సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 836వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ముందు అలజడి రేపినా, తర్వాత మనలో విశ్వాసాన్ని నింపుతారు బాబా
2. బాబాని అర్థించినంతనే లభించిన అనుగ్రహం
3. బాబా ఊదీ అద్భుత ఔషధం

ముందు అలజడి రేపినా, తర్వాత మనలో విశ్వాసాన్ని నింపుతారు బాబా


సాయిబంధువులకు నా నమస్కారం. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్నవారికి నా ధన్యవాదాలు. నేను సాయిభక్తురాలిని. నాకు గురువు, దైవము అన్నీ సాయే. నా అనుభవాలను ఈ బ్లాగ్ ద్వారా మీ అందరితో పంచుకునే అవకాశాన్ని బాబా ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.


మొదటి అనుభవం:


2021, మే నెల మొదటి వారంలో మా బాబాయికి, అతని భార్యకి, తల్లికి కరోనా వచ్చింది. బాబా దయవలన ఆయన భార్యకి, తల్లికి తొందరగా తగ్గిపోయిందిగానీ ఆయనకు తగ్గలేదు. విజయవాడలోని ఒక హాస్పిటల్లో చికిత్స చేయించినప్పటికీ ఫలితం లేకపోయింది. డాక్టర్ హోప్స్ తక్కువ అన్నట్టు చెప్పారు. బాబాయి వాళ్ళ అన్నయ్య ‘ఎలాగోలా మా తమ్ముడికి నయం అయ్యేటట్టు చేయండి’ అని డాక్టరును చాలా వేడుకున్నారు. కానీ ఈ కరోనా ఎవరి మీద ఎలా పగబడుతుందో తెలియదు. బాబాయి పరిస్థితి చాలా విషమంగా ఉండేది. ఆయన వయస్సు 42 సంవత్సరాలు. ఇద్దరు చిన్నపిల్లలున్నారు. అందరమూ ఎంతో బాధపడి ఎన్నో పూజలు చేయించాము. ఒకరోజు డాక్టర్ మాతో, "ఇక్కడ మనకు అన్ని వసతులు అందుబాటులో లేవు కాబట్టి ఆయనను హైదరాబాద్ తీసుకుని వెళ్ళండి. అక్కడికి తీసుకుని వెళితే ఆయనకు నయమవ్వొచ్చు" అని చెప్పారు. కానీ హైదరాబాదులో బెడ్స్ దొరకటం చాలా కష్టం అయింది. చాలా ప్రయత్నం చేసిన మీదట ఒక హాస్పిటల్లో బెడ్ దొరికింది. దాంతో మా పెద్ద బాబాయి ఏదైతే అది అవుతుందని, దేవుడి మీద భారం వేసి అంబులెన్సులో బాబాయిని హైదరాబాద్ తీసుకుని వచ్చారు. బాబాయికి ఇక్కడ 15 రోజులు ట్రీట్మెంట్ జరిగింది. దేవుడి దయవలన ఆయనని వెంటిలేటర్ మీద పెట్టలేదుగానీ, ఆక్సిజన్ మీదనే ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇంజెక్షన్లు, ప్లాస్మా అన్నీ ఎక్కించినప్పటికీ ఆయనకి పల్స్ తగ్గుతూ ఉండేది. ఒకప్పుడు మా నాన్నగారు హాస్పిటల్లో ఉన్నప్పుడు మా బాబాయి మాతో ఉండి మాకు చాలా ధైర్యం చెప్పి చాలా సహాయం చేశారు. అలాంటి ఆయనను ఇటువంటి స్థితిలో నేను చూడలేకపోయాను. నేను మహాపారాయణలో సభ్యురాలిని. అందులో ‘సంకల్ప పారాయణ’ అని కష్టంలో ఉన్నవారికోసం 48 మంది సభ్యులు ఒకరోజు సచ్చరిత్ర పారాయణ చేస్తారు. నేను మా బాబాయి పేరు మీద సంకల్ప పారాయణ చేయించి బాబాపై నమ్మకం ఉంచాను. ఒకరోజు మా అమ్మ ‘క్వశ్చన్ అండ్ ఆన్సర్స్’ వెబ్‌సైటులో బాబాని అడిగి చూడమంది. అప్పుడు వెబ్‌సైట్ చూస్తే, "మత గ్రంథాలు చదవడం, వ్రాయడం జరుగుతుంది. మతపరమైన కార్యకలాపాలు జరుగుతాయి మరియు శుభపరిణామాలు జరుగుతాయి" అని వచ్చింది. బాబా సమాధానంతో మాకు కొంత ధైర్యం వచ్చింది. బాబా చెప్పినట్లుగానే క్రమంగా బాబాయి ఆరోగ్యంలో మెరుగుదల కనిపిస్తూ వచ్చింది. చివరికి కాస్త నార్మల్ స్థితికి చేరుకున్నాక బాబాయిని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేశారు. అయితే తరువాత కూడా బాబాయి కొన్నిరోజులు ఆక్సిజన్ మీద ఉన్నారు. బాబా ఆశీస్సులతో ఇప్పుడు బాబాయి పూర్తిగా కోలుకున్నారు. ముందు అలజడి రేపినా తర్వాత మనలో విశ్వాసాన్ని నింపుతారు బాబా.


మరో అనుభవం:


మచిలీపట్నంలో ఉండే మా అన్నయ్య కూతురికి కూడా కరోనా వచ్చింది. తను బి.ఫార్మసీ మొదటి సంవత్సరం చదువుతోంది. తనకి కూడా ఆక్సిజన్ దొరకక, హాస్పిటల్స్‌లో బెడ్స్ లభించక చాలా ఇబ్బందిపడింది. చివరికి ఖమ్మంలో బెడ్ ఉందంటే తనని అక్కడికి తీసుకుని వెళ్లారు. కానీ అక్కడి డాక్టర్ ఆ అమ్మాయి పరిస్థితి చూసి, "ఇక్కడ ట్రీట్మెంట్ సరిపోదు" అన్నారు. దాంతో అదేరోజు తనని హైదరాబాద్ తీసుకుని వచ్చారు. తనకోసం కూడా నేను ‘సంకల్ప పారాయణ’ చేయించాను. బాబా దయవలన తనకి కూడా క్రమంగా ఆరోగ్యం కుదుటపడటం మొదలై వారం తర్వాత డిశ్చార్జ్ చేశారు. ఇప్పుడు తను పూర్తిగా కోలుకుంది.


"థాంక్యూ సో మచ్ సాయీ. ఇలాగే అందరినీ కాపాడు తండ్రీ. మీకు చెప్పుకున్నట్లు నా అనుభవాలను పంచుకున్నాను సాయీ".


సర్వం శ్రీ సాయినాథ దివ్య చరణారవిందార్పణమస్తు!


బాబాని అర్థించినంతనే లభించిన అనుగ్రహం


నా పేరు సాయిరామ్. నేను మొదటినుండి సాయిభక్తుడిని కాదు, కానీ ప్రేమతో బాబా నన్ను తనవాడిగా చేసుకున్నారు. గత కొద్దిరోజులుగా నేను ఈ గ్రూపులో వస్తున్న అనుభవాలను ప్రతిరోజూ చదువుతున్నాను. ఇటీవల బాబా నాకు ప్రసాదించిన రెండు అనుభవాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. 


ఒకసారి నేను వేరే ఊరు నుండి మా ఊరికి బైక్ మీద వస్తున్నాను. మరో 5 నిమిషాల్లో ఇంటికి చేరుకుంటాననగా, హఠాత్తుగా ఒక గేదె అడ్డమొచ్చి క్రింద పడిపోయాను. దేవుడి దయవల్ల హెల్మెట్ ఉండటంతో చిన్న గాయాలతో బయటపడ్డాను. బండికి మాత్రం బాగా డామేజ్ అయింది. ఇన్సూరెన్స్ ఉండటంతో రిపేర్ కోసం బండిని షోరూమ్‌లో ఇచ్చాను. వాళ్ళు, “ఒక పార్ట్ లేదు, ఆర్డర్ పెట్టి తెప్పించాలి. వారం, పదిరోజులు పడుతుంది. రాగానే కాల్ చేస్తాము” అని చెప్పారు. సరేనని బండి ఇచ్చి వచ్చాను. వాళ్ళు చెప్పిన పదిరోజులు పూర్తయిన తరువాత నేను షోరూమ్‌కి వెళితే, “ఆ పార్ట్ ఇంకా రాలేదు. మరో రెండు రోజులు పడుతుంది” అన్నారు. అలాగే పదిహేను రోజులు గడిచాయి. బండి లేక ఇంట్లో చాలా ఇబ్బందులుపడ్డాము. ఈలోగా కరోనా వల్ల లాక్‌డౌన్ పెడతారని వార్తలొచ్చాయి. ఒకవేళ లాక్‌డౌన్ పెడితే బండి అక్కడే ఇరుక్కుపోతుందని నాకు చాలా భయం వేసింది. దాంతో షోరూమ్‌కి వెళ్లి గట్టిగా అడిగాను. వాళ్ళు సరైన సమాధానం చెప్పలేదు. పైగా లాక్‌డౌన్ వల్ల ట్రాన్స్‌పోర్ట్ సరిగా లేదని, ఇంకా వారం పడుతుందని అన్నారు. ఆరోజు గురువారం. నేను బాబా గుడికి వెళ్లి చాలా బాధపడుతూ, “సాయీ! ఎలాగైనా బండి వచ్చేలా చూడండి” అని ప్రార్థించాను. సాయి అద్భుతం చేశారు. మరుసటిరోజు ఉదయం షోరూమ్ వాళ్లే ఫోన్ చేసి, “ఈరోజు పార్ట్ వస్తోంది. వీలైతే సాయంత్రం బండి ఇచ్చేస్తాము” అని చెప్పారు. సరేనని సాయంత్రం వెళితే, “ఇప్పుడే వచ్చింది. ఇన్సూరెన్స్ మీద కదా, ఇప్పుడు ఇవ్వడం కుదరదు, రేపు ఇస్తామ”ని చెప్పారు. అలాగే మర్నాడు సాయంత్రానికి బండి ఇచ్చారు. అంతా సాయి దయ. "ధన్యవాదాలు సాయీ”.


మరో అనుభవం:


ఒకరోజు నాకు సడన్‌గా జ్వరమొచ్చినట్లుగా అనిపించింది. టెంపరేచర్ తక్కువగానే ఉండటంతో పారాసిటమాల్ వేసుకున్నాను. అయితే మూడు రోజులైనా జ్వరం తగ్గలేదు. మేముండే పట్టణంలో కరోనా ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఇంట్లో పెద్దవాళ్లు కూడా ఉన్నారు. నాకు చాలా భయమేసి వేరుగా గృహనిర్బంధంలో ఉంటూ టాబ్లెట్స్ వాడుతూ, ‘ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః’ అనే మంత్రాన్ని కూడా జపిస్తుండేవాడిని. కానీ లైట్ ఫీవర్ అలాగే కొనసాగుతుండేది. అప్పుడు ఎందుకైనా మంచిదని కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. రెండు రోజులైనా రిపోర్టు రాలేదు. నేను చాలా భయాందోళనలకు గురై బాబాకు నమస్కరించుకుని, “ఏమీ లేకుండా చూడు సాయీ. అలా చేస్తే నా అనుభవాన్ని ‘సాయి మహరాజ్ సన్నిధి’ బ్లాగులో పంచుకుంటాన”ని ఆర్తిగా ప్రార్థించాను. బాబా దయవలన మరుసటిరోజుకి నాకున్న లక్షణాలన్నీ తగ్గిపోయాయి. ఆరోజు సాయంత్రం కోవిడ్ నెగిటివ్ అని రిపోర్టు కూడా వచ్చింది. అది చూసి నాకు ఎంతో ఆనందంగా అనిపించి మనస్ఫూర్తిగా బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను.


ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!


బాబా ఊదీ అద్భుత ఔషధం


ముందుగా సాయినాథునికి నా శతకోటి వందనాలు. సాయిభక్తులందరికీ నమస్కారాలు. నేను సాయిభక్తురాలిని. మేము అమెరికాలో నివాసముంటున్నాము. బాబా నాకు ప్రసాదించిన రెండు అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను.


2021, జూన్ 6 తెల్లవారుఝామున అకస్మాత్తుగా నా కుడిభుజం చాలా నొప్పి పెట్టింది. నేను లేచి మంచినీళ్లు త్రాగి, మళ్ళీ పడుకోవాలని ప్రయత్నించాను, కానీ నిద్రపోలేకపోయాను. కారణం, నొప్పి అధికమవుతోందేగానీ తగ్గట్లేదు. ఇక్కడ అమెరికాలో ఎప్పుడు కావాలంటే అప్పుడు హాస్పిటల్‌కి వెళ్లే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని విని ఉన్నందున నేను చాలా భయపడ్డాను. సమయం గడుస్తున్న కొద్దీ నొప్పి భరించలేనంతగా పెరుగుతోంది. సరిగ్గా అప్పుడే నాకు 'సాయి మహరాజ్ సన్నిధి' గుర్తుకు వచ్చి, "నా నొప్పి తగ్గితే ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి మ్రొక్కుకుని, బాబా ఊదీని నీళ్లలో కలుపుకుని త్రాగి, మరికొంత ఊదీని నొప్పి ఉన్న ప్రాంతంలో పూసుకున్నాను. బాబా దయతో కాసేపట్లో నొప్పి తగ్గిపోయింది. మళ్ళీ వస్తుందేమో అని భయపడ్డాను, కానీ బాబా దయవలన రాలేదు. అంతా ఆయన చల్లని కృపాదృష్టి. "థాంక్యూ బాబా".


మరొక అనుభవం:


ఒకరోజు నేను వంట చేస్తున్నప్పుడు, అకస్మాత్తుగా నాకు పొలమారింది. దాంతో గొంతులో ఏదో అడ్డంపడినట్లై, వాయు సరఫరాకు అవాంతరం ఏర్పడి శ్వాస తీసుకోవడం నాకు కష్టమైంది. నేను, నా భర్త చాలా భయపడ్డాము. నేను ఎప్పుడూ బాబా ఊదీని నీళ్లలో కలిపి మా ఇంట్లో ఉంచుతాను. మావారు ఆ నీళ్ళు త్రాగమని నాకిచ్చారు. అవి త్రాగినంతనే శ్వాసలో ఏర్పడిన అవాంతరం తొలగి ఊపిరి అందింది. లేదంటే ఏమి జరిగి ఉండేదో అని నాకు భయం వేసింది. బాబా నా భర్తకి ప్రేరణనిచ్చి తమ ఊదీ కలిపిన నీళ్ళు నాకు అందించటం ద్వారా నాకు శ్వాసని ఇచ్చారు. "థాంక్యూ సో మచ్ బాబా. సదా నిశ్చలమైన మనస్సుతో మిమ్మల్ని ధ్యానించేలా నన్ను ఆశీర్వదించండి. తెలిసీ తెలియక చేసిన తప్పులను క్షమించండి బాబా".


సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!


10 comments:

  1. Om sai ram sri sai ram ����

    ReplyDelete
  2. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha ❤🕉😀🙏😊

    ReplyDelete
  3. Om Sri Sai Ram ��������

    ReplyDelete
  4. ఓం సా౦ుు బాబా అనంత కోటి రూపాల ప్రభువు అంచున నీ కు నమస్కారము చేసి నిన్ను ప్రేమించుచున్నానని తెలుపుతున్నాను.మమ్ములని కాపాడు తండ్రి. ఓం సా౦ుు తండ్రి ❤����������������

    ReplyDelete
  5. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  6. Om sai ram Baba amma arogyam bagundali thandri

    ReplyDelete
  7. Baba ee gadda ni karginchu thandri

    ReplyDelete
  8. Baba santosh life bagundali thandri

    ReplyDelete
  9. 🌺🌼🌷🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🌺🌼🌷

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo