ఈ భాగంలో అనుభవాలు:
1. శ్రీసాయి కృపతో తీరిన సమస్యలు
2. బాబాకి చెప్పుకుంటే లభించిన అనుగ్రహం
శ్రీసాయి కృపతో తీరిన సమస్యలు
సాయిబంధువులందరికీ నమస్కారాలు. నా పేరు చైతన్య. ఒకసారి మా అత్తయ్య గుండెదడగా ఉందంటే, ఆమెని హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. అక్కడ గుండెకు సంబంధించిన అన్ని పరీక్షలు చేశారు. మేము చాలా భయపడ్డాము. డాక్టర్లు గుండెకు ఏమైనా సమస్య ఉందని చెప్తారేమోనని నేను చాలా టెన్షన్ పడ్డాను. అప్పుడు నేను బాబా నామస్మరణ చేసి, "బాబా! మా అత్తయ్యకి ఏ ఇబ్బంది లేకుండా అంత నార్మల్‌గా ఉండాలి. గుండెకు సంబంధించిన ఇబ్బంది లేదు అంతా నార్మల్‌గా ఉందని డాక్టర్ చెప్పాలి" అని అనుకున్నాను. బాబా దయవల్ల డాక్టరు గుండెకు సంబంధించిన ఏ ఇబ్బంది లేదని, కొంచెం కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందని చెప్పి టాబ్లెట్లు ఇచ్చారు. "ధన్యవాదాలు బాబా. అత్తయ్యకి ఉన్న గుండె దడ తగ్గి ఆరోగ్యంగా ఉండేలా దీవించండి".
మా బాబు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ప్రతి సంవత్సరం సెమిస్టర్ మొదలయ్యే ముందు హాస్టల్ మారాల్సి వస్తుంది. మంచి గ్రేడ్ ఉన్నవాళ్ళు వేరే వాళ్ళని తమ రూములో ఉండడానికి ఎంపిక చేసుకుంటారు. మా బాబుకి అంత గ్రేడ్ లేదు. అందువల్ల తను తన ఫ్రెండ్స్ ద్వారా వాళ్ళ హాస్టల్ రూములో ఉండడానికి అప్లై చేసుకున్నాడు. కానీ మా ఫ్రెండ్స్ నన్ను తమ హాస్టల్ రూములో ఉండటానికి ఎంపిక చేసుకుంటారో, లేదో, నాకు హాస్టల్ వస్తుందో, లేదో అని టెన్షన్ పడ్డాడు. మేము కూడా చాలా టెన్షన్ చాలా పడ్డాము. అప్పుడు నేను, "బాబా! ఎలాగైనా మా బాబుకి హాస్టల్ వచ్చేలా చూడండి" అని బాబాని వేడుకున్నాను. బాబా దయవల్ల మా బాబుకి ఏ సమస్య కుండా హాస్టల్ వచ్చింది. తన ఫ్రెండ్స్ చాలామందికి హాస్టల్ రాలేదు, అలాంటప్పుడు చాలామంది కలిసి ఒకే గదిలో ఉండాల్సి వస్తుంది. బాబా దయవల్ల మా బాబుకి హాస్టల్ వచ్చిందికాని లేదంటే చాలా సమస్య అయ్యేది. "చాలా ధన్యవాదాలు బాబా. బాబుకి దిశానిర్దేశం చేసి మంచిగా చదువుకునే శక్తిని, ధైర్యాన్ని ప్రసాదించండి బాబా. ఎల్లప్పుడూ మీ నామస్మరణలో ఉండేలా మమ్మల్ని దీవించండి".
నాకు థైరాయిడ్ సమస్య ఉంది, దానికోసం నేను టాబ్లెట్లు వాడుతున్నాను. "బాబా! ఎలాగైనా థైరాయిడ్ అదుపులో ఉండేలా, మందులు డోస్ పెంచకుండా ఉండేలా చూడండి" అని బాబాకి చెప్పుకొని 2024, ఆగస్టు నెల మొదటి వారంలో నేను థైరాయిడ్ టెస్ట్ చేయించుకున్నాను. "బాబా! టెస్ట్ రిపోర్టులు నార్మల్‌గా ఉండేలా చూడండి" అని బాబాను ప్రార్ధించాను. బాబా దయవల్ల రిపోర్టులు నార్మల్ వచ్చాయి. "చాలా ధన్యవాదాలు బాబా. గత ఐదు సంవత్సరాలుగా నాకు రక్తహీనత సమస్య ఉంది. అది కూడా నార్మల్ స్థాయిలో ఉండేలా దయ చూపండి బాబా. మీ కరుణాకటాక్షాలు మా అందరి మీద ఉండేలా దీవించండి".
బాబాకి చెప్పుకుంటే లభించిన అనుగ్రహం
సాయిబంధువులందరికీ నమస్కారం. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మనకు ఏ ఆపద రాకుండా చూసుకుంటున్న మన బాబాకి శతకోటి వందనాలు. నా పేరు సౌజన్య. 2024, మార్చ్ 30న మా అమ్మకి మోకాలు రీప్లేస్మెంట్ సర్జరీ చేయించాము. తర్వాత మరో కాలు రీప్లేస్మెంట్ సర్జరీకోసం అమ్మని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే, రెండు రోజులైనా సర్జరీ చేయలేదు. స్టాఫ్‌ని అడిగితే రేపు చేస్తామని చెప్తుండేవారు తప్ప చేసేవారు కాదు. అప్పుడు నేను బాబాని, "రేపైనా సర్జరీ చేసేలా చూడు బాబా" అని వేడుకున్నాను. బాబా దయవల్ల మరుసటి రోజు వేకువజామున సర్జరీ చేసారు. ఇంకా నొప్పి కూడా ముందుసారి కంటే ఈసారి తక్కువగా ఉండింది. ఇకపోతే, మేము ఇన్సూరెన్స్ కింద సర్జరీ చేయించాము. అయితే అప్పటికే మావారు కంపెనీలో రాజీనామా ఇచ్చారు. నా భర్త ఫ్రెండ్ ఒకరు నోటీస్ పీరియడ్‌లో ఉంటే ఇన్సూరెన్స్ వర్తించదని చెప్పారు. దాంతో నాకు చాలా టెన్షన్ వచ్చింది. ఎందుకంటే, ఒకవేళ ఇన్సూరెన్స్ రాకపోతే మొత్తం డబ్బులు మేము కట్టాల్సి వస్తుంది. హఠాత్తుగా అంత డబ్బు కట్టాలంటే కష్టం. అందువల్ల నేను బాబాని, "ఇన్సూరెన్స్ వచ్చేలా చూడమ"ని వేడుకున్నాను. బాబా దయవల్ల ఎలాంటి సమస్యలు లేకుండా బిల్ పేమెంట్ అయింది. "శతకోటి వందనాలు బాబా. మా చేయి ఎప్పుడూ వదలక సదా మమ్మల్ని కాపాడు తండ్రీ. అమ్మ తొందరగా కోలుకునేలా చూడు బాబా".
Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏
ReplyDeleteI am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings on our family forever 🙏🙏💐💐
ReplyDeleteBaba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu vadini bless cheyandi house construction complete cheyandi pl
ReplyDeleteOmsaisri Sai Jai Jai Sai kapadu Tandri omsairamRaksha Raksha
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteOm sai ram, amma nannalani kshamam ga chusukondi vaallaki manchi arogyanni prasadinchandi vaalla badyata meede tandri, na arogyanni kuda sarichayandi tandri pls, ofce lo anta bagunde la chesi na life lo unna anni samasyalani sarichayandi adi meere chayagalaru tandri, e prapancham lo andaru kshamam ga arogyam ga unde la chudandi tandri, varadalu tagginchi manushula ibbandulu taagginchandi tandri pls.
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sai Ram
ReplyDeleteOm Sri Sai Raksha🙏🙏🙏
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteSai always be with me
Sri Sachchidanand sadguru Sai nath Maharaj ki jai
ReplyDelete