ఈ భాగంలో అనుభవాలు:
- ఊదీతోనే జ్వరాన్ని తగ్గించేసిన బాబా
- బాబా మాటలు పొల్లుపోవు - ఆయనకన్నీ తెలుసు!
ఊదీతోనే జ్వరాన్ని తగ్గించేసిన బాబా
సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. 2020, జూన్ 13 రాత్రి మా అపార్ట్‌మెంటులో వాళ్ళు మాతో మాట్లాడటానికి మా ఇంటికి వచ్చారు. వాళ్లతో మాట్లాడుతూ ఉండగానే మావారికి చలిగా అనిపించింది. అయినా అలానే కూర్చుని మాట్లాడుతున్నారు. కొంతసేపటి తరువాత తన శరీర ఉష్ణోగ్రత బాగా ఎక్కువైపోయి చలి బాగా పెరిగిపోయింది. అసలే ఆ సమయంలో అంతటా కోవిడ్ ఉన్నందున నాకు చాలా భయమేసి, బాబాను ప్రార్థించి, మావారి నుదుటిపై కొద్దిగా బాబా ఊదీని పెట్టి, మరికొంత ఊదీని నీళ్ళలో కలిపి తనచేత త్రాగించాను. తరువాత 'ఓం శ్రీసాయి ఆరోగ్య క్షేమదాయ నమః' అని 108 సార్లు జపించాను. "మావారి జ్వరం తగ్గించు బాబా!" అని తెల్లవారుఝామున 3 గంటల వరకు బాబాను ప్రార్థిస్తూనే ఉన్నాను. బాబా అద్భుతం చూపించారు. 3 గంటల సమయంలో మావారికి శరీరమంతా చెమటలు పోశాయి. శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థితికి వచ్చేసింది. ఒక్క టాబ్లెట్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేకుండానే కేవలం తన ఊదీతోనే మావారి జ్వరాన్ని తగ్గించేశారు బాబా. "బాబా! నీ భక్తులను కాపాడు తండ్రీ. మా కుటుంబానికి ఎల్లప్పుడూ మీ ఆశీస్సులు కావాలి బాబా. నా తప్పులేమైనా ఉంటే మన్నించు బాబా!'
బాబా మాటలు పొల్లుపోవు - ఆయనకన్నీ తెలుసు!
సాయిబంధువులకు నా నమస్సులు. నేను ఒక సాయి భక్తురాలిని. నేను ప్రతి మంగళవారం గణేశునికి నైవేద్యంగా ఉండ్రాళ్ళు చేసేదాన్ని. కానీ కొన్ని రోజులుగా మానసిక వ్యధ వల్ల దేవుడి మీద విరక్తి కలిగి పూజల మీద నాకు శ్రద్ధ ఉండటం లేదు. అయితే సాయిసచ్చరిత్ర, శ్రీగురుచరిత్ర మాత్రం పారాయణ చేస్తుండేదాన్ని. జూన్ 10, 2020న చేసుకోవాలనుకున్న సంకటహర గణపతి వ్రతాన్ని కొన్ని కారణాలవల్ల చేసుకోలేకపోయాము. ఆరోజు సచ్చరిత్ర పారాయణ పూర్తయ్యాక వాట్సాప్ ఓపెన్ చేస్తే బాబాకు సంబంధించిన ఒక ఇంగ్లీషు బ్లాగులో బాబా గణేశుడిగా దర్శనం ఇచ్చిన ఒక భక్తురాలి అనుభవం వచ్చింది. నా పాపకర్మ చూడండి, నా మనసుకి ఉన్న అహం వల్ల, 'బాబా ఇలాంటి కంటితుడుపు చర్యలు చేయటం తప్ప నా బాధ మాత్రం తీర్చటం లేదు' అనుకున్నాను. తరువాత పిల్లలని పడుకోబెట్టి ఫోన్ తీసుకుని బయట కూర్చున్నాను. అప్పుడే మా బావగారు వచ్చి 'గణపతి హోమం చేసుకున్నామ'ని చెప్పి ప్రసాదం ఇచ్చారు. లాక్‌డౌన్ తర్వాత అదే మొదటిసారి ఆయన మా ఇంటికి రావటం. ఆ మర్నాడు, ఆరోజు పూర్తిచేయాల్సిన సచ్చరిత్ర పారాయణ పూర్తి చేశాక, ఒక సమస్య కోసం ప్రశ్న-జవాబుల వెబ్‌సైట్ చూస్తే "రోగం నుండి బయటపడతారు, బాబాను స్మరించండి" అని వచ్చింది. నాకేమీ అర్థం కాలేదు. తరువాత, "మరో వారం సచ్చరిత్ర పారాయణ చేయనా?" అని బాబా ముందు చీటీలు వేస్తే, "వద్దు" అని వచ్చింది.
మర్నాడు అంటే 12 జూన్, 2020న ఉదయం లేస్తూనే భరించలేనంత భుజంనొప్పి వచ్చింది. ఆ నొప్పితోనే దీపారాధన చేసి మావారిని ఆఫీసుకి పంపి, పిల్లలకి భోజనం పెట్టాను. ఆ తరువాత లాక్‌డౌన్ వల్ల హాస్పిటల్‌కి వెళ్ళే అవకాశం లేక డాక్టరుకి ఫోన్ చేసి, నా భుజం నొప్పి గురించి చెప్పి, నొప్పి తగ్గటానికి మందులిమ్మని అడిగాను. డాక్టర్ నా భుజంనొప్పికి మందులు రాయటానికి ముందు నన్ను రక్తపరీక్ష చేయించుకోమన్నారు. రక్తపరీక్ష చేయిస్తే, రిపోర్టులన్నీ నార్మల్ అని వచ్చాయి. ఆ తరువాత కాసేపు పడుకుని సాయంత్రం ఆరింటికి లేచాక పూజ, వంట చేసి బాబా ఊదీ పెట్టుకున్నాను. ఇంతలో మావారు ఆఫీసునుండి వచ్చి ఒక వాచీ కోసం అడిగారు. అది పైన బీరువాలో పెట్టినట్లు గుర్తు. కానీ నాకు చెయ్యి పైకెత్తి పనిచేసే ఓపిక లేక బాబాకి నమస్కారం చేసుకుని (దేవుడితో ఇలాంటి మొక్కులు నాకు నచ్చకపోయినా), "బాబా! ఈ భుజంనొప్పితో ఆ వాచీ కోసం నేను వెతకలేను. ఆయన అసలే కోపంగా ఉన్నారు. ఒక చిన్న వాచీకోసం ఆయనతో గొడవ జరగకూడదు. ఏ గొడవా జరగకుండా ఆయన ప్రశాంతంగా ఉంటే నా అనుభవాన్ని తోటి భక్తులతో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. వెంటనే మా పెద్దమ్మాయి, "అమ్మా! వాచీలు మేకప్ బాక్సులో ఉన్నాయి" అంటూ ఆ వాచీ తీసిచ్చింది. ఇక్కడ బాబా దయకు మరో తార్కాణం - ఆ రాత్రికి గొడవవుతుందని అనుకుంటే మావారు నన్నేమీ అనలేదు, పైగా చక్కగా మాట్లాడారు కూడా. నేను ఈరోజు (శనివారం, 13 జూన్ 2020) పడుకుని లేచేసరికి నాకు భుజంనొప్పి లేదు.

ముఖ్యమైన సంగతి - ప్రశ్న-జవాబుల వెబ్‌సైట్‌లో "రోగం నుండి బయటపడతారు, బాబాను స్మరించండి" అని వచ్చినప్పుడు, "నేను బాగానే ఉంటే బాబా ఇలా రోగం నుండి బయటపడతారు అన్నారేంటి? కంప్యూటరులో అన్నీ ఇలాగే వస్తాయి" అని అనుకున్నాను. కానీ నా భుజంనొప్పి, రిపోర్ట్ నార్మల్‌గా రావటం చూస్తే, "బాబా మాటలు పొల్లుపోవు; మనకి తెలియని విషయాలు, మనం చూడలేని విషయాలు బాబాకు తెలుసు" అని అర్థమైంది. దాంతో "నాకున్న బాధ బాబాకు తెలుసు. దాన్ని కూడా వారు అనూహ్యమైన రీతిలో తీరుస్తారు" అని నమ్మకం పెరిగింది. అంతేకాదు, 'ఆ వెబ్‌సైట్ చిన్న పిల్లల ఆట కాదు' అని తెలుసుకున్నాను. అందరికీ ఒకటే చెబుతున్నా - బాబా మార్గం అనూహ్యం. ఆయన తన బిడ్డలను ఎప్పటికీ విడువరు. మనమందరం బాబా స్మరణ ఎల్లప్పుడూ చేద్దాము.
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
ReplyDeleteశాంతచిత్తా మహాప్రజ్ఞ సాయినాథ దయాధన
దయా సింధో సత్య రూప మాయతమవినాశన!
జాత గోతాతీత సిద్ద్ధా అచింత్యా కరుణాలయ
పాహిమాం పాహిమాం సాయినాథ శిరిడి
గ్రామ నివసాయ నామో నమః!!
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
ఓం సాయిరాం!
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
love u sai,pls baba bless me with courage and patience baba,be with me always sai,love u,love u,love u baba
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai
ReplyDeleteఓం సాయిరాం...🌹🙏🌹
ReplyDeleteOm Sai Ram 🙏🌹🙏🌹
ReplyDelete