సాయిశరణానంద అనుభవాలు - ముప్పైరెండవ భాగం
నిన్నటి తరువాయిభాగం.....
శిరిడీలో అప్పుడు బాబా కోసం వట్టివేళ్ళ తడికలు చేసే పని ప్రారంభమైంది. ఆ పనిని నేర్చుకొని నేనూ తడికలు చేశాను. అప్పుడు రాధాకృష్ణమాయి నాతో, “నీవు వెళ్ళిపోయిన తరువాత నాకు బాగా అనిపించలేదు. చాలాసార్లు ఏడుపొచ్చింది” అన్నది. తరువాత మళ్ళీ, “నిన్నంత చక్కగా పంపించాను కదా! మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చావు? నీకు కుర్చీలో కూర్చోవటం బహుశా ఇష్టం లేదేమో! డబ్బు సంపాదించి నా ఈ సంసారానికి ఎప్పుడు సాయం చేస్తావు?” అని మళ్ళీ మళ్ళీ అన్నదామె. కొద్దిరోజులుండి నేను వెళ్ళిపోతానన్న మాటను బయటపెట్టాను. అప్పుడు శ్రీమనూసుబేదారు విదేశం నుంచి తిరిగి వచ్చాడన్న సమాచారం తెలిసింది. ఈ మాట రాధాకృష్ణమాయికి చెప్పి అతనికి 400 రూపాయల వేతనంపై ప్రొఫెసర్‌గా ఉద్యోగం దొరికిందన్న విషయం చెప్పాను. అప్పుడామె, “మనం చాలా బీదవాళ్ళమని నీవనుకుంటున్నావు కాబోలు. ఇదుగో, నీకెంత డబ్బు కావాలి? యాభయ్యా? డెభ్బై అయిదా? వందా? నూట యాభయ్యా? చెప్పు ఎంతో?” అన్నది. దీనికన్నా పెద్ద మొత్తం చెప్పటం ఆమెకి చేతకాలేదు. కొద్దిరోజులు నా నెలజీతం 250, 275 రూపాయల వరకూ ఉంది. క్రాఫర్డ్ బేలీలో ఉన్నప్పుడు 11 నెలల వరకూ 350 రూపాయల వేతనం లభించింది. అలాగే 500 బోనస్ కూడా లభించింది. కొద్దిరోజుల వరకూ నేను నిరుద్యోగిగా ఉన్నాను. ఈ పూర్తి సమయం లెక్క చూస్తే సరాసరి నెలజీతం 150 రూపాయలు ఉంది. మాయి పెట్టిన 150 రూపాయల పరిమితి నిజమైంది. ఆమె మాటలు ఈ రకంగా రెండు అర్థాలు వచ్చేట్లుగా ఉండేవి. కొన్నిసార్లు వైరాగ్యం పెట్టుకోమని అర్థింపూ, మరి కొన్నిసార్లు డబ్బు సంపాదించి ఆమె సంసారానికి సాయం చేయమనీను.
పరమాత్ముని ప్రాప్తికోసం ఏకాంతము, మౌనము అనేవి చాలా అవసరమని చాలామంది దగ్గర విన్నాను, సంత్ తుకారాం చరిత్ర చదివి స్వయంగా తెలుసుకున్నాను. అందువల్ల ఏడురోజుల పాటు ఏకాంతంలో మౌనంగా కూర్చోవాలని నిర్ణయించుకున్నాను. నాకిప్పుడది గుర్తొస్తోంది - ఒక శనివారం మధ్యాహ్న ఆరతి అయ్యాక నా గది తలువులు మూసేసి గదికి ఒక ప్రక్కన ఉన్న వంటగదిలో ఒక మూలన భగవన్నామస్మరణ చేస్తూ కూర్చున్నాను. శ్రీవాసుకాకా, శ్రీవామనరావు నార్వేకర్ నన్ను పిలిచి తలుపు తట్టారు. కానీ నేను పట్టించుకోలేదు. అలా రెండురోజులు గడిచాయి. మూడవరోజు దాహం వేయటం వల్ల గది బయట గట్టుమీద మట్టికుండలో ఉన్న నీటిని త్రాగాను. తరువాత దుకాణం వెనుక ఉన్న బావిలో నీళ్ళు తోడుకుని వెళ్తున్న ప్రజల నుండి నీటిని తీసుకుని ఆ నీటితో దాహం తీర్చుకున్నాను. గదిలో మాత్రం నీరు లేదు. మూడవరోజు గదినుండి బయటకు వచ్చి బాబా దర్శనార్థం వెళ్లి బాబాకి నమస్కరించాను. అప్పుడు బాబా ఏమీ మాట్లాడలేదు. తరువాత రాధాకృష్ణమాయి ఇంటిక్కూడా వెళ్ళాను. అక్కడ వామనరావు నార్వేకర్ ఉన్నారు. ఆయన నన్ను, “రాత్రిళ్ళు పడుకుంటావా?” అని అడిగారు. నేను సమాధానం చెప్పేలోపే రాధాకృష్ణమాయి, “నిద్రయితే వస్తుంది కదా! అది ప్రకృతి నియమం” అన్నది. ఆమె చెప్పిన ఆ జవాబుతో నాకిక చెప్పటానికేమీ మిగల్లేదు. ఈ రెండు సంఘటనల వల్ల, "ఏడురోజులు ఏకాంతంలో ఉండాలన్న ఆలోచన పెట్టుకుని మూడవరోజే నేను బయటకి రావటం బాబాకి, రాధాకృష్ణమాయికి నచ్చలేద”ని నాకు అర్థమైంది. అందువల్ల వెంటనే మళ్ళీ తలుపులు మూసుకుని గదిలో కూర్చున్నాను.
దాని తరువాత శనివారం మధ్యాహ్న ఆరతి అయ్యాక రెండు మూడు గంటలకి గదినుండి బయటకొచ్చాను. బాబా దర్శనం చేసుకొని ముంబాయి తిరిగి వెళ్ళటానికి అనుమతినడిగాను. అప్పుడు బాబా, “రేపు ఉదయం వెళ్ళు” అన్నారు. ఆ సమయంలో కాకాసాహెబ్ దీక్షిత్ అక్కడే ఉన్నారు. అతను నన్ను వాళ్ళింటికి తీసుకెళ్ళాడు. ఆరతై చాలాసేపయ్యాక అతను నాకు వారింట్లో భోజనం పెట్టాడు. తరువాత రాధాకృష్ణమాయి నన్నుద్దేశించి దీక్షిత్ తో, “అతని శౌచం(మలం) గట్టిగా రాయిలా అయిపోయింది. అందువల్ల కాఫీలో నెయ్యి వేసుకొని త్రాగమని అతనితో చెప్పు. దాంతో అతని శరీరంలో వికృతి ఏర్పడకుండా ఉంటుంది” అన్నది. మళ్ళీ ఆమె, “బాబా కృపతో అన్నం తినకుండా నేను కేవలం కొన్ని గుక్కలు నీటిని త్రాగి ఏడురోజులు ఉండగలిగాను" అని కూడా అన్నది. ఆమె అన్న ఈ మాటల్లోని ప్రతి అక్షరం నిజమేనని నేను తెలుసుకున్నాను.
బాబా కృపతోనే నా ఈ కోరిక సఫలమైంది. అది నిర్వివాదాంశం. అప్పుడు నాకు దీనితో ఏదో ఓ గొప్ప ఆధ్యాత్మిక లాభం కలిగిందని అనిపించలేదు. పరమాత్మ ధ్యానం కోసం సిద్ధంగా ఉండటం అవసరం. కానీ ఇంటిలో ఉన్నవారు, ప్రత్యేకించి పెద్దక్కయ్య గుర్తురావటంతో నాకు దుఃఖం కలిగింది. ఏడురోజుల ఏకాంతంలో రాధాకృష్ణమాయి పోలికల్లో ఉన్న ఒక కాల్పనిక గోపిక చరణాలు గాల్లో తేలిపోతూ దృష్టికి అగుపించాయి. ఆమె ప్రత్యక్ష దర్శనమైంది. ఆమెతో నేనేమీ మాట్లాడలేకపోయాను. రాధాకృష్ణమాయి 'తుకారాం గాథ' లోని కొన్ని పేజీలతో సహా జాగ్రదావస్తలో దర్శనమిచ్చింది.
తరువాయి భాగం రేపు ......

source: "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.
om sai ram om sai ram om sai ram
ReplyDeleteOm Sai Ram 🙏🌹🙏
ReplyDeleteOm Sai
ReplyDeleteSri Sai
Jaya Jaya Sai
🙏🙏🙏
🙏🌹 ఓం శ్రీ సాయిరాం తాతయ్య 🌹🙏
ReplyDeleteom sairam
ReplyDeleteఓం సాయిరాం...🌹🙏🌹
ReplyDelete