సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1911వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఎప్పుడూ వెన్నంటే ఉండే బాబా
2. చిన్నచిన్న విషయాలే అయినా తోడుగా తామున్నామన్న సంపూర్ణ విశ్వాసాన్నిస్తున్న బాబా

ఎప్పుడూ వెన్నంటే ఉండే బాబా 

నా పేరు జ్యోతిర్మయి. మాది నెల్లూరు. మాకు కారు ఉంది. దాని ఇన్సూరెన్స్ అయిపోయి ఒక సంవత్సరం అయింది. ఆర్థిక సమస్యల వల్ల చేయించలేదు. మావారు కారుని ట్రావెల్స్ కి తిప్పుతారు. అందులో భాగంగా తరచూ చెన్నై వెళ్తుంటారు. చెన్నైలో ఎక్కడో ఒక చోట  ఏపీ వాహనాలు చెక్ చేస్తుంటారు. మావారు 4, 5 సార్లు ఇన్సూరెన్స్ లేని కారణంగా జరిమానా కట్టారు. అందువల్ల చెన్నైకి వెళ్లాలంటేనే ఎక్కడ పోలీసులు ఆపుతారో అని భయమేసేది. మావారు వచ్చిన డబ్బులు పోలీసులకి ఇచ్చేస్తే మనకు ఇంకేమి మిగులుతాయి, ఇన్సూరెన్స్ చేయించుకోవాలి అంటుండేవాడు. కానీ అందుకు కావాల్సిన డబ్బులు ఉండేవి కావు. చివరికి 2024, ఆగస్టు 21న మావారు అప్పు చేసి అయినా ఇన్సూరెన్స్ చేయించుకోవాలి, పోలీసులు బాగా ఆపుతున్నారని అన్నారు. నేను, "అప్పు చేయడం ఏం వద్దు. బాబా దయవల్ల ఏం కాదు. మీరు నా బాబాని నమ్మండి. ఏం కాదు" అని చెప్పాను. అదేరోజు మర్నాడు అంటే ఆగస్టు 22న చెన్నై వెళ్లేందుకు బాడుగ వచ్చింది. ఆ రాత్రంతా మావారికి నిద్రలేదు. ఒకటే టెన్షన్ పడ్డారు. నేను, "ఏం కాదులే బాబా చూసుకుంటార"ని ధైర్యం చెప్పాను. ఉదయం 5 గంటలకి మావారు ఇంటి నుంచి బయలుదేరుతుంటే నేను, "బాబాని తలచుకోమ"ని చెప్పాను. అప్పుడు మావారు బాబాకి దణ్ణం పెట్టుకొని వెళ్లారు. ఆయన వెళ్లిన తరువాత నేను, "బాబా! మా కారుని ఏ పోలీసులు ఆపకూడదు" అని బాబాతో చెప్పుకున్నాను. బాబా దయవల్ల పోలీసులు ఆపలేదు. మొదటిసారి జరిమానా కట్టకుండా మావారు ఇంటికి వచ్చారు. ఇదంతా బాబా దయ కాకపోతే ఇంకా ఏంటి? "ధన్యవాదాలు బాబా. మేము 7 సీటర్ కారు కొనాలనుకుంటున్నాం. మీరే మా కోరిక తీర్చాలి బాబా".

చిన్నచిన్న విషయాలే అయినా తోడుగా తామున్నామన్న సంపూర్ణ విశ్వాసాన్నిస్తున్న బాబా

ఓం శ్రీసాయినాథాయ నమః. సాయి బంధువులందరికీ నా నమస్కారములు. నా పేరు విజయ. మాది కాకినాడ. బాబా నాతోనే ఉన్నారు. కంటికి కనిపించకపోయినా పరిస్థితులు అనుకూలంగా మారుస్తూ తమ ఉనికిని తెలియజేస్తున్నారు. ఒకసారి నేను స్టావ్ మీద ఇడ్లీలు పెట్టి, అవి ఉడుకుతున్నప్పుడు వచ్చే ఆవిరి బయటకు పోవడానికి చిమ్నీ ఆన్ చేశాను. మధ్యలో కరెంటు పోయి చిమ్నీ ఆగిపోయింది. అప్పుడు నేను ఒకసారి బాబాకేసి చూసి, "ఇలా అయ్యిందేంటి?" అనుకున్నాను. మరుక్షణం కరెంట్ వచ్చి చిమ్ని ఆన్ అయింది.

2024, ఆగస్టు 21న నాకు చాలా తలనొప్పి వచ్చింది. సమయానికి నాకు కావాల్సిన టాబ్లెట్ లేదు, వేరేది ఉంది. అది తలనొప్పికి సంబంధించిందేగాని నాకు అన్ని టాబ్లెట్లు పడవు, అలర్జీ వస్తుంది. అందుకని నేను ఆ టాబ్లెట్ వేసుకోలేదు. అసలు ఏ టాబ్లెటూ వేసుకోలేదు. "తలనొప్పి తగ్గించమ"ని బాబానే అడిగి అలాగే నిద్రపోయాను. పొద్దున్న లేచేసరికి.నాకు తలనొప్పి లేదు. ఇలా ఎప్పుడూ జరగలేదు. అసలు టాబ్లెట్ వేయకుండా నాకు తలనొప్పి తగ్గడం అనేది నా జీవితంలో లేదు. ఒక్కోసారి రెండు టాబ్లెట్లు కూడా వేసుకోవాల్సి వచ్చేది. అలాంటిది ఏ టాబ్లెటూ వేసుకోకపోయినా నాకు బాధ తగ్గడం బాబా చేసిన మిరాకిల్‌గా భావిస్తున్నాను.

సంవత్సరం క్రితం వరకు నేను బాబా లైవ్ హారతి చూసేదాన్ని కాదు. విన్నా నాకు అర్థమయ్యేది కాదు. అలాంటిది శిరిడీ వెళ్లొచ్చినప్పటి నుండి నాకు వీలు కుదిరినప్పుడల్లా అవకాశాన్ని బట్టి రోజులో రెండు, మూడుసార్లు బాబా లైవ్ హారతి పెట్టుకొని పుస్తకం చూస్తూ హారతి పాడటం మొదలుపెట్టాను. ఇప్పుడు అవి దాదాపుగా నా నోటికి వచ్చాయి. ఒకరోజు పొద్దున్న మా అమ్మాయితో మాట్లాడుతూ మధ్యాహ్న హారతి మర్చిపోకుండా పెట్టుకొని వినాలనుకున్నాను. మా అమ్మాయితో మాట్లాడటం అయిపోయాక పాటలు పెట్టుకొని వినసాగాను. నేను ప్రతిరోజు బాబాకి సంబంధించిన హిందీ పాటలు పెట్టుకొని వింటూ పని చేసుకుంటాను. అవి వరుసగా ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. ఆరోజు కూడా పాటలు పెట్టుకొని ఏదో పని చేసుకుంటున్న నేను టైమ్.చూసుకోలేదు. అందువల్ల 12:00 దాటిపోయినా నేను లైవ్ హారతి పెట్టుకోలేదు. అయితే సరిగా లైవ్‌లో హారతి మొదలయ్యే సమయానికి అద్భుతం జరిగింది. హఠాత్తుగా తరువాత పాట రావడం ఆగిపోయి మధ్యాహ్న హారతి వచ్చేసింది(అంటే లైవ్ కాదు. వినడానికి మాత్రమే). అసలు అలా ఎప్పుడూ జరగలేదు. ఒక పాట తర్వాత మరొక పాట రావడం తప్ప పాటల మధ్యలో హారతి ఎప్పుడూ రాలేదు. మొదటిసారి అలా జరిగింది. హారతి రావడం 12 గంటలకు ముందు రావచ్చు, 12.30 తర్వాత కూడా రావచ్చు. కానీ శిరిడీలో హారతి ఇచ్చే సమయానికే నేను మధ్యాహ్న హారతి వినడం జరిగింది. అంతేకాక, బాబాకు ఉదయం హారతి, మధ్యాహ్న హారతి, సాయంత్రం హారతి, శేజ్ హారతి అని నాలుగు హారతులు ఉంటాయి. మధ్యాహ్న హారతి కాకుండా మిగిలిన మూడు హారతులలో ఏదైనా రావచ్చు. కానీ మధ్యాహ్న హారతి మాత్రమే నేను వినేలా బాబా ఏర్పాటు చేశారు. నేను చాలా ఆశ్చర్యపోయాను. పని చేసుకుంటూనే హారతి వింటూ కొంచెం గొంతు కూడా కలిపాను. బాబా నా మనసెరిగి నేను ప్రత్యేకంగా లైవ్ హారతి పెట్టుకోకపోయినా మధ్యాహ్న హారతి వినిపించారు. ఇవి చిన్నచిన్న విషయాలే కావచ్చు కానీ నాకు సంతోషాన్ని, ధైర్యాన్ని, భరోసాని, బాబా నాతో ఉన్నారన్న సంపూర్ణ విశ్వాసాన్ని ఇస్తున్నాయి. "అన్నింటికీ అనేక కృతజ్ఞతలు, నమస్కారాలు బాబా".

16 comments:

  1. Baba u r there always yes I can feel ur presence every where. Be with me forever. I love you Baba. Om Sairam!!!

    ReplyDelete
  2. Om Sai Ram please 🙏🙏🙏 bless my family.you give them full aayush.Be with us

    ReplyDelete
  3. Baba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu vadini bless cheyandi house construction complete cheyandi pl manchi varini rent ki pampandi

    ReplyDelete
  4. ఓం సాయిరామ్

    ReplyDelete
  5. Anta bagunde la chayandi baba please.

    ReplyDelete
  6. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  7. Baba, provide peace and wellness to my parents 💐💐💐💐

    ReplyDelete
  8. Om Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏

    ReplyDelete
  9. I am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings on our family forever 🙏🙏💐💐

    ReplyDelete
  10. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  11. Omsaisri Sai Jai Jai Sai kapadu Tandri omsairamRaksha Raksha

    ReplyDelete
  12. ఓమ్ శ్రీ సాయిరామ్..
    🌹🙏🙏🙏🌹

    ReplyDelete
  13. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  14. Om Sri Sai Raksha🙏🙏🙏

    ReplyDelete
  15. baba, maa sai madava bharam antha meede baba

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo