ఈ భాగంలో అనుభవాలు:
- బాబా ప్రసాదం
- 'నా భక్తులు కష్టంలో ఉంటే, నాకు కన్నీళ్లు వస్తాయి'
బాబా ప్రసాదం
సాయిభక్తుడు శంకరరావు తనకి బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
మేము ఐదేళ్లక్రితం శ్రీసాయిబాబా దర్శనం కోసం శిరిడీ వెళ్ళాము. దర్శనానికి వెళ్ళేటప్పుడు బాబా కోసం ఏదైనా స్వీట్ తీసుకొని వెళ్లాలని అనుకున్నాము. కానీ కొన్ని కారణాల వల్ల తొందరలో స్వీట్ ఏమీ తీసుకోలేకపోయాము. ఖాళీ చేతులతోనే వెళ్లి క్యూ లైన్లో నిలుచున్నాము. బాబా కోసం ఏదీ తీసుకొని వెళ్లలేకపోతున్నందుకు నేను చాలా బాధపడ్డాను. సాధారణంగా బాబాకు అర్పించడానికి భక్తులు తెచ్చేవాటిని అక్కడున్న పూజారులు అందుకొని, వాటిని బాబాకు నివేదించి తిరిగి భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. కానీ నేను బాబాకు ఏదీ తీసుకొని వెళ్లట్లేదు కాబట్టి ప్రసాదం లేకుండా ఒట్టి చేతులతో తిరిగి రావాలని కలవరపడుతూనే బాబా ముందుకు చేరుకున్నాను. బాబాకు అర్పించడానికి నా చేతిలో ఏమీ లేనందున కేవలం బాబాకు మనసారా నమస్కరించుకున్నాను. తరువాత నాకు తెలియకుండానే ఏదో అందుకోవడానికి అన్నట్లు నా రెండు అరచేతులను బాబా ముందు చాచాను. మరుక్షణంలో అద్భుత లీల జరిగింది. అకస్మాత్తుగా నా అరచేతుల్లో ఒక ప్యాకెట్ వచ్చి పడింది. అందులో తెల్లని గుళికల్లాంటి స్వీట్స్ ఉన్నాయి. ఆశ్చర్యంతో బాబా చూపిన లీలకు అనందపరవశుడినయ్యాను. అలనాడు గురుపూర్ణిమనాడు భక్తులందరూ బాబాకు మాలలు వేస్తుంటే భక్తుడు రేగే తాను ఏమీ తేలేదని నొచ్చుకుంటే, బాబా తమ మెడలోని మాలల్ని చూపిస్తూ, "ఇవన్నీ నీవే" అని అంటారు. అలా ఎప్పటికీ మరిచిపోలేని అద్భుత అనుభవం బాబా నాకు ప్రసాదించారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా!"

'నా భక్తులు కష్టంలో ఉంటే, నాకు కన్నీళ్లు వస్తాయి'
సాయిబంధువులకు, సాయి మహరాజ్ సన్నిధి బ్లాగ్ నిర్వాహకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. 2020, జూన్ 15వ తారీఖున నాకు ఒక అనుభవం కలిగింది. అయితే, "ఇది నిజంగా బాబా లీలేనా!?" అని నిర్ధారించుకోవడానికే నాకు కాస్త సమయం పట్టింది. ఎందుకంటే, ఈ విషయంలో నా బాధ తగ్గించమని గానీ, సహాయం చేయమని గానీ నేను బాబాను అడగలేదు. కానీ సమస్త ప్రాణికోటినీ కన్న ప్రేగు కదా ఆయనది, ఆయనకి అన్నీ తెలుసు. తన బిడ్డలు బాధపడుతుంటే బాబా చూడలేరు. జరిగినదంతా కాసేపు ఆలోచించుకుని అర్థం చేసుకున్నాను, ఇదంతా నా బాబా చేసిన సహాయమే అని. కానీ 'దీన్ని బ్లాగులో పంచుకోవాలా, వద్దా?' అని సందేహించాను. ఎందుకంటే ఇది అందరితో పంచుకునేంత పెద్ద విషయం కాదేమో అనిపించింది. కానీ, 'నా బాబా చేసే ప్రతి లీలనూ అందరితో పంచుకోవాలి, అందరికీ బాబా మీద నమ్మకం పెరగాలి' అని ఆలోచిస్తూ ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేశాను. రోజుకి ఎన్నోసార్లు కేవలం బాబా కోసం, బాబా ఏదైనా సందేశం ఇస్తారని ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు కూడా అలానే ఓపెన్ చేశాను. నా ఆలోచనలకి తగినట్టుగానే నా బాబా సందేశం కనిపించింది. బాబా ఫోటో క్రింద ఆయన సందేశం ఇలా ఉంది: "It brings tears in my eyes, seeing my devotees in pain (నా భక్తులు కష్టంలో ఉండటం చూస్తే, నా కళ్ళ నుండి నీళ్లు వస్తాయి)". ఇంక నాకు పూర్తిగా అర్థమైంది, బాబానే నాకు సహాయం చేశారు అని. అది ఎలా అనేది ఇప్పుడు మీతో పంచుకుంటాను.
కరోనా వల్ల దాదాపు మూడు నెలల నుండి మాకు మినరల్ వాటర్ సప్లై చేసేవాళ్ళు రావటం మానేశారు. నేను మా నాన్నతో కలిసి బైక్ మీద వెళ్లి వాటర్ క్యాన్ తీసుకొస్తుంటాను. మేము సెకండ్ ఫ్లోర్‌లో ఉంటాము. నా తల్లిదండ్రులకి కొడుకైనా, కూతురైనా నేనే. అందువల్ల నేనే వాటర్ క్యాన్‌ని పైకి మోసుకుని వెళ్తాను. కానీ ఎందుకో తెలియదు, నిన్నటినుండి(2020, జూన్ 14) నా కుడి అరచేయి చిన్న నొప్పితో మొదలయ్యి కొద్దిగా ఉబ్బింది. దాంతో కుడిచేత్తో దేన్నీ పట్టుకోలేకపోతున్నాను, కనీసం మంచినీళ్ల చెంబు కూడా. ఈరోజు ఉదయం మేము వెళ్లి వాటర్ క్యాన్ తీసుకురావాలి. సాధారణంగా డాడీ ఆఫీసుకి వెళ్లేముందు నన్ను తీసుకెళ్లి, వాటర్ క్యాన్ తీసుకొని, నన్ను ఇంటి దగ్గర దింపేసి తరువాత ఆఫీసుకి వెళ్తారు. కానీ ఈరోజు డాడీ ఆఫీసుకి బయలుదేరే సమయానికి నేను చేస్తున్న బాబా పారాయణ పూర్తి కాలేదు. దాంతో వాటర్ క్యాన్‌ని సాయంత్రం తీసుకొద్దామని చెప్పి మా డాడీ ఆఫీసుకి వెళ్లిపోయారు.

కానీ మెల్లమెల్లగా నా చేతినొప్పి ఇంకా ఎక్కువైంది. "ఇంత నొప్పితో సాయంత్రం వాటర్ క్యాన్‌ని పైకి ఎలా తేవాలి?" అని అనుకున్నాను. సమయం గడిచి మధ్యాహ్నం భోజనం చేశాక కాసేపు పడుకుందామని అనుకున్నాను. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న నాలో ఉన్నట్టుండి ఏదో ఆందోళన మొదలైంది. మనసులో బాబాను స్మరిస్తున్నప్పటికీ ఆందోళన అలానే ఉంది. దాంతో అసలు నిద్రపోలేకపోయాను. "ఏంటి బాబా ఇది? ఏమీ జరగకుండానే ఈ ఆందోళన ఎందుకు? నన్ను హాయిగా పడుకోనివ్వు" అని అనుకుంటున్నాను. సుమారు ఒక 45 నిమిషాల తర్వాత, క్రింద నుండి గట్టిగా అరుపులు - "వాటర్, వాటర్" అని. "అరే, మాకు వాటర్ క్యాన్ సప్లై చేసే అతనేనా?" అని పరిగెత్తుకుని బయటికి వెళ్ళి చూశాను, అతనే! కాసేపట్లో అతను వెళ్లిపోయేవాడే, ఎందుకో ఒక్క క్షణం ఆగి పైకి చూశాడు. నేను అడగగానే వాటర్ క్యాన్‌ని పైకి తీసుకొచ్చి ఇచ్చాడు.
దాదాపుగా మూడునెలల నుండి రానివాళ్ళు ఈరోజు వచ్చారు. ఒకవేళ నేను నిద్రపోయుంటే అతను వెళ్లిపోయేవాడే. నన్ను నిద్రపోకుండా చేసి వాటర్ క్యాన్ తీసుకునేలా చేశారు బాబా. ఇంక మా మంచినీటి సమస్య తీరిపోయింది.
బాబాకి సర్వస్య శరణాగతి చేసి, ఆయన్నే నమ్ముకుంటే ప్రతి విషయంలోనూ బాబా మన వెన్నంటే ఉంటారు. నేను అడగకుండానే ఈ విషయంలో బాబా నాకు సహాయం చేశారు. "బాబా! నాకోసం నువ్వు బాధపడకు, నా చెయ్యినొప్పి కూడా తగ్గిపోతుంది. నువ్వు బాధపడితే నీ భక్తులమైన మేము కూడా తట్టుకోలేము. నీ ప్రేమని పొందుతున్న నేను ఎంతో అదృష్టవంతురాలిని. శరణు సాయీ, శరణు! నీ భక్తులందరినీ ఎల్లవేళలా వెన్నంటి ఉండి రక్షించు".
ఓం సాయిరాం!
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
ReplyDeleteవినయముగ మీకు పాద వందనము సల్పి
చేయనున్నాడ స్తోత్రంబు చిస్త్వరూప
తరచు మీ నామస్మరణంబు గరపు, నాదు
కోర్కె లీడేరకుండునా గురువరేణ్య
జయము దిగ్విజయము జయ సాయినాథ
పతిత పావన భావ కృపావతంస
త్వత్పదంబుల శిరమిడి ప్రణుతిసేతు
నభయమిడి బ్రోవరావమ్ము అత్రితనయ!!!
🙏🙏🙏🌹 నమో సద్గురు సాయినాథ పాహిమం పాహిమాం 🙏🙏🙏🌹
Bagundi , Sai
Delete🙏🌹🙏Sairam..sairam
Deleteఓం సాయిరాం🙏🌹
ReplyDeleteఓం సాయిరాం!
ReplyDeleteOM SAIRAM
ReplyDeleteSai always be with me
nee ee andolani taginchu sai
ReplyDeletechaala ante chaala bhayamuga undi
please sairam
Om Sai Sri Sai Jaya Jaya Sai
ReplyDelete