ఈరోజు భాగంలో అనుభవాలు:
- 'షుగర్ వ్యాధి' అనే మిషతో బాబా నన్ను తమ చెంతకు లాగుకున్నారు.
- బాబా కృపతో వచ్చిన ఉద్యోగాలు.
'షుగర్ వ్యాధి' అనే మిషతో బాబా నన్ను తమ చెంతకు లాగుకున్నారు.
22 సంవత్సరాలకే నా షుగర్ లెవెల్స్ 350 వరకు పెరిగాయి. దానివలన నేను చాలా బాధపడ్డాను. డాక్టర్ మందులిచ్చి ప్రతిరోజూ వాడమని చెప్పారు. పదిహేను రోజులు మందులు వాడాక ఒకరోజు సాయిభక్తులైన మా మామయ్య నాకు సాయిబాబా గురించి చెప్పారు. ఆరోజునుండి నేను సాయిని పూజించడం మొదలుపెట్టాను. ఎప్పుడైతే నేను సాయిని పూజించడం, సాయి లీలలను చదవడం మొదలుపెట్టానో అప్పటినుండి నా జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. నెలరోజులయ్యాక మందులు వాడటం పూర్తిగా మానేసి, కేవలం బాబా ఊదీని రోజూ ఉదయాన్నే నీళ్లలో కలుపుకుని త్రాగుతున్నాను. ఇప్పటికి నాకు షుగర్ సమస్య వచ్చి పది నెలలు అయ్యింది. నేనిప్పుడు చాలా ఆరోగ్యంగా వున్నాను. అదంతా బాబా కృపతోనే సాధ్యమైంది. ఇదేకాకుండా బాబా దయవల్ల మా నాన్నగారి సింగరేణి ఉద్యోగం డిపెండెంట్ కోటాలో నాకు వచ్చింది. ఆ ఉద్యోగానికి నేను ఎంపికవ్వాలంటే దృఢమైన ఆరోగ్యాన్ని కలిగివుండాలి. దానికోసం సింగరేణి వైద్యులు వైద్యపరీక్షలు నిర్వహిస్తారు. కానీ నాకున్న షుగర్ సమస్య వలన నేను చాలా భయపడ్డాను. నేను బాబాపై భారం వేసి వైద్యపరీక్షలకి వెళ్లి పరీక్షలు జరుగుతున్నంతసేపూ సాయిని స్మరించుకుంటూ ఉన్నాను. పరీక్షలన్నీ అయిపోయాక ఆ సాయంత్రం ఫలితాల కోసం భయపడుతూనే ఎదురు చూస్తూ ఉన్నాను. కాసేపటికి స్టాఫ్ నర్సులు నన్ను పిలిచి, “నీకు ఏ సమస్యా లేదు, నువ్వు ఈ ఉద్యోగానికి మెడికల్ గా ఫిట్‌గా ఉన్నావు” అని చెప్పారు. దానితో నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇదంతా కేవలం బాబా అనుగ్రహంతో, బాబా ఊదీ మహిమతో మాత్రమే సాధ్యమైంది. నిజానికి మొదట్లో నేను సాయిభక్తుడిని కాదు. కానీ "సాయి తన భక్తులు ఎక్కడున్నా పిచ్చుక కాలికి దారం కట్టి లాగినట్లు లాక్కుంటారు" అనేది నిజం. నా విషయంలో అదే జరిగింది. “థాంక్యూ సో మచ్ బాబా! నా జీవితంలో బాధలను దూరం చేసి నాకు మంచి రోజులు ప్రసాదించండి సాయిదేవా!” రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
బాబా కృపతో వచ్చిన ఉద్యోగాలు
సాయిబంధువులందరికీ నమస్కారం. ఓం సాయిరామ్! నా పేరు రవితేజ. ముందుగా ఈ బ్లాగ్ నిర్వహిస్తున్నవారికి నా ధన్యవాదాలు. బ్లాగ్ ద్వారా సాయి మీద ప్రేమ రెట్టింపు అవుతుంది. ఇక నా అనుభవానికి వస్తే....
22 సంవత్సరాలకే నా షుగర్ లెవెల్స్ 350 వరకు పెరిగాయి. దానివలన నేను చాలా బాధపడ్డాను. డాక్టర్ మందులిచ్చి ప్రతిరోజూ వాడమని చెప్పారు. పదిహేను రోజులు మందులు వాడాక ఒకరోజు సాయిభక్తులైన మా మామయ్య నాకు సాయిబాబా గురించి చెప్పారు. ఆరోజునుండి నేను సాయిని పూజించడం మొదలుపెట్టాను. ఎప్పుడైతే నేను సాయిని పూజించడం, సాయి లీలలను చదవడం మొదలుపెట్టానో అప్పటినుండి నా జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. నెలరోజులయ్యాక మందులు వాడటం పూర్తిగా మానేసి, కేవలం బాబా ఊదీని రోజూ ఉదయాన్నే నీళ్లలో కలుపుకుని త్రాగుతున్నాను. ఇప్పటికి నాకు షుగర్ సమస్య వచ్చి పది నెలలు అయ్యింది. నేనిప్పుడు చాలా ఆరోగ్యంగా వున్నాను. అదంతా బాబా కృపతోనే సాధ్యమైంది. ఇదేకాకుండా బాబా దయవల్ల మా నాన్నగారి సింగరేణి ఉద్యోగం డిపెండెంట్ కోటాలో నాకు వచ్చింది. ఆ ఉద్యోగానికి నేను ఎంపికవ్వాలంటే దృఢమైన ఆరోగ్యాన్ని కలిగివుండాలి. దానికోసం సింగరేణి వైద్యులు వైద్యపరీక్షలు నిర్వహిస్తారు. కానీ నాకున్న షుగర్ సమస్య వలన నేను చాలా భయపడ్డాను. నేను బాబాపై భారం వేసి వైద్యపరీక్షలకి వెళ్లి పరీక్షలు జరుగుతున్నంతసేపూ సాయిని స్మరించుకుంటూ ఉన్నాను. పరీక్షలన్నీ అయిపోయాక ఆ సాయంత్రం ఫలితాల కోసం భయపడుతూనే ఎదురు చూస్తూ ఉన్నాను. కాసేపటికి స్టాఫ్ నర్సులు నన్ను పిలిచి, “నీకు ఏ సమస్యా లేదు, నువ్వు ఈ ఉద్యోగానికి మెడికల్ గా ఫిట్‌గా ఉన్నావు” అని చెప్పారు. దానితో నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇదంతా కేవలం బాబా అనుగ్రహంతో, బాబా ఊదీ మహిమతో మాత్రమే సాధ్యమైంది. నిజానికి మొదట్లో నేను సాయిభక్తుడిని కాదు. కానీ "సాయి తన భక్తులు ఎక్కడున్నా పిచ్చుక కాలికి దారం కట్టి లాగినట్లు లాక్కుంటారు" అనేది నిజం. నా విషయంలో అదే జరిగింది. “థాంక్యూ సో మచ్ బాబా! నా జీవితంలో బాధలను దూరం చేసి నాకు మంచి రోజులు ప్రసాదించండి సాయిదేవా!” రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
బాబా కృపతో వచ్చిన ఉద్యోగాలు
నేను సాయిబాబాకు అంకిత భక్తురాలిని. ఆయన ఆశీర్వాదాలతో నేను పొందిన అనుభవాలు చాలానే ఉన్నాయి. వాటిలో ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను.
నేను ప్రస్తుతం హెచ్.ఆర్. ఆఫీసరుగా యు.ఏ.ఈ. లో పనిచేస్తున్నాను. నాకు 2016, ఆగస్టులో వివాహమైంది. 2017, ఫిబ్రవరిలో నా భర్తకు యు.ఏ.ఈ. లో ఉద్యోగం వచ్చింది. మూడు నెలల తరువాత నేను అక్కడికి వెళ్ళాను. అంతా సక్రమంగా జరుగుతున్న సమయంలో హఠాత్తుగా ఒకరోజు సాయంత్రం మావారు ఇంటికి వచ్చి మెనేజ్మెంట్ తనని ఉద్యోగంనుండి తొలగించారని చెప్పారు. ఒక్కసారిగా అలా జరిగేసరికి మా జీవితాలు కంపించినట్లయింది. పూణేలో చక్కగా ఉన్న జీవితాన్ని వదులుకుని ఇక్కడకు వస్తే కేవలం ఆరునెలల్లో మాకీ పరిస్థితి ఎదురైంది. మావారు మొదటిసారి తన జీవితంలో అటువంటి పరిస్థితి ఎదుర్కొనేసరికి బాగా కృంగిపోయారు. నేను రోజూ సాయిని చాలా దీనంగా ప్రార్థిస్తూ, "బాబా! మాకెందుకిలా జరిగింది?" అని అడుగుతూ ఉండేదాన్ని. ఇక్కడ అంతా సెటిల్ చేసుకోవడానికి ఇండియాలో మా వాళ్ళను డబ్బులు అడిగాం. మరోవైపు నేను, నా భర్త ఇద్దరమూ ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టి ఇంటర్వ్యూలకు హాజరవుతున్నా ఏదీ కలిసి రాలేదు. చివరికి మావారి వీసాపై వెళ్లిన నాకు ఇండియా తిరిగి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది. అయితే బాబా దయ చూపించారు. నేను బయలుదేరడానికి ముందు మాకొక శుభవార్త అందింది. అదేమిటంటే, మావారి సీనియర్ ఒకతను వేరే సంస్థలో సి.ఈ.ఓ. గా జాయిన్ అయ్యారు. అతను తన క్రొత్త సంస్థకు చాలామంది ఉద్యోగస్తుల కోసం చూస్తున్నారు. మావారు వెళ్లి అతనితో మాట్లాడారు. అతను మరుసటిరోజున ఉన్న ఇంటర్వ్యూకి మావారిని హాజరవ్వమని చెప్పారు. మావారు ఆ ఇంటర్వ్యూకి హాజరై విజయవంతంగా పూర్తి చేశారు. మా మొదటి వివాహ వార్షికోత్సవ సందర్భంగా బాబా మాకిచ్చిన ఒక గొప్ప బహుమతి అది. తరువాత మేము ఇండియా తిరిగి వచ్చాక బాబా కృపతో ఆ సంస్థలో మావారికి ఉద్యోగం నిశ్చయమైంది.
ముందుగా మావారు ఇక్కడికి(యు.ఏ.ఈ) వచ్చి ఉద్యోగంలో చేరారు. తరువాత మూడు నెలలకు నేను వచ్చి హెచ్.ఆర్. ఉద్యోగం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాను. నిజానికి ఒక ఫ్రెషర్ గా నాకిక్కడ ఉద్యోగం రావడం పూర్తిగా అసాధ్యం. అలాంటిది ఎన్నో ఇంటర్వ్యూలకు హాజరయ్యాక బాబా కృప వలన నాకు నచ్చిన ఉద్యోగం వచ్చింది. ఖచ్చితంగా అది బాబా కృప వలన మాత్రమే సాధ్యమైంది. బాబా ఖచ్చితంగా అందరి ప్రార్థనలూ వింటారు. మనం ఆయనను ప్రార్థించి సహనంతో ఉండటమే చేయాల్సింది. "బాబా! నేను ఏవైనా తప్పులు చేసి ఉంటే మన్నించండి. అందరికీ తోడుగా ఉండండి. దయచేసి మీ పట్ల మీరు జాగ్రత్త వహించండి. అలాగే మా అందరినీ జాగ్రత్తగా చూసుకోండి".
No comments:
Post a Comment