ఈ భాగంలో అనుభవం:
- బాబా పిచ్చుకలా నన్ను తన దరికి లాగిన వైనం - మొదటి భాగం
ముందుగా ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న వారికి, తోటి సాయిభక్తులకు నా నమస్కారములు. ఆ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని ఆశీస్సులు మీకందరికీ ఉండాలని, కొరోనా మహమ్మారిని ఈ ప్రపంచం నుండి పారద్రోలాలని బాబాను వేడుకుంటున్నాను.
నేను నా పేరు తెలియజేయాలని అనుకోవటం లేదు. నేనొక అజ్ఞాత భక్తుడిగా ఉండాలని అనుకుంటున్నాను. నేను అనంతపురం జిల్లా యాడికి గ్రామ నివాసిని. నేను నా ఇంజనీరింగ్ విద్యను 2015వ సంవత్సరంలో పూర్తి చేశాను. అప్పటివరకు నాకు బాబా గురించి గానీ, ఆయన లీలలు, అనుభవాల గురించి గానీ అంతగా తెలియదు. మా ఇంటినుండి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో బాబా గుడి ఉంది. ఒక్క గురుపౌర్ణమిరోజు మాత్రం ఆ గుడికి వెళ్ళి బాబా దర్శనం చేసుకుంటుండేవాడిని. ఇంజనీరింగ్ పూర్తైన తరువాత నేను బ్యాంకు ఉద్యోగాలకి ప్రయత్నం చేస్తూ, వాటికి సంబంధించిన పరీక్షలు వ్రాస్తూండేవాడిని. ఆ సమయంలో ప్రతిరోజూ రామాలయానికి, శివాలయానికి వెళ్తుండేవాడిని. ఆ పరీక్షల ఫలితాలు వచ్చిన ప్రతిసారీ నేను ఎంతో బాధపడేవాడిని. కారణం, ఆ ఫలితాలు నాకు అనుకూలంగా రాకపోవడమే. అలా రెండు సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఆ కాలంలో బాబా నన్ను ఎలా అనుగ్రహించారో మీతో పంచుకుంటాను. ఆ క్రమంలో...
- “బాబా పిచ్చుకలా నన్ను తన దరికి లాగిన వైనం”;
- “సాయి దివ్యపూజతో చెల్లికి ఉద్యోగం”;
- “నాన్నకు స్వస్థత చేకూర్చడం”;
- “దుర్గమ్మగా, వృద్ధునిగా వచ్చి దక్షిణ స్వీకరించడం”;
- “ఉద్యోగాన్ని అనుగ్రహించడం”;
- “‘కంట్లో మచ్చ ఉంది, అదృష్టవంతుడివి లేరా!’ అని చెప్పటం”;
- “కొరోనా బారినపడకుండా నన్ను, నా చెల్లిని కాపాడటం” …
ఇవన్నీ ఎలా జరిగాయో ఒకదాని తరువాత ఒకటి మీకు వివరిస్తాను. ఇందులో మొదటిదైన “బాబా పిచ్చుకలా నన్ను తన దరికి లాగిన వైనం”లోని భాగంగానే మిగిలిన సంఘటనలన్నీ జరిగాయి.
సాయి దివ్యపూజతో చెల్లికి ఉద్యోగం:
ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న రెండు సంవత్సరాల కాలంలో నాకు తెలిసిన ఒక వ్యక్తి బాబా గురించి, బాబా లీలలు, సాయిసచ్చరిత్ర గురించి తెలియజేస్తుండేవాడు. అలా నేను బాబా గురించి తెలుసుకున్నాను. ఒకవిధంగా ‘నేను తెలుసుకున్నాను’ అంటే అది నా అహంకారమే అవుతుంది, ‘బాబానే నాకు తెలియజేశారు’ అనటమే సరైనది. అలా తెలియజేసిన వ్యక్తి నాకు సాయికోటి పుస్తకాలిచ్చి సాయి నామం వ్రాయమని చెప్పారు. నేను రెండు పుస్తకాలు పూర్తిచేశాను. అవి వ్రాస్తూ, ప్రతి గురువారం కాకడ ఆరతి లేదా ధూప్ ఆరతికి హాజరయ్యేవాడిని. సాయిసచ్చరిత్ర సప్తాహపారాయణ కూడా చేస్తుండేవాడిని. ఒకరోజు మా ఇంటి పూజగదిలో దేవుడిని ప్రార్థిస్తుండగా సాయి దివ్యపూజకి సంబంధించిన పుస్తకం నా కంటపడింది. ‘ఆ పుస్తకంలో ఉన్నవిధంగా మనం పూజ ప్రారంభిద్దామ’ని నేను మా అమ్మతో చెప్పాను. అందుకు అమ్మ ఒప్పుకోవడంతో 5 వారాల పూజ పూర్తి చేశాము. నాకు ఉద్యోగం రాలేదు కానీ, బాబా దయవల్ల మా చెల్లికి ఒక మంచి ప్రైవేటు ఉద్యోగం వెంటనే వచ్చింది. ఆ సమయంలో తను కూడా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుండేది. 'తనకు ముందు ఉద్యోగం వచ్చింది, నాకు రాలేదు' అని నేనేమీ నిరాశా నిస్పృహలకి లోనుకాలేదు. బాబా నాకు కూడా మంచి అవకాశాన్ని ఇస్తారని నమ్మకంతో ఉన్నాను. ఆయన నాకు ఇండియన్ రైల్వేస్‌లో అసిస్టెంట్ లోకో పైలెట్ గా ఉద్యోగాన్ని ప్రసాదించబోతున్నారని నాకప్పుడు తెలియదు.
నాన్నకు బాబా ఇచ్చిన స్వస్థత:
ఆ రెండు సంవత్సరాల చివరిలో, అంటే నవంబరు నెలలో ఒకరోజు నేను పరీక్ష వ్రాయడానికి బెంగళూరు వెళ్ళాను. పరీక్ష పూర్తైన తరువాత ఇంటికి ఫోన్ చేస్తే స్కూటీ కారణంగా నాన్న కాలు విరిగిందని చెప్పారు. ఆపరేషన్ చేశాక నాలుగైదు నెలల వరకు పూర్తి బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టరు చెప్పారు. నాన్న విశ్రాంతి తీసుకుంటున్న ఆ సమయంలో సాయిసచ్చరిత్ర పారాయణ చేయమని నేను ఆయనతో చెప్పాను. అందుకాయన అంగీకరించి వారంలో సచ్చరిత్ర పారాయణ పూర్తిచేశారు. పారాయణ పూర్తి చేసినరోజు నాన్న నిద్రపోతుండగా పూజగది నుంచి ఒక ఆకారం బయటకి వచ్చి నాన్నని నిద్రలేపి గదమాయిస్తూ, “ఇక లే, నడుము పైకి లేపి నడువు” అని చెప్పింది. ఇది జరిగిన కొద్దిరోజులకి డాక్టరుని సంప్రదించడానికి వెళ్ళాము. డాక్టరు ఎక్స్-రే తీసి, ‘అంతా బాగుంది, కర్ర సాయంతో నడవమ’ని చెప్పారు. ఈ విషయాన్ని డాక్టరు కంటే ముందే బాబా తెలియజేశారని, నాన్నకు స్వస్థత చేకూర్చారని మేము అర్థం చేసుకొని చాలా ఆనందించాము. అంతా బాబా లీల, ఆయన దయ.
పై సంఘటన జరగడానికి ముందే బాబా నాకు శిరిడీ వెళ్ళే అవకాశాన్ని కల్పించారు. అది కూడా శ్రీరామనవమి రోజున. అది బాబా అనుగ్రహమే. శ్రీరామనవమి వంటి విశిష్టమైన రోజున మొదటిసారి తమ దర్శనభాగ్యాన్ని నాకు ప్రసాదించి తమకి, శ్రీరామునికి భేదం లేదని నిరూపించారు బాబా. శిరిడీ నుండి తిరిగి వచ్చేటప్పుడు బాబా నాకొక సచ్చరిత్ర పుస్తకాన్ని కూడా అనుగ్రహించారు. అప్పుడు తెచ్చిన ఆ సచ్చరిత్ర పుస్తకాన్నే నాన్న పారాయణ చేశారు. నాన్న అస్వస్థతకు గురికావడానికి ముందే బాబా నన్ను శిరిడీకి రప్పించడం, సచ్చరిత్ర అనుగ్రహించడం - అంతా ఆయన కృపావిశేషం. నాన్నకి స్వస్థత చేకూర్చిన విధం మేము ఎప్పటికీ మరచిపోలేనిది. అందుకు దయామయుడైన బాబా పాదములకు మా కుటుంబమంతా వందనం చేస్తున్నాము.
బాబా దుర్గమ్మగా, వృద్ధునిగా వచ్చి దక్షిణ స్వీకరించడం & ఉద్యోగాన్ని అనుగ్రహించడం:
ఉద్యోగ ప్రయత్నాలలో రెండు సంవత్సరాలు పూర్తై మూడవ సంవత్సరం వచ్చాక, అంటే 2019 ఫిబ్రవరి నెలలో ఇండియన్ రైల్వేస్‌కి సంబంధించి ఒక నోటిఫికేషన్ వెలువడింది. వెంటనే నేను ఆ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాను. ఆ ఉద్యోగ ప్రక్రియలో మొత్తం నాలుగు పరీక్షలుంటాయి(CBT-1, CBT-2 {Part A, Part B}, CBT-3, వైద్య పరీక్షలు). అవన్నీ విజయవంతంగా పూర్తిచేస్తే చివరిగా ఉద్యోగ నియామక పత్రం ఇస్తారు. ఈ నోటిఫికేషన్‌తో బాబా నన్ను పూర్తిగా తన వైపుకి లాక్కున్నారు.
మొదటి పరీక్ష ఆగష్టులో జరిగింది. దాని ఫలితాలు ఇంకా రావాల్సి ఉండగా నవంబరు నెలలో మా నాన్న నాతో, "గవర్నమెంట్ ఉద్యోగాలు రావాలంటే చాలా కష్టం. బెంగళూరు వెళ్లి సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి ప్రయత్నించు" అని చెప్పారు. ఆ వెంటనే నేను సాయి దివ్యపూజ మొదలుపెట్టాను. 5 వారాలు పూర్తయ్యేలోపు బాబా దయవల్ల CBT-1 ఫలితం నాకు అనుకూలంగా వచ్చింది. కానీ నాన్న నన్ను బెంగళూరు వెళ్ళమని, అక్కడే CBT-2 కి ప్రిపేర్ అవమని చెప్పారు. దాంతో నేను చివరి వారం సాయి దివ్యపూజ పూర్తిచేసి బెంగళూరు వెళ్ళాను. ఆశ్చర్యమేమిటంటే, బెంగళూరు వెళ్ళిన మూడవరోజే నాన్న నన్ను ఇంటికి తిరిగి రమన్నారు. కారణం, మా అన్నయ్య నాన్నకి ఫోన్ చేసి, "త్వరలోనే CBT-2 పరీక్ష ఉంది. దానికి వాడు ప్రిపేర్ కావాలి. ఈ సమయంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే సమయం వృధా అవుతుంది. పరీక్షకు కేవలం 17 రోజులే ఉంది. వాడిని వెనక్కి రప్పించండి" అని చెప్పడమే. దాంతో నేను వెనక్కి వచ్చేసి, అతి తక్కువ సమయంలో ప్రిపేరై పరీక్షకు హాజరయ్యాను. బాబా అపార అనుగ్రహంతో ఫలితం నాకు అనుకూలంగా వచ్చింది.
ఇక CBT-3. "ఈ పరీక్ష కేంద్రం ఎక్కడన్నా ఉండనీ, కానీ ఆ కేంద్రానికి సమీపంలో మీ మందిరం ఉండాలి" అని నేను సాయిని ప్రార్థిస్తూ రోజూ ధూప్ ఆరతికి హాజరవుతూ CBT-3 కి ప్రిపేర్ అవుతుండేవాడిని. బాబా నా మొర ఆలకించారు. పరీక్షా కేంద్రం నాకు ఇష్టదైవమైన జగన్మాత దుర్గాదేవి కొలువైవున్న బెజవాడలో వచ్చింది. పరీక్షా కేంద్రానికి దగ్గరలోనే సాయి మందిరం కూడా ఉంది. అంతా బాబా లీల.
రేపటి భాగంలో మిగిలిన అనుభవాలు పంచుకుంటాను.

Om Sai Ram 🙏🌹🙏
ReplyDeleteOM SAI RAM.ALL THE BEST .
ReplyDeleteఓం సాయిరామ్!
ReplyDeleteఓం సాయిరామ్!
ఓం సాయిరామ్!
ఓం సాయిరామ్!
ఓం సాయిరామ్!
ఓం సాయిరామ్!
ఓం సాయిరామ్!
ఓం సాయిరామ్!
ఓం సాయిరామ్!
ఓం సాయిరామ్!
ఓం సాయిరామ్!
ఓం సాయిరాం🌹🙏🌹
ReplyDeleteOm Sri Sai Ram thaatha 🙏🙏
ReplyDeleteBhavya sree