సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 430వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. నార్మల్ డెలివరీ అయ్యేలా అనుగ్రహించిన బాబా
  2. సాయి కురిపిస్తున్న అనుగ్రహం

నార్మల్ డెలివరీ అయ్యేలా అనుగ్రహించిన బాబా

హైదరాబాద్ నుండి సాయి భక్తురాలు శ్రీమతి ఉమాదేవి తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

గత 30 సంవత్సరాల నుండి నేను సాయిబాబాని నా ఇష్టదైవంగా పూజిస్తున్నాను. నేను బాబాని ఇంట్లో ఒక మనిషిగా భావిస్తాను. నాకు సర్వం బాబానే. మాకు ఒక పాప. తనకు బాబా పేరే పెట్టుకున్నాను. బాబా నాకు ప్రసాదించిన ఎన్నో అనుభవాలలో నుండి 26 సంవత్సరాల క్రితం జరిగిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను.

అప్పుడు నేను నిండు గర్భిణిని. నా డెలివరీకి వారంరోజుల ముందు వరకు నాకు నార్మల్ డెలివరీనే అవుతుందని డాక్టర్ చెప్పింది. కానీ, డెలివరీకి రెండు రోజుల ముందు చెకప్‌ కోసం వెళ్ళినపుడు ఆమె సిజేరియన్ చేయాల్సి ఉంటుందని చెప్పింది. సెకండ్ ఒపీనియన్ కోసం మరో ఆసుపత్రికి వెళితే వాళ్ళు కూడా సిజేరియన్ తప్పదు అని చెప్పారు. దాంతో నేను, “బాబా! నా ఒంటిమీద కత్తి పడనీయకు. ఆసుపత్రిలో నా దగ్గరే ఉండి నాకు నార్మల్ డెలివరీ అయ్యేలా చూడు బాబా” అని బాబాను ప్రార్థించాను. తరువాత తలస్నానం చేసి, బాబా ఊదీ పెట్టుకొని, “బాబా! రా బాబా!” అని బాబాను ప్రార్థిస్తుంటే డాక్టరు వచ్చి చూసి నన్ను ఆపరేషన్ రూంకి షిఫ్ట్ చేయమని నర్సుతో చెప్పింది. నేను డాక్టర్ని, "నాకు ఆపరేషన్ చేయవద్ద"ని ఎంతో ప్రాధేయపడ్డాను. ఆమె నా మాట వినలేదు సరికదా కోపంగా, “నాకు తెలుసు ఏమి చెయ్యాలో. వెయిట్ చేస్తే బేబీకి ప్రాబ్లెమ్ అవుతుంది” అని చెప్పి వెళ్ళిపోయింది. స్ట్రెచర్ వచ్చింది. నేను, “బాబా! త్వరగా రా బాబా!” అని ప్రార్థిస్తుంటే, హఠాత్తుగా ఆ డాక్టర్ వచ్చి, నాకు నొప్పులు రావటానికి ఇంజక్షన్ ఇవ్వమని నర్సుకి చెప్పి ఆపరేషన్ థియేటరుకి వెళ్ళిపోయింది. నర్సు నాకు ఇంజక్షన్ ఇచ్చింది. అంతే, అయిదు నిమిషాలలో నాకు నొప్పులు వచ్చాయి. నన్ను ఆపరేషన్ థియేటరుకి షిఫ్ట్ చేశారు. మరో ఐదు నిమిషాల్లో నాకు నార్మల్ డెలివరీ అయింది. జరిగిన అద్భుతాన్ని చూసి అక్కడికి వచ్చిన మా బంధువులు, హాస్పిటల్ స్టాఫ్ అందరూ ఆశ్చర్యపోయారు. నా ప్రార్థన మన్నించి నాకు నార్మల్ డెలివరీ జరిగేలా చేసినందుకు బాబాకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. నా జీవితంలో ఎప్పటికీ బాబాని మరువలేను.

ఓం సాయిరామ్!

సాయి కురిపిస్తున్న అనుగ్రహం

నా పేరు అంజలి. బాబా నాకు ప్రసాదించిన అనుభవాలను గత కొన్నిరోజుల నుండి మీ అందరితో పంచుకుంటూ ఉన్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను పంచుకోబోతున్నాను. రెండు వారాల క్రితం నాకు బాగా కడుపునొప్పి వచ్చింది. మోషన్‌లో రక్తం కూడా వచ్చింది. కడుపునొప్పి తట్టుకోలేక నా బాధను బాబాకు చెప్పుకుని, ఎలాగయినా నా కడుపునొప్పిని తగ్గించమని బాబాను వేడుకున్నాను. ఆ తరువాత బాబా ఊదీనే దివ్యౌషధంగా భావించి ప్రతిరోజూ ఊదీని పొట్టకి రాసుకుని, కొద్దిగా ఊదీని మంచినీటిలో కలుపుకుని త్రాగాను. బాబా దయవలన ఒక వారానికల్లా కడుపునొప్పి తగ్గిపోయింది. ఇప్పుడు నా ఆరోగ్యం బాగానే వుంది. “చాలా చాలా కృతజ్ఞతలు బాబా!”

మరో అనుభవం: 

ఈమధ్య మా బాబుకి బాగా దగ్గు వచ్చింది. ఈ కొరోనా సమయంలో దగ్గు అంటే భయం వేస్తుంది. మేము బాబుకి ఆయుర్వేద మందులు వేశాము. అయినా దగ్గు తగ్గలేదు. ఏ మందులు వాడాలో సూచించమని బాబాను ప్రార్థించి బాబా దగ్గర చీటీలు వేశాను. అందులో ఇంగ్లీష్ మందులు వాడమని వచ్చింది. బాబా సూచనను అనుసరించి మందులషాపులో దగ్గు నివారణ మందులు తీసుకొచ్చి బాబుకు వేశాము. బాబు ఆరోగ్యం కోసం బాబాను ప్రార్థించి వారం రోజులు సాయి సచ్చరిత్ర పారాయణ చేశాను. రోజూ పడుకునే ముందు మా బాబు ఛాతీకి బాబా ఊదీని రాసి, కొద్దిగా ఊదీని నీళ్లలో కలిపి బాబుకి త్రాగించి పడుకోబెట్టేదాన్ని. బాబా దయవలన మా బాబుకి దగ్గు పూర్తిగా తగ్గిపోయింది. “చాలా చాలా ధన్యవాదాలు బాబా!” ఈ సమస్యలన్నీ తీరితే నా అనుభవాలను సాటి సాయిభక్తులతో పంచుకుంటానని బాబాకు వాగ్దానం చేశాను. 

నేను మహాపారాయణ గ్రూపులో సభ్యురాలిని. రెండు హౌస్‌లకి కెప్టెన్‌గా చేస్తున్నాను. ఇంకో హౌస్‌కి కూడా కెప్టెన్‌గా చేయమని అడిగారు. బాబానే నాకు ఈ బాధ్యత అప్పగించారని భావించి సంతోషంగా ఒప్పుకున్నాను. అలాగే, “ఒక పారాయణ గ్రూపు కూడా మీ పేరుతో పేరుతో నిర్వహించుకుంటారా?” అని అడిగారు. అంతా బాబా దయ. ఆ గ్రూపు కూడా త్వరలోనే ఏర్పడాలని కోరుకుంటున్నాను. “బాబా! మీ దయ, కరుణ, ఆశీస్సులు నా కుటుంబం మీద మరియు అందరిమీదా ఇలాగే వుండాలని కోరుకుంటున్నాను”

మరికొన్ని అనుభవాలతో త్వరలోనే మళ్ళీ మీ ముందుకు రావాలని కోరుకుంటున్నాను. “బాబా! నీవు లేనిదే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని దీనురాలిని. నా చెయ్యి పట్టుకుని ఎప్పుడూ అన్ని విషయాల్లోనూ నన్ను నడిపించు బాబా!” 

జై సాయిరామ్!


7 comments:

  1. Sadhguru sai natha pahimam..pahimama..🙏🙏

    ReplyDelete
  2. “బాబా! నీవు లేనిదే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని దీనురాలిని. నా చెయ్యి పట్టుకుని ఎప్పుడూ అన్ని విషయాల్లోనూ నన్ను నడిపించు బాబా!”

    ReplyDelete
  3. ఓం సాయిరామ్!

    ReplyDelete
  4. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  5. 🙏🌹 ఓం శ్రీ సాయిరాం తాతయ్య 🌹🙏

    ReplyDelete
  6. ఓం సాయిరాం🙏🌹🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo