ఈ భాగంలో అనుభవం:
- బాబా తన బిడ్డల విషయంలో చూపే శ్రద్ధ
సాయిభక్తురాలు శ్రీమతి సంధ్య తన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు:
శ్రీ సద్గురు సాయినాథుని దివ్యపాదాలకు నమస్కరిస్తూ, నెలరోజుల నుండి నేను పంచుకోవాలనుకుంటున్న సాయి లీలలను ఇంత ఆలస్యంగా పంచుకుంటున్నందుకు సద్గురు సాయినాథుని పాదాలకు శిరస్సు వంచి క్షమాపణలు కోరుతూ, సాయిబాబా లీలలను సాటి సాయిబంధువులతో పంచుకుని మురిసిపోయే భాగ్యం కల్పిస్తున్న సాయితండ్రికి మనసారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ‘సాయిమహరాజ్ సన్నిధి’ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి మరియు సాయిబంధువులకు నా నమస్కారాలు. బ్లాగులో కొంతమంది భక్తుల అనుభవాలు చదువుతున్నప్పుడు నాకు బాబా ప్రసాదించిన కొన్ని అనుభవాలు నా మదిలో మెదిలాయి. అవి...
1. సి.ఎ. చదువుతున్న సాయిభక్తురాలికి బాబా మంచి మార్కులతో పాస్ చేయించిన లీల.
2. ‘బాబా నా సూపర్ హీరో!’ అంటూ ఒక భక్తుడు పంచుకున్న లీల.
పై రెండు లీలలను చదివాక బాబా నాపై చూపిన అనుగ్రహం, అప్పుడు నేను పొందిన బాబా ప్రేమానుభూతి గుర్తుకు వచ్చాయి.
3. ‘సాయి మహరాజ్ సన్నిధి’ ఫేస్‌బుక్ పేజీలో శ్రీబి.వి.నరసింహస్వామి ఫోటో చూడటంతో నా జన్మ ధన్యమైందనిపించింది. ఎందుకంటే, నాకు వారు ధ్యానంలో దర్శనమిచ్చారు. శ్రీబి.వి.నరసింహస్వామి జీవిత చరిత్ర చదువుతుంటే బాబా నాకు పుత్రుణ్ణి ప్రసాదించిన లీల గుర్తుకు వచ్చింది.
ఈ లీలలన్నింటిని నెలరోజుల నుండి మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. ఈరోజు (25-05-2020) ఉదయాన్నే సాయిమహరాజ్ సన్నిధి బ్లాగులో సాయి నాపై కురిపించిన లీలలను, ప్రేమని పంచుకోవాలని మనసులో గాఢంగా అనుకున్నాను. బ్లాగ్ ఓపెన్ చేయగానే భక్తుల లీలలను చదివి సాయి ప్రేమను మననం చేసుకున్నాను. నా అనుభవాలను సాటి సాయిబంధువులతో పంచుకోమని బాబా నాకు చెబుతున్నట్లుగా అనుభూతి కలిగింది. ఇక బాబా ప్రేమను పంచే సమయం వచ్చేసింది.
మొదటి అనుభవం: మొదటి శిరిడీ దర్శనం
2001 జూన్ ఒకటవ తారీఖున నాకు వివాహం జరిగింది. అదే నెలలో మేము శిరిడీ యాత్ర చేశాము. అప్పటికి నేను ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పరీక్షలు వ్రాసి ఉన్నాను. నాకు ఇంగ్లీష్ తక్కువ మార్కులు వచ్చి ఫెయిలయ్యే అవకాశం ఉన్నందున, బాబాను మొదటిసారిగా ఒక కోరిక కోరాను, “బాబా! నేను ఇంటర్మీడియట్ పాసవ్వాలి. పెళ్ళయి అత్తవారింటికి వచ్చాను. ఫెయిలయితే నా పరువు పోతుంది. నన్ను పాస్ చెయ్యండి బాబా” అని. నిజానికి క్రొత్త పెళ్ళికూతురిగా నేను బాబాని మా వైవాహిక జీవితం గురించి ప్రార్థించాలి, కానీ నాకు అప్పుడు మెచ్యూరిటీ లేని వయసు కాబట్టి ఇంగ్లీష్ సబ్జెక్టులో మార్కుల గురించి అడిగాను. నా కోరికను బాబా తీర్చారు. నేను అడగకపోయినా బాబా నా వైవాహిక జీవితం గురించి, పిల్లల గురించి ఎంతో శ్రద్ధ తీసుకోవడమే కాకుండా కష్టనష్టాలలో, సుఖసంతోషాలలో తోడుగా ఉంటూ నాకు తెలియకుండానే నాకు రక్షణనిస్తూ వచ్చారు. “థాంక్యూ సో మచ్ బాబా!”
రెండవ అనుభవం: బాబా ప్రసాదించిన బిడ్డ - మాతృప్రేమ
శ్రీబి.వి.నరసింహస్వామి జన్మవృత్తాంతం చదువుతుంటే సాయిబాబా నాకు బిడ్డను ప్రసాదించిన మధురమైన లీల గుర్తుకు వచ్చింది, దానిని ఇప్పుడు మీతో పంచుకోబోతున్నాను. మా వివాహమైన వారం రోజులలో శిరిడీ సాయినాథుని దర్శించుకోవటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇదంతా బాబా కృప. ఎందుకంటే, “పిచ్చుక కాలికి దారం కట్టి లాగినట్లు నా భక్తులను లాక్కుంటాను” అని బాబా అంటారు. శిరిడీ వెళ్ళి సాయిని కనులారా దర్శించటం బాబా అనుగ్రహమే తప్ప మా ప్రమేయమేమీ లేదు. కారణం, అప్పటికి మేము బాబా గురించి ఏమీ తెలియని అజ్ఞానులం. వివాహమైన సంవత్సరంలోనే నేను గర్భవతినయ్యాను. మావారు చాలా సంతోషంగా ప్రతినెలా నన్ను చెకప్ కోసం డాక్టరు దగ్గరకు తీసుకువెళ్ళేవారు. కేవలం డాక్టరిచ్చిన మందులు వాడటం నా పని, అంతే. 8వ నెల పూర్తి కావస్తుండగా నేను మా పుట్టింటికి వెళ్లాను. ప్రతినెలా డాక్టరుని సంప్రదించే అలవాటు ప్రకారం మా అమ్మ నన్ను హాస్పిటల్‌కి తీసుకువెళ్ళింది. ఆరోజు సోమవారం. ‘డెలివరీకి ఇంకా 20 రోజుల పైనే టైం ఉంది’ అని డాక్టరు చెప్పారు. తరువాత ఇంటికి తిరిగి వచ్చాము. మరుసటిరోజు (మంగళవారం) బ్రహ్మీముహుర్తంలో నాకు ఒక కల వచ్చింది. అది కలో, మెలకువో అర్థం కానట్లుగా ఉంది. ఆ కలలో ఒక వ్యక్తి (సాయిబాబా) తెల్లటి కఫ్నీ ధరించి చిన్నగా అంటే సూక్షరూపధారిగా ఉన్నారు. ఆయన, “నీకు కొడుకు పుట్టాడు, ఇదిగో తీసుకో!” అంటూ నవ్వుతూ నా ఒడిలో బిడ్డను కూర్చోబెట్టారు. ఇంకా నాకు కళ్ళకు కట్టినట్లుగా ఉంది ఆ కల. నాకు మెలకువ వచ్చింది. పడక నుండి లేచి మా అమ్మకు నా కల గురించి చెప్పాను, “అమ్మా, ఎవరో ఒక వ్యక్తి నవ్వుతూ ‘నీకు కొడుకు పుట్టాడు, ఇదిగో తీసుకో’ అని ఇచ్చారు. ఆయన చాలా చిన్నగా, సూక్ష్మంగా ఉన్నారు” అని. మా అమ్మ, ‘ఆయన ఎవరో కాదు, నీ గురువే’ అన్నట్లుగా చిన్నగా నవ్వింది, కానీ నాతో ఏమీ చెప్పలేదు. అదేరోజు రాత్రి 9 గంటలకి కడుపులో ఉన్న బిడ్డ ఒక్కసారిగా తిరిగింది. ‘అమ్మా!’ అని గట్టిగా అరిచాను. అరచిన సమయంలో ఉన్న బాధ కొద్ది క్షణాలలోనే మాయమైపోయింది. నా అరుపు విని మా అమ్మ పరుగెత్తుకుని వంటగది నుండి నా దగ్గరకు వచ్చి ఏమైందని అడిగింది. ఖంగారుపడాల్సింది ఏమీ లేదని చెప్పి, జరిగింది వివరించి నిద్రపోయాను. కానీ మా అమ్మ నిద్రపోలేదు. మరుసటిరోజు, అంటే బుధవారం నేను లేచాక మా అమ్మ హాస్పిటల్‌కి వెళదామన్నది. “నిన్ననే కదా వెళ్ళాము, డెలివరీకి ఇంకా 20 రోజుల పైనే టైం ఉంది అని డాక్టర్ చెప్పిందిగా, మళ్ళీ ఇంతలోనే హాస్పిటల్‌కి ఎందుకు?” అన్నాను. మా అమ్మ నాతో, “కడుపు జారినట్లుగా ఉంది. ఎందుకైనా మంచిది హాస్పిటల్‌కి వెళదాం” అని చెప్పి నన్ను హాస్పిటల్‌కి తీసుకెళ్ళింది. డాక్టర్ పరీక్షించి, “కొన్ని గంటలలోనే ఈమెకు డెలివరీ అవుతుంది, మీరు ఇక్కడే ఉండండి” అని తేల్చిచెప్పింది. దాంతో మేము ఆ రాత్రి హాస్పిటల్లోనే ఉన్నాము.
గురువారం (ఆగష్టు 15, 2002) బ్రహ్మీముహూర్తంలో 4.35 నిమిషాలకి నాకు కొడుకు పుట్టాడు. చూడండి బాబా దయ, నా కడుపులో ఉన్న బిడ్డను సరిచేసి నాకు నార్మల్ డెలివరీ అయ్యేలా అనుగ్రహించారు. మా అమ్మకి అందరం ఆడపిల్లలమే కనుక నాకు కొడుకు పుట్టడంతో చాలా సంతోషించి గురువుకు కృతజ్ఞతలు తెలుపుకుంది. నా కొడుకు బాగోగులు అన్నీ తనే చేస్తుండేది. నేను మాత్రం ఏమీ పట్టనట్లు ఉండేదాన్ని. పాలుపట్టడం తప్ప వాడి గురించి నాకేమీ తెలియదు. కారణం, చదువుకునే వయసులోనే పెళ్ళి కావటం, పిల్లవాడు పుట్టడంతో నాకు ఏమీ అర్థం కాలేదు. ‘నా స్నేహితులంతా చక్కగా చదువుకుంటున్నారు’ అనే ధ్యాసలోనే ఉండేదాన్ని. ఇంకా బాబుపై మాతృప్రేమ రాలేదు. 9 రోజుల తర్వాత హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చాము. 9 రోజులకి పురుటి స్నానం చేయించాలి. పురుడు నీళ్ళు పోయాలని మా అమ్మ, అక్క బాబుని తీసుకెళ్లి స్నానం చేయిస్తుండగా ఒక్కసారిగా ఊపిరి ఆగిపోయినట్లు చలనం లేకుండా అయిపోయాడు బాబు. వాడు అసలే చాలా వీక్ గా పుట్టాడు. మాది ఉమ్మడికుటుంబమైనందున నేను ప్రెగ్నెంట్‌గా ఉన్న సమయంలో సరైన భోజనం తీసుకోకపోవడం వలన వాడు చాలా వీక్‌గా పుట్టాడు. అమ్మ వెంటనే బాబుని హాస్పిటల్‌కి తీసుకెళ్ళింది. ఆ విషయం నాకు చెప్పలేదు. ఏమీ పట్టనట్లున్న నేను చక్కగా నిద్రలోకి జారుకున్నాను. చూడండి బాబా లీల. బాబా ప్రసాదించిన బిడ్డ కదా, నేను అలా పట్టించుకోకపోతే ఊరుకుంటారా? నేను నిద్రిస్తుండగా 9 రోజుల పసికందు “అమ్మా, లే అమ్మా” అంటూ నా చీర కొంగు లాగుతున్నట్లు అనిపించింది. వెంటనే ఉలిక్కిపడి లేచి నాతో ఉన్న మా అక్కను ఏం జరిగిందని నిలదీశాను. మా అక్క దేవుడిని ప్రార్థిస్తున్నది. ఆమె కన్నీళ్ళతో, “బాబు పలకడం లేదు, నీళ్ళు పోయగానే తనలో చలనం లేదు. అమ్మ బాబుని హాస్పిటల్‌కి తీసుకుపోయింది” అని చెప్పింది. ఆ మాట వినగానే అప్పటివరకు ఏమీ పట్టనట్లున్న నాలో మాతృప్రేమ కట్టలు తెంచుకుంది. వాడి రూపం, ‘అమ్మా, లే అమ్మా’ అనే మాటలు నాకు గుర్తొస్తున్నాయి. నేను నా ఇష్టదైవాన్ని ప్రార్థించటం మొదలుపెట్టాను. చాలా ఏడ్చాను. “వాడికి ఏమీ కాకూడదు ఈశ్వరా, నా బిడ్డను బ్రతికించు” అని కన్నీటితో వేడుకున్నాను. హాస్పిటల్‌కి వెళ్లాక వాడు కదలటం, ఏడవటం ప్రారంభించాడట. ఇంటికి వచ్చాక అమ్మ, “నీ కొడుకు ప్రాణం పోయి తిరిగి వచ్చింది తల్లీ” అని చెప్పి, దైవానికి కృతజ్ఞతలు తెలుపుకుంది. బాబు ఆరోగ్యం బాగుందని డాక్టర్ చెప్పారట. 9 రోజుల వరకు బాబుని పట్టించుకోని నాలో మాతృప్రేమను రగిలించి తాను ప్రసాదించిన బిడ్డను కంటికి రెప్పలాగా చూసుకునే మాతృత్వాన్ని బాబా నాకు ప్రసాదించారు. అప్పటినుండి ఇప్పటివరకు వాడిని జాగ్రత్తగా చూసుకుంటున్నాను. ఒక్కోసారి మా బాబులో బాబా ముఖకవళికలు కనబడతాయి. మా ఇంట్లో ఎవరికీ లేని అందమైన చేతులు, కాళ్ళు వాడికి ఉన్నాయి. వాడి కళ్ళు బాబా కళ్ళలా ఉంటాయి. చాలా నిదానస్థుడు కూడా. ఇప్పుడు వాడికి 18 సంవత్సరాలు. సాయీశ్వరుని ఉనికిని, బాబా లీలలను తెలుసుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది. కర్మ నశించనిదే గురుకృపను తెలుసుకోలేము. నాకు తెలియకుండానే నా వెంటే ఉండి నన్ను సదా రక్షిస్తున్న నా సాయిమాతకి కృతజ్ఞతలు.
గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరా
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః

మూడవ అనుభవం: బిడ్డ అలవాటుని మాన్పించిన బాబా
ఇప్పుడు మా అబ్బాయి ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తి చేసుకొని ఇంటికి వచ్చాడు. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఉండటం వలన పబ్‌జీ గేమ్‌కి అలవాటుపడ్డాడు. ఎంత వద్దన్నా వినిపించుకోకుండా ఆడసాగాడు. నిస్సహాయస్థితిలో నేను, “బాబా! వాడు మీ బిడ్డ. మీరు ప్రసాదించిన బిడ్డ. ప్రతిరోజూ నిద్రాహారాలు మాని గేమ్ ఆడుతున్నాడు. వాడి బాధ్యత మీదే తండ్రీ” అని బాబాను వేడుకున్నాను. నిద్ర సరిగా లేకపోవటం వలన తను చాలా నీరసించిపోయాడు. ఒకరోజు నీళ్ళు తాగుదామని ఫ్రిజ్ డోర్ తీశాడు. వాడికి తెలియకుండానే నీరసంతో క్రింద పడిపోయాడు. ఫ్రిజ్ కూడా క్రిందపడిపోయింది. పెద్ద శబ్దం విని బయట ఉన్న నేను ఇంట్లోకి వచ్చాను. ఫ్రిజ్ క్రింద పడి ఉంది. మా అబ్బాయి కొంతదూరంలో హాలులో పడివున్నాడు. వాడిని లేపి కూర్చోబెట్టి ఏమైందని అడిగాను. “కళ్లు తిరిగాయి మమ్మీ, అంతా చీకటిగా అనిపించింది, క్రిందపడింది కూడా తెలియదు. నేను ఇంతదూరం ఎలా పడ్డాను?” అని అడిగాడు. “అమ్మో, ఆ ఫ్రిజ్ నాపైన పడివుంటే ఏమయ్యేదీ!” అని ఆలోచనలో పడ్డాడు. “ఫోనులో పబ్‌జీ గేమ్ ఆడి ఆరోగ్యం పాడుచేసుకుంటున్నావు. కానీ బాబా దయతో నీకు ఏమీ కాలేదు. ఫ్రిజ్ నీపై పడివుంటే ఎంత ఘోరం జరిగేది!” అని అన్నాను. ఫ్రిజ్ సొట్ట పడింది. అంత ఐరన్‌తో కూడిన ఫ్రిజ్ సొట్టపడిందంటే అదే బాబు మీద పడివుండే ఏమయ్యేది అని భయపడ్డాము. బాబా దయవలన ఇప్పుడు మా అబ్బాయి ఆ గేమ్ ఆడటం మానేశాడు. చక్కగా రాత్రి టైంకి నిద్రపోతున్నాడు.
నాలుగవ అనుభవం : మన బిగ్‌బాస్ (సాయిబాబా) ఉన్నారు కదా!
మావారు నాలుగు సంవత్సరాల నుండి భూమి ఋణం (లోన్) తీసుకోవాలని అనుకుంటున్నారు. ఎలా తీసుకోవాలో తెలియక వేరేవాళ్ల సహాయం కోరారు. ఒక్కొక్కరు ఒక్కోవిధంగా చెబుతున్నారు. మావారు చాలా టెన్షన్ పడుతున్నారు. ఇది కొన్నిరోజుల నుండి నేను గమనిస్తున్నాను. నేను మావారి నిస్సహాయతను చూసి “ఎందుకు అంతలా బాధపడుతున్నారు? ఈమధ్య ప్రతిదానికీ టెన్షన్ పడుతున్నారు. అందరినీ అడుగుతున్నారు. మన బిగ్‌బాస్ (సాయిబాబా) ఉన్నారు కదా, మన బిగ్‌బాస్‌ని అడగండి” అని చెప్పాను. వెంటనే ఆయన బాబాను ప్రార్థించి ప్రశాంతంగా ఉండిపోయారు. క్వశ్చన్&ఆన్సర్ వెబ్‌సైట్‌లో భూమి ఋణం గురించి బాబాను అడిగారు. బాబా నుండి సానుకూలమైన సమాధానం వచ్చింది. అదేరోజు మావారు బ్యాంకుకి వెళ్ళి ఋణం తీసుకున్నారు. భూమిపై ఋణం తీసుకోవటం చాలా అవసరమని తెలిసీ సరైన దారితెలియక నిస్సహాయస్థితిలో ఉన్న మాకు బాబా అండగా ఉండి ఏ ప్రయాసా లేకుండా, ఎలాంటి లంచం ఒత్తిడి లేకుండా బ్యాంకు నుండి ఋణం అందేలా చేశారు. “చాలా చాలా కృతజ్ఞతలు బాబా!"
“బాబా! మీరే మా అందరికీ తల్లి, తండ్రి. మీరు ప్రసాదించిన బిడ్డలను మీరు తప్పక కాపాడుతారని తెలుసు. కానీ ఒక తల్లిగా నేను ప్రార్థిస్తున్నాను. పిల్లలు యుక్తవయసుకు వస్తున్నారు. దయతో, కరుణతో సదా వారిని రక్షించండి సాయీశ్వరా! వారిని మంచిమార్గంలో నడిపించండి గురుదేవా! తల్లివై, తండ్రివై దారి చూపండి. ఈ మాయా ప్రపంచంలో మీరు తప్ప మాకు దిక్కెవరు? బాబా! మీ పాదాలను విడువకుండా సదా మీ నామస్మరణలో, మీ ప్రేమలో రమించే భాగ్యం సదా మాకు ప్రసాదించండి గురుదేవా! సాయీ! ప్రేమంటేనే మీరు. మీరు తప్ప మిగతాదంతా మాయే తండ్రీ. మాయ నుండి సదా మీ భక్తకోటిని రక్షించండి తండ్రీ! మీ పాదాలకు శరణు వేడుతున్నాను. నా కుటుంబానికి మీ పాదాల చెంత చోటివ్వండి. సదా మీ నామస్మరణలో.. మీ సంధ్య”.
సద్గురు చరణం భవభయహరణం

very nice leela.i liked it.very intersting nare shion. sai 2times he saved his devotee.we must trust him he takes care .i lovebaba very much. he ismy life.omsai ram om saima
ReplyDeleteలీలా మయా సద్గురు సాయినాధ నమో నమః 🙏🙏🙏
ReplyDeleteom sairam
ReplyDeletesai always be with me
పుత్రార్దీ లభతే పుత్రాన్మోక్షార్థి లభతే గతిమ్ !!
ReplyDelete🙏🌹 ఓం శ్రీ సాయిరాం తాతయ్య 🌹🙏
ReplyDeleteOm Sri Sai Ram thaatha 🙏🙏
ReplyDeleteBhavya sree
ఓం సాయిరాం...🌹🙏🌹
ReplyDelete