ఈ భాగంలో అనుభవాలు:
- ఎంతో అండగా ఉంటున్న బాబా
- సాయిబాబా కృపతో గండం గడిచింది
ఎంతో అండగా ఉంటున్న బాబా
సాయిబంధువులందరికీ సాయిరామ్! ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా నమస్కారం. నాకు సాయిబాబాతో చాలా సంవత్సరాలుగా అనుబంధం ఉంది. నేను ప్రతి పనిలోనూ బాబాపైనే భారం వేస్తాను. ఆయన నాకు ఎంతో అండగా ఉంటూ ఎన్నో అనుభవాలను ప్రసాదించారు. వాటిలోనుండి కొన్ని అనుభవాలను ఇప్పుడు మీతో పంచుకుంటాను.
నాకు ఇద్దరు పిల్లలు. ఒక పాప, ఒక బాబు. పాప బి.టెక్ అయిపోయాక ఉద్యోగం చేస్తున్న సమయంలో మేము తనకి వివాహం చేశాము. బాబు బి.టెక్ అయిపోయిన తరువాత ఎమ్.ఎస్ చేయడం కోసం యు.ఎస్.ఏ వెళ్ళాడు. అక్కడ ఎమ్.ఎస్ చేసిన వెంటనే వాడికి మంచి ఉద్యోగం వచ్చింది. రెండు సంవత్సరాలు ఆనందంగా గడిచాయి. కానీ గత సంవత్సరం హెచ్1 వీసాకు దరఖాస్తు చేస్తే వీసా రాలేదు. ఈ సంవత్సరం ఆఖరి నిమిషంలో కంపెనీ వాళ్ళు, “మేము హెచ్1 వీసాకి దరఖాస్తు చేయటం లేదు. ఇది యు.ఎస్.ఏ కంపెనీ. నాన్-లోకల్ వాళ్ల హెచ్1 వీసాకి దరఖాస్తు చెయ్యము” అని చెప్పారు. దాంతో నేను చాలా ఆందోళన చెంది బాబాను ప్రార్థించి, భారమంతా ఆయనపై వేశాను. తరువాత నేను పాప డెలివరీ కోసం యు.ఎస్.ఏ వచ్చాను. ఒకరోజు బాబా గుడికి వెళ్ళి నా బాధనంతా బాబాతో విన్నవించుకున్నాను. ఆయన కృప చూపించారు. మార్చి నెలలో మా బాబు ఆఫీసులో ఒకతను, "నేను నీకు వేరే కంపెనీకి రిఫర్ చేస్తాన"ని చెప్పి బాబుతో ఆ కంపెనీలో ఉద్యోగానికి దరఖాస్తు చేయించి ఇంటర్వ్యూకి ఏర్పాటు చేశాడు. ఒక వారంలోనే ఆ కంపెనీ వాళ్ళు బాబుని ఇంటర్వ్యూ చేసి, ఆ ఉద్యోగానికి తనను ఎంపిక చేసి, తను అప్పుడు సంపాదిస్తున్న జీతం కన్నా రెట్టింపు జీతంతో ఆఫర్ లెటర్ ఇచ్చి, 2020, మార్చి 17న ఉద్యోగంలో చేరమని చెప్పారు. వాళ్ళు హెచ్1 వీసాకి కూడా దరఖాస్తు వేశారు. బాబా అనుగ్రహంతో డ్రా లో బాబు పేరు ఎంపికైంది. బాబానే ఆ మధ్యవర్తి రూపంలో మా బాబుకి, మాకు ఎంతో అండగా నిలిచారు. కాకపోతే యు.ఎస్.ఏ లో కరోనా కారణంగా హెచ్1 వీసా ఇంకా ఆమోదం పొందలేదు. నేను ఆ విషయాన్ని బాబాకు చెప్పుకుని ఆయనపైనే భారం వేశాను.
మరో అనుభవం:
నేను ప్రస్తుతం యు.ఎస్.ఏ లోనే ఉన్నాను. ఒక పదిరోజుల క్రితం నేను, “బాబా! మేము ఇండియాలో పెద్ద ఇల్లు కట్టుకున్నాము. నేను యు.ఎస్.ఏ లోనే ఉంటున్నాను. కాబట్టి ఆ ఇంటిలో ఎవరినైనా అద్దెకు ఉంచు బాబా!” అంటూ ఎంతో దీనంగా బాబాను వేడుకున్నాను. వారం రోజుల్లోనే మాకు తెలిసిన వాళ్ళు వచ్చి ఇల్లు కావాలని అడిగి, రెండు నెలల అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళారు. బాబా దయ మాకు ఇంత అండగా ఉంది. నా అనుభవాలను ఇంత ఆలస్యంగా పంచుకుంటున్నందుకు బాబాను క్షమించమని కోరుకుంటున్నాను. బాబా దయవలన త్వరలోనే మరికొన్ని అనుభవాలను మీతో పంచుకోవాలని బాబాని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

సాయిబాబా కృపతో గండం గడిచింది
సాయిభక్తుడు రాంప్రసాద్ తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
సాయిమహరాజ్ సన్నిధి బ్లాగ్‌కి స్వాగతం. నా పేరు రాంప్రసాద్. బ్లాగ్ నిర్వహిస్తున్న నిర్వాహకులందరికీ నా నమస్సుమాంజలి. ఈరోజు (27/05/2020) బాబా చూపిన అద్భుత లీల గురించి మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను.
నేను ఏ పని చేయాలనుకున్నా ముందుగా బాబా ప్రశ్నలు-జవాబులు పుస్తకం చూసి బాబా సలహా ప్రకారం నడుచుకోవడం అలవాటుగా చేసుకున్నాను. ఈ మధ్యకాలంలో నేను ఒక మిత్రుడికి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఒక ఫ్లాట్ కొనిచ్చాను. ఈ సంఘటన జరగడానికి కొద్దిరోజుల ముందు ప్రశ్నలు-జవాబుల పుస్తకంలో బాబా నాకు ఎన్నో జాగ్రత్తలు, హెచ్చరికలు సూచనప్రాయంగా ఇచ్చారు. కానీ నేను వాటిని అశ్రద్ధ చేసి, నా స్నేహితుడికి ప్లాట్ కొనిచ్చాను. కొద్దిరోజుల తర్వాత ఆ ప్లాట్ విషయంలో చాలా గొడవలు జరిగాయి. పరిస్థితి మొత్తానికి నేనే జవాబుదారీతనం చెప్పవలసిన పరిస్థితి ఏర్పడింది. ఒక్కసారిగా పరిస్థితులన్నీ తారుమారయ్యాయి. ఒకేసారి పెద్దమొత్తంలో హామీ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. రెండురోజుల పాటు నేను చాలా ఆందోళనకు గురయ్యాను. ‘బాబా చెప్పిన సలహాలు పాటించనందుకే ఈ శిక్ష’ అని భావించి, సమాధానం కోసం మరలా బాబానే ఆర్తిగా ప్రార్థించాను. ఆ మరుసటిరోజు ప్రశ్నలు-జవాబులు పుస్తకంలో, "భయం లేదు, నీ అనారోగ్యం తీసివేయబడింది, కానీ ఇకమీదట జాగ్రత్తగా ఉండు" అని సమాధానం వచ్చింది. తరువాతిరోజు, నేను నా మిత్రునికి హామీ పత్రం ఇచ్చినట్లు, ఆ సమస్య నుంచి బయటపడినట్లు నాకు కల వచ్చింది. తరువాత నేను కోరుకున్నట్లే ఎటువంటి మనస్పర్థలూ లేకుండా నా మిత్రుడు ఈ సమస్యను పరిష్కరించేందుకు నాకు కొంత గడువు ఇవ్వటానికి అంగీకరించాడు. ఎటువంటి పరువు నష్టం జరగకుండా సమస్యను తేలిగ్గా పరిష్కరించుకోవడం కోసం బాబానే ఇలా దారి చూపించారని గ్రహించి బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను. బాబా ఇచ్చిన సలహాలను నిర్లక్ష్యం చేసినందుకు ఇది ఒక శిక్షగా భావించి ఇకమీదట జాగ్రత్తగా ఉండాలని అనుకున్నాను. నేను ఎల్లవేళలా బాబా స్మరణలో ఉండాలని, ఎల్లప్పుడూ నా వెంటే ఉండి అనుక్షణం నన్ను రక్షించమని బాబాను వేడుకుంటూ, నా అనుభవాన్ని ఈ బ్లాగ్ ద్వారా సాయిమిత్రులతో పంచుకున్నందుకు సంతోషిస్తున్నాను.

ReplyDeleteOM SAIRAM
ReplyDeleteSAI ALWAYS BE WITH ME
నేను ఎల్లవేళలా బాబా స్మరణలో ఉండాలని, ఎల్లప్పుడూ నా వెంటే ఉండి అనుక్షణం నన్ను రక్షించమని బాబాను వేడుకుంటన్నాను
ReplyDeleteOm Sri Sai Ram thaatha 🙏🙏
ReplyDeleteBhavya sree
Om Sai Ram 🙏🌹🙏🌹🙏
ReplyDelete🙏🌹ఓం శ్రీ సాయిరాం తాతయ్య 🌹🙏
ReplyDelete