- శ్రీసాయి అనుగ్రహ లీలలు - 36వ భాగం
నా పేరు సాయిబాబు. మేము శిరిడీ వచ్చినా రెండో వారంలో ఒకరోజు సాయంత్రం నేను మేముండే ఇంటి కారుడారిలో నిల్చుని ఆకాశం వైపు చూస్తున్నాను. చల్లటి గాలి, ఆకాశం నిర్మలంగా ఉండి చాలా ఆహ్లాదకరంగా ఉంది. హఠాత్తుగా బాబా నన్ను ఫోటో తీసుకోమంటున్నట్టు అనిపించి, నా మొబైల్‌తో ఆకాశాన్ని ఫోటో తీసి చూస్తే, బాబా నయనాలు, నుదురు చాలా స్పష్టంగా దర్శనమిచ్చాయి. వెంటనే ఆ ఫోటోని కొంతమంది సాయిభక్తులకు పంపించాను. అది చూచి వాళ్ళు చాలా సంతోషించారు. అలాగే ఒకరోజు మా ఇంటి టీవిలో సంధ్య హారతి చూస్తున్నప్పుడు బాబాకి కర్పూర హారతి ఇచ్చే సమయంలో బాబా నన్ను మొబైల్‌లో ఫోటో తీసుకోమని చెప్తున్నట్లు ప్రేరణ కలిగి ఫోటో తీసాను. మహా అద్భుతం! కర్పూర హారతిలో బాబా మూర్తి, ఆ మూర్తిపై ఛత్రం స్పష్టంగా దర్శనమిచ్చాయి. ఇవి బాబా లీలలు.
ఒకరోజు నేను, మా అమ్మాయి సమాధి మందిరంలో బాబా దర్శనం చేసుకున్న తర్వాత మా అమ్మాయి ఊదీ పంపిణీ సేవలో పాల్గొనగా నేను కిటికీలో నుండి కనిపిస్తున్న బాబాను చూస్తూ దూరంగా ఉన్న బెంచి మీద కూర్చున్నాను. అంతలో గాలి వీచి గురుస్థానం వద్ద ఉన్న వేపచెట్టు ఆకులు రాలి నేల మీద పడ్డాయి. వాటిని చాలామంది ఏరుకున్నారు. నేను నా మనసులో, "బాబా! ఒక ఆకు మీరే నా దగ్గరకు పంపిస్తారు కదూ!" అని అనుకోగానే మరల గాలి వీచి ఒక ఆకు దూరంగా కూర్చుని ఉన్న నా ముందు పడింది. అది తీసుకొని జాగ్రత్తపరిచాను. మనం అడగకుండా బాబా ప్రసాదించేవి కూడా కొన్ని ఉంటాయి. జూన్ 3న సమాధి మందిరంలో బాబా దర్శనం చేసుకుని బయటకు రాగానే మా అమ్మాయికి మెట్ల మీద రెండు ఆకులు దొరికాయి. తర్వాత బయటకు రాగానే నాకు కూడా ఒక ఆకు లభించింది. అయితే ఒకరు అడగడంతో వాళ్ళకి ఇచ్చేసాను.
2025, జూలై 5న మేము బాబా అనుమతితో వణిలోని సప్తశృంగి మాత ఆలయ దర్శనానికి కారులో శిరిడీ నుండి బయలుదేరాం. అప్పుడు కుండపోతగా ఒకటే వర్షం. అందువల్ల నెమ్మదిగా వెళ్తూ నేను మనసులో బాబాని "బాబా! అమ్మవారి దర్శనానికి అడ్డులేకుండా వర్షం ఆపండి" అని ప్రార్థించాను. తర్వాత మేము అక్కడికి చేరుకొని కారు పార్క్ చేసాం. అంతే! వర్షం దాదాపు తగ్గిపోయి సన్నగా చినుకులు రాలసాగాయి. మా అమ్మాయి కొండకున్న ముందు మెట్ల మార్గం గుండా తన మొక్కుననుసరించి మెట్ల పూజచేస్తూ 510 మెట్లు ఎక్కడం మొదలుపెట్టగా నేను కొండ వెనకనున్న 700 మెట్లు ఎక్కడం మొదలుపెట్టాను. అక్కడున్న మిలిటరీ సెక్యూరిటీ ఆఫీసర్ నాకు తోడుగా ఒక అతనిని పంపారు. 100 మెట్లు ఎక్కేసరికి నాకు ఆయాసం, దడగా అనిపించి దాహం కూడా వేసింది. ఒక నిమిషం ఆగి బావా నామం చెప్పుకుంటూ మిగతా మెట్లు చకచకా ఎక్కేసాను. మా అమ్మాయి కూడా బాబా నామం చెప్పుకుంటూ మెట్లు పూజ చేసి పైకి చేరుకొని నన్ను కలిసింది. క్యూలైన్‌లో దర్శనానికి 4 గంటల సమయం పడుతుందన్నారు. నా వెంట వచ్చిన అతను కేవలం 10 నిమిషాల్లో మాకు అమ్మవారి దర్శనం చేయించి బండారు ఇప్పించారు. తర్వాత మేము కొండ దిగి మిలిటరీ ఆఫీసర్ దగ్గరకి వెళ్ళాము. అక్కడ సెక్యూరిటీ వాళ్లతో బాబా మాకు ప్రసాదించిన అనుభవాల గురించి 2 గంటలసేపు మాట్లాడుకున్నాము. ఆరోజు వారాహి నవరాత్రులు ఆఖరిరోజు. అక్కడే భోజనం చేసి తిరుగు ప్రయాణమయ్యాము. మరుక్షణం భారీ వర్షం మొదలైంది. అంటే బాబా మా విన్నపం ఆలకించి దర్శనం అయ్యేంతవరకు వర్షం ఆపారు. అలా బాబా అనుగ్రహంతో అమ్మవారి దర్శనం మాకు అయింది.
బాబా నాకు ప్రసాదించిన వందలాది అనుభవాలలో నేను ఇప్పుడు పంచుకోబోయే అనుభవం అత్యంత విశిష్టమైనది. సచ్చరిత్ర 33వ అధ్యాయంలో జామ్నేరు ఊదీ లీల మీరంతా చదివే ఉంటారు. దానికి సంబంధించినదే నేను చెప్పబోయే నా అనుభవం. 2025, జూలై 10, గురువారం, గురుపౌర్ణమి. ఆ సందర్భంగా సూరత్‌కి చెందినవాళ్ళు ఒకరు సమాధి మందిర ప్రాంగణంలో బాబాకి సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. నేను ముందురోజు బాబా దర్శనం చేసుకున్న తర్వాత ఆ ఫోటోలు వరుసగా చూస్తుండగా ఇద్దరు సంస్థాన్ ఉద్యోగులు ఆ ఫోటోగ్రాఫర్‌తో మాట్లాడుతూ ఉన్నారు. నేను కూడా వాళ్ళ పక్కన నిలబడి వాళ్ళు మాట్లాడేది వినసాగాను. ఆ ఫోటోగ్రాఫర్ ఫోటోల గురించి వివరిస్తూ ఒక ఫోటో దగ్గర ఆగి, ‘ఈ ఫోటో నానాసాహెబ్ చందోర్కర్ కుటుంబసభ్యుల దగ్గర నుండి తీసుకున్నానని, ఆ కుటుంబీకుల దగ్గ్గర ఇప్పటికీ ఆనాడు మైనతాయికి పంపిన ఊదీ ఉందని(బాబా పంపిన ఊదీలో నుంచి చిటికెడు మాత్రమే నీళ్లలో కలిపి ఆమెకి ఇచ్చారట, మిగతాది అలాగే వారి దగ్గర భద్రపరుచుకున్నారట), ఆ ఊదీ నాకు కొంచం ఇచ్చారని’ చెప్పి, దాన్ని భద్రంగా దాచుకున్న చిన్న వెండి భరణిని చూపించాడు. అప్పుడు సంస్థాన్ ఉద్యోగస్తులు వేళ్ళతో కొంచెం ఊదీ తీసుకొని నుదుటన పెట్టుకున్నారు. పక్కనే ఉన్న నేను కూడా వేళ్ళతో కొంచం ఊదీ తీసి నుదుటన ధరించాను. బాబా హస్తస్పర్శ పొందిన ఊదీ లభించినందుకు నాకు చాలా సంతోషమేసింది. సాయంత్రం మా ఇంటిలో బాబాకి పూజ చేసిన తర్వాత నా మనసులో 'ఆ ఫోటోగ్రాఫర్ చెప్పింది నిజమా, అబద్దమా' అని ఒక ఆలోచన వచ్చింది. అదే విషయం గురించి చేతిలో సచ్చరిత్ర పుస్తకం మూసి పట్టుకొని, నా కళ్ళు కూడా మూసుకొని బాబాని అడిగి పుస్తకం తెరిచి, ఆపై కళ్ళు తెరిచి చూసాను. పుస్తకంలో జామునేర్ ఊదీ లీల ఉన్న 33వ అధ్యాయం వుంది. అది చూసి నా కళ్ళ నుండి ఆనందబాష్పాలు జాలువారాయి. ఆవిధంగా ఫోటోగ్రాఫర్ చెప్పింది నిజమని బాబా తెలియజేసారు. ఆయన నాకు ఎంతటి మహాభాగ్యం కల్పించారు? "ధన్యవాదాలు బాబా".
Baba me daya valana Kalyan ki marriage settle inadi Elanti avarodalu lakunda marriage chai thandi meku sathakoti vandanalu vadini bless chaindi house problem solve cheyandi pl
ReplyDeleteఓంసాయిరోగ్యక్షేమదాయనమః
ReplyDelete