సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 315వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  • బాబా నుండి పొందిన షరతులు లేని ప్రేమ - నాలగవ భాగం

సదా బాబా సంరక్షణ

మా అబ్బాయికి 6 నెలల వయసప్పుడు మావారు తన ఉద్యోగ విషయంగా యు.ఎస్‌. కు మకాం మార్చారు. ఆయన వెళ్లిపోవడంతో చిన్నబిడ్డతో ఒంటరిగా ఉండటం నాకు సవాలుగా మారింది. ఆ సమయంలో బాబా మాత్రమే నాకు అండగా ఉంటూ సహాయం చేశారు. మా అబ్బాయికి 8 నెలలు వచ్చాక, నీళ్ళ విరోచనాలు, వాంతులతో తను చాలా అనారోగ్యానికి గురయ్యాడు. మందులేవీ పనిచేయలేదు. నేను తనని సంబాళించలేకపోయాను. అప్పుడు బాబా కలలో కనిపించి, "నేను తనని జాగ్రత్తగా చూసుకుంటాను, నేను తనకి ఇంజెక్షన్ చేస్తాను" అని చెప్పారు. మరుసటిరోజు ఉదయం నేను తన చేతిమీద చిన్న రక్తపు మరక చూశాను. ఎవరైనా 'అది దోమకాటు కావచ్చేమో' అని అనవచ్చు, ఖచ్చితంగా కాదు. మా అబ్బాయికి ఇప్పుడు పది సంవత్సరాలు. తన చేతిమీద ఇప్పటికీ బాబా వేసిన ఇంజెక్షన్ గుర్తు ఉంది. మావారు లేకుండా నేను ఆ 7 నెలలు ఎలా గడిపానో నాకు తెలియదు. అది కేవలం బాబా కృపే!

తరువాత బాబా ఆశీస్సులతో మావారు నాకు, మా అబ్బాయికి వీసా అపాయింట్‌మెంట్ బుక్ చేశారు. చెన్నై వీసా ఆఫీసుకు వెళ్ళేటప్పుడు నాకు తోడుగా రావడానికి ఎవరూ సిద్ధంగా లేరు. ఆ రోజుల్లో నేను ఏవైనా ఆఫీసు పనులంటే చాలా భయపడేదాన్ని. అసలే మా అబ్బాయి చాలా చురుకైనవాడు. ఆదమరపుగా ఒక్క అయిదు నిమిషాలు కూడా తనని నేలపై ఉంచలేను. తనని ఎల్లప్పుడూ నా చంకలో మోస్తూ ఉండాలి. వాడిని చంకలో పెట్టుకుని ఎలా ఫార్మ్స్ నింపాలి, వీసా ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలి అనుకుంటూ నేను చాలా భయపడ్డాను. పైగా అక్కడ పిల్లలకి అవసరమైన బొమ్మలు, స్నాక్స్ కూడా అనుమతించరు. ఆ స్థితిలో ఎప్పటిలాగే బాబా నాకు రక్షణనివ్వడానికి వచ్చారు. వీసా ఆఫీసుకి వెళ్ళాక నా సోదరుని వయస్సుండే యువకుడు నన్ను క్యూలో కలిశాడు. అతను తనని తాను పిల్లల వైద్యునిగా పరిచయం చేసుకుని, “నాకు పిల్లల గురించి బాగా తెలుసు. మీ అబ్బాయిని ధైర్యంగా నాకు ఇవ్వండి. నేను తనని చూసుకుంటాను” అని చెప్పాడు. అంతలో మా అబ్బాయి ఒక్క ఉదుటన అతనిపైకి దూకాడు. అతను నాతో, “మీరు అలసిపోయి ఉంటారు. మీరు విశ్రాంతి తీసుకోండి. నేను బాబుని చూసుకుంటాను" అని చెప్పాడు. అతనిలో నాకు బాబానే కనిపించారు. ఇక నేను నా పనులన్నీ ప్రశాంతంగా చేసుకున్నాను. పని పూర్తయ్యాక మా అబ్బాయి తిరిగి ఇవ్వమని నేను అతనిని అడిగినప్పుడు అతను, "ఈ బాబుతో నాకు చాలాకాలం నుండి ఏదో అనుబంధం ఉన్నట్లు అనిపిస్తోంది" అని అన్నాడు. అతను నాకు చాలా సహాయం చేశాడు. కానీ నేను అతని పేరు, ఫోన్ నెంబర్ వంటి వివరాలు కూడా అడగలేదని, అతనికి సరిగ్గా కృతజ్ఞతలు కూడా చెప్పలేదని తరువాత గుర్తించాను. కారులో నేను తిరుగు ప్రయాణమవుతూ బాబా చేసిన సహాయానికి ఆయనను కొనియాడుతూ, "మీరు నా పనిని చాలా సులభతరం చేసారు. ఆ డాక్టర్ మీరేనని నేను గుర్తించలేదు" అని అనుకుంటూ వున్నాను. అంతలో కారు ఒక సిగ్నల్ వద్ద ఆగింది. ఎదురుగా ఉన్న ఒక పోస్టర్ నా దృష్టిలో పడింది. ఆ పోస్టర్ మీద "డాక్టర్ మిమ్మల్ని ఎల్లప్పుడూ రక్షిస్తాడు" అని ఉంది. ఆశ్చర్యంతో నేను కన్నీళ్ళు పెట్టుకుంటూ బాబాకు నమస్కరించుకున్నాను. మీలో మీరు ఏది మాట్లాడుకున్నా బాబా వింటారు, ఏవిధంగానైనా మీకు సహాయం చేస్తారు.

తరువాత మా అబ్బాయికి 4 సంవత్సరాల వయస్సున్నప్పుడు తను బాగా అల్లరి చేస్తుండేవాడు. PCOD సమస్య ఉన్న నేను తనని నియంత్రించలేక ఒకరోజు తనని  శిక్షించాను. కానీ తరువాత నేను చాలా బాధపడి, నా బిడ్డపట్ల నేను ప్రవర్తించిన తీరుకు  బాబాను క్షమాపణ అడిగాను. తరువాత బాబా నా కలలో కనిపించారు. ఆయన నాపై చాలా కోపంతో, "తనని శిక్షించడానికి నీకు హక్కులేదు. నీ తలరాతలో నీకు పిల్లలు పుట్టే అవకాశంలేదు. నేను నా శరీరం నుండి తనని నీకు ఇచ్చానుఅని అన్నారు. వెంటనే నేను, "సహనంతో ఉండటానికి ప్రయత్నిస్తాను" అని బాబాకు మాట ఇచ్చాను. కొన్ని సంవత్సరాల తరువాత యు.ఎస్. లో ఉన్న చాలామంది వైద్యులను సంప్రదించాక నేను రెండోసారి గర్భవతినయ్యాను. "బాబా నన్ను మళ్ళీ ఆశీర్వదించారా?” అని నేను చాలా సంతోషంగా ఉన్నప్పటికీ, 'నా తలరాతలో పిల్లలు పుట్టే అవకాశం లేద'న్న బాబా మాటల గురించి ఆలోచిస్తుండేదాన్ని. 5వ నెల వచ్చాక ప్రెగ్నెన్సీ ఆరోగ్యకరంగా ఉన్నప్పటికీ ఏవో కారణాలతో అబార్షన్ చేయాల్సి వచ్చింది. నేను నిరాశతో చాలా కృంగిపోయాను. ఆ సమయంలో బాబా, "పుట్టబోయే బిడ్డకు నరాల సమస్య ఉంది, బిడ్డ జన్మించినట్లైతే   చాలా కష్టకాలాన్ని అనుభవించవలసి ఉంటుంది. మీరు బాధపడటం నాకు ఇష్టంలేదు" అని తెలియజేశారు. దాంతో నేను పరిస్థితి అర్థం చేసుకుని నన్ను నేను శాంతపరచుకున్నాను. కొన్నిసార్లు మనం కోరుకున్నది జరగదు. అలా అని బాబాను నిందించవద్దు. మనకు ఏది శ్రేయస్కరమో ఆయనకు తెలుసు.

సమాప్తం.


2 comments:

  1. Om sai sri sai Jaya Jaya sai, om sai sri sai jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya jaya sai🙏🙏🙏🙏

    ReplyDelete
  2. 🌹🌹 Om sai ram 🌹🌹🙏 🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo