ఈ భాగంలో అనుభవం:
- నా మానాన్ని, ప్రాణాన్ని కాపాడిన అపార కరుణాజలధి శ్రీసాయి
పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:
2020, జూన్ 9వ తేదీ తెల్లవారుఝామున నిద్రలేస్తూనే సుమారు పాతికేళ్లక్రితం బాబా నాపై చూపిన అపారమైన కరుణ గుర్తుకొచ్చింది. ఆనాడు బాబా చేసిన సహాయము, గొప్ప ఆశీర్వాదము తలచుకుంటుంటే కన్నీళ్ళు ఆగలేదు. అప్పుడు, "సాయిబాబా! నా మానాన్ని, ప్రాణాన్ని కాపాడిన మీ అపారమైన కరుణను అందరికీ తెలుపవద్దా?" అని బాబాని అడిగాను. అందుకు బాబా, "నీకు ఆ లీల అంతగా నచ్చితే, చెప్పు" అని బదులిచ్చారు. అందుకే అమ్మకు, నాకు మాత్రమే తెలిసిన ఈ అనుభవాన్ని ఇన్నేళ్ల తరువాత మీ అందరితో పంచుకోబోతున్నాను.
ఈ సంఘటన సుమారు పాతికేళ్లక్రితం జరిగింది. అప్పుడు నాకు పదహారేళ్లు ఉంటాయి. నాకు చిన్నప్పటినుండి బాబా అంటే చాలా చాలా ఇష్టం. ప్రతిదానికీ ఆయననే తలచుకుంటూ ఉండేదాన్ని. మా నాన్నగారు నా చిన్నప్పుడే చనిపోయారు. మా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ఉన్నంతలో అమ్మ నన్ను, తమ్ముడిని జాగ్రత్తగా చూసుకుంటుండేది. మా అమ్మ నా పెళ్లి త్వరగా చేసేద్దామని తలచింది. మాకు తెలిసిన ఒకాయన ఒక సంబంధం గురించి చెప్పారు. "అప్పుడే పెళ్లి వద్దు, నాకు చదువుకోవాలని ఉంద"ని అమ్మకి చెప్పాను. కానీ అమ్మ బలవంతపెట్టింది. దాంతో పెళ్లిచూపులకు ఒప్పుకున్నాను. పెళ్లికొడుకు తల్లిదండ్రులు, అక్క, బావ వచ్చి నన్ను చూసి, "అమ్మాయి మాకు నచ్చింది. ఒకసారి మా ఇంటికి వచ్చి చూసిపోండి" అని అన్నారు. దాంతో మా అమ్మ తనకు తోడుగా వేరేవాళ్ళని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అక్కడ అబ్బాయి తండ్రి 50 వేల రూపాయలు డిమాండ్ చేశారు. దాంతో పాపం అమ్మ ఇంటికి వచ్చి, "అంత డబ్బు నేనెక్కణ్ణించి తెచ్చేది?" అని బాధపడింది. దానికి నేను, "ఎందుకమ్మా బాధపడతావు? నేను చదువుకుంటాను. పెళ్లి సంగతి తర్వాత చూద్దాం. మనకి ఆర్థిక స్థోమత కూడా లేదు కదా" అని అన్నాను. కానీ అమ్మ, "మంచి సంబంధం వదులుకుంటే ఎలా? పిల్లవాడు బుద్ధిమంతుడు. ఈ సంబంధం కుదిరితే నువ్వు సంతోషంగా ఉంటావు" అంది. తర్వాత అమ్మ మా మావయ్యకి ఉత్తరం వ్రాసింది. అతను తనకి చేతనైన సహాయం చేస్తానని చెప్పారు. రోజులు గడుస్తున్నాయి. పెళ్లికొడుకు బావ మా ఊరికి దగ్గరలోనే ఉండటం వలన దాదాపు ప్రతిరోజూ మా ఇంటికి వచ్చి, "మంచి సంబంధం ఎందుకు దూరం చేసుకుంటారు? ఏదో ఒక విధంగా తొందరగా సంబంధం ఖాయం చేసుకోమ"ని ఒత్తిడి చేస్తుండేవాడు. మంచే చెబుతున్నాడు కదా అని మేము అతనితో మర్యాదగా మాట్లాతుండేవాళ్ళం. ఈ విధంగా మూడు, నాలుగు నెలలు గడిచాయి. తరువాత ఒకరోజు అతను అమ్మతో, "మీకు ఆర్థిక ఇబ్బంది ఉంది కదా, మంత్రాలయంలోని బ్రాహ్మణ సంఘం వాళ్ళు బ్రాహ్మణ వధువులకు ఉచితంగా తాళిబొట్టు ఇస్తారు. అది వస్తే నీకు కొంత సహాయంగా ఉంటుంది. కాబట్టి అమ్మాయిని నాతోపాటు పంపించండి. నేను వాళ్ళతో మాట్లాడి తాళిబొట్టు తీసుకొని వస్తాను" అని చెప్పాడు. అతని వెంట నన్ను పంపడం అమ్మకు ఇష్టం లేదు. కానీ అతను, "చూడమ్మా! నా బావమరిదికి సంబంధం అనుకున్న అమ్మాయి నాకు చెల్లెలవుతుంది. కాబట్టి నీ కూతురు విషయంలో నువ్వు భయపడాల్సిన పనిలేదు" అని నమ్మబలికాడు. దాంతో పాపం అమ్మ సరేనని చెప్పింది. అమ్మ అమాయకురాలు, నేను పదహారేళ్ళ చిన్నపిల్లని. ఇప్పట్లో ఉన్నన్ని తెలివితేటలు అప్పట్లో మాకు లేవు.
తరువాత ఒకరోజు మంత్రాలయం వెళ్ళడానికి నేను అతనితో బయలుదేరాను. మధ్యలో దిగి మరో బస్సు ఎక్కాము. మధ్యలో అతనికి తెలిసిన ఒకామె కూడా బస్సు ఎక్కింది. ఆమె చూడడానికి కూలిపని చేసుకునే మనిషిలా ఉంది. నేను ఏమీ పట్టించుకోకుండా కళ్ళు మూసుకుని నా సీట్లో పడుకున్నాను. కొంతసేపటికి 'మంత్రాలయం వచ్చింది, దిగమ'ని చెప్తే వాళ్లతోపాటు దిగాను. వాళ్ళు నన్ను తీసుకొని నేరుగా ఒక లాడ్జికి వెళ్లి రూమ్ తీసుకున్నారు. రూములోకి వెళ్ళాక అతను, "రాఘవేంద్రస్వామి దర్శనానికి వెళ్దాం. నువ్వు స్నానం చేసి చీర కట్టుకొని రెడీగా ఉండు" అని చెప్పి షాంపూ ప్యాకెట్లు ఇచ్చి బయటికి వెళ్లాడు. నేను స్నానం చేసి, చీర కట్టుకొని తయారయ్యాను. మధ్యలో ఒకామె ఎక్కిందని చెప్పాను కదా, ఆమె కూడా మాతో పాటు దర్శనానికి రావడానికి తయారయ్యింది. ముగ్గురం కలిసి వెళ్లి ముందుగా రాఘవేంద్రస్వామి దర్శనం చేసుకున్నాము. తర్వాత అతను నన్ను, ఆమెను ఒక దగ్గర కూర్చోమని, తాను ఆఫీసర్లను కలిసి వస్తానని చెప్పి వెళ్ళాడు. పది నిమిషాల తర్వాత వచ్చి, "ఈరోజు పని కాలేదు. ఉదయాన్నే రమ్మని చెప్పారు. కాబట్టి ఈ రాత్రికి ఇక్కడే ఉండి, ఉదయం వాళ్ళని కలిసి ఊరు వెళ్లిపోదామ"ని చెప్పాడు. రాత్రి అక్కడే ఉండాలంటే నాకు చాలా భయమేసింది. మనసులో అనేక రకమైన ఆలోచనలతో లాడ్జికి వెళ్ళాను. నాకు చాలా ఆకలిగా వుంది. అతను, "మేమిద్దరం బయటకు వెళ్లి వస్తాము, నీకు తినడానికి ఏమైనా తీసుకొస్తామ"ని చెప్పాడు. నేను సరేనన్నాను. అప్పుడు సుమారు రాత్రి 7:00-7:30 గంటలైంది. వాళ్ళు వెళ్ళాక నేను గది తలుపులు వేసుకొని, బట్టలు మార్చుకొని కూర్చున్నాను. బయట మనుషులు తిరుగుతున్న శబ్దం వినిపిస్తోంది. బయటి ప్రపంచం ఎలా ఉంటుందో తెలియని నాకు భయంభయంగా వుంది. ఒక్కసారి నా సినిమా పరిజ్ఞానమంతా గుర్తుతెచ్చుకున్నాను. నాకు అంతకన్నా తెలివితేటలు ఎక్కడివి మరి? ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలతో కళ్లనుండి నీళ్లు కారిపోతున్నాయి. ఏదో జరుగుతుందని భయంతో వణికిపోతున్నాను. బాబా ఉన్నారు, ఆయన రక్షణనిస్తారని తెలిసినా ఏదో తెలియని భయం. అయినా ఆయనకు మోకరిల్లడం తప్ప నేనేమి చేయగలను? అందుకే, "బాబా! గది బయట ఎవరో తిరుగుతున్న శబ్దం వస్తోంది. నాకు భయమేస్తుంది. వీళ్ళిద్దరూ బయటికి వెళ్లారు. వాళ్ళు వచ్చేవరకు గది బయట నిలబడి నాకు రక్షణనివ్వండి తండ్రీ. నాకు ఏమీ కాకుండా చూడు. నన్ను క్షేమంగా అమ్మ దగ్గరికి చేర్చు" అని బాబాను ప్రార్థించాను. ఇదివరకూ ఒక పెద్ద కష్టం నుండి బాబా కాపాడారు, అలాగే ఇప్పుడు కూడా అండగా ఉంటారని ధైర్యం కూడగట్టుకొని వాళ్ళ రాకకోసం ఎదురుచూస్తున్నాను.
కొంతసేపటికి తలుపు చప్పుడైంది. భయంభయంగా తలుపు తీశాను. వాళ్ళిద్దరినీ చూసి, 'హమ్మయ్య! ఇంకేం భయం లేదు, అన్న వచ్చాడు' అనుకున్నాను. అయితే ఆమె లోపలికి రాకుండా ద్వారం బయటే కూర్చుంది. నాకేమీ అర్థం కాలేదు కానీ, పని చేసుకొని బ్రతికే ఆమె కదా, వాళ్ళకది మామూలేమో అనుకున్నాను. అతను లోపలికి వచ్చి తలుపు వేశాడు. అతని దగ్గర ఏదో వాసన వస్తోంది. అతను వచ్చి మౌనంగా కుర్చీలో కూర్చున్నాడు. మనిషి మత్తులో ఉన్నట్లు కనిపించింది. బహుశా అతను తాగి వచ్చాడేమో అనుకున్నాను. కొద్దిసేపటికి అతను నాతో అసందర్భంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. అది నాకు అర్థమవుతోంది, కానీ అతనికి అనుమానం రాకుండా ఏమీ అర్థం కానట్లు కూర్చున్నాను. అతడు నా మీద దురుద్దేశ్యంతో ఉన్నాడని మాత్రం నాకు అర్థమైంది. "ఇప్పుడు నా గతి ఏమిటి? నాలుగు గోడల మధ్య బందీగా ఉన్నాను. సహాయం అర్థించడానికి ఎవరూ లేరు. నేనంత బలమైన మనిషిని కూడా కాదు. అసలు నా వయసు ఎంతని? ఇంకా పూర్తి బుద్ధి పరిపక్వత కూడా లేని తల్లిచాటు బిడ్డని. ఇప్పుడు ఎవరు వచ్చి నన్ను కాపాడుతారు? ఇంతకుముందంటే ఆరుబయట కాబట్టి బాబా కాపాడారు. ఇప్పుడు ఈ నాలుగు గోడల మధ్య ఆయన ఎలా కాపాడుతారు?" అని మనసులో పరిపరివిధాల ఆలోచనలు సాగుతున్నాయి. అతను ఏదేదో చెబుతున్నాడు కానీ, వాటిని జీర్ణించుకునే స్థితిలో నేను లేను. ఎందుకంటే, నా వయసుకు అవి నేను ఊహించలేని మాటలు. అతనింకా తన పూర్తి స్వభావాన్ని బయటపెట్టలేదు కానీ, నేను చాలా ప్రమాదంలో ఉన్నానని తెలుస్తోంది. నాకు జీవితంలో మొట్టమొదటిసారి ప్రపంచాన్ని చూస్తున్నట్టు ఉంది. 'బయట ఆమె కాపలా కాస్తోంది. ఇతను ఇలా మాట్లాడుతున్నాడు. ఈ విధంగా ఉంటుందా ప్రపంచం? ఇంతటి భయంకరమైన మనుషులు కూడా ఉంటారా?' అని అనుకున్నాను. చిన్నప్పటినుంచి బాబా తప్ప నాకు ఇంకో ప్రపంచం తెలియదు. బాబా ప్రేమను చూసిన మనసుతో ప్రపంచమంతా ఇలానే ఉంటుంది అనుకున్నాను. అలాంటి నాకు సమాజంలో దగ్గరగా ఉన్న వ్యక్తుల నుంచి ఇంత ప్రమాదం ఏర్పడుతుందని ఎలా ఊహించగలను? అమ్మ అమాయకురాలు, నాది చిన్న వయస్సు. 'ఆస్తిపాస్తులన్నీ పోగొట్టుకొని నిరాశ్రయులుగా ఉన్నందువల్లే కదా ఈ స్థితి ఏర్పడింది' అని మనసులో ఎన్నో ఆలోచనలు సాగుతున్నాయి. కానీ 'మా' అనేవాడు ఒకడున్నాడు, పిలిస్తే తప్పకుండా వస్తాడని ఏదో గట్టి నమ్మకం. 'వస్తాడు, వస్తాడు, తప్పకుండా వస్తాడు. బిడ్డలు పిలిస్తే బాబా పలకకుండా ఉండడు. నా ఈ పరిస్థితి బాబాకు తెలియదా?' అనుకుంటూ నా బాధ బాబాతో చెప్పుకుందామని బాత్‌రూమ్ లోపలకి వెళ్లి తలుపు గడియపెట్టుకున్నాను.
అతను బయట ఏదేదో అంటున్నాడు. కానీ, నా మనసుకవేవీ అంటట్లేదు. బాబాను తలచుకుంటూ, "బాబా! నేను ఉన్నది పరమ పవిత్రమైన మంత్రాలయ గురు రాఘవేంద్రస్వామి సన్నిధిలో. 'గురువులంతా ఒక్కటే' అని చెప్తారు కదా! మరి ఆ రాఘవేంద్రస్వామి మీరే కదా! ఈ పరిస్థితిలో మీరు ఎలా వస్తారో నాకు తెలీదు. కానీ బాబా, నువ్వు తప్ప నాకు వేరే దిక్కులేదు. చాలా అలసిపోయాను, ఒంట్లో శక్తి లేదు, మానసికంగా ఏడవడానికి కూడా బలం లేదు. నన్ను కాపాడాల్సింది మీరే బాబా" అంటూ నా బాధంతా చెప్పుకున్నాను. నా బాధకు ఆ తండ్రి ఎంతగా కదిలిపోయారో ఏమోగానీ, హఠాత్తుగా అతను బాధతో అరుస్తున్నట్టు వినిపించింది. ఇంతలోనే ఏం జరిగిందోనని మౌనంగా వినసాగాను. అతను బాధతో విలపిస్తున్నాడని అర్థమైంది. కానీ బయటకు రావాలంటే భయం. అయినా నెమ్మదిగా తలుపు కొద్దిగా తెరిచి బయటకు చూశాను. అతను మంచం మీద పడి కాళ్ళు పట్టుకొని మెలికలు తిరిగి పోతున్నాడు. ఏమి జరిగిందో అర్థం కాలేదు. ధైర్యం కూడగట్టుకొని నెమ్మదిగా అడుగులు వేశాను. అతనేమైనా నటిస్తున్నాడేమోనని లోపల భయంగా ఉంది. కానీ అతను లేవగలిగే స్థితిలో లేడని అర్థమైంది. నేను మెల్లగా వెళ్లి తలుపు తెరిచాను. గుమ్మం వద్దే కూర్చుని ఉన్న ఆమె లేచి లోపలికి చూసింది. వాళ్ళ మధ్య బంధమేమిటోగాని చూసిన వెంటనే ఆమె గబగబా లోపలికి వెళ్లి, "ఏమైంది, ఏమైంది" అని కంగారుగా అడగసాగింది. అతను బాధతో ఏమీ చెప్పలేకపోతున్నాడు. రాత్రంతా అతనలాగే బాధపడుతూ ఉన్నాడు. ఆమె అతని ప్రక్కనే ఉండి ఏవేవో మాటలు చెప్తోంది. నేను ఒక మూల ఒదిగి కూర్చుండిపోయాను. ఏ సమయానికో అతను కాస్త కుదుటపడినట్లున్నాడు. తెల్లవారుఝామున ముగ్గురమూ కిందికి వచ్చి, లాడ్జి వాళ్లకు డబ్బులిచ్చి, బస్సెక్కి ఊరికి బయలుదేరాము. బస్సులో ఎలా కూర్చున్నానో నాకే తెలియదు. జరిగింది జీర్ణించుకోలేక అవే ఆలోచనలతో ఉన్నాను. ఎప్పుడు ఊరు వచ్చిందో కూడా తెలియదు. అతను పిలిస్తే బస్సు దిగాను. అతను తన ఊరికి వెళ్లిపోయాడు. నేను ఇంటికి వెళ్ళాను.
గుమ్మం వద్ద కూర్చొని నాకోసం ఎదురుచూస్తున్న అమ్మ ముఖమంతా పీక్కుపోయి ఉంది. కానీ ఏదీ అడిగే స్థితిలో నేను లేను. అమ్మని చూస్తూనే బాధను తట్టుకోలేక, "ఎంత అమాయకంగా పంపించావమ్మా?" అన్నాను. అమ్మ ఏం జరిగిందో ఊహించలేక నా నోటినుంచి ఏం వినాల్సి వస్తుందోనని భయంగా చూస్తోంది. ఏడుస్తూ జరిగిందంతా చెప్పాను. అంతా విన్న అమ్మ, "బాబా! నువ్వు లేకుంటే నా బిడ్డ ఏమైపోయేది?" అని కన్నీళ్లు పెట్టుకుంటూ, "నిన్ను పంపించినప్పటినుంచి నా మనసు స్థిమితంగా లేదు. 'ఎంత పొరపాటు చేశాను' అని అనుకుంటూ రాత్రంతా, "బాబా! నువ్వే నా బిడ్డను కాపాడు. అది చాలా అమాయకురాలు. నువ్వు తప్ప వేరే ప్రపంచం మాకు తెలియదు" అని బాబాని వేడుకుంటూ ఉన్నాను" అని చెప్పింది.
మరుసటిరోజు ఆ దుర్మార్గుడు మళ్లీ వచ్చాడు. వాడిని చూస్తూనే ధైర్యంగా, "నువ్వూ వద్దు, నీ సంబంధమూ వద్దు. ఇంట్లో నుండి బయటకి పో" అంటూ అడగాల్సినవన్నీ అడిగేశాను. అంత ధైర్యం ఎక్కడినుండి వచ్చిందో ఏమో! అది బాబా చలవే. సొంత బావమరిది కోసం చూసిన అమ్మాయి విషయంలో అంత క్రూరంగా ఆలోచించినవాడికి ఏం జవాబు చెప్పాలో పాలుపోలేదు. ఇంక మాట్లాడే ధైర్యంలేక వెళ్ళిపోయాడు. తర్వాత ఆ సంబంధం తెచ్చిన అతనితో 'నాకు ఈ సంబంధం ఇష్టం లేద'ని చెప్పేశాను. కానీ జరిగిన విషయాలేమీ అతనికి చెప్పలేదు. అతను ఆ సంబంధం నిలిపిపెట్టమని వాళ్ళకి ఉత్తరం వ్రాశాడు. జరిగిన ఆ విషయం నాకు, అమ్మకి, వాడికి, వాడితో వచ్చిన ఆమెకి తప్ప ఇంతవరకు ఎవరికీ తెలియదు. తర్వాత ఎనిమిది నెలల్లో వాడు క్యాన్సర్‌తో ప్రతిక్షణం చిత్రహింసను అనుభవిస్తూ చనిపోయాడు. సాయిబాబా తన బిడ్డల మీద ఈగనైనా వాలనిస్తాడా! అలాంటిది తన బిడ్డ విషయంలో అంత అన్యాయానికి పూనుకుంటే ఊరుకుంటాడా?
అతను చనిపోయిన తర్వాత కొద్దిరోజులకి అతడి బావమరిది కుటుంబీకులు మళ్ళీ వచ్చి, అమ్మతో పెళ్లి గురించి మాట్లాడారు. వాడు అంత హీనుడైతే వీళ్లంతా ఎలాంటి వాళ్ళో అని నేను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు. కానీ అమ్మ మాత్రం 'పిల్లవాడు మంచివాడు' అని చెప్తుండేది. నాకైతే నమ్మకం లేకపోయింది. అప్పుడు అమ్మ, "వాడు అలాంటివాడైతే అందరూ అలా ఉంటారా? నిజంగా అబ్బాయి మంచివాడు. దయచేసి పెళ్లికి ఒప్పుకో. నాకేమైనా అయితే నీకు దిక్కెవరు?" అని ఎంతగానో బ్రతిమాలింది. అంతలో ఇంకా మంచి సంబంధం వచ్చింది. కానీ అమ్మ ఇష్టపడలేదు. అప్పుడు నేను బాబాని అడిగి నిర్ణయం తీసుకుందామని చెప్పి బాబాను అడిగాను. బాబా, "లేమివాని ఇంట ఎద్దు మాంసం తినటం కంటే, ప్రేమగల చోట ఆకుకూర భోజనం మేలు" అని సమాధానమిచ్చారు. దాంతో నేను మొదటి సంబంధమే చేసుకోవడానికి ఒప్పుకున్నాను. బాబా దయవల్ల నిజంగా నా భర్త చాలా మంచివాడు. బావకు, బావమరిదికి పోలికే లేదు. నా భర్తది ఉన్నదాంట్లో సర్దుకుపోదామనే మనస్తత్వం. చెడు వ్యసనాలు, చెడు గుణాలు ఏవీ లేవు. నా భర్తతో నేను ఎంతో సంతోషంగా ఉన్నాను.
ఆరోజు నేను, "నాలుగు గోడల మధ్య ఉన్న నన్ను సాయిబాబా ఎలా కాపాడతార"ని అనుకున్నాను. కానీ ఆయన లేని, రాలేని చోటంటూ ఉందా అసలు? నా సాయికి సాధ్యం కానిదంటూ ఉందా? ఎంత హీనమైన మనుషులు? అతనికీ ఒక కూతురు ఉంది. పరాయి ఆడపిల్ల అంటే అంత చిన్నచూపా? 'ప్రతి ఆడపిల్లా నా కూతురుతో సమానం' అనే ఆలోచన కూడా ఉండదా వాళ్ళకు? ఆడపిల్లలను వేధించే ఇటువంటి హీనులను బాబా శిక్షించాలి.
ఎవరన్నారు సాయి లేడని? సర్వకాల సర్వావస్థలందు ఆయన ఉన్నాడు. ఆయన లేని క్షణమంటూ లేదు. కన్నతల్లి కూడా బిడ్డలను కాపాడుకోలేని క్షణంలో సాయి మాత్రమే కాపాడగలడు. సాయి ముందు ఎంతటివారైనా సరే చేష్టలుడిగిపోవాల్సిందే. "సప్త సముద్రాల అవతల ఉన్నా నావారిని కాపాడుతాన"ని చెప్పిన బాబా నన్ను ఎంతలా కాపాడారో చూడండి. ఆపదసమయాలందు తన బిడ్డలకు రక్షణనివ్వడానికి ముందుంటాడు నా సాయి తండ్రి. ఆయన నాపట్ల చూపించిన కరుణను ఏమని చెప్పేది? ఆయన లేకపోతే నేనేమైపోయేదాన్నో! ఇంత చేసిన ఆయనకి ఎలా కృతజ్ఞతలు తెలిపేది? అసలు నాకు అది సాధ్యమేనా? అయినా ఆ తండ్రి అవన్నీ ఏమీ కోరడు. నా సాయికి సాటి ఎవ్వరూ రారు. నా జీవితంలో ఆయన లేకపోతే నేనంటూ లేను.

This comment has been removed by the author.
ReplyDelete🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
ReplyDeleteలీలా మయ.. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్!!
నడిసంద్రం లో ఉన్న తన బిడ్డల ఆర్తనాదం బాబా వారికి వినిపిస్తుంది అనే బాబా సూక్తి కి నిదర్శనం ఇలాంటి లీల.సర్వే జనా సుఖినోభవంతు..సర్వే సుజానా సుఖినోభవంతు.
🙏💐🙏💐🙏💐🙏💐🙏💐
!!ఓం సాయిరాం!!
ఎంత దయామయుడు సాయి🙏🙏
ReplyDeleteఓం సాయిరాం ఓం సాయిరాం హరే హరే కృష్ణ సాయి సాయి రామ్

ఓం సాయిరాం ఓం సాయిరాం హరే హరే కృష్ణ సాయి సాయి రామ్

🙏🙏🙏🙏🙏
DeleteOm Sri Sai Ram thaatha 🙏🙏
ReplyDeleteBhavya sree
Mee experience chaduvutunte kallalo neellu agaledhu.
ReplyDeleteOm Sri Sainathaya Namaha!
Om Sai Ram 🙏🌹🙏
ReplyDeleteఓం సాయిరాం...🌹🙏🌹
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai
ReplyDeleteఈ సాయి లీల నాలోని భక్తిని సాయి మీద నమ్మకాన్ని రెట్టింపు చేసింది అనడంలో సందేహమే లేదు. మీ అనుభవాన్ని మా అందరితో పంచుకున్నందుకు సదా కృతజ్ఞుడను. సాయి రెప్పపాటులో ఏమి జరుగుతుందో కూడా తెలియని స్థితిలో మాకందరికీ మీరే ఆధారం సదా మమ్మల్ని కాపాడమని తెలిసీ తెలియక చేసిన తప్పులను క్షమించమని వేడుకుంటున్నాము
ReplyDelete