సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 446వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. భయాందోళనలు తొలగించిన బాబా
  2. లాకెట్ ప్రసాదించి నాతోనే ఉన్నానని నిరూపణ ఇచ్చిన బాబా

భయాందోళనలు తొలగించిన బాబా

ఓం శ్రీ సాయినాథాయ నమః

అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!

నా పేరు శిరీష. ముందుగా సాయిభక్తులందరికీ నా నమస్కారములు. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న వారందరికీ నా ధన్యవాదాలు. నేను ఇదివరకు కొన్ని అనుభవాలను సాటి సాయిభక్తులతో పంచుకున్నాను. ఇప్పుడు రెండు చిన్న అనుభవాలను మీ అందరితో పంచుకోవాలని అనుకుంటున్నాను. నా అనుభవాలు చిన్నవే అయినా నేను చాలా భయపడి సాయినాథుని ప్రార్థించి, ఆయన దయవల్ల బయటపడినవి.

మొదటి అనుభవం :

మావారు డివిజినల్ ఇంజనీర్(D.E)గా పనిచేస్తున్నారు. 2020, మే నెల చివరి వారంలో మావారు బైక్ పై ఆఫీసు పనిమీద విజయవాడ వెళ్లారు. రాత్రి 9 గంటలు అవుతున్నా కూడా ఆయన ఇంటికి రాలేదు. నేను ఫోన్ చేస్తుంటే నెంబర్ బిజీ అని వస్తోంది. మొదట ఎవరితోనైనా మాట్లాడుతున్నారేమో అనుకున్నాను. అయితే నేను మళ్ళీ మళ్ళీ చేస్తుంటే కొద్దిగా రింగ్ అయిన తరువాత కాల్ కట్ చేసినట్లు వస్తుండేది. ఇలా ఒక గంట సమయం గడిచింది. సాధారణంగా నేను ఎప్పుడు ఫోన్ చేసినా మావారు లిఫ్ట్ చేస్తారు. ఒకవేళ ఆ సమయంలో బిజీగా ఉంటే, కనీసం 'తరువాత మాట్లాడతాన'నైనా చెప్తారు. అటువంటిది ఎంతసేపటికీ ఫోన్ తియ్యకపోయేసరికి నేను చాలా భయపడ్డాను. అప్పుడు బాబాని తలచుకొని, “బాబా! ఒక 15 నిమిషాల తరువాత మళ్లీ ఫోన్ చేస్తాను. ఈసారి ఆయన తప్పకుండా ఫోన్ లిఫ్ట్ చేసేలా చూడండి” అని బాబాను ప్రార్థించాను. కాసేపయ్యాక ఫోన్ చేస్తే, ఆయన లిఫ్ట్ చేశారు. డ్రైవింగులో ఉన్నానని, హెడ్ ఫోన్ పెట్టుకోవడం వలన తనకు కాల్ వినపడలేదని చెప్పారు. బాబా దయవలన అప్పుడు నా మనస్సు తేలికపడింది. వెంటనే బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను. నిజానికి ఆ గంటసేపు నేను భయంతో ఎంత ఆందోళన చెందానో నాకే తెలుసు. ఇలాగే బాబా ఎల్లపుడూ మా కుటుంబాన్ని రక్షిస్తూ ఉన్నారు. ఆయన దయవలన మేము రెండు ప్రమాదాల నుండి బయటపడ్డాము. ఆ అనుభవాలను త్వరలో మీతో పంచుకుంటాను. 

రెండవ అనుభవం : 
          
మావారు D.E గా తన బాధ్యతలతో పాటు E.E(ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్)గా అదనపు బాధ్యతలు కూడా నిర్వహిస్తుండేవారు. 2020, జూన్ 2, మంగళవారంనాడు హైదరాబాద్ నుండి క్రొత్త ఆఫీసరు మంగళగిరి వచ్చి E.E గా బాధ్యతలు తీసుకున్నారు. మావారు బుధవారంనాడు మరలా ఆఫీసు పని మీద విజయవాడ వెళ్లారు. మంచి ఎండలో వెళ్ళడం వల్లనేమో ఆ రాత్రి ఇంటికి వచ్చేసరికి ఆయనకి బాగా జ్వరం వచ్చింది. అసలే కరోనా కారణంగా భయంభయంగా ఉంటున్నాము. దానికితోడు జ్వరం వచ్చేసరికి చాలా ఆందోళనగా అనిపించింది. E.E గా క్రొత్తగా వచ్చినతను హైదరాబాద్ నుండి రావడం కూడా నా భయానికి ఒక కారణం. తెల్లవారుఝామున 3 గంటల సమయంలో మావారి జ్వరతీవ్రత బాగా ఎక్కువగా ఉండటంతో ఒక క్రోసిన్ టాబ్లెట్ ఇచ్చి, బాబా ఊదీ పెట్టాను. తరువాత, “బాబా! మావారికి ఉదయానికల్లా జ్వరం పూర్తిగా తగ్గిపోతే నా అనుభవాన్ని వెంటనే బ్లాగులో పంచుకుంటాను” అని బాబాని ప్రార్థించాను. బాబా దయవలన ఉదయానికల్లా జ్వరం తగ్గిపోయింది. మళ్ళీ ఏ టాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం రాలేదు. "బాబా! చాలా చాలా ధన్యవాదాలు. ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ కరోనా పూర్తిగా సమసిపోయేటట్లుగా చూడు తండ్రీ". 

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!

లాకెట్ ప్రసాదించి నాతోనే ఉన్నానని నిరూపణ ఇచ్చిన బాబా

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


నా పేరు సృజన. నేను ఒక చిన్న సాయిభక్తురాలిని. నేను బాబాని నమ్మటం, పూజించటం మొదలుపెట్టి రెండు సంవత్సరాలు అవుతోంది. నిజానికి బాబా నాకు ముందునుండే తెలుసుగానీ, ఆయనను అంతగా నమ్మేదాన్ని కాదు. కానీ ఇప్పుడు, ప్రతిరోజూ నిద్రలేవగానే బాబాను చూసిన తరువాతే నా దినచర్య మొదలుపెడుతున్నాను. ఆయన నాకు తోడుగా ఉన్నారని నేను నమ్ముతాను. బాబా నాకు చాలా అనుభవాలను ప్రసాదించారు. అయితే ఇటీవల బాబా ప్రసాదించిన ఒక అనుభవం నాకు చాలా సంతోషాన్నిచ్చింది. బాబా చూపిన ప్రేమతో నా ఆనందానికి అవధులు లేవు. 

2020, మే రెండవ వారంలో నేను, 'నాకు కొంచెం మనసు బాగుండట్లేదని, నా కుటుంబసభ్యులు అందరూ బాగుండాలని' బాబాని కోరుకుని సాయి సచ్చరిత్ర పారాయణ మొదలుపెట్టాను. నేను ఒక వారంపాటు పారాయణ చేస్తానని అనుకున్నాను. మొదటి మూడు రోజులూ ఏరోజు చదవాల్సిన భాగాలు ఆరోజు పూర్తి చేశాను. తరువాత నాలుగవరోజు, అనగా మే 18వ తేదీ నాడు నేను పారాయణ చేస్తుండగా ఆ పుస్తకంలో నాకొక లాకెట్ కనిపించింది. దానిపై ఒక వైపు బాబా, రెండవ వైపు 'ఓం' అని ఉన్నాయి. ఆ లాకెట్ అందులోకి ఎలా వచ్చిందా అని ఒక్క క్షణం నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే, నేను ఆదే పుస్తకాన్ని అదివరకు మూడుసార్లు పారాయణ చేశాను. అప్పుడెప్పుడూ నేను ఆ లాకెట్‌ని అందులో చూడలేదు. నిజానికి ఆ సచ్చరిత్ర పుస్తకం నా స్నేహితురాలిది. ఆమెని బాబానే నాకు పరిచయం చేశారు. ఆమె నన్ను "బాబాను నమ్ముకోమ"ని చెప్పింది. నేను తనను ఈ లాకెట్ విషయం గురించి అడిగాను. అందుకామె, ఆ లాకెట్‌ను తాను ఆ పుస్తకంలో పెట్టలేదని, తానెప్పుడూ ఆ లాకెట్‌ని చూడలేదని చెప్పింది. తను ఆ మాట చెప్తూనే, "బాబా నీతోనే ఉన్నానని చెప్తున్నారు చూశావా! నువ్వు చాలా లక్కీ, దేనికోసమూ దిగులుపడకు, అన్నీ బాబా ఏర్పాటు చేస్తారు. అంతా బాగా జరుగుతుంది. నువ్వు ఆనందంగా ఉండు" అని చెప్పింది. తన మాటలతో నేను చాలా సంతోషించాను. బాబా నాతో ఉన్నానని నిరూపణ ఇచ్చారు. "థాంక్యూ సో మచ్ బాబా. మీరు నాతో ఎప్పుడూ ఉంటూ నన్ను, నా కుటుంబాన్ని ఎల్లవేళలా కాపాడండి బాబా. మీ ప్రేమ, కరుణ, దయ మాపైన చూపించండి బాబా. మీరే నాకు అన్నీ. బాధలైనా, సంతోషమైనా అన్నీ మీతోనే  పంచుకుంటాను. కానీ కొన్నిసార్లు మీపై కోప్పడుతున్నాను. తండ్రీ! నన్ను క్షమించండి, బాధలో ఉండి అలా చేస్తున్నాను. బాబా నాది ఇంకా ఒక కోరిక ఉంది. అదేంటో మీకు రోజూ చెప్పుకుంటూనే ఉంటున్నాను. అది నెరవేర్చు తండ్రీ".

ఓం సాయిరామ్!!!


9 comments:

  1. 🙏 ఓం సాయి రామ్🙏
    సకల దేవతా స్వరూపం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్.భక్తుల అనుభవాలు..బాబా వారి అనుగ్రహ కుసుమాలు..లీలలు.. అద్భుతం..
    సాయి బంధువులు, మిత్రులు అందరికి ఎల్లవేళల సాయి ఆశీస్సులు ఉండాలని ప్రార్దన.
    ,🙏సదా సత్స్వరుపం.. చిదానందకందం
    స్వభక్తేచయా మానుషం దర్శయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం, 🙏
    🙏

    ReplyDelete
  2. om sai ram i love you.i like you very much.todays leelas are nice.we must trust him we completely surrened to him.he will take care of us

    ReplyDelete
  3. ఓం శ్రీ సాయినాథాయ నమః

    ReplyDelete
  4. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

    ReplyDelete
  5. ఓం సాయిరామ్!

    ReplyDelete
  6. ఓం సాయిరాం
    సాయి నాకు ఏమిఅని ప్రార్ధించాలో
    ఏమి అడగాలో కూడా అర్ధం కాని పరిస్థితిలో ఉన్నాను .
    చాలా చాలా భయముగా ఉంది సాయిరాం

    ReplyDelete
  7. ఓం శ్రీ సమర్ధ సద్గురు శ్రీ సాయి నాధ్ మహరాజ్ కీ జై

    ReplyDelete
  8. ఓం శ్రీ సాయిరామ్

    ReplyDelete
  9. ఓం శ్రీ సాయిరాం తాతయ్య 🙏🌹

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo