ఈరోజు భాగంలో అనుభవం:
- నా జీవితంలోకి సాయి ప్రవేశం - ఆయన కురిపించిన ఆశీస్సులు
ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
గత 12 సంవత్సరాల నుండి నేను సాయిబాబా భక్తురాలిని. నాకు ఆయనపై చాలా నమ్మకం. కొంతకాలం నేను ఆయనకు దూరమైనప్పటికీ మళ్ళీ నన్ను తమ దగ్గరకు తీసుకున్నారు బాబా. "బాబా! ఎప్పుడూ మీ పవిత్రపాదాల నుండి నన్ను దూరం కానీయకండి".
మొదటి అనుభవం:
సుమారు 12 సంవత్సరాల క్రితం నేను గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు ఇంట్లోని ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువుతోపాటు నేను పార్ట్ టైం ఉద్యోగం చేయాల్సి వచ్చింది. కాబట్టి నేను ఇంటివద్ద ట్యూషన్లు చెప్పడం మొదలుపెట్టాను. కానీ తద్వారా వచ్చే డబ్బు నా ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి సరిపోయేదికాదు. అందువలన నేను ఉద్యోగం కోసం చాలాచోట్ల వెతికాను. ప్రతిచోటా గ్రాడ్యుయేషన్ కనీస అర్హతగా ఉండటంతో ప్రతిసారీ నాకు నిరాశే ఎదురయ్యేది. ఆ సమయంలోనే నేను ఒక ఇంటర్వ్యూకి హాజరయ్యాను. వాళ్ళు తమ కొత్త క్లయింట్ కోసం ఇంటర్నెట్ బేస్ ఉద్యోగాల కోసం నియామకాలు చేస్తున్నారు. మరీ అంత పెద్దపని కాకపోయినా నా అవసరాలకు సరిపోతుంది. అయితే వాళ్ళు కూడా నేను గ్రాడ్యుయేట్ కానందున నన్ను తీసుకోలేమని చెప్పారు. కానీ నా రెజ్యూమ్ ని వాళ్ళ వద్ద ఉంచుకున్నారు. నేను చేసేదిలేక ఇంటర్వ్యూకి హాజరుకాకుండానే తిరిగి వచ్చేశాను. రోజులు గడిచిపోయాయి, నేను కూడా ఆ ఉద్యోగం గురించి మరచిపోయాను.
మా ఇంటి పరిసరాల్లో ఒకతను ఉన్నాడు. అతను సాయిబాబా భక్తుడు. ఒకరోజు అతను సాయిబాబా ఫోటో ముందు ప్రార్థన చేస్తుండటం నేను చూశాను. నా మనసులో ఏమి జరిగిందో నాకు తెలియదు కాని, నేను వెంటనే ఇంటికి పరుగుతీశాను. మా ఇంటిలో ఒక సాయిబాబా క్యాలెండర్ ఉంది. దానిని కత్తిరించి ఫ్రేమ్ కట్టించడానికి షాపుకి వెళ్ళాను. అతను ఒకరోజు చెప్పి ఆరోజు రమ్మన్నాడు. ఇక జరగబోయే సాయిలీల చూడండి! అతను రమ్మన్న రోజు నేను షాపుకి వెళ్లి బాబా ఫోటో తీసుకున్నాను. ఇంటికి వస్తూనే నేను బాబా పటాన్ని గోడకు తగిలించి ఒక కుర్చీలో కూర్చుని బాబాను చూస్తూ ఉన్నాను. అందమైన బాబా రూపాన్ని చూస్తూ నేను మైమరచిపోయాను. ఆ ఆనందాన్ని వివరించడానికి నాకు పదాలు దొరకడంలేదు. ఆ సమయంలో నేను పొందిన ఆనందాన్ని, అనుభూతిని ఇప్పటికీ మరచిపోలేను. అలా ఆయన అందాన్ని ఆరాధిస్తుండగా నా ఫోన్ రింగ్ అయ్యింది. ఒక నెల ముందు నేను ఇంటర్వ్యూకి వెళ్లిన సంస్థ నుండి వచ్చిన ఫోన్ అది. ఆరోజు నాతో మాట్లాడిన అదే వ్యక్తి, "మాకు మరికొన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి. మీరు వచ్చి ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు" అని చెప్పారు. బాబా తన బిడ్డల అవసరాలను, కోరికలను ఎలా నెరవేరుస్తారో ప్రత్యక్షంగా చూస్తూ నేను ఆశ్చర్యపోయాను. ఆయన నేను గ్రాడ్యుయేట్ కాదనే అడ్డును తీసేశారని గ్రహించి పట్టలేని ఆనందంలో మునిగిపోయాను. బాబాకు కృతజ్ఞతలు చెప్పుకుని ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఆయన ఆశీస్సులతో అక్కడంతా సాఫీగా జరిగి నాకు ఉద్యోగం వచ్చింది. సాయంత్రానికల్లా నాకు ఆఫర్ లెటర్ వచ్చింది. మరుసటిరోజు నుండి నేను ఉద్యోగంలో చేరాను. నా ప్రక్కన కూర్చున్న వ్యక్తి నాతో, "ఒకతను తన ఉద్యోగాన్ని వదిలిపెట్టిన కారణంగా మరొకరిని తీసుకునే అవసరం ఏర్పడింది. ఆ స్థానంలో మీరు వచ్చారు" అని చెప్పారు. ఆ విషయం నాకు ఒకవైపు సంతోషాన్ని, మరోవైపు బాధను కలిగించింది. ఎందుకంటే, ఈ ఉద్యోగం నేను సంపాదించుకున్నది కాదని, నేను దీనికి అర్హురాలిని కాదేమోనని అనుకున్నాను. కానీ నా ఆలోచనలన్నింటినీ ప్రక్కనపెట్టి నాకు చేతనైనంత ఉత్తమమైన రీతిలో పనిలో నైపుణ్యాన్ని చూపించాను. మూడవ నెలలో పనిలోని నైపుణ్యాన్ని బట్టి మొదటి 25 మంది ఉద్యోగస్తులకి కంపెనీ బోనస్‌ను అందించింది. సాయిబాబా ఆశీస్సులతో నేను కూడా ఆ జాబితాలో ఉన్నాను. నాకన్నా ఎక్కువ అర్హత ఉన్నవాళ్లకంటే నేను బాగా చేశాను. ఆవిధంగా ఆ ఉద్యోగానికి నేను అర్హురాలినేనని బాబా తెలియజేసి నా మనసులో ఉన్న సందేహాన్ని తీసేశారు. ఒక సంవత్సరంపాటు నేను ఆ ఉద్యోగాన్ని చేశాను. నెమ్మదిగా మా ఇంట్లో పరిస్థితులు సాధారణస్థితికి చేరుకున్నాయి. దానితో మా నాన్నగారు, "ఇకపై నువ్వు పని చేయనవసరం లేదు, నీ చదువుపై దృష్టి పెట్టు" అని చెప్పారు. అప్పటినుండి నేను ఎప్పుడూ బాబాకు చాలా దగ్గరగా ఉండేదాన్ని. ఆయన తమ వైపుకు నన్ను ఇంకా ఇంకా లాగుతున్నారనే భావం నాలో కలుగుతూవుండేది.
రెండవ అనుభవం:
నేను గ్రాడ్యుయేషన్ పూర్తయిన తరువాత పీజీ కోర్సులో చేరాలని అనుకున్నాను. పీజీ ఉన్నతమైన కళాశాలలో చేయాలన్నది నా లక్ష్యంగా పెట్టుకున్నాను. అందువలన నేను గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరంలో ఉన్నప్పటినుండే ప్రవేశ పరీక్షలకోసం ప్రిపరేషన్ మొదలుపెట్టాను. అయితే నేను చాలా కష్టపడినప్పటికీ నామీద నాకు విశ్వాసం లేకుండా పోయింది. ఆ సమయంలో నాకు “సాయి దివ్యపూజ” గురించి తెలిసింది. అప్పటికే బాబాతో నాకున్న అనుభవాల కారణంగా వెంటనే నేను పూజ ప్రారంభించాను. నేను, "బాబా! దయచేసి నేను కోరుకునే కళాశాలలో నాకు ప్రవేశం వచ్చేలా సహాయం చేయండి" అని బాబాను ప్రార్థిస్తూ పూర్తి భక్తివిశ్వాసాలతో ఆయనను ఆరాధించాను. తరువాత నేను ప్రవేశ పరీక్షలు వ్రాసాను, కానీ నేను కోరుకున్న కళాశాలలో సీట్ వచ్చేందుకు సరిపడా ర్యాంక్ రాలేదు. అయినప్పటికీ నేను కలలుగన్న కాలేజీలో ప్రవేశం పొందనేమోనని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే నాకు బాబాపై పూర్తి నమ్మకం ఉంది. కౌన్సెలింగ్ రోజున నేను బాబా పేరు స్మరిస్తూ సెంటర్ కి వెళ్ళాను. నేను కలలుగన్న కాలేజీలోని చివరి సీటు మిగిలివుందన్న సమయానికి నాకన్నా ముందు 11 మంది విద్యార్థులు ఉన్నారు. నేను కొంచెం భయపడ్డాను కానీ, బాబా పరిస్థితిని చాలా చక్కగా తీర్చిదిద్దారు. నా ముందు ఉన్న వాళ్లంతా వేర్వేరు కాలేజీలను ఎన్నుకున్నారు. నేను కలలుగన్న కాలేజీలో నాకు సీటు వచ్చింది. ఈ విధంగా నా కలల కాలేజీలో ప్రవేశం పొందేందుకు బాబా నాకు సహాయం చేశారు. అంతకుముందు చాలా అవసరమైనప్పుడు ఉద్యోగం పొందడంలో కూడా ఆయన నాకు సహాయం చేశారు. బాబాపై ఆశలు వదులుకోవద్దని సాయిభక్తులందరినీ నేను అభ్యర్థిస్తున్నాను. ఏదైనా అనుకూలంగా జరగకపోయినా బాబా ఆశీర్వాదంగా స్వీకరించండి. ఎందుకంటే, కొన్నిసార్లు పరిస్థితులు మనకు తప్పుగా అనిపించవచ్చు, కానీ వాస్తవానికి అవి అలా ఉండవు. మన గురించి మనకంటే ఎక్కువగా బాబాకు తెలుసు. ఆయన మనకెప్పుడూ శ్రేయస్కరమైనదే చేస్తారు.

Sairam
ReplyDeleteఓం శ్రీ సాయిరాం జీ 🙏
ReplyDeleteJai sai ram
ReplyDeleteAmazing! This blog looks exactly like my old one! It's on a entirely different topic but it has pretty much
ReplyDeletethe same page layout and design. Outstanding choice of colors!
🕉 sai Ram
ReplyDeleteఓం శ్రీ సాయి రామ్ 🙏🙏🙏🙏🌹🌹🌹🌹🙏🙏🙏🙏
ReplyDelete