1. పలికే దైవం బాబా
2. కరోనా నుండి, కడుపునొప్పి నుండి ఉపశమనం కలిగించిన బాబా
పలికే దైవం బాబా
సాయిబంధువులకు నా నమస్కారం. ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి నా కృతజ్ఞతలు. అందరినీ బాబాకు ఎంతో దగ్గర చేస్తున్న సాయికి బాబా ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఒక సాయిభక్తురాలిని. ఇంతకుముందు నేను కొన్ని అనుభవాలను ఈ బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలు మీతో పంచుకుంటున్నాను.
మొదటి అనుభవం:
2021, ఏప్రిల్ నెల మొదట్లో మా అన్నయ్యకి కరోనా పాజిటివ్ అని తెలిసింది. దాంతో అన్నయ్య వేరుగా ఒక గదిలో ఉండసాగాడు. అయితే రెండురోజుల తర్వాత మా అమ్మకి, వదినకి కొద్దిగా జలుబు, తలనొప్పి, జ్వరం వచ్చాయి. దాంతో వాళ్ళు కోవిడ్ టెస్ట్ చేయించుకున్నారు. ఉగాదిరోజున వాళ్ళకి కూడా కోవిడ్ పాజిటివ్ అని వచ్చింది. మా అమ్మ వయస్సు 70 సంవత్సరాలు. అందువలన నేను ఆందోళన చెంది, "బాబా! అమ్మని కోవిడ్ నుండి రక్షించండి. సచ్చరిత్ర సప్తాహపారాయణ చేస్తాను" అని బాబాను వేడుకున్నాను. వాళ్ళు ఆన్లైన్లో డాక్టర్ అపాయింట్‌మెంట్ తీసుకుని చికిత్స మొదలుపెట్టారు. ఐదు రోజుల తర్వాత ఆక్సీమీటరులో అమ్మ పల్స్ చూస్తే 94, 93 అని చూపించింది. వెంటనే తనను ఒక హాస్పిటల్‌కి తీసుకుని వెళ్లారు. అక్కడ సరైన వైద్యసదుపాయాలు లేవు. కనీసం ఐ.సి.యు కూడా లేదు. అందువలన వేరే హాస్పిటల్స్‌లో బెడ్ కోసం ప్రయత్నించారు. బాబా దయవల్ల ఒక కార్పొరేట్ హాస్పిటల్లో బెడ్ దొరికింది. దాంతో ఆ రాత్రి 7 గంటలకు అమ్మని హాస్పిటల్లో అడ్మిట్ చేసి అన్నయ్య ఇంటికి వచ్చాడు. రాత్రి గం.11:45 నిమిషాలకి హాస్పిటల్ నుంచి, "అమ్మ ఆక్సిజన్ లెవల్స్ తగ్గుతున్నాయి. పరిస్థితి చాలా క్రిటికల్‌గా ఉంది" అని అన్నయ్యకి ఫోన్ వచ్చింది. విదేశాలలో ఉన్న నాకు అన్నయ్య ఫోన్ చేసి విషయం చెప్పగానే ఒక్కసారిగా నా గుండె పగిలిపోయింది. చాలా ఏడుపు వచ్చింది. బాబా ఫోటో ముందు ఏడుస్తూ, "బాబా! అమ్మని బ్రతికించు. నాన్న కూడా లేడు. ప్లీజ్ బాబా" అని దీనంగా వేడుకున్నాను. అన్నదానానికి డబ్బులు కడతానని కూడా బాబాకు మ్రొక్కుకున్నాను. అన్నయ్యకి ఆస్తమా, పైగా కోవిడ్ కూడా. ఆ స్థితిలోనే తను అమ్మకోసం తిరుగుతున్నాడు. మరుసటిరోజు కూడా డాక్టర్స్ రెండు రోజుల వరకు ఏమీ చెప్పలేమన్నారు. నాకు ఏడుపు ఆగలేదు. అయినా బాబా మీద నమ్మకాన్ని కోల్పోలేదు. బాబా ఒక సాయిబంధువు ద్వారా "మీ అమ్మ ఒక వారం రోజుల్లో కోలుకుంటుంద"ని నన్ను సమాధానపరిచారు. దాంతో ఏదో తెలియని ధైర్యం వచ్చింది. చివరికి బాబా దయవల్ల అమ్మ ప్రాణాపాయ స్థితి నుండి బయటపడి వారం రోజుల తర్వాత ఇంటికి వచ్చింది. బాబా కృపతో అందరూ కోలుకున్నారు. "థాంక్యూ బాబా. థాంక్యూ సో మచ్".
రెండవ అనుభవం:
నా వయసు 30 సంవత్సరాలు. ఈ వయసులోనే నాకు 'సెర్వికల్ స్పాండిలైటిస్' సమస్య ఉంది. దానివల్ల ఒక్కోసారి మెడనొప్పి, తలనొప్పి లేదా ఎడమ చేయి లేదా ఎడమ భుజం, నడుము, కాళ్ళు విపరీతంగా నొప్పి వస్తుంటాయి. అవి వచ్చినప్పుడు నేను చాలా బాధని అనుభవిస్తుంటాను. రెండేళ్ల క్రితం వెన్నునొప్పి వచ్చి తగ్గింది. ఈమధ్య తలనొప్పి, మెడనొప్పి మొదలుకుని పైన చెప్పిన అన్ని నొప్పులూ వచ్చాయి. బాధను తట్టుకోలేక బాబా ముందు నిలబడి, "బాబా! మీ ఊదీ నుదుటన ధరించి, మరికొంత నీళ్లలో కలుపుకుని స్వీకరిస్తున్నాను. దయచేసి నీ మహిమ చూపి, అన్ని నొప్పులూ తగ్గించు తండ్రీ" అని వేడుకున్నాను. ఊదీతోపాటు బలానికి కొన్ని టాబ్లెట్లు మాత్రం వేసుకున్నాను. బాబా దయవలన నొప్పులు తగ్గాయి. పూర్వజన్మ పాపం వల్ల వచ్చిన ఇటువంటి బాధల నుండి బాబానే మనల్ని రక్షిస్తూ ఉంటారు. "థాంక్యూ బాబా".
మూడవ అనుభవం:
నా భర్త డాక్టరుగా పనిచేస్తున్నారు. 2021, ఏప్రిల్ 3న మావారి ఐడి కార్డు కనపడకుండా పోయింది. ఎంత వెతికినా దొరకలేదు. దారిలో ఎక్కడో పడిపోయి ఉంటుంది అనుకున్నాం. నేను ఈ బ్లాగులో ఒకసారి 'ఏదైనా వస్తువు కనపడకుండాపోతే, 'ఓం శ్రీసాయి సూక్ష్మాయ నమః' అనే నామాన్ని 108 సార్లు జపించి, బాబాను వేడుకుంటే ఆ వస్తువు దొరుకుతుంద'ని చదివాను. అది గుర్తొచ్చి, నేను అలాగే చేశాను. కానీ కార్డు దొరకలేదు. నా భర్త తన ఆఫీసులో విషయం చెప్పి, కొత్త ఐడి కార్డు కోసం దరఖాస్తు చేశారు. ఒకరోజు నేను నా మనసులో, 'అందరికీ బాబాకు చెప్పుకుంటే, పోగొట్టుకున్నవి దొరుకుతాయి.. నాకు మాత్రం ఎందుకు దొరకలేదు' అని అనుకున్నాను. తరువాత మే 24 లేదా 25వ తేదీన నేను మంచం మీద పడుకుని కళ్ళుమూసుకుని పక్కనే ఉన్న డ్రాయింగ్ టేబుల్ మీద నా సెల్ ఫోన్ పెట్టాను. అలారం మోగిన శబ్దానికి సెల్ ఫోన్, ఐడి కార్డు క్రింద పడ్డాయి. ఆ కార్డు చూసి నేను నిర్ఘాంతపోయాను. వెంటనే నా భర్తని అడిగాను. ఐడి కార్డు మావారు హాస్పిటల్‌కి వెళ్లే దారిలో పడిపోయింది. తెలిసిన ఒకతనికి ఆ కార్డు దొరికితే, అతను మావారికి ఇచ్చాడు. విదేశంలో, పోయిన వస్తువు తెలిసినవాళ్ల దృష్టిలో పడి, దొరకటం అంటే నిజంగా బాబా దయే. అది దొరికి రెండు రోజులైనా మావారు నాతో చెప్పకపోయేసరికి దాన్ని క్రిందపడేలా చేసి నా దృష్టికి తెచ్చారు బాబా. "బాబా! మీకు మాటిచ్చినట్లే అమ్మ ఆరోగ్యం, నా ఆరోగ్యం, ఇంకా ఐడి కార్డు విషయంలో మీ అనుగ్రహాన్ని తోటి భక్తులతో పంచుకున్నాను. ధన్యవాదాలు బాబా".
నాల్గవ అనుభవం:
కొన్నిరోజులుగా నా ముక్కు యొక్క ఒక రంధ్రంలో కొంచెం వాపులా ఉండి, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంది. దానివల్ల తలనొప్పి కూడా ఉంటోంది. కోవిడ్ సమయంలో డాక్టర్ వద్దకు వెళ్లడం ఎందుకని చాలా రోజులుగా నేను హాస్పిటల్‌కి వెళ్లకుండా ఏవో డ్రాప్స్ వేసుకుంటూ వచ్చాను. కానీ సమస్య నయం కాలేదు. దాంతో 2021, జూన్ 8న నేను డాక్టర్ దగ్గరకు వెళ్లాలని అనుకుంటుండగా ముందురోజు జూన్ 7న 'మహాపారాయణ గ్రూపులో చేరుతారా?' అని నాకు ఫోన్ వచ్చింది. ఆ రకంగా బాబా దయ నాపై ఉందని, ఆయన "నేనున్నాను" అని చెప్తున్నట్లు అనిపించింది. మరుసటిరోజు డాక్టర్ దగ్గరకు వెళ్ళాను. డాక్టర్ సీటీ స్కాన్ వ్రాశారు. దాంతో ఏదైనా పెద్ద సమస్య ఉందేమోనని నాకు భయం మొదలయింది. బాబా గుర్తుకొచ్చి, "ప్లీజ్ బాబా! చిన్న సమస్య అని చెప్పేలా చేయండి" అని బాబాకు మ్రొక్కుకున్నాను. ఇంకా, ఈ బ్లాగులో చెప్పుకుంటే, బాబాకు చెప్పుకున్నట్లేనని ‘నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన’ని కూడా బాబాతో చెప్పుకున్నాను. తరువాత బాబాని స్మరిస్తూ స్కాన్ చేయించుకున్నాను. డాక్టరు, "కొద్దిగా సమస్య ఉంది, నెల రోజుల పాటు మందులు వాడండి" అని చెప్పారు. అంతా బాబా దయ. “ధన్యవాదాలు బాబా. దయచేసి నీ ఈ బిడ్డను ఆరోగ్య సమస్యల నుంచి కాపాడు. మీ చల్లని దృష్టిని, దివ్యప్రేమను అందరిపై ప్రసరించండి”.
ఐదవ అనుభవం:
ఒకరోజు నేను బాబాకి, శివునికి అభిషేకం చేసి చందనం మరియు కుంకుమతో బొట్టు పెట్టాను. బాబా వెండి విగ్రహం యొక్క ఛాతీ భాగంలో పెట్టిన బొట్టులో బాబా ముఖం చాలా స్పష్టంగా దర్శనమిచ్చింది. శివునికి పెట్టిన కుంకుమబొట్టు బిల్వపత్రంలా వచ్చింది. బాబా అనుగ్రహానికి నాకు చాలా సంతోషం కలిగింది. ఫోటో జతపరుస్తున్నాను. మీరూ చూడండి.
కరోనా నుండి, కడుపునొప్పి నుండి ఉపశమనం కలిగించిన బాబా
ముందుగా సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్నవారికి నా కృతజ్ఞతలు. నేను సాయిభక్తురాలిని. ఇటీవల మా కుటుంబమంతా కరోనా బారినపడ్డాము. అందరమూ గృహ నిర్బంధంలో ఉంటూ చికిత్స తీసుకున్నాము. ఏమవుతుందో, ఏమిటోనని నాకు చాలా భయంగా ఉంటుండేది. అప్పుడు నేను, "అందరమూ త్వరగా కరోనా నుండి కోలుకుంటే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల అందరమూ క్షేమంగా ఉన్నాము. "ధన్యవాదాలు బాబా. త్వరగా మేము పూర్తిగా కోలుకునేలా దీవించు తండ్రీ".
ఆ తరువాత ఒకరోజు రాత్రి నేను నిద్రపోతున్న సమయంలో హఠాత్తుగా నా కడుపులో కుడిభాగంలో నొప్పి వచ్చింది. నాకు చాలా భయమేసి వెంటనే, "బాబా! ఉదయానికల్లా నొప్పి తగ్గిపోతే ఈ అనుభవాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకు మ్రొక్కుకున్నాను. ఉదయనికల్లా కడుపునొప్పి పూర్తిగా తగ్గిపోయింది. అంతా బాబా దయవల్లనే. "థాంక్యూ సో మచ్ బాబా. ఇలానే మమ్మల్ని అడుగడుగునా కాపాడుతూ ఉండండి బాబా. ఈ కరోనా బారినుండి ప్రజలందరినీ కాపాడు తండ్రీ".
Om Sri Sai Ram ��������
ReplyDeleteఓం శ్రీ sai ram you are our Lord. We believe you.you take care of us.today I am feeling low.your are my hope. Baba is blessing every one. Om sai ram ❤❤❤
ReplyDeleteOm Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha ❤🕉🙏😊
ReplyDeleteOm sai ram
ReplyDeleteOm sai Ram 🙏🙏
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
787 days
ReplyDeletesairam
Om sai ram baba amma problem tondarga cure cheyi thandri pleaseeee
ReplyDeleteBaba ee gadda ni karginchu thandri
ReplyDeleteBaba santosh life bagundali thandri
ReplyDeleteBaba karthik thyroid taggipovali thandri
ReplyDelete