ఈ భాగంలో అనుభవం:
- బాబా వచ్చి నాతో మాట్లాడి నా జీవితాన్ని చక్కబరిచారు
USA నుండి ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:
నా జీవితం బాబా ప్రసాదించిన భిక్ష. నేను యు.ఎస్.ఏ లో నివాసముంటున్నాను. నా గురువైన సాయిబాబాపై నాకు చాలా నమ్మకం. రోజులో ఒక్క నిమిషం కూడా నేను ఆయన స్మరణ మరువలేను. ప్రతి ఒక్క భక్తుని అనుభవాలు చదువుతూ నేను బాబా ఉనికిని అనుభూతి చెందుతున్నాను. అనుభవాలను పంచుకుంటూ మనశ్శాంతిని చేకూర్చడమే కాకుండా బాబాపట్ల విశ్వాసాన్ని పెంపొందేలా సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరికీ చాలా చాలా ధన్యవాదాలు.
నా అనుభవాన్ని ప్రారంభించేముందు నా గురువు శ్రీ సద్గురు సాయినాథుని పాదకమలాలకు నమస్కరిస్తున్నాను. నా జీవితమంతా సద్గురు సాయిబాబా చేసిన అద్భుతమే. కాబట్టి ఎక్కడనుండి ప్రారంభించాలో నాకు మాటలకు, ఆలోచనలకు అందడం లేదు. ముందుగా నా జీవితంలో జరిగిన సంఘటనల గురించి చెప్పి, తరువాత బాబా ఇచ్చిన అద్భుత అనుభవాలను చెప్తాను. కాస్త వివరంగా చెప్పబోతున్నందున ప్రశాంతంగా చదవమని వేడుకుంటున్నాను.
నా చిన్నతనంలో నాకు తెలిసిన ఏకైక దేవుడు 'బాబా'. ఆయన నాకు ఎప్పుడు, ఎలా పరిచయమయ్యారో తెలియదు. ఎందుకంటే నా కుటుంబంలో ఎవరూ మొదటినుండి శిరిడీ సాయిబాబా భక్తులు కాదు. మాది (నేను, నా సోదరుడు, తల్లి, తండ్రి) భగవంతుని దయవలన చదువుకున్న సంతోషకరమైన చక్కటి కుటుంబం. మాకు ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవు. కాబట్టి నా బాల్యం ఎటువంటి సమస్యలు లేకుండా చాలా సంతోషంగా సాగింది. సరైన పరిణతి లేకపోవడంతో నేను ఇంటర్మీడియట్‌లో చేరాక నా జీవితాన్ని తలక్రిందులు చేసుకున్నాను. కానీ నా తల్లిదండ్రులు స్నేహితులవలే ఎల్లప్పుడూ నాకు మార్గనిర్దేశం చేస్తూ నాకు మద్దతుగా నిలిచారు. నాకు 21 ఏళ్ళ వయసు వచ్చాక నా వివాహం జరిగింది. దురదృష్టవశాత్తు నేను వివాహం చేసుకున్న వ్యక్తి సరైనవాడు కాదు. అతను పూర్తిగా డబ్బు మనిషి. ఎప్పుడూ డబ్బు గురించే ఆలోచించేవాడు. ఆ బాధాకరమైన వివాహాన్ని నేను ఒక సంవత్సరంపాటు సహించాను. తరువాత నా తల్లిదండ్రులు నా శ్రేయస్సు గురించి అలోచించి నాకు నైతిక మద్దతునిచ్చి ఆ వివాహబంధం నుండి నన్ను విడాకుల ద్వారా బయటపడేశారు.
ఆ తరువాత నా తల్లిదండ్రులు ప్రతి విషయంలోనూ నన్ను జాగ్రత్తగా చూసుకోగల సరైన వ్యక్తిని ఎంపిక చేసి నాకు మళ్ళీ వివాహం చేశారు. మా వివాహమైనప్పటికే అతను యు.ఎస్.ఏ లో నివాసముంటున్నాడు. అందువలన వివాహమైన 20 రోజుల తరువాత నేను నా భర్తతో కలిసి యు.ఎస్.ఏ కు వచ్చాను. అతను చాలా మంచివాడు. నన్ను అర్థం చేసుకుని చాలా శ్రద్ధగా, ప్రేమగా చూసుకునేవాడు. కాబట్టి నేను చాలా సంతోషంగా ఉండేదాన్ని. పెళ్ళైన సంవత్సరం తరువాత నేను ఒక అందమైన మగబిడ్డకి జన్మనిచ్చాను. తను పూర్తిగా మాకు బాబా ఇచ్చిన బహుమతి. ఆ తరువాత నెమ్మదిగా నా జీవితంలో మార్పులు చోటుచేసుకున్నాయి. సమయం గజిబిజిగా మారిపోయింది. జీవితంలో స్థిరపడటానికి నేను చాలా కష్టపడ్డాను. చాలాసార్లు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాను. కానీ నా అందమైన భవిష్యత్తుకోసం ప్రణాళికలు వేసుకున్న బాబా నా ఆలోచన మార్చుకునేలా చేస్తుండేవారు. నెమ్మదిగా నా తల్లిదండ్రుల మద్దతుతో నేను పనిచేయడం ప్రారంభించాను. నేను నా భర్తతో కలిసి ఉంటున్నప్పటికీ నాకు పూర్తి నైతిక మద్దతు నా తల్లిదండ్రుల నుండి లభిస్తుండేది. చాలా కష్టపడ్డాక నా జీవితాన్ని ఎలా నడుపుకోవాలో నేర్చుకున్నాను. ఆ చేదు అనుభవాలతో బాబా నన్ను సరిదిద్దారు. ఇప్పుడు నేను ఆత్మవిశ్వాసంతో స్వతంత్రంగా కష్టపడి పనిచేసుకుంటున్న మహిళను. నేనిప్పుడు కలిగి ఉన్న ప్రతిదానికి చాలా ఆశీర్వాదపూర్వకంగా భావిస్తున్నాను. నా ఒడిదుడుకుల జీవన ప్రయాణమంతా నాకు అండగా నిలిచిన నా సద్గురు సాయికి చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆయన చేసిన అద్భుతాలు తెలుసుకుంటే భక్తులు నిజంగా ఆశీర్వాదపూర్వకంగా భావిస్తారు. కాబట్టి అందరిలో విశ్వాసాన్ని స్థిరీకరించడానికి ఇక్కడ బాబా చేసిన అద్భుతాలను, ఆయన నా దృష్టిని ఆయనవైపు ఎలా మళ్లించారో ఇప్పుడు చెప్తాను.
నేను: (మనసులో ఏదో ఆలోచిస్తూ ఏమీ అనలేదు.)
బాబా: మానవులు తప్పులు చేస్తారు. గతం గురించి నువ్వు ఎన్నిరోజులని ఆలోచిస్తావు?
నేను: (ఏమీ చెప్పలేక నా కళ్ళనుండి కన్నీళ్ళు కారుతున్నాయి. అతను నా హృదయాన్ని చదువుతున్నారు.)
బాబా: చింతన్ కరో బేటీ.
నేను: (చింతన్ యొక్క సరైన అర్థం నాకు తెలియలేదు. మందిరం నుండి బయలుదేరిన తర్వాత గూగుల్‌లో దాని అర్థాన్ని చూడాలని అనుకున్నాను. ఇవన్నీ నేను నా మనస్సులో అనుకుంటున్నాను. నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ ఆయన నా మనస్సు చదువుతున్నారు)
బాబా: "చింతన్" అంటే నీకు అర్థం కాలేదా? అంటే "స్మరణ చేయమ"ని.

- నేను నా మొదటి వైవాహిక జీవితంలో బాధలు అనుభవిస్తున్నప్పుడు బాబా మా నానమ్మ ద్వారా నాకు మార్గనిర్దేశం చేస్తుండేవారు. బాబా ఆమెకు కలలో కనిపించి ఆదేశాలు ఇస్తుండేవారు. అప్పట్లో నేను అంత భక్తురాలిని కానందున నేను ఆమె కలల గురించి నమ్మలేదు.
- ఆ సమయంలోనే బాబా ఒకసారి జ్యోతిష్కుడి రూపంలో నా వద్దకు వచ్చారు. నేను ఆయనను బాబాగా గుర్తించలేకపోయాను. ఆయన నా మాతృభాషలో, "నువ్వు విదేశాలలో స్థిరపడతావు. ఈ వివాహం నీ భవిష్యత్తుకు మంచిది కానందున దాన్ని వదిలించుకో" అని చెప్పారు.
- 2010లో జరిగిన నా మొదటి వీసా ఇంటర్వ్యూ, USAలో మొదటిసారి ఇంటిలో అడుగుపెట్టడం గురువారమే జరిగాయి.
- USAలో నా భర్తతో సర్దుకుపోవడానికి కష్టపడుతున్న సమయంలో కలలో తెల్లని వస్త్రాలు ధరించి, తలపాగా కట్టుకున్న ఒక వ్యక్తి నేను ఎక్కడికి వెళ్లినా నన్ను అనుసరిస్తూ ఉండటాన్ని చూశాను. అదే కల వరుసగా రెండురోజులు వచ్చింది. "భయపడవద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను" అని సాయిబాబా ఆ కల ద్వారా నాకు భరోసా ఇస్తుంటే ఆయన సాయిబాబా అని నేనస్సలు గుర్తించలేకపోయాను.
- పరిస్థితులకు తట్టుకోలేక నేను మానసికంగా కృంగిపోయినప్పుడు, జీవితం మీద ఆశను కోల్పోయిన ప్రతిసారీ బాబా ఎవరో ఒకరి ద్వారా నన్ను ఆ పరిస్థితుల నుండి బయటకు తీసుకొచ్చేవారు.
- నన్ను పూర్తిగా మార్చిన అతి పెద్ద అద్భుతం ఇప్పుడు చెప్తాను. పైన వివరించిన విషయాలు జరుగుతున్నప్పుడు ఒక మంచిరోజు (గురువారం) మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో నేను సమీపంలో ఉన్న సాయి మందిరానికి వెళ్ళాను. నేను నా కారు పార్క్ చేసి నా రోజువారీ అలవాటు ప్రకారం ఆరోజు దినఫలాలు చూశాను. అందులో, "మీరు మధ్యాహ్నం 1:30కి ఒక ప్రత్యేకమైన వ్యక్తిని కలవబోతున్నారు. అతను మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతున్నారు" అని ఆ జ్యోతిష్య శాస్త్ర వెబ్‌సైట్‌లో వ్రాయబడి ఉంది. నేను వాటిని అంతగా పట్టించుకోకుండా మందిరం లోపలికి అడుగుపెట్టాను. నేరుగా బాబా వద్దకి వెళ్లి ఆయన దర్శనం చేసుకున్నాను. తరువాత వెనక్కి వచ్చి ఒక మూలన కూర్చుని బాబాను చూస్తూ ఉన్నాను. మనసులో బాధాకరమైన నా గత జీవితాన్ని, అప్పుడు అనుభవిస్తున్న కష్టాలను గుర్తుచేసుకుంటున్నాను. అంతలో తెల్లని ప్యాంటు, షర్ట్ ధరించి, తెల్లటి గడ్డమున్న ఒక వృద్ధుడు నన్ను తన వద్దకు రమ్మని పిలిచాడు. తరువాత అతనే నా పక్కన వచ్చి కూర్చున్నాడు. నేను అతన్ని ఎప్పుడూ చూడలేదు. మా ఇద్దరి మధ్య హిందీలో క్రింది సంభాషణ జరిగింది. అయితే నా సంభాషణ అంతా మనసులోనే జరిగింది.
నేను: (మనసులో ఏదో ఆలోచిస్తూ ఏమీ అనలేదు.)
బాబా: మానవులు తప్పులు చేస్తారు. గతం గురించి నువ్వు ఎన్నిరోజులని ఆలోచిస్తావు?
నేను: (ఏమీ చెప్పలేక నా కళ్ళనుండి కన్నీళ్ళు కారుతున్నాయి. అతను నా హృదయాన్ని చదువుతున్నారు.)
బాబా: చింతన్ కరో బేటీ.
నేను: (చింతన్ యొక్క సరైన అర్థం నాకు తెలియలేదు. మందిరం నుండి బయలుదేరిన తర్వాత గూగుల్‌లో దాని అర్థాన్ని చూడాలని అనుకున్నాను. ఇవన్నీ నేను నా మనస్సులో అనుకుంటున్నాను. నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ ఆయన నా మనస్సు చదువుతున్నారు)
బాబా: "చింతన్" అంటే నీకు అర్థం కాలేదా? అంటే "స్మరణ చేయమ"ని.
నేను: (అది బహిరంగ ప్రదేశమైనందున నేను భావోద్వేగాలను నియత్రించుకుంటూ కన్నీళ్లు తుడుచుకుంటున్నాను.)
బాబా: “మానసికంగా నువ్వెప్పుడు క్రుంగిపోయినా నా దగ్గరకు రా. నేను ఎల్లప్పుడూ నీకోసం ఎదురుచూస్తూ ఉంటాను. నువ్వు నా బిడ్డవు. నువ్వు మాత్రమే కాదు, ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ నా బిడ్డలే".
నేను: (నేను ఎప్పుడూ ఊహించనిది నాముందు జరుగుతుంటే నేను దాన్ని జీర్ణించుకోవడానికి ప్రయత్నిస్తున్నాను.)
బాబా: "చింతలన్నింటినీ వదిలేసి నీ పనిని చేయి. నువ్వు హృదయపూర్వకంగా పిలిచినప్పుడల్లా నీ బాబా నీకు అండగా నిలబడతారని దృఢంగా గుర్తుంచుకో"
నా కళ్ళ నుండి కన్నీళ్లు జలజలా రాలుతుంటే నేను ఆయన పాదాలు తాకి, నన్ను ఆశీర్వదించమని అన్నాను. ఆయన నన్ను ఆశీర్వదించి, తమ వద్ద ఉన్న తెల్లని సంచి నుండి డ్రై ఫ్రూట్స్ తీసి నాకు ప్రసాదంగా ఇచ్చారు. తరువాత నేను అక్కడినుండి తిరిగి వచ్చేశాను. ఇంటికి చేరుకున్నాక కూడా నేను ఆయన నా బాబా అని గ్రహించక, 'ఆయన ఎవరై ఉంటారా!' అని ఆలోచనలో పడ్డాను. అదేరోజు రాత్రి ఆయన నాకు కలలో కనిపించారు. ఆయన నా మంచం దగ్గర నిలబడి, "నువ్వు నన్ను ఇంకా గుర్తించలేదా?" అని గట్టిగా అరుస్తున్నారు. హఠాత్తుగా నేను నిద్ర లేచాను. అప్పటినుండి ఆయన నాకు అనేక విధాల మార్గనిర్దేశం చేస్తూ ఎన్నో లీలలు చూపించారు. వాటిని మరోసారి పంచుకుంటాను.
చాలా ఓపికతో మొత్తం చదివినందుకు నా ధన్యవాదాలు. బాబా మనందరికీ మంచి ఆరోగ్యం, విశ్వాసం, సహనం ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను. "బాబా! మీరు నాపై కురిపించిన అనుగ్రహానికి కృతజ్ఞతలు అన్న మాట సరిపోదు. మీకు నా శతకోటి ప్రణామాలు".
source:http://www.shirdisaibabaexperiences.org/2020/01/shirdi-sai-baba-miracles-part-260314.html

ఓం శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై!
source:http://www.shirdisaibabaexperiences.org/2020/01/shirdi-sai-baba-miracles-part-260314.html
ఓం శ్రీ సాయినాధాయ నమః🙏
ReplyDelete🙏🙏Om sai ram🙏🙏
ReplyDeleteసాయి కథా శ్రవణం సకల పాప హరణం.
Om Sai Ram 🙏🌹🙏
ReplyDelete🙏🌹 Om Sri sairam tatayya 🌹🙏
ReplyDeleteఓం సాయిరాం...🌹🙏🌹
ReplyDelete