ఈ భాగంలో అనుభవాలు:
- కోరుకున్న కుంకుమను కరుణతో ప్రసాదించిన సాయి
- బాబా అనుగ్రహంతో వీసా పొడిగింపు
కోరుకున్న కుంకుమను కరుణతో ప్రసాదించిన సాయి
ఒక సాయిభక్తురాలు తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
సాయిబంధువులందరికీ సాయిరాం! నేను ఇదివరకు ఈ బ్లాగులో కొన్ని చిన్న చిన్న అనుభవాలను మీతో పంచుకున్నాను. ఇది కూడా అలాంటి ఒక బుల్లి అనుభవమే. వినటానికి, చదవటానికి చిన్న అనుభవమే, కానీ నాకు చాలా చాలా సంతోషాన్నిచ్చిన అనుభవం. ఎందుకంటే, ఈ అనుభవం సాయి సచ్చరిత్ర 41వ అధ్యాయంలో బాబా చెప్పిన "నేను నీకు జల్తారు సెల్లానిచ్చుటకు ఇచట కూర్చొనియున్నాను. ఇతరులవద్దకు పోయి దొంగిలించెదవేల?" అన్న వాక్యానికి సరిగ్గా సరిపోతుంది. అందుకే మీ అందరితో పంచుకోవాలని మీ ముందుకు వచ్చాను. ఈ అనుభవం ద్వారా సచ్చరిత్రలో బాబా పలికిన మాటలు ఎంత సత్యవాక్కులో మీకు అర్థమవుతుంది.
చాలామందికి అలవాటు ఉన్నట్టే ప్రతిరోజూ కుంకుమ పెట్టుకోవటం నాకు చిన్నప్పటినుంచీ అలవాటు. ఒకసారి మా నానమ్మ మాకు తెలిసిన ఒక గురువుగారి ఆశ్రమానికి వెళ్ళి అక్కడనుండి ప్రసాదంగా కొంచెం కుంకుమ తీసుకొచ్చింది. అది నాకు చాలా నచ్చింది. మేముండే ప్రాంతంలో ఆ కుంకుమ దొరకటం చాలా కష్టం. అలాంటి కుంకుమని ఎక్కువగా ఉత్తర భారతదేశంలోని ప్రజలు వాడుతారు. కొద్దిరోజులకే ఆ కుంకుమ అయిపోయింది. మళ్లీ ఆ ఆశ్రమం నుంచి కుంకుమ తెప్పించాను, కానీ అది మామూలు కుంకుమ. ఆ తర్వాత నాకు కావలసిన కుంకుమ కోసం ఎంతో ప్రయత్నించాను. గుళ్ళో పూజారిగారితో సహా ఎంతోమందిని అడిగాను, కానీ దొరకలేదు. మావాళ్ళు ఎవరు ఏ పుణ్యక్షేత్రం వెళ్ళినా అలాంటి కుంకుమ తీసుకురమ్మని అడిగేదాన్ని. కానీ అందరినించీ ఒకటే సమాధానం - ఆ కుంకుమ ఇక్కడ దొరకదు అని.
ఒకరోజు పెద్ద పెద్ద బాబా ఫోటోలతో, మైకులో ఏదో చెప్తూ మా ఇంటి ముందు నుంచి ఒక వాహనం వెళ్ళింది. ప్రక్క ఊళ్ళో బాబా గుళ్ళో ఏదో పెద్ద పూజ చేస్తున్నారట, దానికి చందాల కోసం తిరుగుతున్నారు. డబ్బులు, బియ్యం ఏవైనా తీసుకుంటున్నారు. మా అమ్మ కూడా కొంత డబ్బు, బియ్యం ఇచ్చింది. వాళ్ళు ప్రసాదం ఇచ్చారు. మీరు ఊహించగలరా ఆ ప్రసాదం ఏమిటో? నేను చాలా రోజుల నుంచి కోరుకుంటున్న కుంకుమ! ఎక్కడైనా బాబా ప్రసాదంగా ఊదీ ఇస్తారు. కానీ నా సాయితండ్రి తన బిడ్డ ఎంతగానో కోరుకుంటున్న కుంకుమను తన గుమ్మం ముందుకే వచ్చి ఇచ్చారు. అప్పుడు నా సంతోషాన్ని మాటల్లో వర్ణించలేను. బాబా అనుగ్రహం అంతటితో అయిపోలేదు. అలా బాబా ప్రసాదించిన కుంకుమ కొద్దిరోజులకు అయిపోయింది. అయితే ఈసారి కుంకుమ కోసం నేను ఎవరినీ అడగలేదు. ఎందుకంటే అన్నీ ఇవ్వటానికి నా సాయితల్లి ఎప్పుడూ సిద్ధంగా ఉండగా వేరేవాళ్ళని నేనెందుకు అడగాలి? అవును, నా నమ్మకమే నిజమైంది. కొన్ని సంవత్సరాలు వాడినా తరిగిపోనంత కుంకుమను బాబా నాకు పంపారు. ఎక్కడినుంచి పంపారో తెలుసా? - శిరిడీ నుంచి! ఎప్పుడు పంపారో తెలుసా? - బాబా శతాబ్ది సంవత్సరంలో! ఇప్పటికీ నిత్యం ఆ కుంకుమే పెట్టుకుంటున్నాను. ఇంకా కొన్ని సంవత్సరాలు అయినా ఆ కుంకుమ అయిపోదు. ఒకవేళ అయిపోయినా మళ్లీ నా సాయి ఇస్తారు కదా!
ఇపుడు చెప్పండి, నేను అన్నది నిజమే కదా? సచ్చరిత్ర అంటే సత్య చరిత్ర. అందులోని బాబా మాటలు సత్యవాక్కులు. మనకి అన్నీ ఇవ్వటానికి మన సాయిమహారాజు మన హృదయంలో కొలువై ఉండగా మనం అనవసరంగా వాళ్ళని, వీళ్ళని అడుగుతుంటాం, కదా? బుల్లి అనుభవం అని చాలా పెద్దగా రాశాను, మన్నించాలి.
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

బాబా అనుగ్రహంతో వీసా పొడిగింపు
యు.ఎస్.ఏ నుండి శ్రీమతి అనుపమ తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
సాయిభక్తులందరికీ నా నమస్సుమాంజలి. నా పేరు అనుపమ. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్నవారికి నా ధన్యవాదాలు. నాకు ఇటీవల జరిగిన ఒక అనుభవాన్ని మీ అందరితో పంచుకోవాలని అనుకుంటున్నాను. మేము USA లో ఉంటున్నాము. గత నెల మావారి వీసా గడువు పూర్తయిపోయింది. 4 నెలల క్రితమే మేము వీసా గడువు పెంచుకునేందుకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ వీసా ఆమోదింపబడలేదు. వీసా గురించి మావారు బాగా ఆందోళనపడుతుంటే చూడలేక, "బాబా! కొరోనా కారణంగా నెలకొన్న ఈ పరిస్థితుల్లో మేము ఇండియాకు వెళ్లలేము. అందువల్ల మా వీసా గడువు పెరిగేలా చూడండి బాబా. మీ అనుగ్రహంతో వీసా వస్తే నేను 108 ప్రదక్షిణలు చేస్తాను, అలాగే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. బాబా అనుగ్రహంతో వీసా గడువు పొడిగించబడింది. మా ఆనందం ఏమని చెప్పను. "థాంక్యూ సో మచ్ బాబా! ఇలాగే ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉండండి. అందరినీ చల్లగా చూడండి".

ReplyDeleteఓం జయ జగదీశ హరే
💐🌷🥀🌹🙏🙏🙏💐
ఓం జయ జగదీశ హరే
స్వామీ జయ జగదీశ హరే
భక్త జనోం కే సంకట,
దాస జనోం కే సంకట,
క్షణ మేం దూర కరే,
ఓం జయ జగదీశ హరే!!
💐🙏🌹🙏💐🌹🌷🙏🌹
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
ReplyDeleteom sairam
ReplyDeletesai always be with me
ఓం శ్రీ సాయినాథాయ నమః
ReplyDeleteఅఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై! ఓం సాయిరాం...🌹🙏🌹
ReplyDeleteOm Sri Sai Ram thaatha 🙏
ReplyDeleteBhavya sree
Om Sai Sri Sai Jaya Jaya Sai
ReplyDelete