ఈరోజు భాగంలో అనుభవాలు:
- కేవలం నామస్మరణతో బాధలన్నీ తీర్చేస్తారు బాబా
- సాయి కృపతో నేనిప్పుడు గర్భవతిని
కేవలం నామస్మరణతో బాధలన్నీ తీర్చేస్తారు బాబా
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
నా పేరు రజని. సాయిబాబా నాకు ఎన్నో అనుభవాలు ప్రసాదించారు. వాటిని మీతో పంచుకునే అవకాశం ఇచ్చినందుకు ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా ధన్యవాదాలు. ఇలాంటి అవకాశం వచ్చిందంటే బాబా దయవల్లనే.
నేను 10వ తరగతి పూర్తిచేశాక పాలిటెక్నిక్ కళాశాలలో చేరాను. మొదటి సంవత్సరమంతా ఇష్టంగా కష్టపడి చదివాను. చివరికి పరీక్షల సమయం వచ్చింది. మరుసటిరోజు నుంచి పరీక్షలు మొదలవబోతున్నాయని నేను చాలా శ్రద్ధగా చదువుతూ ఉన్నాను. హఠాత్తుగా మా నాన్నగారు కళ్ళుతిరిగి పడిపోయారు. మేము తేరుకునేలోపే ఆయన హార్ట్‌ఎటాక్ తో మరణించారు. ఇక మానాన్న లేరనే నిజాన్ని తట్టుకోలేకపోయాము. ఆయన మరణంతో మా పరిస్థితి ఏమిటో మాకే అర్థం కాలేదు. 6 నెలలు గడిచాక, నేను చదివే కళాశాల ఆర్థిక ఇబ్బందుల వల్ల మూసేశారు. అప్పటికే ఆ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులందరికీ వేర్వేరు కళాశాలల్లో సీట్లు కేటాయించారు. మాఇంట్లో కూడా ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. ఆ కారణంగా నావల్ల ఇంకా సమస్యలు రాకూడదని నాకు చదువు మీద ఆసక్తి లేదని చెప్పి చదవడం ఆపేసాను. నిజానికి నాకు చదువుకోవాలని చాలా కోరికగా ఉండేది. ఆ తరువాత కొంతకాలానికి మా ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోయాయి. దాంతో నేను చాలాసార్లు నా చదువు కొనసాగించాలని చాలా ప్రయత్నించాను. కానీ నేను చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యేవి. నా జాతకం ప్రకారం నాకు చదువుకునే అవకాశం లేదని, ఎంత చదివినా విఫలం అవుతానని చెప్పడంతో నేను చాలా నిరాశచెందాను. తరువాత నేను బాబావారి లీలలు చదువుతున్నప్పుడు ఒక లీల మాత్రం నాకు సంబంధించినదానిలా అనిపించింది. ఆ లీలలో బాబా ఏం చెప్పారంటే - "ఈ జాతకాలు, కుండలినీలు నా బిడ్డను మార్చలేవు. నేను చెబుతున్నాను, పట్టువదలకుండా ప్రయత్నిస్తూనే ఉండు. విజయం నీదే" అని. అదేసమయంలో మా నాన్నగారి ఎల్.ఐ.సి డబ్బులు వచ్చాయి. కానీ మాఅమ్మ, ఆ డబ్బులు నీపెళ్ళికి తప్ప వేరేదానికోసం ఖర్చు పెట్టను" అని ఖండితంగా చెప్పింది. దాంతో నేను కోపం తెచ్చుకుని రెండురోజులు భోజనం చేయడం మానేశాను. ఆ రెండు రోజులూ నేను బాబా నామస్మరణ చేస్తూ ఉండడం వల్ల నాకు ఆకలిగానీ, దాహంగానీ ఏమి వేయలేదు. రెండు రోజుల తరువాత మా అమ్మ నా దగ్గరకు వచ్చి, బాబా ఊదీ నా నుదుటిపై పెట్టి, 'నిన్ను చదివిస్తా' అని చెప్పింది. నా కోరిక తీర్చినందుకు నేను ఎంతో ఆనందంతో బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఒక ముఖ్య విషయం ఏమిటంటే, నాకు ఎప్పుడైనా ఆందోళన కలిగితే ఈ బ్లాగ్ ద్వారా నాకు బాబా ఆన్సర్ చేస్తున్నారు. పిలిస్తే పలికే దైవం బాబా. కేవలం నామస్మరణతో బాధలన్నీ తీర్చేస్తారు. "మీకు చాలా ధన్యవాదాలు బాబా! మీ చల్లని చూపు మా కుటుంబంమీద, సాయిభక్తులమీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను".

సాయి కృపతో నేనిప్పుడు గర్భవతిని
సాయి భక్తురాలు పింకీ బాబా తనకిచ్చిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
హలో అందరికి,
నేను ఒక సాధారణ సాయి భక్తురాలిని. ఈరోజు సాయి దయతో నేను ఒక అనుభవాన్ని మీ అందరితో పంచుకోవాలి అనుకుంటున్నాను. దయచేసి నా ఈ అనుభవాన్ని బ్లాగులో ప్రచురించి నాకు మరింత ఆనందాన్ని కలగచేయండి.
నేను మావారు చాలాకాలంగా సంతానంకోసం ఎదురు చూస్తున్నాము. కాని మాకు ఆ భాగ్యం దక్కట్లేదు. నా తోటి స్నేహితులందరికి పిల్లలు ఉన్నారు. నాకు మాత్రం ఎందుకు కలగడం లేదని చాలా బాధగా అనిపించేది. ఒకరోజు సాయికి గట్టిగా దండం పెట్టుకుని, "నాకు కూడా సంతానాన్ని ప్రసాదించండి" అని ప్రార్ధించాను. అలాగే కొన్నిరోజులు గడిచిపోయాయి. ఒక నెలక్రితం నాకు కడుపులో చెప్పలేనంత నొప్పి వచ్చింది. అది పీరియడ్స్ కి సంబంధించిన నొప్పి. అయితే ఎప్పుడూ ఉండే నొప్పికంటే ఈసారి చాలారెట్లు అధికంగా ఉందని అనిపించింది. నాకు ఉన్నటుండి శరీరం అంతా చెమటలు పట్టేసాయి. నొప్పి తట్టుకోలేక కిందపడి పొట్టని పట్టుకుని బాధతో 'అమ్మా అమ్మా' అంటూ అరవడం మొదలుపెట్టాను. మావారు పరుగున వచ్చి "ఏమైంది? పద! హాస్పిటల్ కి వెళ్దాం" అన్నారు. నొప్పితో విలపిస్తూనే నేను మావారితో, "అదేమీ వద్దు. ఈ నొప్పి ప్రతినెల ఉండేదే, కాస్త ఆ పక్కన ఉన్న డబ్బాలో టాబ్లెట్ ఉంటుంది ఇవ్వండి" అని అడిగాను. ఆయన ఇస్తే, నేను వేసేసుకున్నాను. నొప్పి తగ్గడానికి బదులుగా, నొప్పి తీవ్రత ఇంకా ఎక్కువైంది. చూస్తే! ఆ టాబ్లెట్స్ ఎక్స్ పైరీ డేట్ అయిపోయి రెండు సంవత్సరాలు అయింది. దాంతో నాలో ఆందోళన పెరిగిపోయింది. వెంటనే సాయిని తలుచుకుని, "బాబా! ఎలా అయినా నాకు నొప్పిని తగ్గించండి. అస్సలు తట్టుకోలేకపోతున్నాను. నాకు మీరు తప్ప ఎవరులేరు. దయచేసి నాకు సహాయం చెయ్యండి" అని కళ్ళు మూసుకుని ఏడుస్తూ ప్రార్థించాను. తర్వాత మా వారు వెళ్లి వేరే టాబ్లెట్ తెచ్చి ఇచ్చారు. కాసేపటికి నొప్పి కొంచెం కుదుటపడింది. మా వారు, "ఎందుకైనా మంచిది ఒకసారి డాక్టర్ కి చూపించుకో" అని చెప్పారు. అందుకు నేను సరేనని ఒకరోజు డాక్టర్ అపాయింట్‍మెంట్ తీసుకుని, డాక్టర్ ని కలిసి నా పరిస్థితి అంతా వివరించాను. తాను నాతో "అల్ట్రాసౌండ్ చెయ్యాలి, అలా అయితే సమస్య ఏంటో చూడొచ్చు" అని చెప్పారు. సరేనని నేను అల్ట్రాసౌండ్ చేయించుకున్నాను. రిపోర్ట్స్ వచ్చాక డాక్టర్ చూసి "ఓవరీ పైన చిన్నసిస్ట్(తిత్తి) ఉంది. కాని అది స్పష్టంగా లేదు" అని చెప్పారు. "అది కాన్సరో, కాదో తెలుసుకోవడానికి MRI స్కాన్ చెయ్యలి" అని కూడా చెప్పారు. కొంచం భయం వేసినా కూడా, సరే చెయ్యండి అని వేరే ఒక అప్పాయింట్‍మెంట్ తీసుకుని స్కాన్ చేయించుకున్నాను. తరువాత ఒకరోజు డాక్టర్ ఆఫీస్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. "మేము చెప్పేది ధైర్యంగా వినండి, మీ ఓవరీ పైన చిన్నసిస్ట్ ఉంది. అది కాన్సర్ కి సంబంధించినది కాదు. కానీ మీ కండరాల్లో కణజాలం అధికంగా ఉన్నట్టు కనిపిస్తుంది. అది గర్భాశయాన్ని నిరోధిస్తుంది. దానివల్ల పిల్లలు పుట్టడం కష్టం" అని చెప్పారు. అది వింటూనే పిల్లలకోసం తపిస్తున్న నా హృదయం బద్దలైపోయింది. ఎంతగానో ఏడ్చాను. ఈ వార్త తెలిసి మావారు ఎలా ఫీల్ అవుతారో అని భయమేసింది. ఎన్నో కలలుకన్న మాకింక జీవితంలో పిల్లలు పుట్టడం కష్టమని తెలిసి చాలా క్రుంగిపోయాను. ఆ బాధలో నేను "బాబా! నేను ఏమితప్పు చేసానని నాకింత పెద్దశిక్ష వేసారు. నాకింకా జీవితంలో పిల్లలు కలిగే భాగ్యం లేదా? నేను మాత్రం మీ బిడ్డను కాదా? నాపై మీకు దయలేదా? అమ్మ అనే పిలుపుకు నన్ను దూరం చేయకండి. నాకు మీరు తప్ప వేరే దిక్కు లేదు బాబా, నాపై కరుణ చూపి నాకు సంతానాన్ని ప్రసాదించండి" అని ప్రార్థించాను. నామొర బాబాకు వినపడింది కాబోలు! అదే నెల నాకు పీరియడ్ మిస్ అయ్యింది. టెస్ట్ చేసుకుంటే ప్రెగ్నెంట్ అని తెలిసింది. అయినా కూడా డాక్టర్ దగ్గరకు వెళ్ళాను. వాళ్ళు కూడా ప్రెగ్నెంట్ అని చెప్పేసరికి నా ఆనందానికి అవధులు లేవు. నాకుకూడా ఒక చిన్నబేబీ పుడుతుంది అని చాలాచాలా సంతోషమేసింది. ఇది నిజంగా నిజమా!! అని నేను నమ్మలేకపోయాను. బాబా తప్ప ఎవరు చేయగలరు ఇలాంటి అద్భుతం. నా మనసులోని బాధను గుర్తించి నాకు సహాయం చేసిన బాబాకు జన్మజన్మలు ఋణపడి ఉంటాను. సర్వం సాయినాథార్పణమస్తు !!
"థాంక్యు సోమచ్ బాబా. సదా మీప్రేమ మాపై కురిపించి మమ్ములను ఆనందభరితులని చేస్తున్నందుకు".
ఓం సాయిరామ్!!!
Omsairam
ReplyDelete