సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 835వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా అనుగ్రహ చిహ్నాలు
2. బాబా లీల ఎంత గొప్పదో!
3. నేను పొందిన బాబా అనుగ్రహం

బాబా అనుగ్రహ చిహ్నాలు


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి. నా పేరు పి.సి.శేఖర్. నేను ఏడు సంవత్సరాలుగా బాబా భక్తుడిని. బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకుంటాను.


పిచ్చి సినిమాలను చూడకుండా చేసిన సాయిబాబా:


ఐదేళ్ల క్రితం నేను చిన్నపిల్లలకు ట్యూషన్ చెపుతుండేవాడిని. అప్పట్లో నేను ఎక్కువగా పిచ్చిపిచ్చి సినిమాలు చూస్తూండేవాడిని. అలా ఒకరోజు నేను సినిమా చూసి గదిలో నుంచి బయటకు వచ్చాను. ఒక చిన్నబాబు, 'పళ్ళు రాలగొడతా!' అని వచ్చీరాని తెలుగులో వ్రాశాడు. అది చూసిన నాకు ‘ఆ సద్గురు సాయినాథుడే ఆ పిల్లవాడి చేత అలా వ్రాయించారు’ అన్న భావన కలిగింది. అంతటితో నేను అటువంటి సినిమాలు చూడటం మానుకున్నాను.


ఇతరులను దూషించే అలవాటు కొంతవరకు మార్చిన బాబా:


నాకు మనస్సులో ఇతరులను దూషించడం అలవాటు. దాన్ని వదిలించుకోవాలని ఉన్నా నావల్ల కాలేదు. అప్పుడు నేను, "బాబా! ఈ దూషించే అలవాటును నేను ఎలా తగ్గించుకోవాలి?" అని బాబాను అడిగాను. తరువాత బట్టలు ఉతుకుతుంటే 'సాయి 1 గాడ్, సాయి 2 గాడ్, సాయి 3 గాడ్ .... సాయి 11 గాడ్' లేదా 'ఓంసాయి శ్రీసాయి జయజయసాయి' అని రోజూ అనుకోమని బాబా చెప్తున్నట్లుగా నా మనసులో ప్రేరణ కలిగింది. దానితో అలాగే 'సాయి 1 గాడ్, సాయి 2 గాడ్, సాయి 3 గాడ్ .... సాయి 11 గాడ్' అంటూ మళ్ళీ మళ్ళీ అనుకోవడం మొదలుపెట్టాను. అలా మనసులో మననం చేస్తుంటే ఇతరులను దూషించే అలవాటు కొంతవరకు తగ్గింది. పూర్తిగా తగ్గించమని బాబాను వేడుకుంటున్నాను. "థాంక్యూ బాబా".


సాయి నామస్మరణతో సమస్యను తొలగించిన సాయిబాబా:


ఇంతకుముందు నేను ఏ పని చేసినా ఏదో ఒక సమస్య వస్తుండేది. ఇప్పుడు నేను సాయి స్మరణ చేస్తూ, మనసులో సాయి రూపాన్ని ధ్యానిస్తూ పని చేస్తుంటే సమస్యలు రావడం లేదు. ఒకవేళ వచ్చినా వాటంతటవే తొలగిపోతున్నాయి. సాయి నామస్మరణ ఆపితే మళ్ళీ ఏదో ఒక సమస్య వస్తోంది. మీరు కూడా ఎల్లవేళలా సాయి నామస్మరణ చేస్తూ ఉండండి. ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారు. అలాగే సాయిబాబా మనకు మోక్ష మార్గం చూపిస్తారు. "థాంక్యూ సాయిబాబా".


ఫోనుకి సిగ్నల్స్ వచ్చేలా అనుగ్రహించిన సాయిబాబా:


2021, జూన్ 5న మా నాన్నగారి మొబైల్‌కి సిగ్నల్స్ రాలేదు. రెండు, మూడుసార్లు ఫోన్ ఆఫ్ చేసి ఆన్ చేసినా సిగ్నల్స్ రాలేదు. అప్పుడు నేను సాయిబాబాను స్మరించి, "ఫోనులో సిగ్నల్స్ వస్తే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాతో చెప్పుకున్నాను. తరువాత బాబాపై నమ్మకముంచి మరోసారి మొబైల్ ఆఫ్ చేసి ఆన్ చేశాను. అద్భుతం! బాబా దయవల్ల సిగ్నల్స్ వచ్చాయి.


కరోనా నుండి నా స్నేహితుణ్ణి కాపాడిన బాబా:


నా స్నేహితుడు ఒకతను పూజారిగా పనిచేస్తున్నాడు. తనకు ఈమధ్య కరోనా వచ్చింది. కరోనా ప్రభావం తనపై చాలా తీవ్రంగా ఉండటంతో నాకు చాలా భయంవేసి, తనకు నయమవ్వాలని బాబాను ప్రార్థించాను. అలాగే, నా స్నేహితునితో సాయి సచ్చరిత్ర చదవమని చెప్పాను. తను అలాగే చదివాడు. బాబా దయవల్ల తనకు కరోనా తగ్గింది. "సాయిబాబా! మీకు పాదాభివందనాలు. ఎల్లప్పుడూ ఇలాగే దయతో మమ్మల్ని కాపాడమని కోరుకుంటున్నాను బాబా". చివరిగా, ఈ అవకాశమిచ్చిన సాయికి, సాయి మహరాజ్ సన్నిధికి చాలా కృతజ్ఞతలు.


అందరూ బాగుండాలి, అందులో నేనూ ఉండాలి.


బాబా లీల ఎంత గొప్పదో!


అందరికీ నమస్కారం. నా పేరు శ్రీలక్ష్మి. ఈమధ్య జరిగిన ఒక అనుభవంతో నాకు బాబాపై మరింత నమ్మకం ఏర్పడింది. ఆ అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. ప్రస్తుతం ఈ కరోనా సమయంలో నేను ఇంటినుండే వర్క్ చేస్తున్నాను. రోజూలానే ఒకరోజు పనిచేసి ఫోన్ ఛార్జింగ్‌లో పెట్టి భోజనం చేయడానికి వెళ్లాను. ఆ తర్వాత ఎందుకో 'ఫోన్ చూడు' అని ఎవరో చెబుతున్నట్లు నా మనసుకి అనిపించింది. వెళ్లి చూస్తే, నా కాబోయే భర్త చేసిన మూడు మిస్డ్ కాల్స్ ఉన్నాయి. వెంటనే తనకి ఫోన్ చేస్తే, ‘9 సంవత్సరాల తన తమ్ముడికి యాక్సిడెంట్ అయ్యి తలకి పెద్ద గాయమైందనీ, ఈ సమయంలో శ్రీకాకుళం గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరైనా డాక్టరు ఉంటారా?’ అని అడిగారు. నేను కూడా అదే హాస్పిటల్లో పని చేస్తుండటంతో ‘మధ్యాహ్నం రెండు గంటలకి ఎవరూ ఉండర’ని తనతో చెప్పాను. దాంతో అతను, "వేరే డాక్టరుని సంప్రదించుదాం, నువ్వు కూడా రా" అని అన్నారు. సరేనని నేను వెంటనే బయలుదేరి వెళ్ళాను. మేము వెళ్లి చూసేసరికి ఆ అబ్బాయి అపస్మారక స్థితిలో ఉన్నాడు. తలకు మాత్రమే కాకుండా కాలికి, నాలుకకి కూడా గాయాలై బాగా బ్లీడింగ్ అవుతోంది. మేము ఎంతో భయపడ్డాం. తొమ్మిది సంవత్సరాల పిల్లవాడికి ఎందుకింత కష్టమని చాలా బాధపడ్డాము. వెంటనే ఆ అబ్బాయిని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌కి తీసుకుని వెళ్ళాము. మా సార్ ద్వారా ఒక న్యూరోసర్జన్‌ని ఫోన్లో సంప్రదించాము. ఆ సమయంలో తాను రాలేనని, ఫోన్లో సూచనిలిస్తానని ఆయన చెప్పారు. సరేనని మేము అబ్బాయి పరిస్థితి వివరంగా ఫోన్లో చెప్పగా డాక్టరు, "సీటీ స్కాన్ తీయించమ"ని సలహా ఇచ్చారు. అలాగే సీటీ స్కాన్ చేయించి, "బాబా! రిపోర్టులో బ్లడ్ క్లాట్ అయినట్లు ఏమీ రాకూడద"ని వేడుకున్నాను. బాబా దయవలన అంత పెద్ద గాయం అయినప్పటికీ బ్లడ్ క్లాట్ కాలేదు. కేవలం బోన్ విరిగింది. దాంతో డాక్టర్, "సమస్య ఏమీ లేదు. భవిష్యత్తులో ఏ సమస్యా లేకుండా సర్జరీ చేస్తే సరిపోతుంది" అని అన్నారు. నేను ఆ బాబాపై భారం వేసి, ఆపరేషన్ చేయమని డాక్టరుతో చెప్పాను. డాక్టర్ ఆ మరుసటిరోజు ఆపరేషన్ చేస్తానని అన్నారు. ఆరోజు అబ్బాయికి స్టిచెస్ వేసి, ఐ.సి.యులో ఉంచారు. మరుసటిరోజు డాక్టర్ వచ్చి ఆపరేషన్ మొదలుపెట్టారు. ఆపరేషన్ జరుగుతున్నంతసేపు నేను 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే మంత్రాన్ని జపిస్తూ, "ఆపరేషన్ సక్సెస్ అయి, అబ్బాయి సాధారణ స్థితికి వస్తే, ఈ అనుభవాన్ని తోటి భక్తులతో పంచుకుంటాన"ని బాబాకు మ్రొక్కుకున్నాను. బాబా దయవలన ఆపరేషన్ బాగా జరిగింది, అబ్బాయి బాగానే ఉన్నాడు. అయితే, ఇంటికి వచ్చిన తరువాత తన ప్రవర్తన వింతగా ఉన్నట్లు మేము గమనించాము. కానీ బాబా దయవలన రోజురోజుకీ తనలో కొంచెంకొంచెంగా మెరుగుదల వచ్చి ఇప్పుడు సాధారణ స్థితికి వచ్చాడు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఏ ప్రైవేట్ హాస్పిటల్లో అయినా డబ్బులు కట్టిన తరువాతే ఆపరేషన్ చేస్తారు. కానీ, వాళ్ళడిగినంత డబ్బు మా వద్ద లేదని చెప్పినా ఆ డాక్టర్ చాలా సానుకూలంగా స్పందించి, "డబ్బుది ఏముంది? నేను ముందు ఆపరేషన్ చేస్తాను" అన్నారు. బాబా లీల ఎంత గొప్పదో చూశారా! న్యూరోసర్జరీ అంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. పైగా అది పెద్ద హాస్పిటల్ అవ్వడంతో చాలా డబ్బులు అడిగారు. కానీ బాబా దయవల్ల చాలా తక్కువ డబ్బులతో ఆపరేషన్ పూర్తయింది. "థాంక్యూ సో మచ్ బాబా. ఆ చిన్నవాడి ప్రాణాలు కాపాడావు. నీ మీద నమ్మకం ఉంచితే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేస్తావు".


సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!


నేను పొందిన బాబా అనుగ్రహం

 

సాయిభక్తులందరికీ నా నమస్కారాలు. నేను ఒక సాయిభక్తురాలిని. మాది వైజాగ్. బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. ఒకరోజు మా నాన్నగారు తీవ్రమైన జలుబు, తలనొప్పితో బాధపడ్డారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల వలన అది కరోనా ఏమోనని నాన్న చాలా భయపడ్డారు. అప్పుడు నేను బాబాకు నమస్కరించుకుని, "బాబా! నాన్నకి కరోనా కాకుండా చూడండి. మీ అనుగ్రహంతో నా ఈ కోరిక నెరవేరితే ఈ అనుభవాన్ని మీ బ్లాగులో పంచుకుంటాను" అని వేడుకున్నాను. బాబా నా మొర ఆలకించారు. ఆయన దయవల్ల నాన్నకి కరోనా కాదని తేలింది. అది తెలిసి నేను చాలా ఆనందపడ్డాను. బాబాకు మనసారా ధన్యవాదాలు తెలుపుకున్నాను.


మరో అనుభవం:


మా చిన్న చెల్లికి మూడు నెలల క్రితం బాబు పుట్టాడు. అనుకోకుండా ఒకరోజు బాబు ఆరోగ్యం పాడైంది. అప్పుడు నేను బాబాకు నమస్కరించుకుని, "బాబా! మీ దయవలన బాబుకి నయమైతే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని వేడుకున్నాను. ఆ సాయినాథుని దయవల్ల బాబుకి నయమైంది. "ధన్యవాదాలు బాబా".


ఇంకో అనుభవం:


ఒకసారి హఠాత్తుగా మా అమ్మాయికి కళ్ళు తిరగసాగాయి. మేము నీరసం వల్ల అలా అవుతుందేమో అనుకున్నాం. కానీ మరుసటిరోజు కూడా అలానే ఉంది. దాంతో ఎందుకైనా మంచిదని తనను హాస్పిటల్‌కి తీసుకుని వెళ్ళాము. అక్కడ ఈసీజీ తీసి, "హార్ట్‌లో క్లాట్స్ ఉన్నాయి, పెద్ద హాస్పిటల్‌కి తీసుకెళ్ళండి" అన్నారు. సరేనని మా అమ్మాయిని పెద్ద హాస్పిటల్‌కి తీసుకుని వెళ్ళాము. వాళ్ళు 'రెండు రోజులు హాస్పిటల్లో ఉండాలి' అన్నారు. మాకు భయం వేసింది. అప్పుడు నేను బాబాని మనస్పూర్తిగా వేడుకున్నాను. బాబా దయవలన మా అమ్మాయి ఆరోగ్యం మెరుగుపడింది. ఇప్పుడు తను బాగుంది. "ధన్యవాదాలు బాబా. మమ్మల్ని ఎప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండేలా చూడండి".


9 comments:

  1. Om Sri Sai Ram ��������

    ReplyDelete
  2. ఓం సాయి నమోనమఃహ మీ సాయి లీలలు అధుబుతం.చదివిన తర్వాత సంతోషం కలుగుతుంది. బాబా మీ ఆశీస్సులు కావాలి. మీ అనురాగం కావాలి.

    ReplyDelete
  3. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😀😊❤

    ReplyDelete
  4. Om sai ram baba amma problem tondarga cure cheyi thandri pleaseeee

    ReplyDelete
  5. Baba eroju na birthday please bless me thandri

    ReplyDelete
  6. Baba ee gadda ni karginchu thandri pleaseeee

    ReplyDelete
  7. Baba santosh ki day shifts ravali thandri

    ReplyDelete
  8. Baba karthik ki thyroid taggipovali thandri

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo