సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 439వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. భయాలన్నీ తొలగించిన బాబా
  2. అనుక్షణం మాతోనే ఉంటూ మమ్మల్ని పరిరక్షిస్తున్న సాయినాథుడు

భయాలన్నీ తొలగించిన బాబా

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

ఓం సాయిరామ్! నేను బాబా భక్తురాలిని. ఈరోజు నేను ఒక బాబా లీలని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. కొన్ని నెలల క్రితం ఉన్నట్టుండి నాకు ఓవర్ బ్లీడింగ్ అవటం మొదలైంది. నాకు ఇంకా పెళ్ళి కాలేదు. పైగా నాకు డయాబెటిస్ ఉంది. ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడూ లేనిది మొదటిసారిగా ఇలా అవడంతో నాకు చాలా భయమేసింది. “పెళ్ళి, పిల్లలు లేకుండానే ఇలా అయితే ఎలా బాబా?” అని బాబాతో చెప్పుకుని బాధపడ్డాను. డాక్టరుని సంప్రదిస్తే బ్లీడింగ్ తగ్గటానికి మందులు ఇచ్చారు. ఆ మందులు వాడినప్పటికీ బ్లీడింగ్ తగ్గలేదు. దాంతో యుటిరస్‌‌లో ఏ సమస్య ఉందో ఏమోనని నాకు చాలా భయమేసి, “బాబా! యుటిరస్‌‌కి సంబంధించి ఏ సమస్యా లేకుండా అనుగ్రహించండి. అన్నీ బాగుంటే బ్లాగులో మీ లీలను పంచుకుంటాను” అని బాబాను ప్రార్థించాను. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు బ్లీడింగ్ ఆగటానికి నాకు హార్మోన్ టాబ్లెట్లు ఇచ్చారు. ఆ టాబ్లెట్లు వాడటం ప్రారంభించాక బ్లీడింగ్ కంట్రోల్ అయింది. తరువాత డాక్టర్ యుటిరస్ పరీక్షించి, “అంతా బాగుంది, ఏ సమస్యా లేదు. కానీ, ఈ హార్మోన్ టాబ్లెట్లు కనీసం 3 నెలలైనా వాడాలి” అని చెప్పారు. నేను ఆ టాబ్లెట్లు 2 నెలలు వాడిన తరువాత సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమోని భయపడి, “బాబా! ఇక నేను ఈ టాబ్లెట్లు వేసుకోవటం ఆపేస్తున్నాను. నా నెలసరి క్రమబద్ధంగా వచ్చేలా నువ్వే చూసుకోవాలి బాబా” అని బాబాను వేడుకుని ఆ హార్మోన్ టాబ్లెట్లు వేసుకోవటం మానేశాను. అప్పటినుండి బాబా అనుగ్రహంతో ఏ మందులూ వాడకుండానే నా నెలసరి సక్రమంగా వస్తోంది. ఇలానే ఇకముందు కూడా ఏ సమస్యా లేకుండా నెలసరి సక్రమంగా రావాలని బాబాని కోరుకుంటున్నాను. “థాంక్యూ బాబా, థాంక్యూ సో మచ్. నా ఇంకో సమస్య కూడా పరిష్కరించు బాబా ప్లీజ్!”

అనుక్షణం మాతోనే ఉంటూ మమ్మల్ని పరిరక్షిస్తున్న సాయినాథుడు

విజయనగరం నుండి సాయిభక్తుడు అయోధ్యరామయ్య తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

శ్రీసచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై! సద్గురు శ్రీసాయినాథుని శరత్‌బాబూజీ కీ జై!


అనుక్షణం మాతోనే ఉంటూ మమ్మల్ని పరిరక్షిస్తున్న సాయినాథునికి శతకోటి నమస్కారాలతో ఈ అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. నా పేరు అయోధ్యరామయ్య. నేను విజయనగరంలో నివసిస్తున్నాను. నేను ఒక ప్రముఖ ఫార్మా కంపెనీలో పని చేస్తున్నాను. ఈ కరోనా లాక్‌డౌన్ సమయంలో కూడా మా కంపెనీ అత్యవసర సేవల విభాగం క్రింద పనిచేస్తూ ఉంది. ఏప్రిల్ 19వ తేదీన ట్రాన్స్‌పోర్టేషన్ ఒకచోటి నుంచి ఇంకొక చోటికి నిలిపివేయమని గవర్నమెంట్ నుండి ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. అందువలన ఉద్యోగస్తులందరినీ కుటుంబాలను వదిలి, బ్యాగ్స్ సర్దుకుని బయలుదేరి రమ్మని, కంపెనీ పరిసరాల్లోనే ఉండటానికి రూములు ఇస్తామని కంపెనీ ఆదేశించింది. కానీ ఈ కరోనా నేపథ్యంలో కుటుంబాన్ని వదిలి వెళ్లడం నాకు, మా కుటుంబసభ్యులకు ఏమాత్రం ఇష్టం లేదు. అందుకని నేను చీటీల ద్వారా బాబా నిర్ణయాన్ని తెలుసుకుందామని అనుకుని, ఒకటి ‘వెళ్ళవచ్చు’ అని, రెండోది ‘వెళ్ళనవసరం లేదు, అంతా సరి అవుతుంది’ అని రెండు చీటీలు రాసి బాబా ముందు ఉంచాను. ఆరోజు సాయంత్రం సత్సంగం అయిన తర్వాత బాబాను ప్రార్థించుకుని చీటీలు తీస్తే ‘వెళ్ళనవసరం లేదు’ అనే చీటీ వచ్చింది. వెంటనే మా మేనేజరుకి ఫోన్ చేసి ‘నేను రావట్లేద’ని చెప్పాను. అప్పుడు మా మేనేజర్, “ఏమీ పర్వాలేదు, విజయనగరంలో ఉండేవాళ్లు ఇంటినుండి రావటానికి ట్రాన్స్‌పోర్టేషన్ కోసం గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వచ్చింది” అని చెప్పారు. ఆ క్షణంలో నా ఆనందానికి అవధులు లేవు. వెంటనే కృతజ్ఞత నిండిన మనసుతో బాబా పాదాలకు, గురువుగారి పాదాలకు నమస్కరించుచున్నాను. ఈ విధంగా బాబా, గురువుగారి అనుగ్రహం మాపై ఎల్లవేళలా ఉండటం మా పూర్వజన్మ సుకృతం.


6 comments:

  1. om sairam
    sai always be with me

    ReplyDelete
  2. శ్రీసచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

    ReplyDelete
  3. 🙏🌹 ఓం శ్రీ సాయిరాం తాతయ్య 🙏🌹

    ReplyDelete
  4. Om Sri Sai Ram thaatha 🙏🙏
    Bhavya sree

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo