సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 392వ భాగం


సాయిశరణానంద అనుభవాలు - ఇరవైఆరవ భాగం

నిన్నటి తరువాయిభాగం..... 

స్వప్నంలోని మాటను గురించిన శంక రాగానే దేవుడి కీర్తనలనే కాక దాని ముందు వెనకా గూడా రెండేసి పేజీలు చదివాను. ఆ సమయంలో నేను జ్ఞానేశ్వరిలో చెప్పిన ప్రకారం సిద్ధాసనంలో కూర్చొని ధ్యానం చేసేవాడిని. ఒకరోజు మాయి వేరే ఆసనం చూపించింది. అది పద్మాసనం కాదు. అది స్వస్తికాసనం లేక సహజాసనం. “ఈ ప్రకారంగా నిటారుగా కూర్చోవాలి” అని మాయి చెప్పింది. ఒకటి రెండ్రోజుల తరువాత రాత్రిపూట నేను బాబా దగ్గర కూర్చున్నాను. అప్పుడు బాబా కూడా ఆ ఆసనంలోనే కూర్చొని ఉన్నారు. నేను బాబాకు దగ్గరగా వెళ్ళినప్పుడు ఆయన తాము ప్రతిరోజూ కూర్చొనే ఆసనంలో అంటే కుడికాలు ముందుకు పెట్టి, ఎడమకాలు సగం ముడుచుకుని ఉండేటువంటి ఆసనాన్ని మార్చి రెండు మూడు నిమిషాల వరకూ సహజాసనం వేసుకొని కూర్చున్నారు. బాబా, మాయి కూడా ఒకే ఆసనం నేర్పారు. అందువల్ల నేను కూడా అదే ఆసనంలో కూర్చోవటానికి అలవాటుపడ్డాను.

మాట్లాడుతూ మాట్లాడుతూనే మాయి ధ్యానం చేయటానికి ఈ విధమైన పద్ధతిని నేర్పారు. బయట జగత్తుతో మొదలుపెట్టి బాహ్య జగత్తంతటిలోనూ ఈశ్వరుడు వ్యాపకుడైన భావాన్ని ఉంచుకోవటం చేస్తూ చేస్తూ, ఆ ఈశ్వరుడు తమ అంతఃకరణలో వ్యాపించాడన్న భావం పెట్టుకోవాలి. లేక భగవద్గీత 18వ అధ్యాయం 61వ శ్లోకం “ఈశ్వరస్సర్వ భూతానాం హృద్దేశేర్జున తిష్టతి”లో వర్ణించబడినట్లు మనసులో ఈశ్వరుని గుర్తు చేసుకుంటూ చేసుకుంటూ సర్వత్రా ఆయన్ని వ్యాపింపచేయగల భావన పెట్టుకొని అందులో లీనమైపోవాలి. ఏ విధితోనైనా సరే ఈశ్వరునితో లీనమైపోయి జగత్తునూ, మననీ కూడా మరిచిపోవాలి.

ఒకరోజు బాబా నాకు పచ్చి జామకాయనిచ్చి, “తీసుకో, ఇది చాలా తియ్యగా ఉంది” అన్నారు. ఈ మాటతో - ఈ విధంగా ధ్యానం గురించి బాబా చెప్పిన పద్ధతి యొక్క వర్ణనను శ్రీపరమానందభారతి రచించిన 'లైట్ ఆన్ లైఫ్'లో చదవవచ్చు. దానితోటి మాయి మాటలను కూడా కలుపుకుని నేను ధ్యానం చేయటానికి నిశ్చయించుకున్నాను. ఈ మధ్యకాలంలో స్వప్నంలో బాబా నాతో, “టీ మానేసెయ్, కాఫీ కూడా త్రాగొద్దు” అన్నారు. అందువల్ల నేను టీ త్రాగటం మానేశాను.

రాధాకృష్ణమాయి వద్ద ఒక కాలు ముడుచుకుని ఉన్న శ్రీకృష్ణుని ఇత్తడి విగ్రహం ఉండేది. ఆమె ఎప్పుడూ ఆ విగ్రహాన్ని వదిలి ఉండేది కాదు. భోజన సమయంలో ఆమె ప్రతి ఒక్క ముద్దనూ ఆ ప్రతిమ పెదవులదాకా తీసుకెళ్ళి ప్రసాద రూపంగా భోజనాన్ని స్వీకరించేది. అది చూసి నాకు, "అలాంటి ప్రతిమ నాకూ ఒకటి దొరికితే బాగుండు”ననిపించింది.

చాలారోజుల వరకూ ఈ మాట నా మనసులో మెదులుతూ ఉండేది. అయితే నా నియమానుసారం ఈ మాటను పెదవులదాకా తెచ్చేవాణ్ణి కాదు. నా మననులో మాటను గ్రహించి మాయి, “నీకిలాంటి ప్రతిమ ఆవశ్యకతేమీ లేదు. నీకు బాబా తన ఫోటో ఇచ్చారు కదా” అన్నది. మాయి దగ్గర చాలావరకు నేను మౌనంగా ఉండేవాణ్ణి. ఇతరులు మాట్లాడటం ఈవిడకు ఇష్టం ఉండేది కాదు. ఎన్నో ధార్మిక విషయాలపైనా, తమ స్వంత విషయాల్లోనూ ఎవరైనా తమ స్వంత జ్ఞానాన్ని ప్రదర్శించినట్లైతే వెంటనే ఆమె వారి నోరుమూయించేది. అందువల్ల నేను కూడా నా మననులో మాటను ఆమె ముందు చెప్పేవాణ్ణికాదు. బాబాకిది నచ్చలేదు. ఒకసారి ఆయన, “అరే! నేన్నిన్ను అక్కడకు పంపించాను. అక్కడ కూడా నీవు మట్లాట్టం లేదు. అదేం పద్ధతి?” అన్నారు. కానీ ఆవిడ పద్ధతిని చూసి నా స్వభావరీత్యా నేనక్కడ మౌనంగా ఉంటుండేవాణ్ణి.

తరువాయి భాగం రేపు ......

source: "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

6 comments:

  1. Om Sai
    Sri Sai
    Jaya Jaya Sai
    🙏🙏🙏

    ReplyDelete
  2. om sai ram nice experiences.very intrust blog.every day i read this blog.om sai ram om saimaa.bless our familyand be with us

    ReplyDelete
  3. 🙏🌹 ఓం శ్రీ సాయిరాం తాతయ్య 🌹🙏

    ReplyDelete
  4. Om Sri Sai Ram thaatha 🙏..
    Bhavya sree

    ReplyDelete
  5. ఓం సాయిరాం...,,🌹🙏🌹

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo