడువులు జరిగిపోతూనే ఉన్నాయి. ఈ గండం గట్టెక్కించమని బాబాను ప్రార్థించి, సాయి సచ్చరిత్ర పారాయణ చేశాను. 90 రోజుల సాయిమంత్రదీక్ష చేస్తున్నాను. రోజుల గడుస్తున్నకొద్దీ సమస్య మరింత తీవ్రతరమవుతోందే గానీ పని మాత్రం జరగలేదు. ఈ మనోవేదన భరించరానిదిగా ఉంది, ఎంత చేసినా సాయినాథునికి నా మీద కృప కలగడం లేదని కృంగిపోయాను. 


ఒకరోజు సాయిసూక్తులలో ఈ విధంగా వచ్చింది: "నిందలు భరించేవాడే నిజమైన భక్తుడు, సత్యం త్వరలోనే ఆవిష్కృతమవుతుంది" అని. ‘ఇది ఓదార్పు అనుకోవాలా లేక పరిష్కారం అనుకోవాలా?’ అన్న మీమాంసలో ఉన్న సమయంలో, మకరసంక్రాంతి పర్వదినాన, ఉదయాన్నే ఒక ఫకీరు సాయిబాబా విగ్రహంతో మా ఇంటికి భిక్షకు వచ్చారు. ఆయనకు మా అమ్మగారు 5 రూపాయల దక్షిణ, కొన్ని పిండివంటలు ఇచ్చారు. అప్పుడు ఆయన యాదృచ్ఛికంగా, “సాయిబాబా మీ కష్టాలను తీరుస్తారు” అని చెప్పి వెళ్లారు. అదేరోజు నేను డబ్బులు ఇవ్వవలసినవాళ్ళు నాకు ఇచ్చిన గడువు ముగిసేరోజు. సాయిని తలచుకుని, “నేను నా పొలాన్ని అమ్మి ఆ డబ్బులు నా చేతికి వచ్చేవరకు గడువు పెంచేలా ఋణదాతను ఒప్పించు బాబా! ఇప్పటికే చాలాసార్లు గడువు పెంచారు. ఈ ఒక్కసారికి అతనిని ఒప్పించే బాధ్యత మీదే బాబా” అని దీనంగా మనసులోనే బాబాను వేడుకొన్నాను. తరువాత భయంభయంగానే ఆ ఋణదాతకు ఫోన్ చేసి నేను డబ్బులు ఇవ్వగలిగే గడువు తేదీ చెప్పేశాను. అద్భుతం! ఎప్పుడూ కటువుగా మాట్లాడే అతను ఏదో మాయ ప్రభావం అన్నట్లుగా నేను అడిగినదానికి ఒప్పేసుకున్నారు. నిజంగా ఇది సాయి లీల. “గడువు ఇప్పిస్తే సాయి మహరాజ్ సన్నిధి బ్లాగ్ ద్వారా సాయి ప్రేమను అందరితో పంచుకుంటాను” అని సంకల్పం చెప్పుకున్నాను. అందుకే ఆలస్యం చేయకుండా వెంటనే ఈ అనుభవాన్ని పంచుకున్నాను. మరో అద్భుతమేమిటంటే, బాబా అనుగ్రహంతో నా పొలం కూడా మంచి ధరకు అమ్ముడైంది. సాయి నాకు ఇప్పించిన గడువులోగా పొలం అమ్మిన డబ్బులు నా చేతికి వచ్చి సమస్య తీరిన తర్వాత మళ్లీ నా అనుభవాన్ని ఈ బ్లాగ్ ద్వారా మీ అందరితో పంచుకుంటాను. సాయి సర్వసమర్థుడు. ఆయనకు సర్వస్య శరణాగతి అవడం ద్వారా సాయి ప్రేమను పరిపూర్ణంగా ఆస్వాదించవచ్చు. 


సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు! శుభం భవతు!


సాయి ప్రేమను అందరికీ పంచుతున్న సాయి మహారాజ్ సన్నిధి నిర్వాహకులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ.. సెలవు.


బాబా కృపతో అరుదైన వ్యాధి నుండి ఉపశమనం


పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో ఇలా పంచుకుంటున్నారు:


ఓం సాయి శ్రీసాయి జయజయసాయి!


నేను సాయిభక్తురాలిని. ఈ బ్లాగును నడుపుతున్నవారికి నా ధన్యవాదాలు. సాయిబాబా మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. నా వయసు 44 సంవత్సరాలు. నేను అకలేజియా (Achalasia) (ఆహారనాళానికి సంబంధించిన సమస్య) అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాను. ఆ సమస్య వలన కొన్నిసార్లు ఆహారనాళం మూసుకుపోతుంటుంది. దాంతో ఒకటి రెండు రోజులపాటు నేను కొద్దిపాటి ఆహారాన్నిగానీ, కనీసం ఒక్క చుక్క నీరుగానీ తీసుకోలేను. ఈ సమస్యకు చికిత్సలో భాగంగా డాక్టర్లు డిలేట్(dilate) అనే ఒక ప్రక్రియను ఉపయోగిస్తారు. ఆ ప్రక్రియలో ఆహారనాళాన్ని వ్యాకోచింపజేస్తారు. దాని ద్వారా ఒక్కోసారి శాశ్వత ఉపశమనం, కొన్నిసార్లు తాత్కాలిక ఉపశమనం లభిస్తుంది. 2020వ సంవత్సరంలో నేను డిలేట్ చికిత్స చేయించుకున్నాను. కానీ అది విజయవంతం కాలేదు. 40 రోజుల తరువాత సమస్య మళ్లీ ప్రారంభమైంది. నేను చాలామంది డాక్టర్లను సంప్రదించాను, కానీ నాకు నయం కాలేదు. 2020, డిసెంబరులో సమస్య చాలా తీవ్రమైంది. ప్రతి రెండు రోజులకు నేను ఘనపదార్థాలుగానీ, ద్రవపదార్థాలుగానీ ఏవీ తీసుకోలేకపోతుండేదాన్ని. చివరికి బాబా ఆశీస్సులతో 2021, జనవరి 9న నాకు ఆపరేషన్ జరిగింది. ఇప్పుడు నేను ఇంటికి వచ్చి సంతోషంగా ఉన్నాను. కష్టకాలంలో నేను చాలాసార్లు, "నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించమ"ని సాయిబాబాను ప్రార్థించి, బాబా ఊదీని నీళ్లలో కలుపుకుని త్రాగాను. అదే నేను త్వరగా కోలుకోవడానికి ఎంతో సహాయపడింది. "థాంక్యూ సో మచ్ బాబా! నేను ఎప్పటికీ మీకు ఋణపడివుంటాను".



9 comments:

  1. What is 90days sai mantra diksha. please write about this mantra diksha.how to do it.I like sai mantra diksha.

    ReplyDelete
    Replies
    1. ఓం సాయిరాం🙏💐🙏
      https://youtu.be/Xzuvz1gIvm8
      సాయిరాం!!ఈ వీడియో లింక్ మీకు ఉపయోగపడుతుంది.సాయి మంత్ర దీక్ష,అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది,అందుకు నేనే సాక్షి..
      ఓం సాయిరాం🙏💐🙏

      Delete
  2. ఓం సాయి శ్రీసాయి జయజయసాయి!

    ReplyDelete
  3. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  4. Om sai ram baba amma ki tondarga cure cheyi baba pleaseeee baba

    ReplyDelete
  5. Baba santosh ki salary hike ayyi mng shift ravali tondarga santanam kalagali thandri

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo