సాయి బంధువులందరికీ ఓం సాయిరామ్. నేను దుబాయ్ నుండి లత రామచంద్రన్. నేను మహాపారాయణ (MP-77, ఎల్లో హౌస్) గ్రూపులో సభ్యురాలిని. 2018లో నేను మహాపారాయణలో భాగంగా సచ్చరిత్ర చదివిన కొన్నిరోజులకు నాకు కలిగిన అనుభవాన్ని దిగువ తెలియజేస్తున్నాను.
"దేవుడెక్కడో లేడు, భక్తి భావంతో చూస్తే దేవుడు అణువణువునా ఉన్నాడని తెలుసుకుంటావ"ని ఎందరో మహాత్ములు చెప్పారు. ఇదే అనుభవం నాకు జరిగింది. నేను చాలా సంవత్సరాల నుండి సాయిబాబా భక్తురాలిని. నేను పుణేలో పుట్టి, పెరిగాను. పవిత్రమైన శిరిడి మాకు కొన్ని గంటల దూరంలోనే ఉంది. బాబా యందు భక్తి, ఆయన కథలయందు ఆసక్తి, ఆయనను సేవించడం అన్నీ ఆ సమయంలోనే నాలో మొదలయ్యాయి. నేను చాలాసార్లు తన ఉనికిని చూపించమని బాబాను అడిగాను. ఆయన కూడా అప్పుడప్పుడు అనుకోకుండా ఎదురుపడిన వ్యక్తులు లేదా ఫోటోలు లేదా ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు చివరి నిమిషంలో ఊహించని వ్యక్తి రూపంలో సహాయం అందించడం ఇలా అనేక విధాలుగా తన ఉనికిని నాకు తెలియజేసారు.
కానీ, ఒక నెల నుండి నేను సాయి సచ్చరిత్ర చదువుతున్నప్పటికీ, శ్రద్ధగా పూజలు చేస్తున్నప్పటికీ ఆయన ఉనికిని తెలియజేసే ఎటువంటి అనుభూతి కలగలేదు. ఆయన నుండి అటువంటి సంకేతాల కోసం ఎదురు చూసి అనేకసార్లు నేను నిరాశ చెందాను. ఇక బాధను తట్టుకోలేక బాబా ముందు కూర్చొని "బాబా! మీరు నాతో ఉన్నారని చూపించండి, నేనింకా నిరీక్షించలేను నాపై దయ చూపి నాకు అనుభవాన్ని ప్రసాదించండ"ని సాయిని దృఢంగా ప్రార్ధించాను. బాబా నా ప్రార్థన విన్నారు. బహుశా నా కన్నీళ్లు చూసి ఆయన కరిగిపోయారు. మాఇంటిలోనే అద్భుతం చూపించారు బాబా. అదేరోజు మా ఇంటిలో ఉన్న రాక్ సాల్ట్ లైట్ మీద బాబా దర్శనమిచ్చారు. అది చూసి భావోద్వేగంతో నా కళ్ళు ఆనంద భాష్పాలతో నిండిపోయాయి. ఈ అనుభవం ద్వారా "శ్రద్ధ - సబూరి" నేర్చుకున్నాను. బాబాను ఏదైనా విశ్వాసంతో అడిగి ఆయన అనుగ్రహించేవరకు సహనంతో వేచి ఉండాలని తెలుసుకున్నాను. ఫోటో క్రింద ఇస్తున్నాను మీరు కూడా చూసి ఆనందించండి.
wonderful leela.
ReplyDeleteయద్భావం తద్భవతి... భగవంతుడు విరాట్ స్వరూపం సర్వవ్యాపకం మానవ మేధస్సుకు అంత సులభంగా గోచరం కాదు. సాయి లీలలు అద్భుతం తన భక్తులకు కోరిన వెంటనే ప్రత్యక్షంగా తన లీలల ద్వారా ఉనికిని చాటిస్తూ ఉంటారు. సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై, 🙏🙏🙏🙏
ReplyDelete