శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ - సబూరి
ఓం సాయిరామ్.
నా పేరు భాను. నేను నిజామాబాద్ నివాసిని. నేను బి.ఇ.డి. చదివేటప్పుడు బాబా నాకు చేసిన సహాయానికి సంబంధించిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను.
నాకు తెలంగాణా యూనివర్సిటీలో బి.ఇ.డి. సీట్ థర్డ్ కౌన్సిలింగ్ లో వచ్చింది. సంవత్సరానికి 16,500 రూపాయల చొప్పున రెండు సంవత్సరాలకు 32,000 రూపాయల ఫీజు కట్టాలి. మాది కాస్త మధ్యతరగతి కుటుంబం కాబట్టి అంత ఫీజు కట్టడమన్నది మాకు ఇబ్బందికరమైన విషయం. మాములుగా అయితే నాకు స్కాలర్ షిప్ వచ్చేది కానీ, థర్డ్ కౌన్సిలింగ్ లో సీట్ వచ్చినందువలన స్కాలర్ షిప్ కూడా రాదు. కష్టపడి మొదటి సంవత్సరానికి ఎలాగో 16,500 రూపాయలు కట్టినా, రెండో సంవత్సరం ఎలా కట్టాలని చాలా బాధపడి బాబాకు చెప్పుకున్నాను. అంతలో ఒక అన్నయ్య ఫోన్ చేసి, "HDFC బ్యాంకు వాళ్ళు పేపర్ లో యాడ్ ఇచ్చారు, దానికి అప్లై చేసుకో" అని చెప్పాడు. అది ఖచ్చితంగా బాబా దయే. సమయానికి నాకు మార్గం చూపించారు. వెంటనే దానికి అప్లై చేశాను. కానీ వాళ్ళు స్కాలర్ షిప్ స్టడీస్ లో వచ్చిన మార్కులను బట్టి ఇస్తారు. చదువులో ముందుండి, చదవడానికి స్తోమత లేని వాళ్లకు మాత్రమే ఇస్తారు. నాకేమో డిగ్రీలో అంతంతమాత్రమే మార్కులు వచ్చాయి. మన దేశంలో అన్ని ప్రాంతాల నుండి దానికి అప్లై చేసారు. మా కాలేజీ నుండి కూడా చాలామంది అప్లై చేశారు. అందులో నేను కూడా ఒకదాన్ని. ఈ క్లిష్ట పరిస్థితులలో స్కాలర్ షిప్ వస్తే 2000 రూపాయలు బాబాకి సమర్పిస్తానని మొక్కుకున్నాను.
కొన్నిరోజులు గడిచిన తరువాత హఠాత్తుగా ఒకరోజు స్కాలర్ షిప్ కి నేను ఎంపికయ్యానని మెసేజ్ వచ్చింది. అది చూసి నేను ఆనందాశ్చర్యాలకు లోనయ్యాను. తరువాత ఢిల్లీ నుండి HDFC బ్యాంకు వాళ్ళు ఫోన్ చేసి కూడా ఈ విషయాన్ని నిర్ధారించారు. ఆ లిస్ట్ లో ఎంపికైన వాళ్లలో తెలంగాణాకి చెందినదాన్ని నేనొక్కదాన్నే. నా పేరుకు ముందు, తరువాత ఉన్న వాళ్ళు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకి చెందినవారు. బాబా దయవల్ల నాకు డిగ్రీలో మార్కులు సరిగా రాకున్నా నేను స్కాలర్ షిప్ కి సెలెక్ట్ అయ్యాను. పది రోజుల తరువాత నిజామాబాద్ HDFC వాళ్ళు ఫోన్ చేసి, "25,000 రూపాయలు మీ పేరు మీద వచ్చాయి, వచ్చి చెక్ తీసుకుని వెళ్లండ"ని చెప్పారు. వెంటనే నేను బ్యాంకుకి వెళ్లి చెక్ తెచ్చుకొని బాబా మొక్కు తీర్చుకున్నాను. బాబాకు చేయలేనిదంటూ ఏదీ లేదు. ఆయన తన భక్తుల శ్రేయస్సు కోసం ఏదైనా చేస్తారు. చాలా చాలా కృతజ్ఞతలు బాబా.
🕉 సాయి రామ్
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
'ఓం శ్రీసాయి అసహాయ సహాయాయ నమః'
ReplyDeleteసాయి నా తమ్ముడు చాల కష్టకాలంలో ఉన్నాడు.
మాకు మీరు తప్ప పెద్ద దిక్కు లేదు
దారి చూపించు తండ్రి.
'ఓం శ్రీసాయి అసహాయ సహాయాయ నమః'
ReplyDelete