సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 437వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబా సాక్షాత్కారం
  2. దర్శనభాగ్యాన్నిచ్చి సంతోషాన్నిచ్చారు బాబా

బాబా సాక్షాత్కారం

సాయిభక్తురాలు సాయి తనకు బాబా ప్రసాదించిన దర్శనాన్ని మనతో ఆనందంగా పంచుకుంటున్నారు.

సాయిభక్తులకి, ఈ బ్లాగ్ నిర్వాహకులకి నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు సాయి. ఆలస్యం చేయకుండా ఈరోజు నాకు కలిగిన అనుభవాన్ని (ఆనందాన్ని) మీ అందరితో పంచుకుంటాను. నేను సాయిలీలామృతం పారాయణ చేయడం ప్రారంభించాను. అందులో భాగంగానే ఈరోజు (01-06-2020) సాయంత్రం పారాయణ చేస్తున్నాను. అప్పుడు నా మనసులో, “ఆహా, నిజంగా శిరిడీ ప్రజలు ఎంత అదృష్టం చేసుకున్నారు! దేవుడికి స్వయంగా సేవ చేయాలంటే ఎంత అదృష్టం కావాలి!” అనుకున్నాను. మళ్ళీ అంతలోనే ఇంకో ఆలోచన, “నిజంగా బాబా అలా నా ముందుకి వచ్చినా గుర్తించేంత జ్ఞానం నాకుందా? లేదు, అస్సలు లేదు” అని. మళ్ళీ అంతలోనే, “బాబా! నాకు తెలుసయ్యా, నువు నాతోనే ఉన్నావు, నాలోనే ఉన్నావు, కానీ ఎందుకు ప్రత్యక్షంగా కనిపించవు?” అని బాబాని అడిగాను. నా పాటికి నేను పారాయణ చేస్తూనే ఉన్నాను, మళ్ళీ మనసులో ఈ ఆలోచనలు. బహుశా అది నా సుప్తచేతనాత్మక మనసు (subconscious mind) అయివుండొచ్చు. నెమ్మదిగా పారాయణ పూర్తయింది. 

ప్రతిరోజూ నిద్రపోవడానికి ముందు కనీసం ఒక అరగంట బయట కూర్చుని మాట్లాడుకోవడం నాకు, మా అమ్మకు అలవాటు. ఈరోజు కూడా అలానే కూర్చుని అలా సరదాగా ఆకాశంలోని మేఘాలని, చంద్రుని వెన్నెలని చూస్తూ మాట్లాడుకుంటున్నాం. నేను ఎందుకో కాసేపు చంద్రుడిని అలానే చూశాను. అద్భుతం! నాకు చంద్రుడిలో బాబా కనిపించారు. మళ్ళీ మళ్ళీ చూశాను, బాబా కనిపిస్తున్నారు. బాబా కనిపిస్తున్నారని అమ్మతో చెబితే తను కూడా చంద్రుడి వంక పరీక్షగా చూసి, “అవును, నాకు కూడా చంద్రుడిలో బాబా ముఖం కనిపిస్తోంది” అని చెప్పింది. నేను ఇంతకుముందు వార్తల్లో కొన్నిసార్లు చూశాను - “చందమామలో శిరిడీసాయిని దర్శించుకుంటున్న భక్తులు” అని. ఎప్పటినుండో నేను బాబాకి భక్తురాలినయినప్పటికీ నాకు బాబా ఎప్పుడూ కనిపించలేదు. కనిపించలేదు అనేకంటే నేను చూడలేకపోయాను అనడం నిజం. ఇప్పుడు బాబా కనిపించడంతో నాకు ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను. ఈరోజు జరిగింది కేవలం నా మనసులో ఉన్న ఊహే కావచ్చు. కానీ, బాబాని అన్నిటా, అంతటా ఎప్పటికీ ఇలానే చూడగలగాలని నా అభిలాష. ‘సర్వం సాయిమయం’ అని మనందరికీ తెలుసు. “బాబా! ప్రతి చోటా,  ప్రతి జీవిలో నిన్ను చూసే జ్ఞానాన్ని నాకు ఇవ్వు బాబా. నాలోని అహంకారాన్ని పూర్తిగా తీసివేయి. బాబా! నా మనసు ఎప్పటికీ నీ పాదాల చెంత ఉండనీ!”

పిలిస్తే పలుకుతానుఅని బాబా చెప్పింది అక్షర సత్యం. ఆయన తప్పకుండా పలుకుతారు, మనం శ్రద్ధ, సబూరీలతో ఉండి ఆయన అనుగ్రహాన్ని పొందాలి. “నీ బిడ్డలందరినీ రక్షించు బాబా, ఎవరినీ నీకు దూరం కానీయకు”.

ఓం సాయిరాం!

దర్శనభాగ్యాన్నిచ్చి సంతోషాన్నిచ్చారు బాబా

సాయి భక్తురాలు శ్రీమతి మహేశ్వరి తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

సాయి మహరాజ్ సన్నిధి బ్లాగ్ నిర్వాహకులకు నా కృతజ్ఞతలు. ఈ బ్లాగ్ ద్వారా సాయిభక్తుల అనుభవాలు తెలుసుకోవటం చాలా సంతోషంగా ఉంది. బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో  పంచుకుంటాను. మావారి ఉద్యోగరీత్యా మేము దుబాయిలో ఉంటున్నాము. ఒకసారి సెలవులకు మేము ఇండియా వచ్చినప్పుడు మా కుటుంబమంతా కలిసి తిరుపతి వెళ్ళాము. అక్కడ వేంకటేశ్వరుని దర్శనం అనంతరం ఆ చుట్టుప్రక్కల గల దేవాలయ దర్శనాలకు వెళ్ళాము. అలా కపిలతీర్థం కూడా వెళ్ళాము. అక్కడ మేము కారు దిగి దర్శనానికి గుడి లోపలికి వెళ్తుండగా వెనుకనుండి ఒక వ్యక్తి నన్ను ఓయ్, దుబాయ్!అని పిలిచారు. నేను వెనక్కి తిరిగి చూశాను. కఫ్నీ ధరించివున్న ఆ వ్యక్తి తెల్లగా, ఎత్తుగా ఉండి, ఒక చేత్తో కర్ర, వేరొక చేత్తో సటకా పట్టుకుని ఉన్నారు. ఆయన సటకా చూపిస్తూ నన్ను డబ్బులు అడిగారు. “ఈయన నన్ను దుబాయ్ అని ఎలా పిలిచారు? నేను దుబాయిలో ఉంటానని ఈయనకెలా తెలుసు?” అని ఆలోచిస్తూనే ఆయనకి ఒక పది రూపాయలు ఇచ్చి, మిగిలిన యాచకులతో కూడా పంచుకోమని చెప్పి అక్కడనుండి కొంచెం ముందుకు వస్తుండగా, ఒకామె నన్ను పిలిచి డబ్బులు అడిగింది. “నేను ఇంతకుముందే ఒకాయనకి ఇచ్చాను, అందరూ తీసుకోండి” అని చెప్పాను. అందుకామె, “ఆయన ఇవ్వరమ్మా, అందరినీ కొడతారు. ఇదిగో, నా చెయ్యి చూడమ్మా ఎలా విరగ్గొట్టారో” అంది. ఆ మాటలు విని నేను ‘ఆయన ఖచ్చితంగా బాబానే అయివుంటారు’ అనుకున్నాను. కానీ మళ్ళీ వెనక్కి వెళ్లి చూద్దామనుకోలేదు. ఈ విధంగా నాకు ఆయన దర్శనభాగ్యం కల్పించి నాకు చాలా సంతోషాన్నిచ్చారు బాబా. మనం ఎంత కొంచెం ప్రార్థించినా ఆయన మన వెంటే ఉంటారు. ఇలా ఎన్నో అనుభవాలను బాబా నాకు ప్రసాదించారు. “బాబా! నీ నామస్మరణ, నీ ఆలోచనలు ఎప్పుడూ నాతో ఉండాలని ఆశీర్వదించు బాబా!”


10 comments:

  1. ఓం సాయిరాం!

    ReplyDelete
  2. Om sairam
    sai always be with me

    ReplyDelete
  3. ఓం సాయిరాం ఓంసాయిరాం
    హరే హరే కృష్ణ సాయి సాయి రామ్
    ఓం సాయిరాం ఓం సాయిరాం
    హరే హరే కృష్ణ సాయి సాయి రామ్
    ఓం సాయిరాం ఓం సాయిరాం
    హరే హరే కృష్ణ సాయి సాయి రామ్

    ReplyDelete
  4. ఓం సాయిరాం!

    ReplyDelete
  5. very nice leelas.they are lucky to take sais live darshan.i want to take sai\s live darshan. my bad luck sai even don;t come in dreams also.my fate .om sai ram om sai ram.please sai give darshan to me.i am your lovely daugther.be with us.bless us

    ReplyDelete
  6. ఓం సాయిరాం...🌹🙏🌹

    ReplyDelete
  7. బాబా మా ఫ్రెండ్ సెకండ్ హాండ్ sucooty తీసుకుంది ది పై వినాయకునికి బోమ్మ ఉంది
    నిను మా ఫ్రెండ్ కి చేపను నాకు కుడా తీసుకోమని
    బాబా నాకు వొచ్చే sucooty పై మీ బోమ్మ ఉండాలని కోరుకుంటునను ప్లీజ్ బాబా నాకు మీ బోమ్మ ఉన్న sucooty వొస్తే నిను నా అనుభవాన్ని ఈ బ్లాగు లో పంచుకుంటాను plese plese బాబా ఓం సాయిరాం,,🌹🙏🌹

    ReplyDelete
  8. 🙏🌹 Om Sri sairam tatayya 🙏🌹

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo