ఈ భాగంలో అనుభవాలు:
- సాయిబాబా నాపై కురిపించిన ఆశీస్సులు
- సాయి నా జీవితాన్ని చక్కగా అమర్చారు
సాయిబాబా నాపై కురిపించిన ఆశీస్సులు
సాయిభక్తురాలు సరిత తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు :
నేను సాయిబాబాకు చాలా సాధారణ భక్తురాలిని. నేను గత 6, 7 ఏళ్లుగా సాయిబాబాను ఆరాధిస్తున్నాను. అంతకుముందు నాకు ఆయనపై పెద్దగా నమ్మకం లేనందున ఎప్పుడూ ఆయనను ప్రార్థించేదాన్ని కాదు. అలాంటి నేను ఒకసారి నా బంధువు వద్దనుండి ఒక బాబా పుస్తకాన్ని తీసుకుని చదవడం మొదలుపెట్టాను. అప్పటినుండి నేను బాబాను నమ్మడం ప్రారంభించాను.
మొదటి అనుభవం:
2013, ఆగస్టులో మొదటిసారి నేను శిరిడీ వెళ్ళాను. అప్పడు నేను, "బాబా! ఒక సంవత్సరంలోపు మాకు పిల్లలు కలిగేలా ఆశీర్వదించండి. అలా జరిగితే నేను మళ్ళీ శిరిడీ వస్తాను" అని ప్రార్థించాను. బాబా దయతో 2014, ఆగస్టులో నేను కవలలకు జన్మనిచ్చాను. సరిగ్గా ఒక సంవత్సరంలో నేను కోరుకున్నట్లుగా బాబా నన్ను ఆశీర్వదించి, ఆయనపై నా విశ్వాసాన్ని పెరిగేలా చేశారు.
రెండవ అనుభవం:
గత కొన్నినెలల క్రితం దాదాపు ప్రతిరోజూ నేను తలలో ఎడమవైపు నొప్పితో బాధపడ్డాను. ఆ నొప్పి ఒకేవైపు ఉంటున్నందున ఏమవుతుందోనని నేను చాలా భయపడ్డాను. అందువలన సి.టి.స్కాన్ చేయించుకోడానికి డాక్టర్ వద్ద అపాయింట్‌మెంట్ తీసుకున్నాను. క్యాబ్ లో ఆసుపత్రికి వెళ్తూ, "బాబా! పెద్ద సమస్య ఏమీ ఉండకూడదు. అంతా నార్మల్ గా ఉండేలా చూడండి. ఈ నొప్పి త్వరలో తగ్గిపోయేలా చేయండి" అని బాబాను ప్రార్థించాను. అలా బాబాకు చెప్పుకుంటూ నేను క్యాబ్ నుండి బయటకు చూశాను. ఆశ్చర్యం! నేను ఒక పోస్టర్ మీద బాబాను చూసాను. ఆయనను చూడగానే నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఆయన నాతో ఉన్నానని చెబుతున్నారని నాకు అనిపించింది. తరువాత డాక్టర్, "ఇది సైనస్, జస్ట్ కాలానుగుణంగా వచ్చేదే. భయపడాల్సిన పనిలేదు" అని చెప్పి కొన్ని మందులు ఇచ్చారు. కొద్దిరోజుల్లో తలనొప్పి పూర్తిగా తగ్గిపోయింది. ఇదంతా బాబా ఆశీర్వాదం వల్లనే. "చాలా చాలా ధన్యవాదాలు బాబా! లవ్ యూ బాబా!"

సాయి నా జీవితాన్ని చక్కగా అమర్చారు
USA నుండి ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
సాయిభక్తులందరికీ సాయిరామ్! బ్లాగు వలన చాలా పాజిటివ్ ఎనర్జీని, సాయిబాబాపై మరింత నమ్మకాన్ని పొందుతున్నాము. నేను చాలా సాయి లీలలు అనుభవించాను. వాటిలో ఒక ముఖ్యమైన లీలను నేనిప్పుడు మీతో పంచుకుంటాను. ఇది చెప్పేముందు నాపై ఆశీస్సులు కురిపిస్తున్న దేవుళ్లందరికీ నా కృతజ్ఞతలు.
నాలుగేళ్ళ క్రితం నా తల్లిదండ్రులు నాకోసం సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. చాలా తక్కువ సమయంలో, అంటే అదే నెలలో మ్యాట్రిమోనీ ద్వారా ఒక సంబంధం వచ్చింది. అతను యు.ఎస్.ఎ. లో ఉంటున్నాడు. పైగా అతను కూడా బాబా భక్తుడే. ప్రారంభంలో అంతా సవ్యంగా జరిగి 2016 జూన్ నెలలో వివాహాన్ని నిశ్చయించారు. కానీ కొన్నినెలల తరువాత వాళ్ళు అకస్మాత్తుగా ఎక్కువ మొత్తంలో కట్నం ఆశించారు. అది మావాళ్ళు అస్సలు ఊహించలేదు. నిజంగా అది మా కుటుంబానికి చాలా పెద్ద భారం. వాళ్ళడిగిన దానిలో సగం మాత్రమే మావాళ్లు నెరవేర్చే స్థాయిలో ఉన్నారు. అప్పటికీ నా సోదరుడు పెళ్ళైన తర్వాత వాటిని సమకూరుస్తానని వాళ్ళతో చెప్పి ఒప్పించడానికి ప్రయత్నించాడు. కానీ వాళ్ళు అస్సలు ఒప్పుకోక సంబంధాన్ని రద్దు చేసుకున్నారు. దాంతో నేను నిరాశకు గురై పూర్తిగా కృంగిపోయాను. నా ఉద్యోగంపై దృష్టి పెట్టలేకపోయాను. నాకంతా చీకటిగా అనిపించింది. ఆ చీకటి నుండి బయటపడటానికి మిరాకిల్స్ కోసం గూగుల్ లో వెతికాను. అప్పుడొక బాబా ఫోటో నా దృష్టిలో పడింది. దానిపై "సదా సాయి గురించి ఆలోచించు. ఆయన మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటారు" అని ఉంది. అది నన్ను చాలా తేలికపరిచింది. ఆ మనోహరమైన పదాలతో నేను చలించిపోయి బాబా గురించి మరింత సమాచారం కోసం శోధించాను. అప్పుడు భక్తుల అనుభవాలతో ఉన్న ఇంగ్లీష్ బ్లాగు నా దృష్టిలో పడింది. అది నిజంగా అద్భుతమైన క్షణం. భక్తుల అనుభవాలు చదువుతూ ఆ బ్లాగుకు నేను బానిసనైపోయాను. నవగురువార వ్రతం కూడా మొదలుపెట్టాను. 2016, జూన్ 9వ తారీఖు నా వ్రతంలో 7వ వారం. ఆరోజు నాకు మరో వివాహ ప్రతిపాదన(నా భర్త) వచ్చింది. కానీ తరువాత వాళ్ళనుండి ఎటువంటి సమాధానం రాకపోవడంతో వాళ్లకు ఈ సంబంధం ఇష్టంలేదేమోనని మేము భావించాము. తరువాత 2017లో మరికొన్ని సంబంధాలు వచ్చాయిగాని వేటినుండీ సానుకూల స్పందన రాలేదు. చివరికి రెండేళ్లక్రితం, 2018లో నా నవగురువార వ్రతం 7వ వారంలో వచ్చిన సంబంధం వాళ్ళు మళ్ళీ మా కుటుంబాన్ని సంప్రదించారు. అంతా సక్రమంగా జరిగి బాబా ఆశీస్సులతో మా వివాహం నిశ్చయమైంది. నా పెళ్లికి రమ్మని బాబాను ఆహ్వానించాను. నా ప్రియమైన సాయి ఫోటో రూపంలో నా పెళ్ళికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. ఈరోజు నేను బాబా దయవలన నన్నెంతో ప్రేమించే భర్తతో USAలో సంతోషంగా ఉన్నాను. నేను ఇంకా ఏమి అడగగలను? నా ప్రియమైన సాయి నా జీవితాన్ని చక్కగా అమర్చారు. ఆయన భక్తురాలినవ్వడం నేనెంతో ఆశీర్వాదపూర్వకంగా భావిస్తున్నాను. ఆ కష్టకాలంలోని ప్రయాణం నా జీవితంలో విషయాలను నిర్వహించుకోగలిగేంత బలాన్నిచ్చింది. సంబంధాల కోసం చూస్తున్న ఇతర భక్తులకు నా అనుభవం ఒక ఉదాహరణగా ఉంటుంది. సాయి మీ ప్రార్థనలకు ఖచ్చితంగా సమాధానం ఇస్తారు. ఆయనపై విశ్వాసముంచి సహనంతో ఉండండి.
అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
anantakoti brahmandanayaka rajadiraja Yogi Raja parahbrahma Sri sachchidananda Samantha sadguru sainath maharajuki jai
ReplyDelete🕉 sai Ram
ReplyDelete