సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 448వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. అడిగినంతనే అనుగ్రహించే కరుణామూర్తి శ్రీసాయి
  2. దయగల సాయి తన బిడ్డలకు రక్షణనిస్తారు

అడిగినంతనే అనుగ్రహించే కరుణామూర్తి శ్రీసాయి

అందరికీ నమస్కారం. నా పేరు అంజలి. ఇటీవల బాబా ప్రసాదించిన మరో అనుభవాన్ని మీ అందరితో పంచుకోవాలని అనుకుంటున్నాను. ఇంతకుముందు నా అనుభవంలో బాబా నా పేరు మీద ఒక మహాపారాయణ గ్రూపు స్టార్ట్ చేయమని చెప్పారని చెప్పాను. అది తొందరగా ఏర్పడాలని నేను కోరుకున్నాను. బాబా దయవలన కేవలం నాలుగు రోజుల్లోనే ఆ గ్రూపు ఏర్పడింది. శనివారం చెబితే, గురువారానికి గ్రూపు సిద్ధమై పారాయణ కూడా మొదలుపెట్టాము. అంతా బాబా అనుగ్రహం. ఆయన దగ్గరుండి ఆశీర్వదించారని నాకు చాలా సంతోషంగా అనిపించింది. అయితే, ఆరోజు(గురువారం) రాత్రి నా భర్త బైక్ మీద నుండి క్రింద పడ్డారు. తన పాదం గీరుకుపోయింది. దెబ్బలు కూడా స్వల్పంగా తగిలాయి. గ్రూపు మొదలై మొదటిసారి పారాయణ చేసుకున్నామన్న సంతోషంలో ఉన్న నాకు మావారికి అలా జరిగిందని తెలిసి చాలా బాధ కలిగింది. దాంతో నాకు బాబా మీద కాస్త కోపం వచ్చింది. తరువాత కొంతసేపటికి, 'నా భర్తను పెద్ద ప్రమాదం నుండే బాబా కాపాడి ఉంటారు, నేనే తప్పుగా ఆలోచించాన'ని నాకనిపించి బాబాకు క్షమాపణలు చెప్పుకున్నాను. మరుసటిరోజు సాయంత్రానికి ఆ దెబ్బల కారణంగా మావారికి జ్వరం వస్తే ఆయుర్వేద మందులు వేసుకున్నారు. నేను, "తెల్లవారేసరికి మావారికి నయమైతే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. మరుసటిరోజు తెల్లవారేసరికి జ్వరం తగ్గిపోయి మావారు నార్మల్ అయ్యారు. అంతా బాబా దయ. అడిగినంతనే అనుగ్రహించే కరుణామూర్తి. సదా మన బాగోగులు చూసుకొనే ప్రేమమూర్తి. మన శ్రేయస్సుకోసం ఏమి చేయాలో ఆయనకి తెలుసు. "బాబా! మా కుటుంబాన్ని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లేలా అనుగ్రహించమని వేడుకుంటున్నాను".

సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

దయగల సాయి తన బిడ్డలకు రక్షణనిస్తారు

జై సాయిరాం! నా పేరు మల్లారెడ్డి. నేను ఇదివరకు రెండు అనుభవాలను ఈ బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను తోటి సాయిభక్తులతో పంచుకుంటాను.

మొదటి అనుభవం: 

2020, ఫిబ్రవరి 27న నా మేనకోడలి వివాహం మా ఊరిలో జరిగింది. ఆ వివాహానికి వెళ్లి, పెళ్లి పనుల్లో నిమగ్నమై ఉండగా హఠాత్తుగా నా కడుపులో, అంటే కిడ్నీకి సంబంధించి తీవ్రమైన నొప్పి వచ్చింది. కళ్ళు తిరుగుతున్నాయి, ఏ పనీ చేయలేకపోతున్నాను. నీళ్లు త్రాగినా నొప్పి తగ్గలేదు. సరే, కొబ్బరినీళ్లు తాగుదామని అనుకుంటుండగా మా తమ్ముడు తన దగ్గర సాయిబాబా ఊదీ ఉందని చెప్పాడు. వెంటనే నేను ఊదీ తీసుకొని, కొద్దిగా నీళ్లలో కలుపుకొని త్రాగాను. ఐదు నిమిషాల్లో నొప్పి పూర్తిగా మాయమై సాధారణస్థితికి వచ్చాను. తక్షణమే బాబా చూపిన కృపకు మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకున్నాను.

ఆ వివాహమైతే బాగా జరిగింది కానీ, తర్వాత పెళ్ళికొడుకుకి పిచ్చి ఉందని తెలిసింది. అబ్బాయికి చిన్నతనంనుంచే పిచ్చి ఉందట. అది ఆలస్యంగా తెలుసుకుని నిర్ఘాంతపోయాము. దానితో నా మేనకోడలు బాధతో ఎంతగానో ఏడ్చింది. ఎన్నో గొడవలు జరిగాయి. చివరికి పెద్దల సమక్షంలో విడాకులు ఇవ్వడానికి, నెలరోజుల్లో డబ్బు తిరిగి ఇవ్వడానికి అంగీకారం జరిగింది. తరువాత నేను నా మేనకోడలు వాళ్ళింట్లో అలమరా పైన ఉన్న బాబా ఫోటోను చూశాను. అప్పుడు 'సర్వాంతర్యామి సాయి ఈ ఇంట్లో ఉండడం వల్ల చివరికి అంతా మంచే జరిగిందని, లేకుంటే ఎన్ని బాధలు అనుభవించేవారో' అని అనిపించింది. కర్మానుసారం ఏమి జరిగినా దయగల తండ్రి తన బిడ్డలకు రక్షణనిస్తారు.

మరో అనుభవం: 

మా నాన్నగారి వయస్సు వంద సంవత్సరాలపైనే ఉంటుంది. ఆయన ఇప్పటికీ తన పని తానే చేసుకుంటారు. ఈమధ్యకాలంలో అంటే ఏప్రిల్, మే నెలల్లో విపరీతమైన ఎండలకు ఆయన చాలా అస్వస్థతకు గురై లేవలేని స్థితికి చేరుకున్నారు. ఈ వార్త తెలిసిన వెంటనే నేను హైదరాబాదు నుండి ఊరికి వెళ్లి, ఆయనకి సేవ చేశాను. ఆయన కొద్దిగా కోలుకోగానే హైదరాబాద్ తిరిగి వచ్చేశాను. తరువాత వారం రోజుల్లో నాన్న కిందపడిపోవడంతో దెబ్బలు తగిలాయి. తలకు కూడా వాపు వచ్చింది. నిజానికి ఆ సాయినాథుడు ఎంతో సహాయం చేశారని చెప్పాలి. ఎందుకంటే, ఆయన పడిన చోట చాలా రాళ్లు ఉన్నాయి. ఆయన ఆ రాళ్లపై పడి ఉంటే మాకు దక్కేవాడు కాదు. కేవలం సాయి దయవలనే నాన్న మామూలు దెబ్బలతో బయటపడ్డారు. "బాబా! మీకు చాలా కృతజ్ఞతలు. నాన్న త్వరగా కోలుకునేలా అనుగ్రహించండి". 

మళ్లీ మరో అనుభవంతో మీ ముందుకు వస్తాను. మా అబ్బాయికి ఆ సాయినాథుని కృపతో కళ్ళు వస్తే మళ్ళీ నా అనుభవాలను పంచుకుంటాను.


జై సాయిరామ్! శ్రీ సాయినాథాయ నమః. అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


6 comments:

  1. 🙏ఓం సాయి రామ్🙏

    ReplyDelete
  2. సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

    ReplyDelete
  3. శ్రీ సాయినాథాయ నమః

    ReplyDelete
  4. Om Sairam
    sai always be with me

    ReplyDelete
  5. Om Sri Sai Ram thaatha 🙏
    Bhavya sree

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo