సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 833వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

  1. ఎఱ్ఱగుడి బాబా మందిర విశేషాలు
  2.  కోరుకున్నట్లు అనుగ్రహించిన బాబా

ఓంసాయి శ్రీసాయి జయజయసాయి


సాయి విడిది:ఎఱ్ఱగుడి, కొలిమిగుండ్ల మండలం, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్.

ముందుగా బ్లాగువారికి ఒక మాట:


"నేనిప్పుడు పంచుకుంటున్న అనుభవాలు కేవలం శ్రీ శిరిడీ సాయి ఆజ్ఞతోనే వ్రాస్తున్నాను. నా ఈ అనుభవాలు ఒక గుడి గురించి అతిగా పొగిడినట్లు ఉంటుందని ఇంతకాలం నేను వీటిని మీకు పంపలేదు. కానీ, ఈ అనుభవాలను మీకు పంపమని ప్రతి గురువారం బాబా నాకు స్వప్నంలో సందేశమిస్తున్నారు. అందువలన వీటిని మీకు పంపుతున్నాను. ఈ అనుభవాలను 'బాబా పలుకులకు ఇస్తున్న గౌరవం'గా మీరు స్వీకరించండి. మీకు సమ్మతమైతేనే ప్రచురించండి".


సాయిభక్తులకు ఈ 'సాయి మహరాజ్ సన్నిధి బ్లాగ్' బాబా ఇచ్చిన అద్భుత వరం. ప్రతి సాయిభక్తుడు తాను పొందిన అనుభవాలను తోటి సాయిభక్తులతో పంచుకుంటూ అందరూ ఆనందం పొందేలా, సాయిపట్ల భక్తి మరింత పెంపొందేలా చేస్తున్న గొప్ప వేదిక. అత్యంత శ్రద్ధ, సబూరీలు ప్రదర్శిస్తూ ఈ బ్లాగును కళాత్మకంగా రూపొందిస్తున్న సాయిబృందానికి కృతజ్ఞతాశీస్సులు అందజేస్తున్నాను.


నా పేరు సూర్యనారాయణమూర్తి. మాది విజయనగర్ కాలనీ, హైదరాబాద్. ఇంతకుముందు బాబా నాకు ప్రసాదించిన అనుభవాలను తోటి సాయిభక్తులతో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను సాయి ఆజ్ఞగా మీకు తెలియజేస్తున్నాను. ఈ అనుభవాలన్నీ కూడా ప్రస్తుతం సాయి మహరాజ్ విడిది చేస్తున్న పైన చెప్పిన గుడితో ముడిపడి ఉన్నందున సంక్షిప్తంగా ఆ గుడి గురించి, అంటే ఎఱ్ఱగుడి సాయి మందిర విశేషాలు ముందుగా తెలియజేస్తాను. కొలిమిగుండ్ల మండలంలోని ఎఱ్ఱగుడి గ్రామం 1999 నుండి సుమారు ఎనిమిది సంవత్సరాలు క్షామంతో అల్లాడింది. బ్రతుకుతెరువు లేక ఎందరో ఆ ప్రాంతం వదిలి బెంగళూరు, కేరళ, హైదరాబాదు తరలిపోయారు. ఇట్టి పరిస్థితుల్లో ఆ మండల వాస్తవ్యులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఒకరు బాబా భక్తుడిగా మారుతున్న రోజులలో బాబాకు మ్రొక్కుకుని, ప్రముఖ సాయిభక్తులు, 'ఓంసాయి శ్రీసాయి జయజయసాయి' నామ ప్రచారకులు అయిన కీర్తిశేషులు దూబగుంట శంకరయ్యగారి సూచనమేరకు, వారి ఆధ్వర్యంలో 2008 వేసవికాలం చివరిలో 'ఓంసాయి శ్రీసాయి జయజయసాయి' ఏకాహ నామసంకీర్తన జరిపించారు. బాబా వరుణుడి అవతారంలో అదేరోజు రాత్రి 9 గంటలు మొదలుకుని రెండురోజులపాటు కుంభవృష్టి కురిపించారు. అది మొదలు నేటివరకు ప్రతి సంవత్సరం క్రమంతప్పకుండా ఆ ప్రాంతంలో వానలు పడుతూ ఉన్నాయి.


ఎఱ్ఱగుడి గ్రామం ఆ మండలంలోని మిగతా గ్రామాల రాకపోకలకు అనువుగా ఉండటం వల్ల బాబా ప్రేరణతో కొద్దిమంది గ్రామస్థులు అక్కడ బాబాకు ఒక మందిరం నిర్మించాలని సంకల్పించారు. కానీ అక్కడి ప్రజలు నిరుపేదలు, అమాయకులు. మరోప్రక్క అక్కడి ధనవంతులకు గుడి కట్టడం ఇష్టం లేకపోయింది. అయినప్పటికీ అపూర్వమైన బాబా ఆశీస్సులతో ఆ అమాయక ప్రజలు గుడికి కావలసిన స్థలాన్ని సేకరించి, చిన్నగా అక్కడ బాబా పూజలు చేయడం మొదలుపెట్టారు. 'బాబా అక్కడ కొలువై ఉన్నారా!' అన్నట్లు క్రమంగా చుట్టుప్రక్కల గ్రామాల నుండి విరాళాలు రాసాగాయి. చేతిలో చిల్లిగవ్వైనా లేకుండా ప్రారంభమైన మందిరం, నిర్మాణం పూర్తయ్యేనాటికి మందిర నిర్మాణ వ్యయం సుమారు రెండు, మూడు కోట్లకు చేరింది. ఆ సద్గురు కృపావిశేషంగా అంత మొత్తం ఏ ప్రయాస లేకుండా సమకూరింది. ఒక్క పైసా కూడా దుర్వినియోగం కాలేదని నేను సగర్వంగా చెప్పగలను. అలా చుట్టుప్రక్కల గ్రామాలకు చెందిన కొంతమంది నిస్వార్థ సాయిభక్తుల కృషితో 2017, మే 4న అద్భుతమైన సాయిమందిరం అక్కడ వెలసింది. ఈ నాలుగు సంవత్సరాలలో నేరుగా బాబా ఆదేశాన్ని అందుకున్న ఎంతోమంది సాధుసత్పురుషులు హిమాలయాల నుండి ఎంతో శ్రమకోర్చి ఆ మందిరాన్ని దర్శించారు. ఆ మందిరం నిర్మాణదశలో ఉన్నప్పుడు కీ.శే.శంకరయ్య గారి సలహామేరకు AMR గ్రూపు గిరీష్‌రెడ్డిగారు (శిరిడీలో బాబాకు బంగారు సింహాసనం సమర్పించింది ఈ సంస్థే) చక్కటి అందమైన బాబా విగ్రహాన్ని తెప్పించారు. బాబా విగ్రహం వచ్చిందని తెలిసి నేను, శ్రీశంకరయ్యగారు కలిసి అక్కడికి వెళ్తూ ప్రొద్దుటూరులోని శ్రీ కె.సుధాకర్‌రెడ్డిగారిని కలిసి వెళ్ళాము. ఆ సమయంలో నేను ధ్యానంలో ఉండగా బాబా సాక్షాత్కరించి, "ప్రస్తుతం ఈ ఎఱ్ఱగుడిని నా నివాసంగా మార్చుకుంటున్నాను. నా సూచనగా, ఆజ్ఞగా ఇక్కడి యాజమాన్యానికి చెప్పి, ఆ ప్రకారం మందిర నిర్వహణ జరిగేటట్లు చూడు" అని అన్నారు. నాకు అర్థం కాలేదు. ప్రక్కనే ఉన్న శ్రీశంకరయ్యగారితో విషయం చెప్పాను. ఆయన సజీవులుగా ఉన్నంతకాలం ఆ గుడి విషయం బాబాను అడిగి తెలుసుకోమని నన్ను ప్రోత్సహిస్తుండేవారు. ఇది అందరికీ నమ్మదగినదిగా ఉండకపోవచ్చు. ఆ గుడి ప్రారంభ సమయంలో నేను అమెరికాలో ఉన్నాను. అప్పుడు గానీ, ఈనాటికి గానీ నేను ఆ మందిరాన్ని దర్శించలేదు. కానీ గత నాలుగు సంవత్సరాలుగా అక్కడ ఏరోజు ఏవిధంగా పూజలు, అభిషేకాలు, ఆరతులు  చేయాలో బాబా తమకు కావలసిన విధంగా చెబుతూనే ఉన్నారు. వారి సూచనలను అక్కడి నిష్కల్మష సాయిభక్తులు ఆచరణలో పెడుతూనే ఉన్నారు. అట్టి అనుభవాలలో నుండి ఇటీవల జరిగిన రెండు అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకుంటాను.


1) ఎఱ్ఱగుడిలో సమర్పించాల్సిన టెంకాయలను బాబా శిరిడీలో స్వీకరించుట:


2020, కార్తీకమాసంలో నేను అమెరికాలో ఉన్నాను. అప్పుడొక గురువారంనాడు బాబా నాకు స్వప్నదర్శనమిచ్చి, మార్గశిరమాసంలో వచ్చే దత్తజయంతికి జరగాల్సిన పూజా వివరాలను తెలియజేశారు. "మార్గశిరమాసం ప్రారంభం నుండి పౌర్ణమి వరకు ఎఱ్ఱగుడిలో ప్రతిరోజూ ఉదయం విష్ణుసహస్రనామ పారాయణలు చేసి, తమను తలచుకుని ధునిలో ఒక టెంకాయను వేసేలా చేయమ"ని బాబా ఆదేశించారు. ఈ విషయం నేను అక్కడివారికి తెలియజేశాను. బాబా ఆదేశానుసారం అక్కడివాళ్ళు మందిరానికి వచ్చే భక్తులతో టెంకాయలను ధునిలో వేయించసాగారు. నేను బాబా ఆదేశం గురించి ఇంతకుముందు ప్రస్తావించిన సుధాకర్‌రెడ్డి దంపతులతో కూడా చెప్పాను. దాంతో, వాళ్లు చెరో 11 టెంకాయలు చొప్పున ధునిలో వేస్తామని బాబాకు మ్రొక్కుకున్నారు. ఈ విషయం నాకు తెలియదు. వాళ్ళు 2020, డిసెంబరు 30న ప్రొద్దుటూరులో బయలుదేరి ఎఱ్ఱగుడిలో బాబాకు టెంకాయలు సమర్పించి, కర్నూలు మీదుగా 2020, డిసెంబరు 31 నాటికి శిరిడీ చేరుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. అనుకున్నట్లే వాళ్ళు ఎఱ్ఱగుడి వెళ్లి బాబాను దర్శించుకుని, అక్కడ కమిటీలో ఉంటూ బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీశివయ్యగారితో కలిసి శిరిడీ ప్రయాణమయ్యారు. వాళ్ళు శిరిడీ చేరుకున్నాక బాయిజాబాయి వంశస్థుల ఇంట్లో బసచేశారు. రాత్రి వాళ్ళు వెళ్ళిన వాహనంలోని సామాన్లన్నీ దింపుతుండగా 22 టెంకాయలు కనిపించాయి. దాంతో, ‘ఎఱ్ఱగుడిలో టెంకాయలు సమర్పించలేద’ని వాళ్ళు చాలా బాధపడ్డారు. అది చూసిన పాటిల్‌గారు (బాయిజాబాయి వంశస్థుడు), "మీరు బాధపడవద్దు. మేము ఇప్పటికీ ప్రతిరోజూ మూడుపూటలా తాత్యా పేరు మీద బాబాకు భోజనం నివేదిస్తాము. రేపు క్రొత్త సంవత్సరం, 2021 జనవరి 1న మూడుపూటలా భోజనాలలో ఈ టెంకాయలు ఉపయోగిద్దామ"ని చెప్పారు. చెప్పినట్లే, ఉదయం కొబ్బరిపాలతో పాయసం, మధ్యాహ్నం కొబ్బరి అన్నము, కొబ్బరిపచ్చడి, రాత్రి కొబ్బరికోరుతో కూర చేసి బాబాకు నివేదించారు. మిగిలిన టెంకాయలను శిరిడీ సంస్థాన్ వారి అనుమతితో ధునిలో వేశారు. బాబా కరుణకు వాళ్ళు కన్నీళ్లపర్యంతమవుతూ ఆనందసాగరంలో మునకలేస్తూ అమెరికాలో ఉన్న నాకు ఫోన్ చేసి ఆ ఆనందాన్ని నాతో పంచుకున్నారు. నేను కూడా చాలా సంతోషించాను. ఆరకంగా ఆ గుడి విషయంలో నాకొచ్చిన స్వప్నం సరైనదేనని బాబా నిరూపించారు.


2) అక్షయతృతీయనాటి అనుభవం:


ఈ సంవత్సరం అక్షయతృతీయనాడు తమకు మామిడిపండ్ల రసం, పెరుగన్నం సమర్పించవలసిందిగా బాబా సందేశమిచ్చారు. బాబా ఆదేశం మేరకు 2021, మే 14 ఉదయం ఎఱ్ఱగుడిలో శిరిడీకి చెందిన శ్రీఅచ్యుతానందసాయిగారి ఆధ్వర్యంలో బాబాకు మామిడిపండ్ల రసంతో అభిషేకం చేసి, పెరుగన్నం నివేదించారు. అంతేకాదు, తమను అభిషేకించిన మామిడిపండ్ల రసాన్ని సంతానంలేని దంపతులకు పంచమని బాబా చెప్పగా, 11 మంది దంపతులు ఆ రసాన్ని స్వీకరించారు. కార్యక్రమమెంతో అద్భుతంగా జరిగింది.


3) హనుమాన్ జయంతి:


2021, జూన్ 4, శుక్రవారంనాడు రామాయణం ప్రకారం హనుమాన్ జయంతి అనీ, కృష్ణరామశివమారుత్యాది రూపాలలో ఉన్నది తామే గనుక తమకు 1,100 తమలపాకులతో ఎఱ్ఱగుడిలో పూజ జరపాలని బాబా సూచించారు. వారి ఆదేశం మేరకు ఆ విషయం కూడా అక్కడి కమిటీవారికి చెప్పాను. ఆ పూజ కూడా మహావైభవంగా జరిగింది. బాబా నాకు సూచనలు ఇవ్వడం, నా పరోక్షంలో వారి ఆదేశం మేరకు ఇవన్నీ జరగడం, ఇదంతా తమ భక్తుల మీద బాబాకున్న ప్రేమను తెలియజేస్తుంది. "బాబా! ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి నుండి అందరినీ రక్షించండి".


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


కోరుకున్నట్లు అనుగ్రహించిన బాబా


సాయిబంధువులకు నమస్కారం. నా పేరు చందన. బాబా నాకు చాలా అనుభవాలను ప్రసాదించారు. వాటిలోనుండి ఇటీవల జరిగిన ఒక అనుభవాన్ని ఇప్పుడు పంచుకుంటాను. నా ఉద్యోగానికి సంబంధించి 2021, జూన్ 7న రెండు పరీక్షలు జరగాల్సి ఉండగా కొన్ని టెక్నికల్ సమస్యల కారణంగా నేను సమయానికి నా లాప్‌టాప్‌లో లాగిన్ కాలేకపోయాను. దాంతో ఒక పరీక్ష రీ-షెడ్యూల్ చేసే పరిస్థితి ఏర్పడింది. అప్పుడు నేను, "ఆ పరీక్ష మరుసటిరోజే షెడ్యూల్ చేసినట్లైతే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. ఆశ్చర్యంగా ఆ పరీక్ష మరుసటిరోజుకి షెడ్యూల్ చేసినట్లు నాకు మెయిల్ వచ్చింది. బాబా ఆశీస్సులతో పరీక్ష బాగా వ్రాశాను. జూన్ 10న వెలువడిన ఫలితాల్లో నేను ఉత్తీర్ణురాలినయ్యాను. "థాంక్యూ సో మచ్ బాబా".


తరువాత నేను, "నా ట్రైనింగ్ సాఫీగా సాగితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాను ప్రార్థించాను. బాబా ఆశీస్సులతో నా ట్రైనింగ్ ఎంతో బాగా, సునాయాసంగా పూర్తయింది. బాబా అనుగ్రహంతో మొదటినెల జీతం కూడా అందుకున్నాను. నిజానికి నేను సాయి దివ్యపూజ చేస్తున్నప్పుడు, "నాకు ఉద్యోగం వచ్చినట్లైతే, మొదటినెల జీతం మీకు సమర్పించుకుంటాన"ని సాయిని ప్రార్థించాను. నా కోరికను సాయి తీర్చారు. ఇటీవల బాబా గుడికి వెళ్ళినప్పుడు ఆయనకు సమర్పిస్తాననుకున్న మొదటినెల జీతం ఇస్తున్నప్పుడు అక్కడున్న పూజారి ఎంతో సంతోషంగా తన అనుభవాన్ని నాతో ఇలా చెప్పారు: "కోవిడ్ కారణంగా ఆర్థికంగా చాలా కొరత ఉంది. ఇటువంటి స్థితిలో 'గురుపూర్ణిమ ఎలా జరపాలా' అని ఆలోచిస్తున్నప్పుడు నాకొక కల వచ్చింది. ఆ కలలో బాబా, 'నా భక్తులలో ఒకరు వచ్చి డబ్బిస్తారు' అని చెప్పారు" అని. బాబా ఆశీస్సులతో ఆయనకు చేయనున్న గురుపూర్ణిమ వేడుకలలో భాగస్వామినైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. "బాబా! మీ అనుగ్రహానికి చాలా చాలా ధన్యవాదాలు".


సర్వేజనాః సుఖినోభవంతు.


12 comments:

  1. Om Sai ram 🌹🌸💐🥀🌷🌺

    ReplyDelete
  2. Om Sai ram please bless all .my request is devotees must trust baba and take blessings from lord.Om Sai ram.Om Sai baba,Om lord bless

    ReplyDelete
  3. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha ❤😀🕉🙏😊

    ReplyDelete
  4. Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  5. Kothakonda SrinivasJuly 12, 2021 at 10:47 AM

    ఓం సాయిరాం!

    ReplyDelete
  6. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  7. 🌺🌷🌺🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🌺🌷🌺 🌺🌺Om Sri SaiRam 🌺🌺

    ReplyDelete
  8. Om sai ram baba amma arogyam bagundali thandri pleaseeee

    ReplyDelete
  9. Baba ee gadda ni karginchu thandri

    ReplyDelete
  10. Baba santosh ki putra santanam kalagali thandri

    ReplyDelete
  11. Baba karthik thyroid taggipovali thandri

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo