సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 686వ భాగం.....



ఈ భాగంలో అనుభవం:
  • సాయినాథునితో నా ప్రయాణం, ప్రస్థానం

సాయిభక్తురాలు శ్రీమతి విజయ తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.

ఓం శ్రీ శిరిడీ సాయినాథాయ నమః. ఎందరో సాయిభక్తుల ఆధ్యాత్మిక ఆర్తిని తీరుస్తున్న ఈ బ్లాగ్ నిర్వాహకులకు, సాయిబంధువులందరికీ నా నమస్సుమాంజలులు. ఇదివరకు నా అనుభవం ఒకటి ఈ బ్లాగులో ప్రచురించబడింది. ఇప్పుడు సాయినాథునితో నా ప్రయాణం, ప్రస్థానం ఎలా మొదలైందో చెప్పబోతున్నాను. 


ఇప్పుడు నా వయసు 54 సంవత్సరాలు. నాకు 6, 7 సంవత్సరాల వయసున్నప్పుడు సాయినాథునితో నా అనుబంధం మొదలైంది. అప్పుడు మేము ఏలూరు ప్రక్కన దెందులూరు అనే చిన్న ఊరిలో ఉండేవాళ్ళం. నేను రెండవ తరగతి చదువుతున్నప్పుడు పాఠశాలకు వెళ్ళే దారిలో ఒక నిర్జన ప్రదేశం, నాలుగు రోడ్ల కూడలి, చుట్టూ చెట్లు ఉన్న దారి ఒకటి ఉండేది. ఆ మధ్యలో బాబా ఉన్నట్లు, నేను బాబాను చూస్తున్నట్లు, నన్ను బాబా చూస్తున్నట్లు అనిపించేది. కానీ ఒక్కోరోజు అక్కడ బాబా విగ్రహం ఉండేది, ఒక్కోరోజు ఉండేది కాదు. అక్కడ బాబా విగ్రహం ఉందో లేదో ఇప్పటికి కూడా నాకు సరిగా తెలీదు. కానీ, సాయినాథుని చూస్తూ వెళ్తున్నట్టు నాకు బాగా గుర్తుంది. నాకు సాయి గురించి ఏమీ తెలీదు, ఎలాంటి భావమూ లేదు. కానీ ఆ చిన్నవయసునుండే నా మీద బాబా అనుగ్రహం, ఆశీర్వాదం ఉందని నాకు 26 సంవత్సరాల వయసు వచ్చేదాకా తెలియలేదు. తర్వాత పాఠశాల మారిపోయాక ఇంక ఆ విషయం మర్చిపోయాను. 


నాకు చిన్నప్పటినుండి ఆంజనేయస్వామి అంటే చాలా ఇష్టం. మా చెల్లి సాయినాథుని గురించి పరిచయం చేసింది. అన్ని దేవీ, దేవతామూర్తులు బాబానే అని చెప్పేది. నేనేమో, “అలా అయితే ఆంజనేయస్వామి మీదే భక్తిగా ఉండవచ్చు కదా! బాబాను ఎందుకు పూజించాలి?” అని వాదించేదానిని. నాకు దేవుళ్ళను మార్చడం ఇష్టం ఉండదు. కానీ బాబా తన మహిమను నాకు తెలియపరిచారు. అదెలా అంటే, నాకు 17వ సంవత్సరంలో వివాహం జరిగింది. పదేళ్లపాటు మాకు సంతానం కలగలేదు. ఒకరోజు అనుకోకుండా మా మేనత్తగారింటికి ధవళేశ్వరం వెళ్లాను. వాళ్ళ అమ్మాయి, నేను, మా చెల్లి ముగ్గురం కలిసి బాబా కోవెలకు వెళ్ళాము. ఆ ఊరిలోని కోవెలలో బాబా విగ్రహం నల్లటి రంగుతో ఎంతో ఆకర్షణీయంగా, చూడముచ్చటగా, మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఉండేది. మా మేనత్తగారి అమ్మాయి తమ ఇంటి రిజిస్ట్రేషన్ కోసం బాబా చుట్టూ 108 ప్రదక్షిణలు చేసింది. అనుకోకుండా నేను కూడా తన వెనకాల 108 ప్రదక్షిణలు చేసేశాను. తర్వాత బాబా పాదాలు పట్టుకుని నమస్కారం చేసుకుంటున్నప్పుడు, “బాబా! మేము ఇద్దరం (నేను, మావారు) ముగ్గురం అయితే శిరిడీ వస్తాము” అని అసంకల్పితంగా నా నోటివెంట వచ్చేసింది. అలా బాబాకు నమస్కారం చేసుకున్నాక ఒక నెలసరి వచ్చింది. ఆ మరుసటి నెలలోనే నేను గర్భవతినని తెలిసింది. వివాహమయ్యాక పదేళ్లపాటు పిల్లలు పుట్టని మాకు సాయినాథుని అనుగ్రహంతో గురువారంనాడు పాప పుట్టింది. ఆ పాపకు ‘శ్రీసాయిరవళి’ అని పేరు పెట్టాము. ఈ సంఘటనతో నా దృష్టి బాబా వైపు మళ్ళింది. అప్పటినుంచి కొద్దికొద్దిగా నాకు తెలియకుండానే బాబా ఆకర్షణలో పడిపోయాను. తిరుమల వెళ్ళినా కూడా అక్కడ వేంకటేశ్వరుని చూసి నోటి వెంట ‘బాబా’ అని వచ్చేస్తోంది. ఇంక అక్కడినుంచి నా జీవితంలో ఏమి జరిగినా అది బాబా అనుగ్రహమే అని భావించాను. బాబా దయవల్ల మా పాప పెద్దది అవడం, తన చదువు, తన పెళ్లి, తనకు బాబు పుట్టడం, ఆ బాబు కూడా గురువారంనాడే పుట్టడం ఇవన్నీ సాయినాథుని ఆశీర్వాదాలే. 


కానీ ఇక్కడివరకూ నా జీవితంలో బాబా ఒక ఎత్తు, సాయి మహారాజ్ సన్నిధి గ్రూపులో జాయినయ్యాక ఒక ఎత్తు. ఇందులో ప్రచురించిన సాయిభక్తుల అనుభవాలు, బాబా సమకాలీన భక్తుల వివరాలు చదివాక, ‘నాకు అస్సలు భక్తి లేదు. బాబా అనుగ్రహం వల్లనే ఈ మాత్రమైనా భక్తి కుదిరింది’ అని అర్థమైంది. ఇందులో ప్రచురిస్తున్న బాబా లీలలు చదవడం నా ఆధ్యాత్మిక ఉన్నతికే అని తెలిసింది. బాబా నన్ను అంచెలంచెలుగా తన దారిలోకి తీసుకొచ్చి నా కర్మఫలాన్ని నా చేత అనుభవింపజేస్తూనే నాకు తనమీద భక్తి, విశ్వాసాలు కుదిరేలా, నా మనసు (ఆధ్యాత్మిక) పరిపక్వత పొందేలా నన్ను తీర్చిదిద్దుతున్నారు. ఇప్పుడైతే ప్రతిక్షణమూ నాకు ఏదైతే జరుగుతోందో అది బాబా ప్రసాదమే. బాబా ఏది చేసినా అది నా మంచి కోసమే. ‘అనుక్షణమూ సాయినాథుడు నాకు తోడుగా, నీడగా, రక్షగా ఉన్నారు’ అనే భావన నా మనసులో స్థిరపడుతోంది. కానీ, ఇది సరిపోదు. ఇంకా భక్తి స్థిరపడాలి. అది బాబానే స్థిరపరచాలి. బాబా ఎన్నిసార్లో నాకు సహాయం చేశారు. వాటిలో కొన్నిటిని గుర్తించగలిగాను, కొన్ని గుర్తించలేకపోయాను. చిన్నప్పటినుండి జరిగిన విషయాలను ఇప్పుడు తరచి తరచి ఆలోచిస్తుంటే బాబా నాకు తోడునీడగా, రక్షణగా ఎలా ఉన్నారో అర్థమవుతోంది. బాబా నాకు ఏ విషయంలోనూ ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వలేదు. నాకు ఏది మంచిదో (నాకు నచ్చినా, నచ్చకపోయినా) అదే చేశారు. ఎంపిక చేసుకునే అవకాశం ఇస్తే నేను చెడును ఎంపిక చేసుకుంటానని సాయికి తెలుసు. నా పెళ్లి దగ్గరనుండి నాకు మనవడు పుట్టేవరకూ అంతా బాబా ఇష్టమే, నాదంటూ ఏమీ లేదు. 


‘నా’ అనుకున్న అందరినీ బాబా కంటికి రెప్పలా కాపాడాలని, ఆశీర్వదించాలని, అభివృద్ధిలోకి తీసుకురావాలని ఆ సాయినాథుని మనసారా ప్రార్థిస్తున్నాను. బాబానే అందర్నీ అనుక్షణమూ నడిపిస్తున్నారని గాఢంగా విశ్వసిస్తున్నాను. సాయినాథ మహారాజు తనకు అప్పజెప్పబడిన పైసలను (జీవులను) శుభ్రమైన దారిలో ఎలా గమ్యం చేరుస్తున్నారో నాకు కొద్దికొద్దిగా అర్థమవుతోంది. అలా చేయాలంటే సాయి ఎంత కష్టపడాలో అనిపిస్తోంది. బాబా తన భక్తులను చివరికంటా గమ్యం చేరుస్తానని చెప్పడమే కాదు, శ్రద్ధ-సబూరీలతో తన మాటను పాటిస్తున్నారు. ఒక మనిషి మనసు మార్చాలంటే ఎంత కష్టమో! అసలు మనసు మారదు కూడా. ‘పుట్టుకతో వచ్చింది పుడకలతో కానీ పోదు’ అని సామెత. అలాంటిది బాబా ప్రతి ఒక్కరినీ తనదైన శైలిలో ఆధ్యాత్మికంగా పురోగమింపజేస్తూ గమ్యం చేరుస్తున్నారు


మా ఆడపడుచుగారి అబ్బాయి కాపురం విషయంలో కూడా సాయినాథునికి నమస్కారం చేసుకుని సరిచేయమని ప్రార్థిస్తే బాబా దయవల్ల ఆ విషయం చక్కబడింది. ఇప్పుడు ఆ దంపతులిద్దరూ పండంటి బాబుతో ఆనందంగా ఉన్నారు. ఇంతేకాదు, మేము వేరే ఇల్లు కొనుక్కోవడంలో, పాత ఇల్లు అమ్ముడవడంలో, ఇలా ఇంకా చాలా చాలా విషయాలలో బాబా తన అనుగ్రహాన్ని చూపిస్తూనే ఉన్నారు. ఒకరోజు ఇంట్లో కరెంట్ ఎర్త్ అయి ఎలక్ట్రీషియన్ బల్బుతో చెక్ చేస్తుండగా వంద వాట్ల బల్బు పేలి గాజుపెంకులు ఇల్లంతా పడ్డాయి. అది ఏమాత్రమూ ఊహించని నేను బియ్యం బస్తాను తెరచిపెట్టి ఉంచాను. అందులో పైన 2,3 గాజుపెంకులు కనబడితే తీసేశాను. అయినా ఇంకా ఏమైనా ఉన్నాయేమో అని రోజూ పరిశీలిస్తూనే ఉన్నాను. పాతిక కిలోల బియ్యం బస్తాలో రోజూ చూస్తున్నప్పటికీ ఒక్క గాజుపెంకు కూడా లేకుండా బాబానే కాపాడారు. నేను వ్రాసే ప్రతి అక్షరం బాబానే నా చేత వ్రాయిస్తున్నట్టుగా భావిస్తున్నాను. చిన్నదైనా, పెద్దదైనా, సమస్య ఎలాంటిదైనా చేతులు చాచి బాబాను వేడుకోండి. సరైన సమయానికి బాబా తన అభయహస్తాన్ని అందిస్తారు. ఎందరో సాయిభక్తులు, వారందరి భక్తివిశ్వాసాలు, నమ్మకాలు, ఆచరణలు, అనుభవాలు మహోన్నతంగా ఉన్నాయి. నేను ఒక చిన్న సాయి పాదరేణువును. అందరికీ ఆ సాయినాథుని అనుగ్రహం అనంతంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను.


ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి.

ఓం సాయిరామ్!



10 comments:

  1. ప్రతి అక్షరంలోనూ సాయి మీద భక్తి ,ప్రేమ, అంకితభావం కనిపించాయి. జై సాయి రామ్.

    ReplyDelete
  2. 🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏
    ఓం సాయిరాం!!ఓం సాయిరాం!!
    🌟🌷🌟🌷🌟🌷🌟🌷🌟🌷🌟

    ReplyDelete
  3. Om sai ram this sai leela is big and nice. I liked it. Please remove my tension. Head acke

    ReplyDelete
  4. ఓం సాయిరామ్!

    ReplyDelete
  5. Foundation ki amount pampendhuku kudhirela cheye baba.foundation amount vachela cheye baba.naa samasyallu theruthaye baba OM SRI SACHIDHANAMDHA SAMARDHA SATHDGURU SAINATHAYA NAMAH .. Om Sai Ram

    ReplyDelete
  6. Foundation amount cancel kakunda kapadu Baba.GST amount kudirella cheyi Baba OM SRI SACHIDHANAMDHA SAMARDHA SATHDGURU SAINATHAYA NAMAH.. Om Sai Ram

    ReplyDelete
  7. శ్రీ సాయి మీ జీవితంలోకి ఎలా వచ్చాడనే విషయం నుండి ప్రస్తుతం వరకు మీ అనుభవాలను చక్కటి బాషానుభూతులతో తెలియ పరిచారు..

    సాయి నాథ్ మహారాజు కి జయము.. ☘️🙏🌺

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo