సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1908వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ప్రతి సమస్యకు బదులిచ్చే బాబా
2. శ్రీసాయి ఆశీస్సులు

ప్రతి సమస్యకు బదులిచ్చే బాబా

నేను ఒక సాయి భక్తురాలిని. మేము USAలో ఉంటున్నాము. ఒకరోజు 6 సంవత్సరాల మా బాబు స్విమ్ గాగుల్స్ ధరించకుండా స్విమ్మింగ్‌కి వెళ్ళాడు. మరుసటిరోజు నుండి తను రోజులో చాలాసార్లు తన కళ్ళు నులుముకుంటుండేవాడు. మేము మొదట తను ఎందుకు అలా చేస్తున్నాడో తెలుసుకోలేకపోయాము. బహుశా తను ఊరికే అలా చేస్తున్నాడేమో అనుకున్నాము. కానీ ఒకానొక సమయంలో కళ్ళ లాగుతుండటం వల్ల తను సరిగా చదవలేకపోతున్నాడని గమనించాము. దాంతో తన కళ్ళకు ఏమైందోనని నేను చాలా భయపడ్డాను. ఎందుకంటే, ఇక్కడ USAలో కంటి డాక్టర్ అపాయింట్‌మెంట్ అంత సులువుగా లభించదు. కనీసం 2 నెలల సమయం పడుతుంది. అయినప్పటికీ నేను చాలా కంటి హాస్పిటల్స్‌కి కాల్ చేసి నా ప్రయత్నం నేను చేశాను. కానీ, అదృష్టం లేకపోయింది. అప్పుడు బాబుకి ఐ డ్రాప్స్ వేసి బాబాను ప్రార్థించాము. బాబా దయతో రోజురోజుకి తనకి మెరుగు అయింది. "చాలా ధన్యవాదాలు బాబా. దయచేసి తనతో ఉండండి. తనకి మంచి ఆరోగ్యం, విద్య అనుగ్రహించండి బాబా".

మా అమ్మ కొంతకాలం మాతో గడపడానికి USA వచ్చింది. తను ఒకరోజు హఠాత్తుగా తన ఎడమ చేయి నొప్పిగా ఉంటుందని ఫిర్యాదు చేసింది. నేను అమ్మ చేతిని గమనిస్తే కొద్దిగా వాపు ఉండటం గుర్తించాను. బహుశా ఏదైనా పురుగు కుట్టి ఉండొచ్చు, ఫర్వాలేదు అనుకున్నాను. కానీ రోజురోజుకీ అమ్మ పరిస్థితి బాగా లేకుండా పోయింది. ఎడమ చేయి కాబట్టి నాకు చాలా భయమేసి, "ఇది హృదయానికి సంబంధించినది కాకూడద"ని బాబాని ప్రార్థించాను. ఆ రోజు రాత్రి అమ్మ ఒక టాబ్లెట్ వేసుకుంది. మర్నాడు ఉదయానే ఆమె, "నాకు బాగానే ఉంది. ఎలాంటి నొప్పి లేదు" అని చెప్పింది. అంతా బాబా దయ. "చాలా ధన్యవాదాలు బాబా. దయచేసి నా తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోండి బాబా".

ఒకరోజు ఉదయాన్నే మా అత్తగారింటి నుండి అత్తగారికి ఆరోగ్యం బాగాలేదని, ఆమె దాదాపు 10 రోజులు ఐసియులో ఉన్నారని మాకు ఫోన్ వచ్చింది. అది విని వీసా సమస్యల వలన మేము చాలా ఆందోళన చెందాము. ఇండియా వెళ్ళడానికి మా పాస్‌పోర్ట్‌లపై వీసా స్టాంపింగ్ కోసం డ్రాప్‌బాక్స్ స్లాట్‌ బుక్ చేసుకోవాల్సి ఉండగా ఉన్నపళంగా స్లాట్‌లు లభించని పరిస్థితి. అదృష్టవశాత్తూ నా భర్త స్లాట్‌ బుక్ చేయగలిగారు కానీ, నాకు ఏ స్లాటూ చూపించలేదు. నేను చాలా ఆందోళన చెందాను. ఎందుకంటే, వీసా విషయాలన్నీ వాళ్ళకి తెలియవు కాబట్టి, వాళ్ళు చెడుగా ఆలోచిస్తారు. పైగా అది పల్లెటూరు అయినందున ఇతరులు కూడా నన్ను నిందిస్తారు. ఈవిధంగా నా మనసులో చాలా ఆందోళన కొనసాగింది. ఇలా ఉండగా ఒక గురువారం నేను బాబా గుడికి వెళ్లి, ఆయన్ని ప్రార్థించి, "ఇటువంటి వాతావరణంలో నేను ప్రయాణించగలనా, లేదా" అని అడిగి సమాధానం కోసం క్వశ్చన్&ఆన్సర్స్ సైట్‌లో చూసాను. బాబా ప్రయాణం చేస్తానని సమాధానమిచ్చారు. అది చూసి నాకు స్లాట్ దొరుకుతుందని, ఇండియా వెళ్తానని చాలా నమ్మకంగా అనిపించింది. కానీ ఒక మాములు మనిషిగా నా మనసులో ఎక్కడో 'స్లాట్‌ చూపడం లేదు, ప్రయాణం ఎలా సాధ్యం?' అన్న ప్రశ్న తలెత్తింది. అయితే మరుసటిరోజు ఉదయం నేను వీసా సైట్ తెరిస్తే, స్లాట్‌లు చూపించింది, నేను బుక్ చేసుకోగలిగాను. చాలా సంతోషించాను. "కోటి కోటి ప్రణామాలు బాబా. మీరు చాలా ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. చాలా ధన్యవాదాలు బాబా. ఇంకా అన్నిటికి చాలా ధన్యవాదాలు. ఈ జన్మలో మీరు మా గురువుగా ఉన్నందుకు మేము చాలా ధన్యులం. మాకు ఇంకేం కావాలి బాబా? దయచేసి ప్రతి జన్మలో మీరు మాతో ఉండండి, మమ్మల్ని విడిచిపెట్టవద్దు బాబా. దయచేసి అందరికీ మంచి ఆరోగ్యం, ఆనందం అనుగ్రహించండి బాబా". 

శ్రీసాయి ఆశీస్సులు

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన సాయినాథుని పాదాలకు శతకోటి నమస్కారాలు. నేను చాలా సంవత్సరాల నుంచి సాయిబిడ్డను. 2024 జూలైలో మేము శిరిడీ వెళదామని టికెట్లు బుక్ చేసుకున్నాము. అప్పుడు నేను బయటకి ఎవరితోనూ అనలేదుగాని, నా మనసులో, 'బాబా! మీరు పిలిస్తేనే శిరిడీ రాగలం. కానీ మేము టికెట్ బుక్ చేసుకుని వస్తున్నామ'ని అనుకున్నాను. మనసులోని ఆ మాట సర్వాంతర్యామి అయిన నా తండ్రికి తెలియకుండా ఉంటుంది! మేము జూలై 7న శిరిడీ వెళ్లాల్సి ఉండగా జూలై 5న మా అమ్మాయి తన ఆరోగ్యం సరిగా లేదని నాతో అంది. వెంటనే నేను, "బాబా! నన్ను క్షమించు. మీ ఆశీస్సులతో మేము శిరిడీ రావాలి" అని బాబాతో అన్నాను. బాబా దయవల్ల కాసేపటికే మా అమ్మాయి ఆరోగ్యం కుదుటపడింది. కానీ బాబా నాకు మరో పరీక్ష పెట్టారు. అదేరోజు నాకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన పేపర్లు కనిపించలేదు. వాటికోసం మా ఇంట్లో అంతటా చాలాసేపు వెతికాము కానీ, అవి కనిపించలేదు. నేను, మా పిల్లలు వెతికి వెతికి అలసిపోయాం. చివరికి నేను నేను నా కొడుకుతో, "మేము శిరిడీ వెళ్తున్నాము కదా! నేను శిరిడీలో అడుగుపెట్టగానే నువ్వు నాకు ఫోన్ చేసి, 'బాబా దయవల్ల పేపర్లు దొరికాయని చెప్తావు" అని ధైర్యంగా అన్నాను. మేము 7వ తేదీన శిరిడీ వెళ్లేందుకు బయలుదేరాం. మేము బస్సులో కూర్చున్న గంటసేపటికి నా కొడుకు ఫోన్ చేసి, "బాబా ఆశీస్సులతో పేపర్లు దొరికాయి" అని చాలా సంతోషంగా చెప్పాడు. అది విని నాకు చాలా సంతోషమేసింది. ఆ రాత్రి ఒంటి గంటన్నర సమయంలో మేము వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. కానీ బాబా దయవల్ల ఎవరికీ ఏమీ కాలేదు. వేరే బస్సులో ప్రయాణం చేసి శిరిడీ చేరుకొని ఆ రోజు సాయంత్రం బాబా దర్శనం చేసుకొని బాబాకి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకున్నాను. మా అమ్మాయికి ఆరు నెలలైనా  నెలసరి కాలేదు. అందుకని శిరిడీలో బాబాకి, "బాబా! మీ దర్శనం అయిన నెల లోపల అంటే ఆగస్టు 6లోగా మా అమ్మాయికి నెలసరి రావాలి" అని మొక్కుకున్నాను. బాబా ఆశీస్సులతో నా కోరిక నెరవేరింది. "ధన్యవాదాలు బాబా. నా మనసులో శిరిడీకి టికెట్లు బుక్ చేసుకుని వస్తున్నామని అనుకున్నాను గాని మీ ఆజ్ఞతో అనలేకపోయాను. క్షమించు తండ్రీ. నాలోని అహంకారాన్ని మీ పాదాల కింద అణిచివేయండి బాబా".

14 comments:

  1. ఓం సాయిరామ్

    ReplyDelete
  2. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  3. Baba, provide peace and wellness to my parents 💐💐💐💐

    ReplyDelete
  4. Om Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏

    ReplyDelete
  5. I am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings on our family members forever 🙏🙏💐💐

    ReplyDelete
  6. Baba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu vadini bless cheyandi house construction complete cheyandi

    ReplyDelete
  7. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  8. Omsaisri Sai Jai Jai Sai kapadu Tandri omsairamRaksha Raksha

    ReplyDelete
  9. ఓమ్ శ్రీ సాయిరామ్..
    🌹🙏🙏🙏🌹

    ReplyDelete
  10. baba madava ki anni subjects lo 12 above marks ravali. maa attagari arogyam bagundali.

    ReplyDelete
  11. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  12. Om Sri Sai Raksha 🙏🙏🙏

    ReplyDelete
  13. Sri Sachchidanand sadguru Sai nath Maharaj ki jai 🙏🙏🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo