ఈ భాగంలో అనుభవం:
- మృత్యువును ఆపడానికే బాబా వచ్చారు
సాయిబంధువులందరికీ సాయిరామ్! నా పేరు రమణి(మహతి). నా జీవితంలో జరిగిన ఒక దివ్యమైన సాయిలీలను నేనిప్పుడు మీ అందరికీ చెప్పబోతున్నాను. మనకు అమ్మ ప్రేమ అవసరమైనపుడు సాయి అమ్మగా మారి మనకు మాతృప్రేమను అందిస్తారు. అదే మనం అమ్మగా ఆలోచించేటపుడు సాయి బిడ్డగా, పసివాడిగా మన ఒడిలో చేరి మారాం చేస్తారు. కడపజిల్లా రైల్వే కోడూరులో శిరిడీసాయి దేవాలయం, రాఘవేంద్రస్వామి దేవాలయం పక్కపక్కనే ఉన్నాయి. ఆ దేవాలయాలలోని పూజారులు తండ్రీకొడుకులు. 2014 డిసెంబరులో మా అబ్బాయికి ఒక సంబంధం వచ్చింది. జాతకాలు చూపించడానికి నేను మా పనిమనిషి భామతో ఉదయం 11గంటల సమయంలో బాబా గుడికి వెళ్ళాను. బాబా గుడిలోగాని, రాఘవేంద్రస్వామి గుడిలోగాని ఎవరూ లేరు. గుడి వెనకే పూజారుల ఇల్లు. గుళ్ళమధ్య ఒక రావిచెట్టు ఉంది. నేను పూజారి గురించి చూస్తూ రావిచెట్టు దాటుతుంటే ఎవరో నా చీర కుచ్చెళ్ళు పట్టుకుని లాగారు. క్రిందికి చూస్తే, చామనఛాయ రంగులో ఉన్న ఒక పదినెలల చిన్నబాబు నా చీర లాగుతున్నాడు. వాడి మొలకు వెండిమువ్వల మొలత్రాడు ఉంది. చూడటానికి చక్కగా, పుష్ఠిగా ఉన్నాడు. "భామా! ఎవరీ బాబు, నా చీర లాగుతున్నాడు? వీళ్ళవాళ్ళెవరైనా ఉన్నారేమో చూడు" అన్నాను. ఆమె ఆశ్చర్యపోతూ, "ఎక్కడమ్మా, ఇక్కడెవరూ లేరే!" అంది. మళ్ళీ నేను క్రిందికి చూస్తే అక్కడ ఎవరూ లేరు. నా భ్రమేమో అనుకుని ముందుకు అడుగు వేయబోతే, మరలా చీర లాగుతూ "నన్ను ఇంటికి తీసుకెళ్ళు" అని మారాం చేస్తున్నాడు. ఈసారి మునుపటికంటే ఇంకా స్పష్టంగా కనిపించాడు. రావిచెట్టు కింద కాషాయవస్త్రాలతో ఉన్న బాబా బొమ్మ ఉంది. ఆ బాబు మాట్లాడుతున్న మాటలు ఆ బాబా బొమ్మలోనించి వస్తున్నాయి. వెంటనే నేను, "భామా! నా చీర లాగుతున్నది బాలసాయి" అన్నాను. "ఇంటికి తీసుకుపోదాం" అన్నది భామ. కానీ నా భర్త బాబాద్వేషి, నన్ను తిడతారని భయపడి బాబా బొమ్మ దగ్గరకెళ్ళి, "సాయికన్నా! నా భర్తకు నువ్వంటే పడదు. నిన్ను తీసుకెళ్తే నిన్ను తిట్టించిన దాన్నవుతాను. ఆయనను అనుమతి అడిగి తీసుకెళ్తాను" అని బ్రతిమాలి చెప్పి ఇంటికి వచ్చేశాము. తరువాత నా రోజువారీ పనులలోపడి ఆ విషయం పూర్తిగా మర్చిపోయాను.
డిసెంబర్ 31 గురువారం రాత్రి 8:30 సమయంలో రెండు కాళ్ళు గబగబా పరుగెడుతూ వచ్చి గుమ్మం దగ్గర ఆగిపోయాయి. అప్పుడు నాకు గుర్తుకువచ్చింది, బాబా(బు) అడిగిన విషయం. నిజానికి నేను మరచిపోయి నా పనులలో పడిపోయాను. ఆ వచ్చినవి సాయి పాదాలని గుర్తుపట్టి సాయిపాదాలకు భక్తితో ప్రణామం చేశాను. తర్వాత మావారికి జరిగిందంతా చెప్పాను. ఆయన, "తీసుకొచ్చి ఎక్కడ పెడతావు? చోటు లేదు కదా!" అన్నారు. "నేనెక్కడుంటే ఆయన అక్కడే ఉంటారు, మీకు అడ్డం లేకుండా చూసుకుంటాను" అని చెప్పాను. "అయితే తెచ్చుకో!" అన్నారు ఆయన. మర్నాడు ఉదయం 11 గంటలకి నేను గుడికి వెళ్ళాను. అక్కడ చాలా పెద్ద క్యూ వుంది. "ఈరోజు గురువారం కాదు కదా, ఇంత క్యూ ఉందేమిటి?" అని ఒకరినడిగితే, "ఈరోజు ముక్కోటి ఏకాదశి" అన్నారు. శుక్రవారం కదా, విగ్రహాన్ని ఇస్తారో లేదో అని సందేహిస్తూనే పూజారిగారికి జరిగింది చెప్పి విగ్రహాన్ని అడిగాను. "నాకేమీ అభ్యంతరం లేదమ్మా. కానీ అది పగిలిన విగ్రహం, పగిలినవి ఎవరూ ఇంట్లో పెట్టుకోరు. మీకు అభ్యంతరం లేకపోతే తీసుకెళ్లండి" అన్నారు. నాకు పరమానందంగా అనిపించింది. ఆ బొమ్మను చంటిబిడ్డను ఎత్తుకున్నట్లు ఎత్తుకుని ఇంటికి తీసుకొచ్చాను. ఆ బొమ్మను ఉత్తరదిక్కు చూస్తున్నట్లు పెట్టాను. ఎంతోమంది చూడటానికి వచ్చారు. బాబా వచ్చాక విశేషంగా ఆదాయం పెరిగింది. బాబాను చూడటానికి వచ్చినవారు, "దక్షిణ దిక్కులో పెట్టారేంటి? మంచిది కాదు, తీసెయ్యండి" అన్నారు. నాకు వాస్తు తెలియదు. మా ఇంట్లో ఉత్తర, దక్షిణలు తప్ప వేరే చోట పెట్టేందుకు వీలులేదు. ఆ బొమ్మను అక్కడనుండి మార్చి వంటగదిలో ఉత్తరదిక్కున పెట్టాను. అకారణంగా ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. ముందే బాబాద్వేషి అయిన మావారు, "పగిలిన విగ్రహం ఇంట్లో ఉండకూడదు. తెచ్చి ఇంట్లో పెట్టావ్. దానిని బయటపారెయ్" అన్నారు. ఆయన మాటకు ఎదురుచెప్పలేక మా ఇంటి ఎదురుగా ఉన్న శివాలయంలో ఏడుస్తూ బొమ్మను వదలి వచ్చాను.
తరువాత ఆ బాధలో ధ్యానంలో కూర్చుని, "బాబా! అసలు మీరెందుకు వచ్చినట్టు? ఎందుకు వెళ్ళినట్టు?" అని అడిగితే, 'నాకు రాబోయే మృత్యువును ఆపడానికే!' అని తెలిసింది. ఆ వివరాలు అప్రస్తుతం కనుక చెప్పడంలేదు. మరలా తెల్లని బాబా బొమ్మను తెచ్చి, మునుపటి దక్షిణదిక్కులోనే పెట్టాను. మా ఇంట్లోని ఆ చోటు బాబాకు చాలా ఇష్టం. అప్పటినుండి ఇంటి పరిస్థితులు చక్కబడ్డాయి. నా వరాల తండ్రి సాయినాథునికి వినయపూర్వక నమస్కారములు తెలుపుకుంటూ...

Sainathbhagavanki jai om Sainathaya namaha
ReplyDelete