- బాబాకి చెప్పుకుంటే అన్నీ నెరవేరుతాయి
- బాబా ఊదీతో బుగ్గ మీద మచ్చ మాయం
బాబాకి చెప్పుకుంటే అన్నీ నెరవేరుతాయి
సాయిభక్తులందరికీ నా నమస్కారం. నేనొక సాయి భక్తురాలిని. ప్రతిరోజూ సాయిభక్తుల అనుభవాలు చదువుతుంటే మనసుకు చాలా సంతోషంగా ఉంటుంది. బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను సాటి సాయిభక్తులతో పంచుకోవాలనుకుంటున్నాను.
ఒకసారి మేము ఇల్లు మారేటప్పుడు సామాన్లు సర్దడంలో నేను చేస్తున్న బిజినెస్‌కు సంబంధించిన కొన్ని పత్రాలను ఎక్కడో పెట్టి మర్చిపోయాను. ఒకరోజు కస్టమర్ కాల్ చేసి బిల్స్ అడిగినప్పుడు అవి ఎక్కడ పెట్టానో నాకు గుర్తురాలేదు. వాటికోసం ఇల్లంతా వెతికినా అవి కనపడలేదు. తరువాత నేను బాబాను తలుచుకొని, “బాబా! నాకు కావలసిన పత్రాలు కనపడేలా దయ చూపండి” అని అనుకున్నాను. కాసేపటి తర్వాత బాబా దయవల్ల ఆ పత్రాలను ఎక్కడ పెట్టానో గుర్తుకు వచ్చి ఆ చోట వెతికితే, ఆ బిల్స్ అన్నీ కనిపించాయి. “చాలా చాలా ధన్యవాదములు బాబా!”
మరొకసారి మా బాబు తన ప్యాంటు జేబులో డబ్బులు ఉన్నాయన్న విషయం మర్చిపోయి తన బట్టలను ఉతకడానికి వేశాడు. తర్వాత మాటల సందర్భంలో ఆ విషయం నాకు చెప్పాడు. నేను వెళ్ళి అక్కడున్న బట్టలన్నీ వెతికి చూశాను, డబ్బులు కనిపించలేదు. మా పనిమనిషిని కూడా అడిగాను, తనేమైనా చూసిందేమోనని. కానీ ఆమె ఏమీ మాట్లాడలేదు. నేను బాబాకు నమస్కరించుకుని, “బాబా! పనిమనిషే గనక ఆ డబ్బులు తీసివుంటే తనే మాకు ఆ డబ్బులు ఇచ్చేలా చేయండి” అని చెప్పుకున్నాను. బాబాకు చెప్పుకున్న వెంటనే మా పనిమనిషి తన ఇంటికి వెళ్లి ఆ డబ్బు తీసుకొచ్చి మాకు ఇచ్చేసి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయింది. తన సంకల్పంతో ఆమె మనసు మార్చి మా డబ్బులు మాకు ఇచ్చేలా చేసిన సాయి లీలకు మేము ఎంతో ఆనందించాము. “చాలా చాలా కృతజ్ఞతలు బాబా!”
ఇంకొకసారి మా అమ్మ తన చెవికమ్మలు ఎక్కడో పెట్టి మర్చిపోయింది. వాటికోసం ఇల్లంతా వెతికింది కానీ, అవి ఎక్కడా కనబడలేదు. చెవికమ్మలు కనిపించనందుకు అమ్మ దిగులుపడుతుంటే చూసి నేను బాబాను స్మరించుకుని, “బాబా! మా అమ్మ చెవికమ్మలు కనపడేలా చూడండి” అని చెప్పుకున్నాను. మరుసటిరోజు సాయంత్రం మా అమ్మ మళ్లీ వెతుకుతున్నప్పుడు ఆ చెవికమ్మలు కనిపించాయి. అమ్మ చాలా చాలా సంతోషపడింది. “థాంక్యూ బాబా! ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉండి మమ్మల్ని కాపాడు తండ్రీ!”

ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
ReplyDelete🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
Om baba i like you. Today i did satya sai baba pooja and read 2 chapters satcharita. I am m p member. Every Thursday I do siridi sai pooja. Please bless my husband with long life bless him.
ReplyDeleteOM SAIRAM
DeleteOm Sairam
ReplyDeleteSai always be with me
653 days
ReplyDeletesairam
Om sairam
ReplyDeleteBaba amma arogyam bagundela chudu thandri
ReplyDeleteOM SRI SACHIDHANAMDHA SAMARDHA SATHDGURU SAINATHAYA NAMAH..Om Sai Ram
ReplyDeleteBaba Kalyan ki marriage settle inadi Elanti avarodalu lakunda marriage chai thandi meku sathakoti vandanalu vadini bless chaindi house problem solve cheyandi pl na health bagu cheyandi pl Rashmi ki pregnancy vachhatatlu chai ulthandri
ReplyDelete