సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1902వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • కావాలని అడిగితే చాలు - అది మనకి మంచిదైతే బాబా తప్పకుండా సహాయం చేస్తారు

నా పేరు హాసిని. నా ఫ్రెండ్ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే చివరి నిముషంలో చేజారిపోసాగాయి. అలా ఒక 3 కంపెనీలలో తను సెలెక్ట్ అవ్వలేదు. అప్పుడు నేను తనతో "నువ్వు ఈసారి వెళ్లే కంపెనీలో నీకు ఉద్యోగం రావాలి. అదే జరిగితే విజయవాడ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటాన"ని మ్రొక్కుకోమని చెప్పాను. తర్వాత తను వెళ్లిన కంపెనీలో సెలెక్ట్ అయ్యాడు. నాకు చాలా సంతోషంగా అనిపించింది. అయితే జాయినింగ్ ముందు కొన్ని టెస్టులు ఉన్నాయి. అప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికేట్ అడిగారు. తనకి ఆ సర్టిఫికెట్ లేదు. అందువల్ల తను "ఏమవుతుందోనని భయమేస్తుంది" అని అన్నాడు. ఇక అప్పుడు నేను, "బాబా! నా ఫ్రెండ్ ఆ కంపెనీలో సెలెక్ట్ అవ్వాలి. తనకి ఉద్యోగం రావాలి. తనకి ఆఫర్ లెటర్ వచ్చేస్తే మీ అనుగ్రహాన్ని తోటి భక్తులతో పంచుకుంటాను" అని మొక్కుకున్నాను. బాబా దయవల్ల తనకి ఆఫర్ లెటర్ వచ్చింది. మనమందరం ప్రధానంగా తెలుసుకోవలసింది ఏంటంటే, ఏదైనా పని చేసేటప్పుడు గురు అనుగ్రహం వుండాలి. అప్పుడే ఎలాంటి పనైనా విజయవంతమవుతుంది. అది నాకు ఈ అనుభవం ద్వారా అర్థమైంది.

నేను డిగ్రీ పరీక్షలు వ్రాసాను. ఆ పరీక్షలు సులువే కానీ, ఎంత బాగా వ్రాసినా ఫెయిల్ చేస్తున్నారని ఒక ఫ్రెండ్ చెప్పింది. తనని అలాగే ఫెయిల్ చేశారు కూడా. అయితే నేను పరీక్షలు వ్రాసే ముందు "బాబా! మీరు దగ్గరుండి నాచేత పరీక్షలు వ్రాయించాలి. ఇచ్చిన సమయంలో పూర్తి పేపర్ మీరు నాచేత వ్రాయించాలి బాబా" అని బాబాకి చెప్పుకున్నాను. నా పక్కనున్న వాళ్ళు ఎవరూ నూటికి నూరు మార్కులకి ఆన్సర్ చేయలేదు. బాబా దయవల్ల నేను మాత్రం ఆయన్ని తలుచుకుంటూ అన్నీ ఆన్సర్ చేశాను. ఒక పరీక్ష వ్రాసేటప్పుడు నా పక్కనున్న అతను నేను వ్రాసేది చూసి తను రాసుకుంటుంటే, నేను పోనిలే వ్రాసుకోని అని ఊరుకున్నాను. మరో 30 నిముషాలు ఉందనగా ఇన్విజిలేటర్ గమనించి, చూసి వ్రాస్తున్న అతనిని ఏమీ అనకుండా నా పేపర్ తీసేసుకున్నారు. నేను అప్పటికే వ్రాసేసినందున తిరిగి అడగలేదు. నేను ఎగ్జామ్ హాల్ నుండి బయటకి వచ్చేసాక ఆ మేడం నా పేపర్ మీద పెన్‌తో కొట్టేశారని నా స్నేహితులు చెప్పారు. అది విని నాకు చాలా భయమేసింది. ఆ సబ్జెక్టు ఉండిపోతే ఒక సంవత్సరం వేచి ఉండాలనిపించింది. కానీ ఎక్కడో బాబా ఉన్నారు కదా అని ధైర్యంగా అనిపించింది. మొత్తం పరీక్షలన్నీ అయిపోయాక నేను, "బాబా! మొత్తం సబీజెక్టులన్నీ పాసవ్వాలి. మీ అనుగ్రహం తోటి భక్తులతో పంచుకుంటాను. అలానే పులిహోర, కొబ్బరి కేసరి ప్రసాదం గుడిలో పంచుతాను" అని బాబాకి మొక్కుకున్నాను. బాబా దయవల్ల నేను ఫస్ట్ క్లాసులో పాసయ్యాను. మేడం కొట్టేసిందని చెప్పిన పేపర్ కూడా బాబా దయవల్ల పాస్ అయ్యాను. నేను చేసిన గ్రాడ్యుయేషన్‌కి 60% మార్కులొస్తేనే విలువ ఉంటుంది, అందువల్ల నేను బాబాని నాకు 60% రావాలని అడిగాను. బాబా దయవల్ల నాకు 67% వచ్చింది. చాలా సంతోషించాను. ఇది అంత మన సాయి లీల. నేను స్టూడెంట్స్‌కి ఒక్కటే చెప్తాను. బాబా! పాసవ్వాలని అడిగినంత మాత్రాన మనం పాస్ అవ్వము. మనం కష్టపడితేనే బాబా 'అయ్యో.. నా బిడ్డ కష్టపడుతుంద'ని మనకి సహాయం చేస్తారు. విద్యార్థులకు గురు కృప చాలా ఆవశ్యకం.

ఒకసారి నేను kyc అప్డేట్ చేయడం కోసం పోస్టాఫీసుకి వెళ్ళాను. వాళ్ళు ఏవో పేపర్స్ ఇచ్చి సంతకాలు చేయాలని అన్నారు. నేను సంతకాలన్నీ చేసి ఆ పేపర్స్ తీసుకొని మరుసటిరోజు మళ్ళీ పోస్టాఫీసుకి వెళ్తే, ఇంకా కొన్ని సంతకాలు చేయాలని అన్నారు. నేను ఇంకా నెగ్లెక్ట్ చేసి నాలుగు నెలల తర్వాత 'ఈసారి పని అయిపోవాలని, మళ్ళీ వెనక్కి పంపకూడదని; బాబా సహాయం అడిగి అవే పేపర్స్‌తో పోస్టాఫీసుకి వెళ్ళాను. వాళ్ళు ఏమీ అనకుండా అప్డేట్ చేశామని అన్నారు. అదివరకు అవే పేపర్స్ తీసుకెళ్తే ఇంకా సంతకాలు చేయాలని వెనక్కి పంపారు. అంతా బాబా దయ. మనం ఇది కావాలని అడిగితే చాలు. అది మనకి మంచిదైతే బాబా తప్పకుండా సహాయం చేస్తారు.

ఒకసారి నాకు జలుబు చేసింది. టాబ్లెట్లు వేసుకున్నా అస్సలు తగ్గలేదు. ఎందుకో ఆరోజు రాత్రి టెలిగ్రామ్ ఓపెన్ చేసి 'సాయి మహరాజ్ సన్నిధి' ఛానెల్ ఓపెన్ చేస్తే, అందులో ఎవరో భక్తులకి జలుబు చేస్తే, ఊదీ నీళ్లు తాగితే తగ్గిందని పంచుకున్నారు. బహుశా బాబానే ఆ రూపంలో అలా చెప్పారనిపించింది నాకు. ఎందుకంటే, నేను టెలిగ్రామ్ అసలు ఎప్పుడూ ఓపెన్ చేయను, బ్లాగు తాలూకు ఛానల్ అయితే అసలే ఓపెన్ చేయను. అలాంటిది ఆరోజు ఓపెన్ చేయడం, జలుబుకి సంబంధించిన అనుభవమే చదవడం అంతా బాబా కృప మనపై ఉండటం వల్లే. సరే, మరుసటిరోజు నేను నీళ్లలో శిరిడీ నుండి తెచ్చిన ఊదీ కలిపి తాగాను. అంతే, నేనింకా ఏ టాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం రాలేదు. బాబా ఊదీ అంత శక్తివంతమైనది. "ధన్యవాదాలు బాబా",

సర్వం శ్రీసాయినాథార్పణమస్తు.

13 comments:

  1. Baba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu vadini bless cheyandi house construction complete cheyandi pl

    ReplyDelete
  2. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  3. Baba, provide peace and wellness to my parents 💐💐💐💐

    ReplyDelete
  4. Om Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏

    ReplyDelete
  5. I am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings on our family forever 🙏🙏💐💐

    ReplyDelete
  6. Om sai ram, na manasulo unna bayalu korikalu andolanalu neeku telusu anni bagunde la chayandi tandri, andarni kshamam ga arogyam ga chudandi tandri pls.

    ReplyDelete
  7. Om Sairam
    Sai Always be with me

    ReplyDelete
  8. baba madava lo maarpu ravali. madava ni marchandi baba

    ReplyDelete
  9. ఓం సాయిరామ్

    ReplyDelete
  10. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo