ఈ భాగంలో అనుభవాలు:
- తోడుగా ఉంటూ బాబా చేస్తున్న సహాయం
- బాబా అనుగ్రహానికి కొదవలేదు
తోడుగా ఉంటూ బాబా చేస్తున్న సహాయం
హైదరాబాద్ నుండి సాయిభక్తురాలు శ్రీమతి వనిత బాబా తనకు ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు:
నేను ఇరవై సంవత్సరాలుగా సాయిబాబా భక్తురాలిని. బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. మేము ఉంటున్న ఇంటిని ఇటీవల నేను కొనుగోలు చేశాను. అందుకోసం నేను బ్యాంకు లోన్‌కి అప్లై చేశాను. ఆ లోన్ మొత్తం నాకు 2020, మార్చి 23న రావాల్సి ఉందనగా హఠాత్తుగా లాక్‌డౌన్ ప్రకటించారు. దాంతో అది హోల్డ్‌లో ఉండిపోయింది. లాక్‌డౌన్ రిలాక్సేషన్ ఇచ్చిన తరువాత ఒకరోజు లోన్ డబ్బులు అందుకోవడానికి బ్రాంచిని సందర్శించమని బ్యాంకు నుండి నాకు సమాచారం అందింది. తీరా నేను వెళ్తే, వాళ్ళు లోన్ ఒప్పందానికి సంబంధించిన గడువు తీరిపోయినందున అది రద్దు చేయబడిందని, కొత్త ఒప్పందం చేసుకోవాలని చెప్పారు. అందుకు సంబంధించిన సమాచారం మరుసటిరోజే తెలియజేస్తామని చెప్పారు. కానీ ఆ తరువాత పది రోజులు గడిచినా ఏ సమాచారమూ వాళ్ళు నాకు ఇవ్వలేదు. నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా వాళ్ళ నుండి సరైన స్పందన రాలేదు. నిజానికి మాట్లాడాల్సిన సరైన వ్యక్తిని నేను కనుగొనలేకపోయాను. నేను ప్రతిరోజూ సాయిబాబాకి సంబంధించిన సమాచారం కోసం ఫేస్‌బుక్ ఫాలో అవుతుంటాను. ఆ అలవాటు ప్రకారం ఒకరోజు నేను ఒక భక్తుని అనుభవం చదువుతూ, "రెండు రోజుల్లో లోన్ మంజూరైతే నేను కూడా నా అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకుంటాన"ని బాబాను ప్రార్థించాను. బాబా చాలా దయామయులు. అడిగినంతనే అనుగ్రహించారు. 2020, మే 29న నాకు లోన్ మంజూరైంది. బాబా నాతో ఉన్నారని నేను చాలా సంతోషించాను.
ఇదే కాకుండా నాకు మరికొన్ని అనుభవాలున్నాయి. 4 నెలల క్రితం నేను 5 వారాల సాయిబాబా పూజ చేశాను. ఆ పూజ మధ్యలో ఉండగా ఒకరోజు నా భర్త, నా సోదరుడు బైక్ మీద వెళుతున్నారు. వాళ్ళు సరిగ్గా స్పీడ్ బ్రేకర్ మీద ఉండగా అకస్మాత్తుగా ఒక లారీ వేగంగా వచ్చి వాళ్ళ బైక్‌ను గుద్దింది. వాళ్ళు చిన్న చిన్న గాయాలతో ఆ ప్రమాదం నుండి బయటపడ్డారు. కేవలం బాబా కృపవలనే వాళ్ళు అంత పెద్ద ప్రమాదం నుండి క్షేమంగా బయటపడ్డారు.
ఐదు వారాల పూజ పూర్తైన తరువాత మళ్ళీ అదే పూజను 3 వారాలపాటు చేశాను. ఆ సమయంలో ఒకరోజు నేను గ్యాస్ స్టవ్ మీద నుండి వేడినీటిని క్రిందికి దించుతున్నప్పుడు అనుకోకుండా చేజారి వేడినీళ్లు నా మీద పడిపోయాయి. కానీ బాబా నన్ను రక్షించారు. ఆయన కృపవలన నాకేమీ కాలేదు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. మీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి".
నా అనుభవాలను పంచుకొనే అవకాశాన్ని ఇచ్చిన బ్లాగువారికి చాలా చాలా ధన్యవాదాలు.
- వనితా తమ్మిశెట్టి

బాబా అనుగ్రహానికి కొదవలేదు
పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు ఇటీవల తనకు బాబా ప్రసాదించిన ఒక అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:
ఓం సాయిరామ్! సాయిబంధువులందరికీ నమస్కారాలు. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్నవారికి ధన్యవాదాలు. ఇటీవల జరిగిన ఒక అనుభవాన్ని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. మా పెద్దపాపకి UK లో మాస్టర్స్ చేసే అవకాశం వచ్చింది. తను 2020, జనవరి 15న UK వెళ్ళింది. అక్కడికి వెళ్లేముందు తన వీసాను బాబా సమాధి వద్ద పెట్టించి, బాబా ఆశీస్సులు తీసుకుందామని జనవరి 11న మేము శిరిడీ వెళ్ళాము. బాబా మాకు చక్కటి దర్శనాన్ని అనుగ్రహించారు. సమాధిమందిరంలో మాకు తెలిసిన పూజారి ఒకరున్నారు. అతను బాబా శాలువాను మా అమ్మాయి మెడలో వేసి, బాబాకు పెట్టే గంధం మా కుటుంబంలోని అందరి నుదుటనా పెట్టారు. తరువాత ఊదీ ప్యాకెట్లు ఒక పర్సులో పెట్టి మా అమ్మాయికిచ్చి, "దీన్ని నీ దగ్గర ఉంచుకో, నీకు UK లో ఉపయోగపడుతుంది" అన్నారు. శిరిడీ నుండి వచ్చిన తరువాత 15వ తేదీ రాత్రి ఫ్లైట్‌కి మా అమ్మాయి UK వెళ్ళింది. అక్కడికి చేరుకున్న తరువాత తనకి నాలుగు నెలలపాటు నెలసరి రాలేదు. ఆ విషయంగా అక్కడ తను, ఇక్కడ మేము చాలా భయపడ్డాం. మా అమ్మాయి డాక్టర్ అపాయింట్‌మెంట్ తీసుకుందిగానీ, కరోనా కారణంగా డాక్టరు ఫోన్లోనే మాట్లాడి, బ్లడ్ టెస్ట్ చేయించుకోమని చెప్పారు. ఆ సమయంలో మా అమ్మాయి బాబా ఊదీని నీళ్లలో కలుపుకొని త్రాగి, కొంచెం ఊదీని తన పొట్టకి రాసుకుంది. మరో రెండురోజుల్లో బ్లడ్ టెస్టుకి వెళ్తాననగా తను సచ్చరిత్ర చదవటం ప్రారంభించింది. సచ్చరిత్ర చదవటం ప్రారంభించాక బాబా కృపవలన తనకి నెలసరి వచ్చింది. దాంతో మా మనసు ఎంతో తేలికపడి బాబాకి కృతజ్ఞతలు చెప్పుకున్నాము. తరువాత డాక్టరు బ్లడ్ రిపోర్టులు చూసి, చెకప్ చేసి "థైరాయిడ్, ఐరన్ బోర్డరులో ఉన్నాయి. కానీ మందులు అవసరం లేదు. సరైన ఆహారం తీసుకుంటే సరిపోతుంది. నెల తర్వాత మళ్ళీ ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకోండి" అని చెప్పారు. ఇదంతా బాబా అనుగ్రహం. "బాబా! ఈసారి బ్లడ్ టెస్ట్ రిపోర్టులు నార్మల్‌గా వచ్చేటట్లు చూడండి. కరోనా నుంచి అందర్నీ కాపాడండి. తప్పులు ఉంటే మన్నించండి బాబా".

🙏 ఓం సాయి రామ్ 🙏
ReplyDeleteసాయి లీలలు అద్భుతం.ఆయన లీలలు మన ఊహకు
అందవు.అందుకే సాయి సంధ్య ఆరతి లో "అగాథ తవ కరని..మార్గ దావిసి అనాధ"అని స్తుతిస్తూ తన్మయత్వం తో గానం చేస్తాం.... లీలా మయా సద్గురు సాయినాథ మీకు మీరే సాటి.. ధన్యోస్మి దేవదేవా సాయి దేవా 🙏🙏🙏
సాయిని నమ్మితే ఆయనే అంతా చూసుకుంటారు
ReplyDeleteOm sairam
ReplyDeleteOm sairam
ReplyDeleteOm Sai Ram 🙏🌹🙏
ReplyDeleteOm Sri Sai Ram thaatha 🙏🙏
ReplyDeleteBhavya sree..
ఓం సాయిరాం 🙏🙏🙏
ReplyDelete