ఈ భాగంలో అనుభవాలు:
1. బాబా చేసిన సహాయం
2. బాబా ఆశీస్సులు
బాబా చేసిన సహాయం
సాయిభక్తులందరికీ నమస్కారం. నా పేరు అనూష. బాబా కృపాకటాక్షాలు అందరి మీద ఎప్పుడూ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఎక్కడెక్కడో భక్తులకు జరిగిన అనుభవాలను ఎందరో భక్తులకు చేరుస్తూ కష్టాల్లో ఎవరు తోడున్నా, లేకపోయినా బాబా ఉన్నారని నమ్మకాన్ని కలిగిస్తున్న ఈ బ్లాగుకు చాలా కృతఙ్ఞతలు. ఇక నా అనుభవానికి వస్తే.. ఒకసారి నేను వైద్య పరీక్షలు చేయించుకుంటే హిమోగ్లోబిన్ శాతం చాలా తక్కువ ఉందని వచ్చింది. డాక్టర్ అది చూసి, అసలెందుకు రక్తం తగ్గుతుందో తెలుసుకోవడానికి చాలా పరీక్షలు వ్రాసారు. దానిలో థైరాయిడ్ పరీక్ష కూడా ఉంది. అది చూసి, 'నేను ఈమధ్య ఏ డైట్ నియమాలు పాటించకుండానే చాలా బరువు తగ్గాను. నాకు థైరాయిడ్ ఉందేమో! అందువల్లే బరువు తగ్గనేమో!' అని నాకు చాలా భయమేసింది. అదీకాక నేను బాగా బలహీనమైపోయానని, రక్తం తక్కువగా ఉందని చాలా ఫీల్ అయిన నా నాన్న ఇప్పుడు నాకు థైరాయిడ్ కూడా ఉందంటే చాలా బాధపడతారనిపించింది. అందువల్ల నేను వెంటనే, "ఎలా అయినా థైరాయిడ్ లేకుండా చూడండి బాబా" అని బాబాను ప్రార్థించాను. తర్వాత నేను హాస్పిటల్‌కి వెళ్లి రిపోర్టులు తీసుకున్నాను. అప్పుడు బాబా మెసేజ్ కోసం చూస్తే, 'నీకు అనుకూలంగా రిజల్ట్ వస్తుంద'ని ఇచ్చారు. తర్వాత రిపోర్టులు తీసుకొని డాక్టర్ దగ్గరకి వెళ్తూ టెన్షన్ వల్ల రిపోర్టు చూశాను. అందులో నా థైరాయిడ్ లెవెల్ 0.7 అని, 0.4 నుండి 5 అయితే నార్మల్ అని ఉంది. అయితే నేను కంగారులో 0.7ని 7 అనుకొని నాకు థైరాయిడ్ ఉందని బాధపడ్డాను. తర్వాత సరిగా ఆలోచిస్తే, అది 0.7 అని గుర్తించి బాబా నాకు సహాయం చేసారనిపించింది. అయినా ఇంకా ఏదో భయంతో డాక్టర్ దగ్గరకి వెళితే, రిపోర్టులన్నీ చూసి, "బాగానే ఉన్నాయి. ఒక్క బ్లడ్ తక్కువగా ఉంది" అని అన్నారు. నాకు చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. ఇది బాబా చేసిన అద్భుతం అని నేను నమ్ముతున్నాను. "పిలిచిన వెంటనే తోడుండే మీకు శతకోటి వందనాలు బాబా. నాకున్న ఆరోగ్య సమస్యలన్నీ నయమయ్యేలా నాకు మీ ఆశీస్సులిచ్చి మంచి ఆరోగ్యాన్ని నాకు ప్రసాదించండి".
బాబా ఆశీస్సులు
నా పేరు మహేశ్వర. నేను ఐటీ రంగంలో పని చేస్తున్నాను. 2024, ఆగస్ట్ నెల ప్రారంభంలో మూడు రోజులపాటు నా ప్రాజెక్ట్‌లో కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. కొన్ని బ్యాచ్ జాబ్స్ ఫెయిల్ అవ్వసాగాయి. దానికి కారణమేంటో మేము కనుక్కోలేకపోయాము. ఆ సమయంలో నా మేనేజర్ సెలవులో ఉన్నప్పటికీ ఈ సమస్యల స్థితిగతులను అడుగుతూనే ఉన్నారు. ఆగస్టు, 5న మళ్ళీ జాబ్స్ ఫెయిల్ అయ్యాయి. మేము ఇంకొక టీమ్‌తో చర్చించాము. వాళ్ళు మా బ్యాచ్ జాబ్స్ మళ్ళీ ఎప్పుడు ప్రారంభించాలో చెపుతామని అన్నారు. వాళ్ళ నుంచి నిర్ధారణ వచ్చాక జాబ్స్ రన్ చేసాము. అప్పుడు నేను, "జాబ్స్ విజయవంతంగా రన్ అవ్వాల"ని బాబాని ప్రార్థించాను. బాబా ఆశీస్సులతో జాబ్స్ సరిగా రన్ అయ్యాయి. "థాంక్యూ బాబా".
2024, ఆగస్టు నెలాఖరులో కస్టమర్ సైట్‌లో పని చేస్తున్న నా సహోద్యోగికోసం నేను ఎన్నోసార్లు చేసిన ఒక టాస్క్(పని)కి సంబంధించి నాలెడ్జ్ ట్రాన్స్‌ఫర్(కె.టి.) చేశాను. అయితే, ఆ టాస్క్ అనుకున్న విధంగా పని చేయలేదు. నేను బాబా సహాయాన్ని అర్థిస్తూ, "సమస్యను పరిష్కరించమ"ని ప్రార్థించాను. బాబా ఆశీస్సులతో ఆ సమస్య పరిష్కరమైంది. విజయవంతంగా నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ పూర్తైంది. బాబా అందించిన సహాయానికి కృతజ్ఞతలు తెలుపుకున్నాను.
ఒకరోజు నేను కూరగాయలు కొనడానికి, బట్టలు షాపింగ్ చేద్దామని బయలుదేరాను. నాకెందుకో నేను వెళ్ళిన బట్టల షాపులో బాబా(విగ్రహం) ఉండొచ్చని అనిపించింది. ఆశ్చర్యకరంగా నేను వెళ్ళిన షాపులో క్యాష్ కౌంటర్ దగ్గర బాబా విగ్రహం దర్శనమిచ్చింది. నేను బట్టలు ఎంచుకున్న తర్వాత, "బిల్లు 9,000 రూపాయల కంటే ఎక్కువ కాకుండా చూడమ"ని బాబాని ప్రార్థించాను. నేను తీసుకున్న బట్టలు 11,200 రూపాయలు కాగా డిస్కౌంట్ పోను మొత్తం 8,600 రూపాయలు అయ్యింది. బాబా నాపై చూపుతున్న అనుగ్రహానికి కృతజ్ఞతలు తెలుపుకున్నాను. "బాబా! నా జీవితాంతం మీ కృప నాకు ఉండాలని ప్రార్థిస్తున్నాను తండ్రీ".
ఓం సాయినాథాయ నమః.
Om Sairam
ReplyDeleteBaba i am feeling glad.some times I feel low.in that situation please 🙏🙏 help me.i can't come out that time I feel fursted . when I think negative i suffer very much.please be with me and slove problem.Om Sai Ram
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteOm sai ram, amma nannalani kshamam ga chusukondi tandri vaallaki manchi arogyanni prasadinchandi, vaalla badyata meede, ofce lo unna problems anni teere la chesi anta bagunde la chayandi tandri. Aa tension valla na manasu anta badha ga undi pls e tension taggi work prashantan ga unde la chudandi tandri, naaku manchi arogyanni evvandi tandri, andarni kshamam ga chusukondi tandri, andariki tandri meere kada.
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏
ReplyDeleteI am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings on our family members forever 🙏🙏💐💐
ReplyDeleteBaba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu vadini bless cheyandi house construction complete cheyandi pl
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Om Sai Ram
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sri Sai Raksha 🙏🙏🙏
ReplyDeleteSri Sachchidanand sadguru Sai nath Maharaj ki jai ,🙏🙏🙏
ReplyDelete