సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 219వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. అనుక్షణం అండగా ఉంటూ సమస్యను తొలగించిన బాబా
  2. బాబాకు మ్రొక్కుకున్నాక దొరికిన ఫోన్

అనుక్షణం అండగా ఉంటూ సమస్యను తొలగించిన బాబా

పేరు వెల్లడించని సాయిభక్తురాలు తనకు ఇటీవల బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

ఓం సాయిరామ్! కొన్నిసార్లు కష్టాల రూపంలో మన పూర్వజన్మ కర్మఫలాలను మనం అనుభవించక తప్పదు. అయితే, ప్రతిక్షణం బాబా మనల్ని కనిపెట్టుకుని ఉంటారని తెలియజేసిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను.

నేను ఎక్కువగా రాశిఫలాలు చూస్తుంటాను. కొన్నిసార్లు అవి నిజమవుతుంటాయి. ఈమధ్య ఒకసారి నేను రాశిఫలాలు చూసినపుడు అక్టోబరు, నవంబరు నెలల్లో కొన్ని కుటుంబసమస్యలు వస్తాయని ఉంది. కాస్త ఆందోళనగా అనిపించినా, నాకు, మావారికి మధ్య అంతా బాగానే ఉంది కాబట్టి ఏమీ కాదులే అనుకున్నాను. కానీ కొన్ని అపార్థాల కారణంగా దసరా ముందురోజు మా మధ్య పెద్ద గొడవ జరిగింది. అప్పటినించి మా ఇద్దరికీ మనశ్శాంతి లేదు. ఇద్దరి మధ్య మాటలులేక చాలా బాధపడ్డాం. నేనెంత బాధలో ఉన్నా రోజూ చేసే బాబా పూజను ఆపలేదు. ఆ కష్టకాలంలో మా ఐదేళ్ల పాపే నాకు తోడుగా ఉండి నన్ను ఓదార్చింది. చిన్నతల్లి బాబా ఫోటో దగ్గరకి వెళ్ళి, "బాబా! మా అమ్మ ఏడవకూడదు" అని చెప్పేది. ప్రతిరోజూ ఫేస్‌బుక్, ఇంకా బాబాకు సంబంధించిన ఇతర వెబ్‌సైట్ల ద్వారా ఏరోజుకారోజు నా మనస్థితికి తగిన సందేశాలు వస్తూ ఉండేవి. ఆ బాబా సందేశాలు నాకు చాలా ఓదార్పునిచ్చేవి. ఈమధ్యలో మావారి స్నేహితుడు ఒకరు వచ్చి, మా మధ్య నడుస్తున్న పరిస్థితి చూసి, మా మధ్య సఖ్యత కోసం తన వంతు ప్రయత్నం చేయడం మొదలుపెట్టి, నాతో ప్రతిరోజూ "మంచి జరుగుతుంది, కాస్త ఓపికగా ఉండమ"ని చెప్తుండేవారు. ఈ సమస్యకు తోడు ఆఫీసులో పని బాగా ఎక్కువయింది. మరోప్రక్క ఆరోగ్యసమస్యలు కూడా నన్ను చుట్టుముట్టాయి. నా పరిస్థితి దారుణంగా ఉండేది. అయితే ప్రతిరోజూ "నేను నీతో ఉన్నాను" అని బాబా సందేశం ఇస్తూ ఉండేవారు. చివరికి దీపావళిరోజు మావారు, నేను మాట్లాడుకున్నాం. 'అంతా బాబా దయే'  అని నేను ఖచ్చితంగా చెప్పగలను. బాబానే మావారి స్నేహితుడిని పంపి సమస్య పరిష్కారమయ్యేలా చేశారు. కర్మానుసారం వచ్చే కష్టాన్ని అనుభవిస్తున్నా, బాబా మన వెన్నంటి ఉండి మనల్ని కాపాడుతారు. ఏదో ఒక రూపంలో ఆయన సహాయం చేస్తారు. మరో ముఖ్యవిషయం ఏమిటంటే, మా మధ్య సఖ్యత కుదిరిన తరువాత, అదివరకు ఫేస్‌బుక్ మొదలైన వాటిద్వారా వచ్చిన బాబా సందేశాలు ఆగిపోయాయి. అదే విషయం ఆలోచిస్తుంటే, మన 'సాయి మహారాజ్ సన్నిధి' వాట్సాప్ గ్రూపులో 'సాయి వచనాలు' ఇలా వచ్చాయి:

ఏమిటి, ఇప్పుడైనా నీ మనసులోని ఆలోచనాతరంగాలు శాంతించాయా? విశ్వాసంతో సహనం కలిగి ఉండేవారిని శ్రీహరి రక్షిస్తాడు" - సచ్చరిత్ర (అధ్యాయం 26) అని.

"అనుక్షణం నాకు అండగా ఉంటూ ఆదుకుంటున్నారు, చాలా చాలా కృతజ్ఞతలు బాబా!"

బాబాకు మ్రొక్కుకున్నాక దొరికిన ఫోన్

హైదరాబాదు నుండి సాయిభక్తురాలు అర్చన తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

ఓం సాయిరామ్! బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను ఈ బ్లాగు ద్వారా ఇదివరకు నేను మీతో పంచుకున్నాను. ఇటీవల జరిగిన మరో చిన్న అనుభవాన్ని ఇప్పుడు పంచుకుంటాను.

నా ఫోన్ ఒకటి మా పాపకి ఇచ్చాను. తను ఆ ఫోన్ ఎక్కడో పెట్టింది. దసరా సెలవులకి ఊరు వెళ్తున్న హడావిడిలో నేను కూడా ఆ ఫోన్ సంగతి అంతగా పట్టించుకోలేదు. ఊరినుండి తిరిగి వచ్చాక కూడా నాకు ఫోన్ సంగతి గుర్తురాలేదు. తరువాత 2019, అక్టోబరు 31న ఆ ఫోన్ సంగతి గుర్తొచ్చి ఇంట్లో అన్నిచోట్లా వెతికాను. కానీ ఎక్కడా కనపడలేదు. అప్పుడు నేను బాబాని తలచుకుని, "రేపు నా ఫోన్ కనపడితే, ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. ఆశ్చర్యం! ఆ మరునాడు, ముందురోజు ఏ చోట అయితే వెతికానో అదే చోట ఫోన్ కనపడింది. "చాలా చాలా థాంక్స్ బాబా! లవ్ యూ బాబా!"

5 comments:

  1. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీసాయి ఆరోగ్య క్షేమదాయ నమః'

    ReplyDelete
  2. Om Sairam ��

    ReplyDelete
  3. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤😀🌼🌹😃🌸🥰🌺🤗

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo