ఈ భాగంలో అనుభవాలు:
- 'బాబా ఉన్నారు - అది చాలు'
సాయిబంధువులకి నమస్కారం. నా పేరు సంహిత. నాకు చిన్నప్పటినుంచి బాబా అంటే ఇష్టం. అప్పట్లో ఏదైనా అవసరం కోసం బాబా గుడికి వెళ్ళేదాన్ని. ఇంట్లో మాత్రం తప్పకుండా బాబాకు పూజ చేసుకునేదాన్ని. బాబాకి పూజ చేసి, ఆయనకు నైవేద్యం పెట్టనిదే మంచినీళ్లు కూడా త్రాగేదాన్నికాదు. పెద్దయ్యేకొద్దీ బాబా అంటే పిచ్చి ప్రేమ. ఆయన లేకుంటే నేను లేననే భావన ఏర్పడింది. ఆరతులకి హాజరు కావడం, బాబా ఎప్పుడు శిరిడీకి పిలుస్తారా అని ఎదురుచూస్తూ ఉండటం - ఇదే నా మనసులోని ఆరాటం. "బాబా! మీ గురించి ఏమి చెప్పాలో, ఎలా చెప్పాలో తెలియడంలేదు. కానీ ఏదో పంచుకోవాలని ఉబలాటం. క్షమించండి బాబా".
నేను ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎంతగానో ఎదురుచూస్తూ ఐదేళ్ల పాటు చాలా కష్టాలు పడ్డాను. చాలా పరీక్షలు వ్రాశాను కానీ, ఏదీ కలిసిరాలేదు. ఎన్నో మాటలు పడుతూ ప్రతిరోజూ బాబా దగ్గర "నేను మిమ్మల్నే నమ్ముకున్నాను బాబా, ఏమి చేస్తారో ఏమో మీ ఇష్టం" అని ఏడ్చేదాన్ని. ఆ సమయంలో బాబా నాకు ఎంతో అండగా ఉంటూ తొమ్మిదిసార్లు శిరిడీ దర్శనం చేయించారు. శిరిడీ నుండి వచ్చిన ప్రతిసారీ ఉద్యోగం వస్తుందని ఆత్రంగా చూసేదాన్ని, కానీ నాకు నిరాశే మిగిలేది. అలా ఐదేళ్లు గడిచిపోయాయి. తర్వాత పోలీస్ రిక్రూట్‌మెంట్ ఉద్యోగాలు పడ్డాయి. అంతకుముందు ఎన్నిసార్లు పోలీసు ఉద్యోగానికి సంబంధించిన నోటిఫికేషన్స్ వచ్చినా నాకు ఆ ఉద్యోగం వద్దని నేను దరఖాస్తు చేసేదాన్నికాదు. అలాంటిది ఈసారి నా స్నేహితురాలు నా చేత బలవంతంగా ఆ ఉద్యోగానికి దరఖాస్తు చేయించింది. అంతేకాదు, తనే స్వయంగా నోట్స్ ప్రిపేర్ చేసి నాకు ఇచ్చేది. తన ప్రోత్సాహంతో నేను ప్రిలిమ్స్, మెయిన్స్ మరియు అన్ని ఈవెంట్స్ విజయవంతంగా పూర్తిచేశాను. అయితే ఎస్.ఐ ఉద్యోగం చేజారి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. ఆ విషయంలో నేను అస్సలు సంతృప్తిగా లేను. ఒక గురువారం నేను ఆరతికి వెళ్లి ఆరతి పూర్తైన తరువాత, “బాబా! నేను కష్టపడిన దానికి ఫలితం దక్కలేదు. ఇన్ని సంవత్సరాలు కష్టపడితే ఈ ఉద్యోగమా?” అని బాధగా బాబాతో చెప్పుకున్నాను. శుక్రవారం ఉదయం నిద్రలేచాక చూస్తే, నేలమీద బాబా రూపం కనిపించసాగింది. నాకేమీ అర్థం కాలేదు. ‘ఎందుకిలా బాబా పదేపదే కనిపిస్తున్నారు?’ అని అనుకున్నాను. తరువాత అలవాటు ప్రకారం మొబైల్‌లో బాబా మెసేజ్‌లు చూసాను. తరువాత యూట్యూబ్ ఓపెన్ చేస్తే నేను అదివరకు వ్రాసిన ఒక పరీక్షా ఫలితాలు వచ్చినట్లు ఎవరో పెట్టారు. నిజానికి ఆ పరీక్షపై నేనెప్పుడో ఆశ వదిలేశాను. సరే, ఒకసారి చూసుకుందామని ఫలితాలు చూస్తే, అద్భుతం! నా నెంబర్ అందులో ఉంది. నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది. తరువాత సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ పూర్తయింది. ప్రస్తుతం నేను ఫైనల్ మెరిట్ లిస్ట్ కోసం ఎదురుచూస్తున్నాను.
అదలా ఉంటే ప్రస్తుతం పోలీస్ కానిస్టేబుల్ ట్రైనింగులో ఉన్న నేను చాలా కష్టంగా కాలం గడుపుతున్నాను. బాబా పూజ చేయడం, ఆయనకి నైవేద్యం పెట్టడం, మందిరానికి వెళ్లడం రోజూ అలవాటుగా చేసే నేను ఇప్పుడు అవి చేసే అవకాశం లేక చాలా బాధపడుతున్నాను. అద్భుతం! బాబాకి దూరంగా ఉన్నానని అంతలా బాధపడుతున్న నా దగ్గరకి బాబానే స్వయంగా వచ్చారు. 2020, మే 12న గ్రౌండులో నాకు బాబా ముఖం ఉన్న ఒక రాయి దొరికింది. నేను ఎంత ఆనందాన్ని పొందానో మాటల్లో చెప్పలేను. నా బాబా నాకోసం వచ్చారు.
తరువాత 2020, మే 14 రాత్రి ఒంటరితనాన్ని అనుభవిస్తూ, “బాబా! నాకు ఈ ట్రైనింగ్ నచ్చడం లేదు. బయటికి వెళ్లనివ్వడం లేదు. నేను ఇష్టపడినవన్నీ కోల్పోతున్నాను. మీరు కూడా నన్ను వదిలి వెళ్తారా బాబా?” అని ఎంతగానో ఏడ్చుకుంటూ పడుకున్నాను. ఆ రాత్రి నాకొక కల వచ్చింది. ఆ కలలో నేను, నా ఫ్రెండ్ కలిసి శిరిడీ వెళ్ళాము. మేము శిరిడీ వీధుల్లో తిరుగుతున్నాం. ఒకచోట రెండు బాబా విగ్రహాలు ఉన్నాయి. ఒక బాబా విగ్రహం పెద్దదిగా ఉండి, ప్రాణం పోసుకొని మనిషిలా మాట్లాడుతోంది, ఏది అడిగినా సమాధానం చెప్తోంది. మరో విగ్రహం చిన్నగా వుంది. ఆ చిన్న విగ్రహం నాకు ఇవ్వబడింది. నేను దాన్ని నా బ్యాగులో పెట్టుకున్నాను. మాట్లాడే పెద్ద బాబా నా ఫ్రెండుతో వెళ్తున్నారు. అప్పుడు నేను, “బాబా! మీరు నాతో మా ఇంటికి రావాలి” అని అడుగుతున్నాను. అప్పుడు బాబా, “లేదు, నేను నీ ఫ్రెండుతో వెళ్తాను. ఆల్రెడీ నేను నీ దగ్గర ఉన్నాను కదా” అని అన్నారు. నేను, "మరి మీరు నాతో మాట్లాడట్లేదు కదా" అని అడిగితే, "నేను నువ్వు అడిగే ప్రతి ప్రశ్నకి నా కనురెప్పలు వాల్చి నీకు సమాధానం ఇస్తాను" అని చెప్పారు. అది నిజమే, నేను ఎప్పుడూ బాబా కళ్ళని చూసి మాట్లాడుతుంటాను. నా బాధకు బాబా ఈ విధంగా సమాధానం చెప్పారు. ఈ కల ద్వారా నన్ను ఎప్పటికీ ఒంటరిగా విడిచిపెట్టనని, నాతోనే ఉంటానని బాబా చెప్పారు.
"బాబా! మీరు ఇచ్చిన అనుభవాన్ని అర్థమయ్యేలా సరిగా చెప్పలేకపోయాను. నన్ను క్షమించండి. అందరూ నన్ను అడుగుతారు, 'బాబా నీకేమి ఇచ్చాడు? ఎప్పుడూ ‘బాబా.. బాబా’ అంటూ అంతలా పూజ చేస్తావు' అని. నాకు నచ్చింది ఇవ్వలేదు కానీ నాకేది మంచిదో అదే ఇస్తున్నావు కదా బాబా. నాకు నచ్చిన చాకోలెట్స్, ఫ్రూట్స్ దగ్గర నుంచి మనుషుల దాకా అన్నీ దూరం అయ్యాయి. కానీ బాబా, వాటన్నిటికంటే ఎంతో విలువైన మీరు నాతో ఉన్నారు. అది నాకు చాలు. నన్ను సరైన దారిలో నడిపించండి బాబా".

om sai ram very nice leela well written sai gave her darshan.very lucky.
ReplyDeleteom sairam
ReplyDeletesai always be with me
This comment has been removed by the author.
ReplyDeleteOm Sai Ram 🙏🌹🙏
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteOm Sri Sai Ram thaatha 🙏🙏..
ReplyDeleteBhavya sree
Om Sairam
ReplyDelete