సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 2075వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. 'నేను ఉండగా ఎందుకు భయపడుతున్నావు?'
2. అడిగినంతనే గొడవ సద్దుమణిగేలా అనుగ్రహించిన బాబా
3. బాబా దయ ఉంటే అనుకున్నవన్నీ జరుగుతాయి


అడిగినంతనే గొడవ సద్దుమణిగేలా అనుగ్రహించిన బాబా

సాయి బంధువులందరికీ నమస్కారం. నేను సాయి భక్తురాలిని. పెళ్లయ్యాక నాకు, నా భర్తకి మధ్య ఎప్పుడు ఏ సమస్య వచ్చినా 10 రోజులకి మించి ఎప్పుడూ మాట్లాడుకోకుండా ఉండక ఇద్దరిలో ఎవరో ఒకరం మాట్లాడి గొడవని ఆపేసేవాళ్ళము. అయితే ఇటీవల ఒకసారి జరిగిన గొడవలో నాకు నా భర్త ప్రవర్తన అస్సలు నచ్చలేదు. నేను కోపంలో కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత విషయం ప్రస్తావించి నా భర్తని ప్రశ్నించాను. దాన్ని ఆయన చాలా సీరియస్‌గా తీసుకున్నారు. అందువల్ల నేను అలా మాట్లాడటంలో నా తప్పు లేకపోయినప్పటికీ మేము ఒక నెల మాట్లాడుకోలేదు. అప్పుడు నాకెందుకో ఇది కరెక్ట్ కాదనిపించి బాబాని తలుచుకుని, "వచ్చే గురువారం లోపు నా భర్త మారి ఈ గొడవ ఇక్కడితో సమసిపోవాలి" అని అనుకొని శిరిడీ నుండి తెచ్చిన ఊదీ నీళ్ళలో కలుపుకొని తాగాను. తర్వాత నా భర్త, "ఈ సమస్యని ఇక్కడితో ఆపేసి నేను ఇంతకు ముందులా మామూలుగా ఉండాలనుకుంటున్నాను" అని మెసేజ్ చేసారు. నేను ఆ మెసేజ్ చూసి, 'వాళ్ల అమ్మ ఏమైనా నచ్చజెప్పరేమో అనుకున్నాను'. కానీ తర్వాత తెలిసింది, 'వాళ్ల అమ్మ ఆశలు ఏం చెప్పలేదు, తనే మారారు' అని. అంతేకాదు, తను మెసేజ్ చేసింది గురువారం నాడు అని తెలిసి షాకయ్యాను. "ధన్యవాదాలు బాబా. మీకు కాకడ ఆరతి ఇవ్వాలని 2 సంవత్సరాల నుండి అనుకుంటున్నాను. కానీ నా వల్ల అస్సలు అవ్వట్లేదు. అది జరిగేలా నువ్వే చూడు బాబా. ఇంట్లో నిన్ను వదిలి నాకు ఎక్కడికీ వెళ్ళనిలేదు. దయచేసి ఎక్కడికీ పంపించకు బాబా. రోజూ మిమ్మల్ని శుభ్రం చేసి, మీకు రోజూ 4 అరతులిచ్చి, మంచిగా పూజ చేసి, తిండి పెట్టి సచ్చరిత్ర పారాయణ చేయాలని ఉంది. దానికే నా జీవితంలో మొదటి ప్రాధాన్యత. ఆ రోజులు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నాను బాబా. తొందరగా అనుగ్రహించండి బాబా".


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo