ఈరోజు భాగంలో అనుభవాలు:
- దొంగ బారినుండి కాపాడిన బాబా
- బాబా చిలుము నాకు బలాన్నిచ్చింది.
దొంగ బారినుండి కాపాడిన బాబా
ఓం సాయిరామ్! సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు పద్మ. నేను ఖమ్మం నివాసిని. ముందుగా ఈ బ్లాగు నిర్వాహకులకు ధన్యవాదాలు. ప్రతిరోజూ నేను బ్లాగులోని సాయి లీలలు తప్పకుండా చదువుతూ చాలా ఆనందాన్ని పొందుతున్నాను. 2017, అక్టోబరులో జరిగిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. ఆరోజు గురువారం. ఉదయం 11-12 మధ్యలో ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఇంటి ముందుతలుపులు మూసేసి పెరట్లో పని చేసుకుంటున్నాను. పనులన్నీ పూర్తయ్యాక చెత్త బయట పడేద్దామని చేతిలో చెత్తడబ్బాతో వెనకనుండి ముందుకి వచ్చేసరికి, ముందుతలుపుల వద్ద ముఖానికి మాస్క్ కట్టుకుని ఒకడు నిలబడివున్నాడు. నాకు భయమేసి, "ఎవరు నువ్వు?" అని అడిగాను. వాడు ఉలుకూ పలుకూ లేకుండా అలాగే నిలబడివున్నాడు. మా బంధువులెవరైనా తమాషాగా నన్ను భయపెడుతున్నారేమో అనుకుని మళ్లీ "ఎవరు నువ్వు?" అని అడిగాను. వాడు పలకలేదు. వాడు దొంగ అని నేను గ్రహించేలోగా వాడు నేను అరవకుండా గట్టిగా నా నోరు మూసేశాడు. నాకేం జరుగుతుందో, అసలు ఏమి చేయాలో తెలియడం లేదు. ఆ స్థితిలో బాబాని తలచుకుని, "బాబా! నన్ను నువ్వే కాపాడాలి" అని అనుకున్నాను. ఇంతలో పక్కింటివాళ్ళు కనిపించారు. చెయ్యి కదిలిస్తూ, ఇటు చూడండి అన్నట్లు వాళ్ళకి సైగలు చేశాను గాని, చెట్టు అడ్డంగా ఉండటంతో నేను వాళ్ళకి సరిగ్గా కనపడట్లేదు. నేను గట్టిగా పిలవాలని ప్రయత్నిస్తున్నప్పటికీ శబ్దం రాకుండా వాడు నా నోరు గట్టిగా మూసేసి ఉన్నాడు. అయితే బాబా కృపవలన వాళ్ళకి ఏదో అలికిడి అవుతున్నట్లు అనిపించి మా ఇంటివైపు చూశారు. వాళ్ళు 'ఆంటీ.. ఆంటీ' అని నన్ను పిలిచారు. కానీ ఆ దొంగ, "పిలిచావంటే నిన్ను చంపేస్తా, నా దగ్గర కత్తి ఉంది" అన్నాడు. నిజంగానే కత్తి ఉందేమో, దాన్ని తీసి నన్ను ఎక్కడ చంపుతాడో అని నేను భయపడిపోయాను. అయితే వాడి దగ్గర కత్తి లేదని గమనించి ఎలాగో మొత్తానికి వాడి చేతులు విదిలించుకుని 'దొంగ దొంగ' అని గట్టిగా అరిచాను. అది విని వాళ్ళందరూ బయటికి వచ్చారు. దాంతో ఆ దొంగ నన్ను బలంగా ఒకవైపుకు నెట్టేసి పారిపోయాడు. కానీ నేను భయంనుండి పూర్తిగా బయటకు రావడానికి చాలా సమయం పట్టింది. బాబా దయవల్ల వాడు నెట్టివేయడం వలన అయిన చిన్న గాయం తప్ప ఇంకే హానీ జరగలేదు. నా మెడలో ఉన్న చైను కూడా సురక్షితంగా ఉంది. తలచుకోగానే ఆ దొంగ బారినుండి నన్ను కాపాడి 'పిలిస్తే పలికే దైవం' అని నిరూపించుకున్నారు బాబా. "చాలా చాలా కృతజ్ఞతలు బాబా! మీరు చేసిన మేలు నేనెప్పటికీ మరచిపోలేను".

బాబా చిలుము నాకు బలాన్నిచ్చింది.
కెనడా నుండి సాయి భక్తురాలు ప్రియ తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
ఓం శ్రీ సాయిరామ్. నేను సాయి భక్తురాలిని. నేను గత 10 నెలలుగా కెనడాలో ఉంటున్నాను. మొదటి ఆరు నెలలు కనీస అవసరాల కోసం నేను చాలా కష్టపడ్డాను. నేను, నా కుటుంబం ఊహించని పరిస్థితులు ఎదుర్కున్నాము. ఇల్లు, ఉద్యోగం దొరకక జీవించడం పెద్ద సవాలుగా అనిపించింది. చాలా శ్రమతో 6 నెలల తరువాత నాకొక కార్యాలయంలో ఉద్యోగం దొరికింది. అది నా అర్హతకు సరైనది కానప్పటికీ, నా మనుగడ కోసం ఆ ఉద్యోగం చేయడానికి సిద్ధపడ్డాను. అయితే ఆఫీసు నిర్మానుష్య ప్రదేశంలో ఉంది. బస్ స్టాప్ నుండి ఆఫీసు వరకు చాలా దూరం నడవాల్సి ఉన్నందున రాకపోకల విషయంలో నేను ఆందోళన చెందాను.
నేను ఉద్యోగంలో చేరడానికి ముందురోజు బాబాకు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి మందిరానికి వెళ్ళాను. అక్కడినుండి తిరిగి వచ్చే సమయంలో బస్సు దొరకనందున నడుచుకుంటూ ఇంటికి బయటలుదేరాను. అది అక్టోబర్ నెల. సమయం రాత్రి 7 గంటలయింది. సూర్యుడు అస్తమించి ఇంకా పూర్తిగా చీకటి పడలేదు. నేను నడుస్తుండగా అకస్మాత్తుగా సిగరెట్ వాసన వస్తున్నట్లు అనిపించింది. ఎక్కడినుంచి వస్తుందా అని నేను చుట్టూ చూశాను. కనీసం 300 మీటర్ల దూరంలో నా చుట్టూ ఎవరూ లేరు. ఇల్లు కూడా ఎడమవైపుగా చాలా దూరంలో ఉన్నాయి. ఒకవేళ అక్కడినుండి ఆ వాసన వచ్చినా మరీ అంతదూరం వచ్చే అవకాశం లేదు. 70 కిలోమీటర్ల వేగంతో కార్లు మాత్రమే నాపక్కనుండి పోతున్నాయి. నేను ఏదో పరిహాసంగా "బాబా! మీరు నాతోపాటు ఉన్నారా?" అని అడిగాను. తరువాత 3, 4 అడుగులు వేశాక ఆ వాసన మరిలేదు. మరో 10 అడుగులు ముందుకు వెళ్ళాక మళ్ళీ ఆ వాసన మొదలైంది. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఇప్పుడు కూడా నా సమీపంలో ధూమపానం చేస్తూ ఎవరూ లేరు. నా మనసుకొక్కటే అనిపించింది, 'బాబా నాతోపాటు నడుస్తున్నారు. ఆయన నాతో ఉన్నానని భరోసా ఇస్తున్నారు. ఇక నేను ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.
మరుసటిరోజు నేను మొదటిసారి ఆఫీసుకు వెళ్ళాను. ఆ గదిలో నాకు శిక్షణనిచ్చే వ్యక్తి తోపాటు మొత్తం ముగ్గురం ఉన్నాము. అకస్మాత్తుగా గది లోపల ఘాటుగా సిగరెట్ వాసన రావడం మొదలైంది. అది ‘నో స్మోకింగ్' ఏరియా. నాతో ఉన్న ఇద్దరు ఆ వాసన గురించి ఏమీ ప్రస్తావించడం లేదు. 'నీకేం భయంలేదు. నేను నీతోనే ఉన్నాను' అని బాబా నాకు తెలియజేస్తున్నారు అనుకున్నాను. వెంటనే నాకు 'ఒక భక్తురాలు ఆఫీసులో ఉండగా తన డెస్క్ వద్ద చిలుము వాసన వచ్చినట్లు' నా స్నేహితులొకరు చెప్పిన అనుభవం గుర్తుకువచ్చి 'బాబా నాతోనే ఉన్నార'ని ధృవీకరించుకుని చాలా సంతోషంగా బాబాకు కృతఙ్ఞతలు చెప్పుకున్నాను.
ఓం శ్రీ సాయిరామ్.
ఓం సాయిరాం ,
ReplyDeleteసాయి నాకు చాలా భయముగా ఉంది ।
నా సమస్యకు పరిస్కారము చూపించు
కొంచం అయినా ఇష్టం లేకుండా బ్రతక లేక పోతున్నాను
ప్లీజ్ సాయి నా మనోవేదనను తగ్గించు।
ఎవ్వరితో చెప్పుకోలేని ,ఈ వేదన నుండి విముక్తిని ప్రసాదించు।ఈ జన్మాంతర పాపమూ నుండి దరి చేర్చు సాయి । నా కొడుకుని నా వద్దకు చేర్చు ।
చాల చాల మాటలలో చెప్పలేని గుండె బరువుని అనుభవిస్తూ ఉన్నాను । నటిస్తూ తిరగ లేక పోతున్నాను ।
ఎదో ఒకటి చేయి సాయి
వీలైనంత త్వరలో మీ బిడ్డను మీ దరిచేర్చి మీ కష్టాన్ని తొలగించాలని మనసారా కోరుకుంటున్నాము సాయి.
Delete