ఈ భాగంలో అనుభవాలు:
- దయగల సాయి నా మనోభీష్టాన్ని నెరవేర్చారు
- క్రొత్త ఇంటిని అనుగ్రహించిన బాబా
దయగల సాయి నా మనోభీష్టాన్ని నెరవేర్చారు
ఓం సాయిరాం! నా పేరు కె.శ్రీనివాసరావు. మాది మార్కాపురం. నేనొక సామాన్య సాయిభక్తుడిని. ముందుగా ఈ బ్లాగ్ నిర్వహిస్తున్నవారికి నా ప్రణామాలు. సుమారు 20 సంవత్సరాలుగా నేను బాబా భక్తుడిని. గత రెండు నెలలుగా ఈ బ్లాగులో వస్తున్న అనుభవాలను ప్రతిరోజూ చదువుతున్నాను. భక్తులకు బాబా ఇచ్చిన అనుభవాలు చదువుతుంటే, 'బాబా తన బిడ్డల బాధలు తీరుస్తూ, కోరికలు నెరవేరుస్తూ ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో!' అని అనిపిస్తూ ఉంది. ఇంతమంది భక్తుల అనుభవాలు చూశాక నా అనుభవాన్ని కూడా సాటి సాయిభక్తులతో పంచుకోవాలని అనుకున్నాను.
కొద్దిరోజులుగా మా పాప ఆరోగ్యరీత్యా మానసికవ్యధతో చాలా బాధపడుతోంది. ప్రస్తుత కరోనా పరిస్థితుల కారణంగా ఎక్కడికీ వెళ్ళలేక బాబానే తలచుకొని, ఆయన నామస్మరణ మొదలుపెట్టాము. మా పాప ప్రతిరోజూ ఉదయం, రాత్రి కొంత బాబా ఊదీని నీళ్లలో కలుపుకొని త్రాగుతుండేది. బాబా ఎంతటి దయామయులంటే, అలా 15 రోజులపాటు చేసిన తరువాత ఆయన అనుగ్రహం వల్ల పాప ఆరోగ్యం కుదుటపడింది. మా పాప త్వరగా కోలుకుంటే నా అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకుంటానని అనుకున్నాను. అందుకే తను కోలుకోగానే నేను నా అనుభవాన్ని మీ ముందు ఉంచుతున్నాను. బాబా అనుగ్రహం ఉంటే ఎటువంటి బాధలైనా వెంటనే తొలగిపోతాయని నేను విశ్వసిస్తున్నాను. మనం కేవలం శ్రద్ధ, సబూరితో ఉంటే చాలు, బాబా మనల్ని కరుణిస్తారు. తన బిడ్డలందరినీ ఈ కరోనా బారినుండి కాపాడాలని బాబాను మనసారా కోరుకుంటున్నాను.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!

క్రొత్త ఇంటిని అనుగ్రహించిన బాబా
సాయిభక్తురాలు దీప్తి తమ అనుభవాలను ఇలా పంచుకుంటున్నారు:
ఓం సాయిరాం! నా పేరు దీప్తి. మేము బెంగళూరులో నివాసముంటున్నాము. నేను సాయిభక్తురాలిని. నాకు ఏ సమస్య వచ్చినా బాబాకే చెప్పుకుంటాను. అవి పరిష్కారమైతే ఆయనే తీర్చారని అనుకుంటాను. అంతలా నేను ప్రతిదానికీ బాబా మీదే ఆధారపడతాను. బాబా మాకు చాలా అనుభవాలు ఇచ్చారు. బాబా కృపతో మేము ఒక క్రొత్త ఇల్లు తీసుకున్నాము. ఆ విషయంలో బాబా ఎలా అనుగ్రహించారో నేనిప్పుడు మీకు వివరిస్తాను.
బాబాకి మన ఇష్టాయిష్టాలు తెలుసు. ఆయన ఎప్పుడు ఎలా అనుగ్రహిస్తారో మనం అస్సలు ఊహించలేము. నేను ప్రతి గురువారం బాబా ఆరతికి వెళ్తాను. అలాగే 2019, సెప్టెంబరు 26 గురువారం నేను బాబా ఆరతికి వెళ్ళినప్పుడు అనుకోకుండా నా స్నేహితురాలు కలిసింది. ఆమె ఒక అపార్ట్‌మెంట్ కన్‌స్ట్రక్షన్ పార్టనర్‌గా ఉంది. ఆమె అపార్ట్‌మెంట్ చూడడానికి రమ్మని నన్ను పిలిచింది. సరే, తను రమ్మంటోంది కదా అని నేను తనతో బయలుదేరాను. నేను ఎప్పటినుండో అనుకుంటున్న విధంగా ఆ ప్లాటు ఉండటంతో వెంటనే ఓకే చెప్పేశాను. అక్టోబరు 3, గురువారంనాడు అడ్వాన్స్ ఇచ్చాను. అక్టోబరు 15న అగ్రిమెంట్ కోసం అమౌంట్ చెక్ రూపంలో ఇస్తే, ఆ అమౌంట్ అక్టోబర్ 17 గురువారంనాడు డెబిట్ అయ్యింది. తర్వాత 2020, ఫిబ్రవరి 27 గురువారంనాడు ఇంటీరియర్ వర్క్ స్టార్ట్ అయింది. చివరికి బాబా అనుగ్రహంతో 2020, మార్చి 19 గురువారంనాడు గృహప్రవేశం చేసుకున్నాము. అయితే మార్చి 22 నుండి లాక్‌డౌన్ కారణంగా వుడ్‌వర్క్ ఆగిపోయింది. నేను మార్చి, ఏప్రిల్ రెండు నెలలు బాబా సప్తాహం, ద్వి సప్తాహ స్తవనమంజరి పారాయణ చేశాను. ఏప్రిల్ 30 గురువారంనాడు వుడ్‌వర్క్ చేసేవాళ్ళతో మాట్లాడితే, బాబా దయవల్ల మే ఒకటో తారీకు నుండి వుడ్‌వర్క్ మొదలై మే 23కి పూర్తయింది. మే 25న మేము మా క్రొత్త ఇంటిలోకి షిప్ట్ అయ్యాము. మే 28 గురువారంనాడు క్రొత్త ఇంటిలో అఖండ దీపం పెట్టి, బాబా చరిత్ర, గురుచరిత్ర పారాయణ మొదలుపెట్టాను. ఇదంతా బాబా దయ. నిజానికి నేను ఇల్లు బుక్ చేసిన కొద్దిరోజులకే, అంటే అక్టోబరు 15న మావారి ప్రాజెక్ట్ పూర్తయిపోయింది. ఇప్పుడు మా వారికి ఉద్యోగం లేదు. ఉద్యోగం లేకపోయినా మేము ఒక క్రొత్త ఇంటిని తీసుకోగలిగామంటే బాబా కృపే అందుకు కారణం. ఆయన మేము అప్పటివరకు ఉంటున్న ఇంటిని మంచి ధరకు అమ్ముడుపోయేలా అనుగ్రహించి నేను కోరుకున్న క్రొత్త ఇంటిని మాకు ప్రసాదించారు. ఆయన అడుగడుగునా మా వెంట ఉండి మమ్మల్ని నడిపించారు. ఆయన దయ ఎల్లవేళలా ఇలాగే మా మీద, అందరి మీదా ఉండాలని కోరుకుంటున్నాను.
రెండవ అనుభవం:
మావారికి మే 12వ తేదీ నుండి దగ్గు మొదలైంది. ఈ కరోనా సమయంలో దగ్గు రావడంతో మేము చాలా టెన్షన్ పడ్డాము. డాక్టరుని సంప్రదించి టాబ్లెట్స్ వాడినప్పటికీ దగ్గు తగ్గలేదు. అంతలో మా ఇంటికి రెండు వీధుల అవతల కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిసింది. దాంతో నేను బాగా టెన్షన్ పడి బాబాని ప్రార్థించి, మే 18న కరోనా టెస్ట్ చేయించాను. బాబా కృపవలన మే 21 గురువారంనాడు వచ్చిన రిజల్ట్ నెగటివ్ అని వచ్చింది. మేము చాలా సంతోషంగా సదా మమ్మల్ని కాపాడుతున్న బాబాకి శతకోటి వందనాలు చెప్పుకున్నాము.
మూడవ అనుభవం:
మే 26 మంగళవారం నేను ఐదు మెట్ల మీద నుండి క్రింద పడిపోయాను. అసలే నాది ఆర్టిఫిషియల్ హిప్. అయినప్పటికీ పాదంలో కొద్దిగా వాపురావడం తప్ప ఏమీ కాలేదు. ఒక వారం విశ్రాంతి తీసుకోమని డాక్టర్ చెప్పారు. కేవలం బాబా వల్లే నాకు పెద్ద ప్రమాదం జరగలేదు.
బాబా నాకు ప్రసాదించిన అనుభవాలను అందరితోనూ పంచుకునే సదవకాశం ఇచ్చిన ఈ బ్లాగువారికి ధన్యవాదాలు.
ఓం సాయిరామ్!

🙏ఓం సాయి రామ్ 🙏
ReplyDeleteసాయి బంధువులందరికి సదా సాయినాధుని ఆశీస్సులు ఉండాలని,సాయి పథం లో పయనిస్తూ,సాయి వసుదైక కుటుంబం లో చల్లగా ఉండాలని ఆకాంక్షిస్తూ.
🙏సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై🙏
Om Sai Ram 🙏🌹🙏
ReplyDeleteOm Sri Sai Ram thaatha 🙏🙏
ReplyDeleteBhavya sree
ఓం సాయిరామ్!
ReplyDeleteOm Sri Sai Ram thaatha 🙏🙏
ReplyDeleteBhavya sree..