సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 837వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. వ్యాక్సిన్ వేయించుకునేలా అనుగ్రహించిన బాబా
2. బాబా వ్రతం’ చేసేలా, భాగవతం వినేలా అనుగ్రహించిన బాబా
3. బాబా ఎక్కడో లేరు! ఆయన ప్రతి భక్తుని హృదయంలో ఉన్నారు
4. బాబా చల్లని చూపు       

సాయిభక్తులకు, ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా నమస్కారాలు. నా పేరు నవీన్. బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను నేను ఇంతకుముందు ఈ బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను పంచుకుంటున్నాను.


వ్యాక్సిన్ వేయించుకునేలా అనుగ్రహించిన బాబా:


నేను చాలారోజుల నుంచి వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రయత్నిస్తున్నాను. అందుకోసం నేను ఆరోగ్యసేతు యాప్‌లో రిజిస్టర్ కూడా చేసుకున్నాను. అయితే ఆ యాప్, ‘18+ వాళ్ళకి ప్రస్తుతం వ్యాక్సిన్ లేదు’ అని చూపిస్తుండేది. మా నాన్నగారికి తెలిసిన ఒక నర్సు ఉన్నారు. ఆవిడే మా నాన్నకు, అమ్మకు వ్యాక్సిన్ వేయించారు. నాన్న ఆమెను సంప్రదించి, "మా అబ్బాయికి కూడా వ్యాక్సిన్ వేసే అవకాశం ఏమైనా ఉందా?" అని అడిగారు. అందుకామె, "నేను ఫ్రీగా ఉన్నప్పుడు చెప్తాను" అని చెప్పింది. తర్వాత 2021, జూన్ 4 సాయంత్రం మా నాన్న హఠాత్తుగా ఆమెకు ఫోన్ చేశారు. ఆమె, "ఇప్పుడు వ్యాక్సిన్ అవైలబుల్ ఉంది, తొందరగా రండి" అని చెప్పింది. నేను బాబాకి, "అంతా మంచే జరగాలి. ఏ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా చూడు బాబా" అని దణ్ణం పెట్టుకుని బయలుదేరాను. నిజానికి ఆ సమయంలో మా ఊర్లో బాగా వర్షం పడుతోంది. అయినప్పటికీ నేను, నాన్న వర్షంలో తడుస్తూనే హాస్పిటల్‌కి వెళ్ళాము. హాస్పిటల్లోని రెండు గదుల్లో వ్యాక్సిన్ వేస్తున్నారు. నేను మాకు తెలిసిన నర్సుతో మాట్లాడి మొదటి గదికి వెళ్లాను. లోపల చాలామంది ఉన్నారు. అక్కడి వాళ్ళు, "కాసేపట్లో ఈ గదిలో వ్యాక్సిన్ అయిపోతుంది. రెండో గదికి వెళ్ళండి" అని చెప్పారు. సరేనని నేను రెండో గదికి వెళ్లాను. అక్కడ కూడా వ్యాక్సిన్ పదిమందికే ఉంది అన్నారు. నేను నా మనసులో, 'బాబా దయ ఉంటే నాకు వ్యాక్సిన్ దొరుకుతుంది, లేకపోతే లేదు' అని అనుకున్నాను. అయితే, బాబా దయవలన నాకు అవకాశం వచ్చింది. కానీ అక్కడున్న ఒకతను నా ఆధార్ వెరిఫై చేసి, "సార్, మీరు ఆరోగ్యసేతు యాప్‌లో రిజిస్టర్ చేసుకున్నారు. అందులోని మీ వయస్సుకి, ఇక్కడ మీ వయస్సుకి తేడా వస్తుంది. అందువలన వ్యాక్సిన్ వేయడం కుదరదు. మీరు యాప్‌లో ఉన్న డేటా డిలీట్ చేసి రండి" అని అన్నారు. కానీ నేను మొబైల్ తీసుకుని వెళ్ళనందువల్ల ఏం చేయాలో అర్థంకాక మాకు తెలిసిన నర్సుతో విషయం చెప్పాము. ఆమె ‘మొదటి గదిలో ఉన్న సూపర్‌వైజర్‌తో మాట్లాడండి’ అని చెప్పింది. నేను సూపర్‌వైజర్‌తో విషయం చెప్పాను. ఆయన ‘వ్యాక్సిన్ వేయడం కుదరదు’ అని చెప్పారు. నాన్న ఆయనతో, ‘ఏదో ఒకటి మేనేజ్ చేసి, వ్యాక్సిన్ వేయండి సార్’ అని అన్నారు. కానీ ఆయన ఒప్పుకోలేదు. దాంతో మేము బయటకు వచ్చి కూర్చున్నాము. అంతలో సూపర్‌వైజర్‌తోపాటు ఉన్న ఒకతను వచ్చి, "రండి, వ్యాక్సిన్ వేస్తామ"ని అన్నారు. నేను సంతోషంగా వెళ్లి వ్యాక్సిన్ వేయించుకున్నాను. విశేషం ఏంటంటే, వ్యాక్సిన్ అయిపోయిందని చెప్పిన మొదటి గదిలోనే నాకు వ్యాక్సిన్ వేశారు. ‘ఇదంతా బాబా లీల’ అని సంతోషించి బాబాకు మనసారా ధన్యవాదాలు చెప్పుకున్నాను.


మరుసటిరోజు ఉదయం నుంచి నాకు బాగా ఒళ్లునొప్పులు, జ్వరం మొదలయ్యాయి. సాయంత్రానికి ఇంకా ఎక్కువయ్యాయి. దాంతో రాత్రి పడుకునేముందు టాబ్లెట్ వేసుకుని, "బాబా! రేపటికల్లా నాకు నార్మల్ అయిపోవాలి. అలా జరిగితే నా అనుభవాన్ని మన బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకుని నిద్రపోయాను. కాసేపటికే నాకు నార్మల్ అవడం మొదలైంది. మరుసటిరోజు ఉదయం లేస్తూనే నేను పూర్తి నార్మల్ ఫీల్ అయ్యాను. మళ్ళీ నాకు ఒళ్లునొప్పులు, జ్వరం రాలేదు. "బాబా! చాలా చాలా ధన్యవాదాలు. మీకు ప్రమాణం చేసినట్టు నా అనుభవాలను బ్లాగులో పంచుకున్నాను".


బాబా వ్రతం’ చేసేలా, భాగవతం వినేలా అనుగ్రహించిన బాబా :


ఒకసారి నేను ఈ బ్లాగులో సాయిభక్తుల అనుభవాలు చదువుతున్నప్పుడు ఒక సాయిభక్తురాలు చేసిన ‘సాయి దివ్యపూజ’ అనుభవాలను చదివాను. దాంతో నాకు కూడా ఆ వ్రతం చేయాలనిపించింది. కానీ మా ఇంట్లో బాబా ఫోటోగానీ, విగ్రహంగానీ లేవు. అందువలన నేను బాబా విగ్రహమొకటి కొనాలని అనుకున్నాను. సాధారణంగా మా అమ్మ, నాన్న విగ్రహం కొందామంటే ఒప్పుకోరు, ‘ఇంట్లో విగ్రహాలు ఉండకూడద’ని అంటారు. కాబట్టి నేను, "అమ్మానాన్నలు ఏమీ అనకుండా ఉండేలా చూడమ"ని బాబాతో చెప్పుకుని విగ్రహం కొనాలనే విషయం వాళ్ళతో చెప్పాను. చాలా ఆశ్చర్యంగా వాళ్ళు, "సరే, కొనుక్కో!" అని చెప్పారు. నేను చాలా సంతోషించి ఆన్లైన్‌లో ఒక బాబా విగ్రహం ఆర్డర్ పెట్టాను. కొన్నిరోజులకి బాబా విగ్రహం రూపంలో మా ఇంటికి వచ్చారు. మరుసటి గురువారం నుంచి ఏడు గురువారాల పాటు పూజ చేద్దామన్న సంకల్పంతో దివ్యపూజ మొదలుపెట్టాను. మూడు వారాలు అయిన తర్వాత ఒకరోజు చాగంటిగారి భాగవత ప్రవచనం వీడియో యూట్యూబ్‍లో కనిపించింది. ఎందుకో తెలియదుగానీ నాకు భాగవతం వినాలి అనిపించి ఆరోజు నుంచి రోజుకో అధ్యాయం చొప్పున వినడం ప్రారంభించాను. అలా వింటున్నప్పుడు ‘భగవంతుని అనుగ్రహం లేకపోతే దాన్ని వినడం అసాధ్యమ’ని తెలిసింది. అంటే, ఇది బాబా అనుగ్రహం వల్లే సాధ్యమైంది. ఇకపోతే, భాగవతం వింటుంటే నేను పొందిన ఆనందం అంతా ఇంతా కాదు. కొన్ని కొన్ని కథలు వింటున్నప్పుడు నాకు కన్నీళ్లు కూడా వచ్చేవి. భాగవతమనే అద్భుత గ్రంథాన్ని వినేలా అనుగ్రహించి బాబా నాలో భక్తిని చాలా వృద్ధిపరచారు. "బాబా! ఇలాగే ఎప్పుడూ నేను భక్తి మార్గంలో ఉండేలా అనుగ్రహించండి. ఈ కరోనాను తొందరగా అంతమొందించి మా  అందరికీ ప్రశాంత జీవనాన్ని ప్రసాదించండి బాబా".


ఓం శ్రీ సాయినాథాయ నమః


బాబా ఎక్కడో లేరు! ఆయన ప్రతి భక్తుని హృదయంలో ఉన్నారు


నా పేరు ఉమ. మాది నిజామాబాద్ జిల్లా. మనందరి దైవమైన శ్రీ సాయినాథునికి శతకోటి నమస్కారములు. ‘ఈ బ్లాగును నడిపించేది బాబానే’ అని నా నమ్మకం. ఇకపోతే, నేను ముందుగా నా సోదరికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎందుకంటే, సాయిని మరియు ఈ బ్లాగును నాకు పరిచయం చేసింది తనే. నేను 15 సంవత్సరాల నుండి బాబా భక్తురాలిని. కానీ బాబాకు దగ్గరైంది మాత్రం 2020, ఫిబ్రవరి నుండి. నేను అప్పుడే మొదటిసారిగా ‘శ్రీసాయిసచ్చరిత్ర’ పారాయణ చేశాను. తరువాత ఈ బ్లాగ్ ద్వారా బాబాకు మరింత దగ్గరయ్యాను. ఈ కొద్దికాలంలోనే బాబా నాకు చాలా అనుభవాలను ఇచ్చారు. అందులో కొన్నిటిని ఇదివరకే మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను పంచుకుంటాను.


నా తలలో ఏర్పడిన సొరియాసిస్ వలన నేను గత 7 సంవత్సరాలుగా మానసికంగా చాలా కృంగిపోతుండేదాన్ని. నేను చికిత్స కోసం చాలా హాస్పిటల్స్ తిరిగాను. చాలా డబ్బు ఖర్చయింది. కానీ ఎలాంటి ఫలితం కనిపించలేదు. గత సంవత్సరం ఫిబ్రవరిలో మొదటిసారి శ్రీసాయిసచ్చరిత్ర పారాయణ చేశానని చెప్పాను కదా! అప్పుడేదో ఒకసారి సచ్చరిత్ర చదవాలనిపించి పారాయణ చేశానేగానీ, నేను నా సమస్య గురించి బాబాకు చెప్పుకోలేదు. తర్వాత శ్రావణమాసం(ఆగస్టు)లో రెండోసారి సచ్చరిత్ర చదివాను. అప్పుడు నేను చాలా బాధతో నా సమస్యను బాబాకు చెప్పుకుని, ఆ వ్యాధిని నయం చేయమని వేడుకున్నాను. సచ్చరిత్ర పఠనం పూర్తయింది. నెల రోజులు గడిచాయి. కానీ ఎలాంటి ఫలితం కనిపించలేదు సరికదా, సమస్య మరింత ఎక్కువైంది. అప్పుడొక గురువారంనాడు నేను చాలా నిస్సహాయస్థితిలో ఉన్నప్పుడు 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగు ఓపెన్ చేసి చూశాను. అక్కడ, "నా సచ్చరిత్ర పఠనం చేస్తూ, ఊదీ రాస్తూ ఉండు, నీకు నయమవుతుంది" అన్న బాబా సందేశం ఉంది. అది బాబా నా కొరకే పెట్టినట్లుగా అనిపించి, మరుసటిరోజు నుండి రోజుకి ఒక అధ్యాయం చొప్పున సచ్చరిత్ర పఠనం చేస్తూ, నా తలకి ఊదీ రాయడం మొదలుపెట్టాను. కానీ నా బాబా నన్ను పరీక్షిస్తున్నారనిపించి, బాబాకి ‘సంతోషంతో కూడిన ఓరిమి’ కావాలని అలానే ఉండసాగాను. తర్వాత 2021, మార్చి నెలలో ఒకరోజు నేను చాలా బాధతో, "బాబా! నిజంగా మీరు నా హృదయంలోనే ఉన్నట్లయితే, ఈ గురువారానికల్లా నా వ్యాధిని పావువంతైనా తగ్గించండి" అని బాబాను వేడుకున్నాను. నా బాబా నిజంగా అద్భుతం చేశారు. గురువారానికి నా వ్యాధి పూర్తిగా నయం అయిపోయింది. దాంతో నా సంతోషం అంతా ఇంతా కాదు. చూడండి! బాబా ఎక్కడో లేరు. ఆయన ప్రతి భక్తుని హృదయంలోనే ఉన్నారు. ఎంతటి కష్టపరిస్థితుల్లో ఉన్నా బాబా పాదాలు మరువకండి. ఎందుకంటే, మనకి దారి చూపించేవి ఆ పాదాలే. 


మరో అనుభవం : 2021, ఏప్రిల్ నెలలో మావారికి దగ్గు, జ్వరం వచ్చాయి. ప్రస్తుత పరిస్థితుల్లో జ్వరం అంటే చాలా భయం వేస్తోంది. పైగా నాలుగురోజులైనా తనకు జ్వరం తగ్గలేదు. దాంతో పరీక్షలు చేయిస్తే, అది టైఫాయిడ్ జ్వరమని నిర్ధారణ అయింది. అది కూడా పదిరోజులైనా తగ్గలేదు. నాకు చాలా భయం వేసి రోజూ బాబా ఊదీని మావారి నుదుటన పెట్టి, మరికొంత ఊదీని నీళ్ళలో కలిపి మావారికి ఇస్తూ, "బాబా! గురువారానికల్లా మావారికి జ్వరం తగ్గితే నేను, మావారు మీ గుడికి వచ్చి కొబ్బరికాయ సమర్పించుకుంటామ"ని బాబాను వేడుకున్నాను. నిజానికి ఆ సమయంలో మేము మా దగ్గరి బంధువులు పోయినందువల్ల పూజలకు దూరంగా ఉన్నాము. ఆ విషయమే మర్చిపోయి మేము గుడికి వస్తామని బాబాకు మ్రొక్కుకున్నాను. అయినా, నా బాబా బుధవారం రాత్రి నుండి మావారికి జ్వరం తగ్గిపోయేలా అనుగ్రహించారు. "బాబా! నేను మీకు ఎంతో ఋణపడివున్నాను. మీ నామస్మరణ చేయడం తప్ప ఇంకేమి చేయగలను సాయీ? నా మనసు దేనిగురించీ చింతించక సదా మీ నామస్మరణలోనే ఉండేలా అనుగ్రహించండి సాయీ".


బాబా చల్లని చూపు


నా పేరు లత. కరోనా మహమ్మారి అందరినీ వణికిస్తూ ఎంతోమంది అభాగ్యులను బలితీసుకుంటోంది. ఈమధ్య నాకు, మావారికి, మా బాబుకి కూడా ఈ కరోనా వచ్చింది. మావారి పరిస్థితి చాలా విషమించింది. ఆయన ఆక్సిజన్ లెవెల్స్ 85కి పడిపోయాయి. అవి  హాస్పిటల్లో బెడ్స్ దొరకని మరియు ఆక్సిజన్ కొరత బాగా ఉన్న రోజులు. అయినప్పటికీ బాబా దయవల్ల అరగంటలో బెడ్, ఆక్సిజన్ అందుబాటులో ఉన్న హాస్పిటల్ మాకు దొరికింది. కానీ డాక్టర్లు, "వారం రోజుల పాటు రిస్క్ ఎక్కువగా ఉంటుంది, గ్యారెంటీ ఇవ్వలేము" అని చెప్పారు. దాంతో నేను 'బాబానే దిక్కు, అంతా ఆయనే చూసుకోవాల'ని భారం ఆయన మీద వేసి బాబాను ప్రార్థించటం మొదలుపెట్టాను. బాబా నామస్మరణ, మృత్యుంజయ మంత్రజపం చేస్తూ గడిపాను. దయార్ద్రహృదయుడైన బాబా కరుణించారు. నెమ్మదిగా మావారి ఆక్సిజన్ లెవల్స్ పెరగటం మొదలై పదమూడవరోజు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. మా కర్మ ఫలితంగా మేము ఈ బాధ అనుభవించినప్పటికీ బాబా దయవల్ల ఆయన క్షేమంగా ఇంటికి వచ్చారు. ఆక్సిజన్ ఎక్కువ రోజులు తీసుకునేటప్పటికి బ్లాక్ ఫంగస్ భయం కూడా ఉండేది. కానీ బాబా చల్లని చూపు వల్ల మావారు ఆ ఫంగస్ బారిన పడలేదు. కానీ హై-డోస్ మెడిసిన్స్ ఇవ్వటం వల్ల ఆయనకు షుగర్ ఎటాక్ అయింది. అయితే అది కూడా మన తండ్రి సాయిబాబా దయవల్ల త్వరలోనే పూర్తిగా తగ్గిపోతుందని నాకు నమ్మకం ఉంది. నేను, మా బాబు ఇంట్లో ఉంటూనే బాబా దయవల్ల రికవరీ అయ్యాము. చల్లని తండ్రి బాబాకు శతకోటి ప్రణామాలు. మనందరినీ ఎల్లవేళలా చల్లగా చూడమని బాబాను ప్రార్థిస్తున్నాను.


చివరిగా, తోటి సాయిభక్తులకు నాదొక విన్నపం: "ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ అధైర్యపడకండి. బాబా దయవల్ల అందరూ చల్లగా ఉంటారు".


11 comments:

  1. Om Sri Sai Ram ��������

    ReplyDelete
  2. ఓం శ్రీ sai ram please bless my family. Sai you are our Lord.baba came in photo rup to that devotees house. Very happy baba give blessings, and appers in any form.my mom is not well. I want to visit her.but traveling is not safe what to do. Sai you are only hope.please guide us❤❤❤

    ReplyDelete
  3. Om Sree Sachidhanandha Samardha Sadguru Sainath Maharaj Ki Jai.. ❤🕉😊😀🙏

    ReplyDelete
  4. 🌺🌷🌻🌻🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🌻🌻🌷🌺

    ReplyDelete
  5. Kothakonda SrinivasJuly 16, 2021 at 3:30 PM

    ఓం సాయిరాం!

    ReplyDelete
  6. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  7. Om sai ram baba amma arogyam bagundali thandri pleaseeee

    ReplyDelete
  8. Baba ee gadda ni karginchu thandri

    ReplyDelete
  9. Baba santosh ki day shifts ravali thandri

    ReplyDelete
  10. Baba karthik ki thyroid taggipovali thandri

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo