సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 391వ భాగం


సాయిశరణానంద అనుభవాలు - ఇరవైఐదవ భాగం

నిన్నటి తరువాయిభాగం.....

ఒకనాటి రాత్రి శ్రీవామనరావు నార్వేకర్ ఏకనాథ భాగవతం తీసుకొచ్చాడు. దాన్ని చేతిలోకి తీసుకుని, “కాయేనవాచా మనసేంద్రియైర్వా" శ్లోకానికి విస్తృత టీక చదివి మాయి, “భాగవత సారాంశమంతా ఈ శ్లోకంలో నిబిడీకృతమై ఉంది. దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి" అని చెప్పింది. తరువాత నా గదికి వెళ్ళి మళ్ళీ నేను ఆ శ్లోకం చదివి అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేశాను కానీ అర్థం చేసుకోలేకపోయాను. ఇప్పుడు ఆ టీకకి స్పష్టమైన అర్థం ప్రదర్శించగల భాగవత గ్రంథం లభించటం వల్ల దీని అవసరం తీరిపోయింది. సంత్ తుకారాం గాథ కాక శ్రీజయదేవ్ విరచిత గోపీ గీతాలు రాధాకృష్ణమాయికి చాలా ఇష్టంగా ఉండేవి. ఆమె మళ్ళీ మళ్ళీ వాటిని గానం చేస్తూ, “గోపీ గీతాల విశిష్టత ఏమిటంటే వీటిని ప్రతిరాగంలోనూ పాడుకోవచ్చు, వాయించుకోవచ్చు" అని చెపుతూ ఉండేది.

డాక్టరు పిళ్ళే ఒక ఉత్తమ ఫకీరు వద్ద బాగా శ్రమపడి సితార్ వాయించటం నేర్చుకున్నాడు. అతను రాత్రింబవళ్ళు మాయీ వద్ద కూర్చొని గోపీ గీతాలకు సితార్ మీద రాగాలాపనలు ఆమె చెప్పిన విధంగా ఆలపిస్తూ ఉండేవాడు. డాక్టర్ పిళ్ళేతో కలిసి కొంచెంసేపు ఆవిడ సమర్థ రామదాసు విరచిత దాసబోధ గ్రంథపఠనం చేసేవారు. డాక్టర్ పిళ్ళే అక్కడున్న సమయంలో చాలాసార్లు నేను కూడా అక్కడ కూర్చునేవాణ్ణి. ఈ కారణం వల్లే నేనివన్నీ తెలుసుకునే అవకాశం కలిగింది. వార్కరీ సాంప్రదాయానికి చెందిన ఒక వ్యక్తి గోస్వామి తులసీదాసు రాసిన రామాయణాన్ని మరాఠీలోకి అనువదించారు. దాన్ని నేను ముంబాయిలో తీసుకున్నాను. అది చదివి మాయి దాన్ని చాలా ప్రశంసించారు. ఎక్కడ నుంచో ఆవిడకు మరాఠీలో రచింపబడిన శ్రీగౌరాంగ ప్రభువు జీవిత చరిత్ర దొరికింది. అది పఠించిన తరువాత ఆమె ఒకటి రెండు రోజులు అదే ధ్యాసలో ఉన్నారు. అప్పుడు గుజరాతీ ప్రెస్ వారి 50 పైసల మూల్యం ఉన్న శ్రీరామకృష్ణ బోధామృతాన్ని నేను శిరిడీకి తీసుకొచ్చాను. అది రెండు మూడు భాగాలుగా ఉంది. ప్రతి ఒక్కభాగం ఆరంభంలో శ్రీరామకృష్ణ పరమహంస మాటల్లో చక్కని ప్రార్థన ఉంది. దాని భావార్థం, “ఓ తల్లీ! బ్రాహ్మణ కులంలో జన్మించామన్న అహంభావంతో ఛేదించబడకుండా ఉండేలా నా ధ్యానం ఎప్పుడూ నీ చరణాల్లోనే కేంద్రీకరింపబడాలి” అని ఉంది. రాధాకృష్ణమాయి అడగటంతో నేనీ ప్రార్థనను ఆమెకు వినిపించి అలాగే వేరే ఏదో లేఖను చదివి వినిపిస్తున్నాను. ఇంతలోనే శ్రీబాపూసాహెబ్ జోగ్ వచ్చి, “ఈ రకంగా మాయి సమక్షంలో కేవలం పుస్తకం చదవటం వల్ల ఏమీ నేర్చుకోలేవు, ఆమె చెప్పింది ఆచరించాలి” అన్నాడు. అందువల్ల నేనక్కడ చదవటం మానేశాను.

ఈ మధ్యకాలంలో 'ది గోస్పెల్ ఆఫ్ శ్రీరామకృష్ణ' మొదటిభాగం చదువుతుండేవాణ్ణి. అది నాకు చాలా నచ్చింది. మాయి ఆ పుస్తకానికి 'సమ్మోహింపచేసే మాయాబంధాన్ని తొలగించే శాస్త్రం' అని పేరు పెట్టింది. ఈ మధ్యలో ఒకసారి బాబా నా స్వప్నంలోకి వచ్చి, సంత్ తుకారాం గాథను చేత్తో పట్టుకుని తెరచి చూపిస్తూ, “100వ పేజీ, 104వ పేజీ" అన్నారు. పొద్దున లేచి పుస్తకం తీసి 104వ పేజీ తెరచి చూశాను. అయితే అందులో దర్వేషు అనే పేరుగల కవిత ఉంది. దానిలో మొదటి శబ్దం 'అల్లా'. దర్వేష్ పేరుగల ఆ కవిత ఇలా ఉంది:

అల్లా చేసేదే అవుతుంది
సత్కార్యాలు చేసేవాళ్ళకి బాబా కలికితురాయి
నడిపిస్తున్నారు ఆవులను, దూడలను
స్నేహభావంతోడి తనతోను
అనుకున్నాన్నేను అవాలని యజమానిని
నెరవేర్చారు బాబా దానిని
పైకెక్కాలని ఎక్కాక మెట్లు సగం
మిగతాదయింది తనంత తనే సులభం
అల్లా గురించి చేస్తే మననం
నిండి ఉంటారు బాబా వారి బాహ్యాంతరం
భయంతో శంకించినవారు
వెనకపడిపోతారు అంటున్నాడు తుకా.

పైన చెప్పబడిన భావార్థం యొక్క అల్లా శబ్దంతో ప్రార్థించబడే వేరే కవిత 'వేద్య గోలీ' ఈ క్రింద వ్రాసిన విధంగా ఉంది:

అల్లా ఇస్తాడు అల్లా ఇప్పిస్తాడు
అల్లాయే మద్యం, అల్లాయే తినిపిస్తాడు.
అల్లా కాక లేరు వేరెవవరూ
అవుతుంది అల్లా చేయించిందే ఎప్పుడూ
ధైర్యశాలి నిలబడుతాడు లేచి
అలా చేసే ధైర్యం ఉండదు పిరికివాడికి
మన హృదయాన్నుంచుకోవాలి సంతోషంతో
కష్టానికి వెరవని వారికి భయమెందుకు?
అనుభవించినా అన్ని రసాలనూ
భజన గోలీ ఒకటే రసవంతం
మంచితనమే అందరికీ నేస్తం.
కొంచెమైనా దాన్ని నీతో కొనిపో
ఎవరి దగ్గర ఉంటుందో నీతి
వారిని తరింపచేయటమే దేవుని రీతి
చెడుపనులు చేసేవారు
వెనుకబడిపోయి
జగమంతా తిరిగి యవ్వనం వృధా అయి
అంతా అయిపోయాక మాలిన్యాన్ని కడగరు
వారే నిజంగా మూర్ఖులు
త్రాగి అల్లా అనే మద్యాన్ని, అనుభవిస్తే అల్లా నామాన్ని,
పొందుతారు వారే పవిత్రతను
తలను క్రిందికి వాల్చేసి నడుస్తున్నవాడికి
లభించదు ఏమీ ఏనాటికీ
తీసుకుంటే జగత్తు నుంచి మంచి భావాలు
అవుతారు వారే అల్లాకి సఖులూ, ఆప్తులూ.
ఊరికే పరిభ్రమించేవాడికి
లభించదు ఏమీ ఏనాటికీ
అంటాడు తుకా

భగవంతుడు ఉంచినట్లుండాలి. అందులో సంతోషాన్ని పొందుతూ స్వర్గ నరకాల మార్గాలను త్యాగంచేసి సన్మార్గంలో నడవాలి. విచారాన్ని విసర్జించిన వాడి పేరు ఫకీరు. 

తరువాయి భాగం రేపు ......

source: "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

4 comments:

  1. Om Sai
    Sri Sai
    Jaya Jaya Sai
    🙏🙏🙏

    ReplyDelete
  2. 🙏🌹 ఓం శ్రీ సాయిరాం తాతయ్య 🌹🙏

    ReplyDelete
  3. ఓం సాయిరాం..,,,🌹🙏🌹

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo