ఈ భాగంలో అనుభవాలు:
- బాబా దయతో నొప్పి పోయింది
- బాబా తన భక్తుల వెన్నంటి వుంటారు
బాబా దయతో నొప్పి పోయింది
సాయిభక్తురాలు శ్రీమతి ఇందిర తన అనుభవాన్ని పంచుకుంటున్నారు.
ఓం శ్రీ సాయిరాం! ముందుగా ఈ బ్లాగుకు, దీని రూపకర్తలకు నా అభినందనలు. ఈ బ్లాగులోని అనుభవాలను చదవకుండా నాకు రోజు పూర్తి కాదు. కొన్ని అనుభవాలు కంటతడి పెట్టిస్తే, కొన్ని నాకు ధైర్యాన్నిచ్చాయి.
నా అనుభవానికి వస్తే.. నా పేరు ఇందిర. నేను బాబాకు సామాన్య భక్తురాలిని. నా కష్టం, సుఖం రెండూ బాబా దయగా భావిస్తాను. ఈమధ్య మా అత్తగారి కుడికాలు బాగా వాచి నడవలేని పరిస్థితి వచ్చింది. మందులు వాడినా ఫలితం లేకపోయింది. ఆమె బాధని చూసి నాకు భయమేసింది. అప్పుడు నేను, "బాబా! మా అత్తగారి కాలినొప్పి తగ్గితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. మరుసటిరోజు ఉదయాన్నే చూస్తే వాపు కొంత తగ్గింది. మూడురోజులకి వాపు పూర్తిగా తగ్గి కాలు మామూలు స్థితికి వచ్చింది. నాకు చాలా సంతోషమేసింది. బాబాకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకున్నాను.

బాబా తన భక్తుల వెన్నంటి వుంటారు
హైదరాబాదు నుండి ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
ఒక సాయిభక్తురాలిగా బాబా నాకు ప్రసాదించిన అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను.
నాకు వివాహం కాకముందు సాయిబాబా అంటే పెద్దగా తెలియదు. బాబా నన్ను తమ భక్తురాలిగా ఎందుకు ఎంచుకున్నారో తెలియదుగానీ అది నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే, ఎక్కడో మారుమూల ప్రాంతంలో పుట్టిన నాకు పెద్దగా చదువుకునే అవకాశంలేక పదవతరగతితోనే చదువు ఆపేశాను. మాకు పెద్దగా ఆస్తులు లేకపోయినా బాబా నా కొరకు తన భక్తుడిని నా భర్తగా ఎంపిక చేసి, అదృశ్యంగా తానుండి మా పెళ్లి ఘనంగా జరిగేలా చూశారు. నా భర్త మంచి బాబా భక్తుడు కావటం వల్ల నేనూ బాబా గురించి ఆలోచించేలా చేశారు. బాబా దయవల్ల నా చెల్లెలి వివాహం కూడా మావారి ద్వారానే వాళ్ళ బాబాయి కొడుక్కి ఇచ్చి చేశాము, వాళ్ళూ జీవితంలో బాగానే స్థిరపడ్డారు. నేను ఒక అడుగు వేస్తే బాబా నాకోసం వంద అడుగులు దిగివచ్చి నన్ను 100% బాబా భక్తురాలిగా మార్చేశారు.
కానీ నా తమ్ముడి విషయంలో బాబా కొన్ని పరీక్షలు పెట్టారు. అయినా చివరకు బాబా చేసిన మేలుతో మేమంతా సంతోషంతో బాబా లీలను ఇప్పటికీ తలచుకుంటున్నాము. అదేమిటంటే... నాకు ఒక తమ్ముడు, వాడు పెద్దగా చదువుకోలేదు, మా అమ్మావాళ్ళకి ఉన్న కొద్ది పొలంలో వ్యవసాయం చేస్తూ ఉండేవాడు. కాలం కలిసిరాక వ్యవసాయంలో అన్ని నష్టాలే. అప్పులు పెరిగిపోయాయి. దాంతో ఉన్న కొద్ది పొలాన్ని కూడా అమ్మి అప్పులు తీర్చేశారు. ఒక్కసారిగా వారి జీవితం అగమ్యగోచరంగా తయారైంది. మా అమ్మానాన్నలు నా తమ్ముడి గురించి బాగా దిగులుపడుతుండేవారు. నేను తరచూ వాళ్ళకి ఫోన్ చేసి, "బాబా వున్నారు, ఏమీ భయపడవద్దు" అని ధైర్యం చెప్పేదాన్ని. వాళ్ల మంచికోసం బాబాని ప్రతిరోజూ వేడుకునేదాన్ని. కానీ కొన్ని కర్మలు ప్రారబ్ధం ప్రకారం జరగాల్సి ఉంటుంది, జరిగిపోతాయి. కానీ బాబా ఎంతో దయతో మనపై వాటి తీవ్రతను తగ్గిస్తారు.
నా తమ్ముడు పెద్దగా చదువుకోకపోవటం వల్ల మరియు ఆస్తిపాస్తులు లేకపోవటం వల్ల తనకు పెళ్ళి కావటం ఆలస్యమైంది. ఇంతలో ఒక సంబంధం వచ్చింది. పూర్తిగా నచ్చకపోయినా, వాడు ఉన్న పరిస్థితిని ఆలోచించి ఏదో ఒకటిలే అని సరిపెట్టుకుని పెళ్లి చేశాము. కానీ వారి భావాలు కలవలేదు. దాంతో వారికి ఒక బాబు పుట్టాక వాళ్ళిద్దరూ విడిపోవలసి వచ్చింది. మళ్ళీ కథ మొదటికి వచ్చింది. మా అమ్మానాన్నలు ఆర్థికంగా చాలా ఇబ్బందికి గురయ్యారు. మానసికంగా చాలా బాధపడేవారు. వారికి ఏదోలా దారిచూపమని నేను బాబాని రోజూ ప్రార్థించేదాన్ని. బాబా ఏదో ఒకరోజు మన మొర అలకిస్తారు, సహాయం చేస్తారు అని ఆశతో ఎదురుచూసేదాన్ని. ఇంతలో మావారు తను పనిచేసే కంపెనీలోనే మా తమ్ముడికి ఒక ఉద్యోగం ఇప్పించారు. దానితో మా తమ్ముడు మా ఊరు విడిచి వచ్చి సంతోషంగా ఉద్యోగం చేస్తూ ఆ ఉద్యోగానికి కావలసిన చదువులు కూడా దూరవిద్య ద్వారా పూర్తిచేసి జీవితంలో స్థిరపడ్డాడు. ఇంతలో తనకు మంచి సంబంధం వచ్చింది. ఆనందంగా తనకు పెళ్లి చేశాము. బాబా వారిని ఒక పాప, ఒక బాబుతో ఆశీర్వదించారు. రెండు సంవత్సరాల వ్యవధిలో అన్నీ చకచకా జరిగిపోయాయి. మా అమ్మానాన్నలు గతంలో వాళ్ళు పడిన ఇబ్బందులు, బాధలు ఏవీ ఇప్పుడు మచ్చుకు కూడా గుర్తుకు రాకుండా ఆనందంగా జీవితాన్ని సాగిస్తున్నారు. బాబా చేసిన సహాయం, చూపిన కృప ఎప్పటికీ మరువలేము. అందుకే ప్రతి ఒక్కరికీ నా విజ్ఞప్తి - బాబా ఒక కల్పవృక్షం, నమ్మినవారికి కొంగుబంగారం. చిన్న చిన్న బాధలకు, ఇబ్బందులకు కృంగిపోవద్దు. శ్రద్ధ సహనాలతో బాబా పాదాలు పట్టుకోండి, మీ భవిష్యత్తు అనే నావను బాబాకు వదిలేయండి, వారు దాన్ని సురక్షితంగా తీరానికి చేరుస్తారు. ఇది నిజం.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!
మీ
సాయిభక్తురాలు

*******(🙏🙏🙏)*******
ReplyDelete======================
🛕🛕🛕🛕🌷🙏🌷🛕🛕🛕🛕
~~~~~~~~~~~~~~~~~~~~~~
ఓం సాయిరాం! ఓం సాయిరాం!!
💐🌹💐🙏🙏🙏🌹💐🌹🌷🌷💐
ఓం సాయిరాం! ఓం సాయిరాం!!
🌷💐🌷💐🌷💐🌷💐🌷💐💐💐
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
ఓం సాయిరామ్...🌹🙏🌹
ReplyDeleteOm Sai Ram 🙏🌹🙏
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai
ReplyDeleteOm Sri Sai Ram thaatha 🙏🙏
ReplyDeleteBhavya sree
Om sri sai ram🙏🙏🙏🙏🙏
ReplyDelete