సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 396వ భాగం


సాయిశరణానంద అనుభవాలు - ముప్పయ్యవ భాగం 

నిన్నటి తరువాయిభాగం..... 

ప్రాణాయామంలో అన్ని రకాలూ తెలుసుకున్నాను, కానీ చేయటం మాత్రం మానేశాను. ఎప్పుడో ఒకసారి జలుబు, తలనొప్పి వస్తే ప్రాణాయామం చేశాను, కానీ ఆ ప్రయోగం కూడా విఫలమైంది. ఒకసారి కళ్ళు మండితే నాసాగ్రంపై దృష్టిని స్థిరం చేయటం వల్ల మంటలు తగ్గాయి. కానీ ఈ పనులన్నిటికీ, నా ఆధ్యాత్మిక ప్రగతికీ ఏ విధమైన సంబంధమూ కనిపించలేదు. పైగా మనసు శరీరంమీద కేంద్రీకరింపబడుతుందన్న భయం పట్టుకుంది. మనస్ఫూర్తిగా బాబా సమ్మతి ఇచ్చారనిపించకపోవటం వల్లా, క్రియలో బాధలు కలగటంవల్లా వాటిని శాశ్వతంగా మానేశాను.

ఇన్ని సంవత్సరాలు గడిచాక, అంటే 1957 ఆగష్టు నెలలో పైన చెప్పిన విషయంలో దివ్య జ్ఞానానుభూతి కలిగింది. బాల్యంలో చాలాసార్లు స్వప్నంలో భయంకరమైన దృశ్యాలు కనిపిస్తూ ఉండేవి. అప్పుడు నేను కాకినై దూరంగా ఎగిరిపోవటంతో నా భయం దూరమైపోయేది. అలా చాలాసార్లు స్వప్నదర్శనమైంది. దీంతో నేను ఇప్పుడు గానీ, లేదా పూర్వజన్మలో గానీ విహంగమ మార్గంలో ఉండి ఉంటాననీ, హఠయోగ మార్గంలో కాదనీ నాకు స్పష్టంగా అనిపించింది. నేను శుకదేవుడి అనుయాయుడినే కానీ, నామదేవుడికి కాదని ఇప్పుడు స్పష్టమైంది.

1916కి ముందే బాబా నాకీ విషయంలో సూచన ఇచ్చారు, కానీ దాన్ని ఇప్పుడర్థం చేసుకున్నాను నేను. మొదట్లో బాబా నాతో, “నా ఈ బాబు ఎలా ఎగురుతూ ఎగురుతూ పోయేవాడో!" అనేవారు. ఈ సూచన విహంగమ మార్గం గురించే. “ఆ ‘ముండ’ వీడిని వేధించింది" - ఈ శబ్దాన్ని నేను రాధాకృష్ణమాయికి ఆపాదించుకున్నాను. కానీ, 'ముండ' శబ్దం 'మాయ' గురించి చెప్పబడింది. 1954లో 'నీ దీక్షా గురువు పేరు శుకదేవుడ'ని బాబా చెప్పారు. వరాహోపనిషత్తు 33, 34 అధ్యాయాల్లో ఉన్న శ్లోకాలు చదివితే, బాబా నాకు శుకదేవుడి విహంగమ మార్గాన్ని చూపించారని అర్థమవుతోంది. పరిస్థితి జన్య హఠయోగం, యోగ సాంఖ్యం లేదా పిపీలకలకు వామదేవుడి యొక్క 'యమ' తప్ప వేరే మార్గం లేదు.

(14-7-53న ఈ రచయిత సన్యాసం స్వీకరించాడు. 6-1-54న జాగ్రదావస్థలో సాక్షాత్తూ భగవాన్ శంకరుని ద్వారా మహావాక్యోపదేశం లభించింది. అలాగే ‘నీ గురువు శుకదేవుడ’న్న సూచన కూడా లభించింది.)

శిరిడీలో నేను పదకొండు నెలలున్నప్పుడు అడపాదడపా నాకు జ్వరమొస్తూ ఉండేది. అయితే బాబా కృపవల్ల ఈ జ్వరంతో నాకెలాంటి సంబంధం లేదన్న అనుభవం నాకు కలుగుతూ ఉండేది. చాతుర్మాస్యంలో వర్షమొస్తే గదిలో నాల్గువైపులా నీరు కారుతూ ఉండేది. శ్రీసగుణరావు నాకో కొయ్యబల్ల తెచ్చిచ్చాడు. దానిమీద నేను పడుకునేవాడిని. కేవలం ఆ మేరకే పొడిగా ఉండేది. తరువాత నా తమ్ముడు వైకుంఠ బాబాకి రాసిన ఉత్తరం వచ్చిన తరువాత బాబా నాకు ఇంటికెళ్ళటానికి అనుమతినిచ్చారు. అప్పుడు నేను ఇంటికి వెళ్ళటానికి సిద్ధమయ్యాను.

తరువాయి భాగం రేపు ......

source: "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

2 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo